-->

Thursday, February 6, 2020

Talathoti కవి'తలతోటి': Book reviews on Prithvi poetry

Book reviews on Prithvi poetry

ఇప్పటివరకు నేను రచించిన కవితా సంపుటులను వివిధ పత్రికలలో సమీక్షించిన సమీక్షకులకు, సాహితీ మిత్రులకు ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఆవిష్కరణ రోజు వేదికపై పుస్తకాన్ని సమీక్షించే దానికి, అదే పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చెయ్యడానికి పత్రికలకు రాసే సమీక్షా వ్యాసానికి తేడా ఉంది. సమీక్ష గీటు రాయిల ఉండాలి.  

పృథ్వి రాజ్ కవితా సంపుటులపై ఇతరులు రాసిన సమీక్షా వ్యాసాలు:
హైకూ కొలనులో పృథ్వి " కలువలు" -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.  - హైకూ సాహిత్య మాస పత్రిక - జూలై 2003.  
భూమికి పృథ్వీరాజ్ అలంకరించిన కిరీటం చంద్ర కిరీటం - కొంపెల్ల కామేశ్వరరావు - చినుకు మాసపత్రిక , 54 వ పేజి , డిసెంబర్ 2005.
"పృథ్వీ" -హైకూలు!! టంకాలు!!!  -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
హైకూ కిరీటి - తలతోటి    -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
మనవ జీవితాన్ని ప్రతిబింబించే హైకూ - సెన్ ర్యూ  - కొంపెల్ల కామేశ్వరరావు - ...వార్తా పక్షపత్రిక, 54 వ పేజి , 15  డిసెంబర్ 2002
నీలాకాశం  - సెన్ ర్యూ  -కన్నా - భావ తరంగిణి, జనవరి 2003.
"హైకూ కొలనులో " "పృథ్వీ కలువలు " ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.,ఈరోజు ,శుక్రవారం 13 జూన్ 2003.
అనుభూతి తడిలో హృదయాంకురాలు 'హైకూలు' ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
తటాకంలో చంద్రకిరణాలు ! కలువలు !!- ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు. -సర్కార్ ఎక్స్ ప్రెస్-కాకినాడ,శుక్రవారం 13 జూన్ 2003.
పృథ్వీ 'సెన్ ర్యూలు - టంకాలు' - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు. - ఈరోజూ-కాకినాడ,శుక్రవారం 12 డిసెంబర్ 2003.
అరటాకుల్లో వడ్డించిన పసందైన హైకూల విందు - మకినీది సూర్య భాస్కర్ (సమీక్షణం) -సర్కార్ ఎక్స్ ప్రెస్-కాకినాడ, మంగళవారం 21 డిసెంబర్ 2004.
అరటాకుల్లో వడ్డించిన పసందైన హైకూల విందు - మకినీది సూర్య భాస్కర్ - సంవీక్షణ, జనవరి & ఫిబ్రవరి 200?.

నెలవంక (హైకూ సంకలనం ) -రాజా విజయ సారధి -మావార్త తెలుగు పక్ష పత్రిక -శుక్రవారం. 28 ఫిబ్రవరి 2003.

సప్త అంతరంగాల అక్షర నక్షత్రాల మధ్యన తళుక్కు మన్న "నెలవంక " - (అక్షర వీక్షణం ) జయకేతనం , 1 జనవరి 2002.  

















































Tuesday, December 17, 2019

ప్రియమైన అధ్యాపక మిత్రులకు నమస్కారాలు!. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించడానికి సుముఖతను లేదా విముఖతను తెలియజేయమని ప్రభుత్వం నుండి ఎయిడెడ్ కళాశాల యాజమాన్యాలకు సర్క్యులర్ అందించిన విషయం అందరికీ తెలిసిందే! ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలలుగా మార్చాలని ఎయిడెడ్ కళాశాలల దళిత అధ్యాపకుల సంఘం (డాక్టా) స్వాగతిస్తుంది. సేవా భావంతో విద్యాసంస్థలను నెలకొల్పి పాటు పడే రోజుల్లో ప్రభుత్వం కళాశాల యాజమాన్యం వారి ఆర్థిక భారాన్ని తగ్గించి కళాశాల నిర్వహణలో వారికి చేయూతనందించి విద్యావకాశాలను ప్రోత్సహించే గొప్ప కార్యక్రమంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రారంభం అయింది. కాని రానురాను; మరీముఖ్యంగా ఈ మధ్యకాలంలో దాదాపు చాలా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కళాశాలలను నిర్వహిస్తున్నాయి. దాదాపు సీనియర్ లెక్చరర్స్ రిటైర్డ్ అయిపోయాక; బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ద్వారా అధ్యాపకులుగా నియమింపబడిన వారే అనేక కళాశాలలలో మిగిలి ఉన్నారు. ఎయిడెడ్ అధ్యాపకులు న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన ప్రిన్సిపాల్, ఎన్.సి.సి. ఇటువంటి అనేక పదవులను
కళాశాల యాజమాన్యానికి చెందిన సామాజిక వర్గం పార్ట్ టైం అధ్యాపకులే పొంది నిర్వహిస్తున్నారు. అంతేకాదు, అనేక ఎయిడెడ్ కళాశాలలలోని దళిత అధ్యాపకులు ఎదో ఒక రూపంలో యాజమాన్యం వేధింపులకు,వివక్షకు గురియవుతూ ఇక భరించలేని స్థితిలో కమిషనర్ గారికి ఫిర్యాదులు చేయగా కమీషనర్ గారు స్పందించి ఎంక్వైరీలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి లోని ఎయిడెడ్ కాలేజీ పైసంఘటనలకు ఒక ఉదాహరణ.
చాలా కళాశాలలలో నిధుల దుర్వినియోగం, నిధుల మళ్లింపులు జరుగుతున్నాయి. ఇన్నిజరుగుతున్నా వారికున్న రాజకీయ పలుకుబడి, అండతో ఇవన్నీ చేస్తుంటారు అని ప్రభుత్వాధికారులు చూసి చూడనట్లు పోతున్నారు. ప్రజలకు విద్యావకాశాలను మరింత కల్పించడానికి, దళిత- దళితేతర అధ్యాపకుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, యాజమాన్యం వేధింపుల నుండి విముక్తి కలిగించడానికి, కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను విద్యాభివృద్ధికై వినియోగించుకోవడానికి ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వ కళాశాలలుగా మార్చాల్సిందే!. కళాశాలపై వారికుండే పెత్తనాన్ని వదులుకోవడానికి ఏ ఒక్క ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టపడకపోయినా నిర్భందంగా... ప్రభుత్వ పాలసీగా ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వ కళాశాలలుగా మార్చాలని డాక్టా కోరుకుంటుంది.
ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా జాతీయం చేసిన సందర్భం మరువకూడదు. ప్రభుత్వాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మా ఎయిడెడ్ కళాశాలల దళిత అధ్యాపకుల సంఘం (డాక్టా) మద్దతు ప్రకటిస్తోంది.
~ డాక్టర్ కాకాని సుధాకర్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఎయిడెడ్ కళాశాలల దళిత అధ్యాపకుల సంఘం. (డాక్టా).

Sunday, December 15, 2019

సరెండర్ చేసిన క్రమం

     ప్రత్యేకించి నాకు కళాశాల యాజమాన్యానికి పొసగనిది ఈ రూల్స్ దగ్గరే. రూల్స్ కు బిన్నంగా వ్యహరిస్తూ రూల్సుకు అనుగుణంగా తమ విధులను నిర్వర్తించే అధ్యాపకులను కక్ష సాధింపుగా రూల్స్ కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొని వేధిస్తూ ఉంటారు. ఏ .ఏం .ఏ.ఎల్. కళాశాల (అనకాపల్లి) తెలుగు విభాగాధిపతిగా పనిచేసే నన్ను యాజమాన్యం కక్షసాధింపుగా కమీషనర్ అఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి 19నవంబర్ 2019న సర్వీస్ రిజిస్టర్ తో సహా సరెండర్ చేశారు. 
01) 2019 సంవత్సరం కాలేజీ యాజమాన్యం జీతాలు చెల్లించిన వైనం (ఐడిల్ కాలేజీ స్టేట్ మెంట్ ను అనుసరించి): 
02) జీతాలు, ఎరియర్స్, పి .ఆర్. సి. 2016 స్కెల్ అమలు విషయంపై ప్రిన్సిపాల్ కు 30 అక్టోబర్ 2019 న లేఖ :
03) ప్రిన్సిపాల్ వాట్సాప్ , కళాశాల మెయిల్ ద్వారా 30 అక్టోబర్ 2019 న లేఖ సాఫ్ట్ కాపీ:
04) దళిత అధ్యాపకుల సంఘం ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల ఇర్రెగ్యులారిటీస్, దళిత అధ్యాపకుల సమస్యలపై విచారణ జరిపించమని 31 అక్టోబర్ 2019 న కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ అందించిన లేఖ :
05) దళిత అధ్యాపకుల సంఘం ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల ఇర్రెగ్యులారిటీస్, దళిత అధ్యాపకుల సమస్యలపై విచారణ జరిపించమని 31 అక్టోబర్ 2019 న ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ కు డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ అందించిన లేఖ :
06) 31 అక్టోబర్ 2019 న ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ కు డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ అందించిన లేఖకు కమీషన్ స్పందన:
07) దళిత అధ్యాపకుల సంఘం ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల ఇర్రెగ్యులారిటీస్, దళిత అధ్యాపకుల సమస్యలపై విచారణ జరిపించమని 31 అక్టోబర్ 2019 న విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి లేఖ, ఎంక్వయిరీ కి మంత్రి ఆదేశం :
08) కళాశాల యాజమాన్యం డా తలతోటి పృథ్వీ రాజ్ కు 7 నవంబర్ 2019 న జారీచేసిన మెమో :
09) కళాశాల యాజమాన్యం డా తలతోటి పృథ్వీ రాజ్ కు 13 నవంబర్ 2019 న జారీచేసిన షోకాజ్ నోటీస్:
10) కళాశాలలో జరుగుతున్న పరిణామాలను జాయింట్ డైరెక్టర్ శ్రీమతి డా కె ప్రమీల గారి దృష్టికి వాట్సాప్ ద్వారా:
11) విచారణ జరపాల్సిన ఆర్ జె డి విచారణకు అనుమతిని కోరుతూ 14 నవంబర్ 2019 కమీషనర్ గారికి లేఖ :
12) కళాశాల యాజమాన్యం డా తలతోటి పృథ్వీ రాజ్ ను 19 నవంబర్ 2019 న కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి సర్వీస్ రిజిస్టర్ తో సరెండర్ చేయుట :
13) విచారణ జాప్యం, డా తలతోటి పృథ్వీ రాజ్ సరెండర్ విషయంపై మరోమారు మంత్రివర్యులకు తెలియజేయుట ~ స్పందన:
14) నూతన కమీషనర్ ను కలిసి అభినందించుట ~ సరెండర్ విషయం వివరించుట 
15)  డా తలతోటి పృథ్వీ రాజ్ సరెండర్ ను నిరాకరిస్తూ విధులలోకి తీసుకోవాలని 29 నవంబర్ 2019న  కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా కమీషనర్ ఆదేశించుట:
16) కమీషనర్ ఆదేశాలను అనుసరించకుండా నన్నుటీచింగ్ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయనివ్వకుండా క్లాసులు తీసుకోవద్దని , కరెస్పాండెంట్ ఆదేశాలని 30 నవంబర్ 2019న  ప్రిన్సిపాల్ తెలుపుట :
17)  కమీషనర్ ఆదేశాలను యాజమాన్యం అమలు చెయ్యని విషయాన్నీ సి సి ఇ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళుట :

Saturday, December 14, 2019

ఒక తప్పును సరిదిద్దుటలో వంద తప్పులు చేసే ఏ ఎం ఏ ఎల్ కళాశాల యాజమాన్యం- అధ్యాపకులచే ఫిర్యాదు సంతకం ఉపసంహరణ


     ఏ. ఎం.ఏ. ఎల్ .కళాశాల (అనకాపల్లి ) కరస్పాండెంట్ , ప్రిన్సిపాల్ ,సూపరిండెంట్ ముగ్గురూ కలిసి అధ్యాపకులను లక్ష్యంగా చేసుకొని వేధించే ఉద్దేశంతో నూతన విధానం ద్వారా జీతాల చెల్లింపులు 1వ తేదీకల్లా ప్రభుత్వం చెల్లిస్తుంటే ఈ కాలేజీ యాజమాన్యం మాత్రం వారి దయ ఉన్నప్పుడు ఇస్తారు . 
     30/10/2019న కళాశాల యాజమాన్యం సి ఎ ఎస్ స్కేల్ ఎరియర్స్ , నెల నెల జీతాలు ఉద్యోగులకు సకాలంలో చెల్లించక పోవడం , డా తలతోటి పృథ్వీ రాజ్ అనే లెక్చరర్ కు ఉద్దేశ పూర్వకంగా మెడికల్ లీవ్ మంజూరు చెయ్యకుండా 23 రోజులకే ఆక్టోబర్ జీతాన్ని చెల్లించడం , 2016 పి ఆర్ సి స్కెల్స్ అమలు చెయ్యక పోవడం వీటన్నింటిపై ప్రిన్సిపాల్ కు లేఖ ద్వారా రిప్రజెంటేషన్ ఇద్దామని రాసి అధ్యాపకులవద్దకు వెళ్లి చెప్పగా చదివి సంతకాలు చేశారు.  ఆ వినతి పత్రాన్ని ఇవ్వబోగా ప్రిన్సిపాల్ ట్రైన్  టైం అయినదని  ఇంచార్జ్ ప్రిన్సిపాల్  శ్రీ బి. ఎస్, సాగర్ కు ఇమ్మని సూచించి వెళ్లగా తానూ తీసుకోడానికి తిరస్కరించగా అప్పుడు ప్రిన్సిపాల్ వాట్సాప్ కు , కాలేజీ మెయిల్ తో పాటు ఆర్ జె డి - సి సి ఇ మెయిల్స్ కు వినతి పత్రం సాఫ్ట్ కాపీ ని పంపుతూ ప్రిన్సిపాల్ కు ."  గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు.   టీచింగ్ స్టాఫ్ మాకు రావాల్సిన 2016 పి.ఆర్.సి. స్కేల్ జీతాలు మరియు ఇతరేతర ఎరిఎర్స్ గూర్చి ఒక వినతి పత్రం తయారుచేసి ఈ రోజు మధ్యాహ్నం మీకు ఇవ్వబోగా మీరు ట్రైన్ టైం అయిపోతుంది కనుక ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా మీరు సూచించిన శ్రీ బి. ఎస్, సాగర్ కు ఇమ్మని సూచించారు. తాను తీసుకోడానికి నిరాకరించారు. అందులోను అధికారికంగా తనని మీరు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా మీరు ద్రువపరచలేదు కనుక, రేపు నాగుల చవితి సెలవు దినం గనుక మీకు వాట్సాప్ , మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ గా మా వినతి పత్రాన్ని అందించి ఆ తర్వాత హార్డ్ కాపీని అందించగలము. ~ఇట్లు: ఏ ఎం ఏ ఎల్ కళాశాల ఆక్టా చైర్మన్, ఏ పి డాక్టా ఛైర్మన్ డా తలతోటి పృథ్వి రాజ్   " అని తెలియ జేశాము 

     ఇక ఇక్కడినుండి వాస్తవ విషయాలను కళాశాల సూపరింటెండెంట్ ఎలా వక్రీకరించి ప్రయత్నం చేసిందో , అధ్యాపకులను బెదిరించి ఆమె రాసిన ప్రకారం వారిచేత రాయించి వారిచే  సంతకం చేయించి వారు ఆఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు రాయించింది . కళాశాల యాజమాన్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అని సృష్టించింది . 
     "నాకు రావాల్సిన SALARY మరియు ARREARS అన్ని కూడా UPDATE గా వచ్చినవి "~ శ్రీమతి జె సామ్రాజ్యం 
     "Dr T పృథ్వీరాజ్ గారు వచ్చినట్లైతే అనుమానంతో మొత్తం చదివేదాన్ని , ఎందుకంటే అయన నిత్యం Management వారితో వాదిస్తూ ఉంటారు . " అని "Salaries ప్రతినెల అందుకుంటున్నాము " అని తనను Mislead చేశామని శ్రీమతి ఎం మేరీ హెలెన్ రాశారు . 
     "ఓవర్ look లో చూచుకోకుండా సంతకం పెట్టినందుకు నా తప్పిదంగా భావించి అందులోని నా సంతకాన్ని ఉపసంహరించుకుంటున్నానని" శ్రీమతి యెన్ శ్యామల 
     "వారికి Management తో  గొడవ ఉంటె వారు చూసుకోవాలి . వారు మమ్మల్ని పావులుగా వాడుకుంటూ Misguide చేసి నాచే సంతకం చేయించినారు "అని శ్రీ ఎ రవీంద్ర గారు 

     "వారికి Management తో  గొడవ ఉంటె వారు చూసుకోవాలి . వారు మమ్మల్ని పావులుగా వాడుకుంటూ Misguide చేసి every  month regular గా Salary వస్తున్నా , నాచే సంతకం చేయించినారు "అని డా ఎ వాసుదేవ రావు
     "లెటర్ చదవడానికి అవకాశము ఇవ్వకుండా నా చేత సంతకము చేయించారు." అని , "మార్చి CAS బకాయిలు , Dr పృథ్విరాజ్ CAS బకాయిలు DTO , visakhapatnam లో head of accounts తెలియక ఆగిపోయినవి" అని ,"నేను మొత్తం proceedings , arrears  list xerox తీసి bills ready చేసి correspondent సంతకంకి రడీగా ఉన్న సమయంలో వారి personal   ప్రయోజనాలకు, Management వారిని bad చేయుటకు నన్ను తప్పుదోవ పట్టించి నాచే సంతకం చేయించినారు. " అని "పృథ్వీరాజ్  గారి గొడవకి ,staff salaries , arrears కి సంబంధం లేదు " అని శ్రీ బి.సత్యానంద సాగర్ అనే ఆంగ్ల అధ్యాపకునిచేత   అన్నీ సక్రమమే అంటూ అక్రమంగా బెదిరించి అధ్యాపకులచే అండర్ టేకింగ్ లెటర్స్ రాయించుకున్న వైనం.


Thursday, December 12, 2019

18 జూలై 2018న 8మంది దళిత అధ్యాపకులు లేఖకు యాజమాన్య వక్రీకరణ సమాధానంలోని వాస్తవాలు.

       18 జూలై 2018న 8మంది దళిత అధ్యాపకులు ప్రిన్సిపాల్ గారి ద్వారా యాజమాన్యానికి లేఖను అందించాము. ఆ లేఖలో ఏ విధంగా ఏ.ఎం.ఏ.ఎల్ కళాశాల యాజమాన్యం మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చేరిననాటినుండి మాపట్ల వివక్షత ప్రదర్శిస్తూ వస్తున్నారో పాయింట్ వైస్ ఉదహరిస్తూ నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ ద్వారా తెలిపాము.







       ఈ లేఖలో మేము లేవనెత్తిన అనేక విషయాలను యాజమాన్యం సమర్ధించుకుంటూ మా పట్ల వారు ఏరకమైన తప్పులు చేయనట్టు, వివక్ష ప్రదర్శించనట్టు మా లేఖకు సంజాయిషిగా 3/8/2018న స్పెషల్ కమిషనర్ కు లేఖ రాశారు.  పాత తేదీతో యాజమాన్యం అధికారులకు తప్పుదోవపట్టించడానికి సృష్టించిన దొంగ లేఖ.  నన్ను సరెండర్ చేస్తూ నాకు మేనేజ్మెంట్ ఇచ్చిన పేపర్స్ లో ఒకటి ఈ లేఖ. యాజమాన్యం వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, యాజమాన్యం వారి తప్పులను సమర్ధించుకుంటూ అధికారులను తప్పుదోవ పట్టించడానికి ఎలా రాస్తారో మీరూ పరిశీలించండి.







1వ పాయింట్:
       మొదటిపేజీ చివరి పేరాలో ...  ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి .,  హాస్టల్ వార్డెన్ లను పార్ట్ టైం లెక్చరర్స్ కు; అదీ యాజమాన్యంవారి కులానికి సంబంధించిన వారికి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమైన నియామకం కాదట!  వాళ్లకు మేనేజ్మెంట్ జీతాలు ఇస్తుంది కనుక ఎయిడెడ్ అధ్యాపకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైన పార్ట్ టైం అధ్యాపకుల నియామకాలను గూర్చి మేనేజ్మెంట్ ను అడిగే హక్కు లేదట! ఆ పదవులు,  పోస్ట్ లు ఎలా రూల్స్ ను  అతిక్రమిస్తూ సమర్థించుకున్నారో ప్రతి ఒక్కరు గ్రహించవచ్చు.

3వ పాయింట్ :
       ఇద్దరు ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాల అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థినీలను ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్నారట! అందువల్ల కళాశాల విద్యార్థుల అడ్మిషన్లు పడిపోయాయని విచిత్రమైన వింత ఆరోపణలు చేశారు కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు. ఏ.ఎం.ఏ ఎల్. కళాశాల పూర్వ విద్యార్థినీలను పెళ్లి చేసుకున్నందుకు కళాశాల యాజమాన్యం ఆశీర్వదించి అభినందించాల్సింది పోగా వారిపై బురదజల్లి , వారిని అవమానపరిచేలా ఈ విధమైన కార్యక్రమానికి  కూడా యాజమాన్యం వెనుకాడలేదంటే వారి స్వభావం అర్థం చేసుకోవచ్చు.  ఆ అమ్మాయిల తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే వారికి పెళ్లిళ్లు జరిగాయా? అయిన వారి వ్యక్తి గతవిషయలతో యాజమాన్యానికి పని ఏమిటి? ఆరోపింపబడిన అధ్యాపకులేకాదు; వారి భార్యలు సైతం యాజమాన్యం వైఖరిని తీవ్రమైన విషయంగా పరిగణించారు. పృథ్వీ రాజ్ సరెండర్ రిపోర్ట్ కు సంబంధించిన పేపర్స్ లో దీని ప్రస్తావన అవసరం ఏమిటి ?

4వ పాయింట్ :
       డబ్బులు కోసం నాపై కొందరు తప్పుడు కేసు పెట్టారు. కళాశాల యాజమాన్యం ఆర్జేడి, సి.సి.ఇ. అధికారుల దృష్టికి తీసుకుపోకుండా ఏకపక్షంగా నన్ను సస్పెండ్ చేశారు. ఇలా సస్పెండ్ చెయ్యాల్సిన యాజమాన్యం కులానికి సంబంధించిన ఎందరినో సస్పెండ్ చేయకుండా రక్షించారు. నా సస్పెన్షన్ని కూడా నేను వ్యతిరేకించలేదు.  కానీ కమిషనర్ సస్పెన్షన్ ఎత్తివేసి నన్ను విధుల్లోకి తీసుకోమని 15/3/2016న ప్రోసిడింగ్ పంపిస్తే కళాశాల యాజమాన్యం వెంటనే నన్ను చేర్చునట్లు కమిషనర్ వంటి అధికారులను తప్పుదోవ పట్టించేలా ఈ లేఖలో పేర్కొన్నారు.

       15/3/2016న నన్ను విధుల్లోకి తీసుకోమని కమిషనర్ ప్రొసీడింగ్స్ పంపినా కళాశాల యాజమాన్యం నన్ను విధుల్లోకి తీసుకోకుండా తిప్పిస్తున్న నేపథ్యంలో 19/4/2016న ఏపీ ఎస్సీ-ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. సి. సి. ఇ. కమిషనర్ కు లేఖ రాశాను. అదేవిధంగా 26/4/2016న రాజమహేంద్రవరం ఆర్జెడి గారికి లెటర్ రాశాను.  27/4/ 2016 న ఏపీ ఎస్సీ-ఎస్టీ కమిషన్ స్పందించింది నాకూ మరియు కరస్పాండెంట్ కు ఒక లేఖను పంపారు.  29/4/2016 న రాజమహేంద్రవరం ఆర్జెడి వారు కూడా స్పందించి నాటి కరస్పాండెంట్ ను హెచ్చరిస్తూ ప్రొసీడింగ్ పంపగా అప్పుడుగాని 4/5/2016న నన్ను కళాశాల వారు విధిలేని పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకున్నారు. అంటే కమిషనర్ గారి ఉత్తర్వులు 50 రోజులపాటు అమలు చేయకుండా బేఖాతరు చేసి వారు కమీషనర్ ప్రొసిడింగ్ కు విలువ ఇచ్చినట్లు పై వివరాలను పొందుపరచకుండా కప్పిపుచ్చి అధికారులకు విధేయులు అన్నట్లు కళాశాల యాజమాన్యం నటిస్తున్నారు.

       అప్పటి సస్పెన్షన్ రివోక్ విషయంలోనే కాదు; 19/11/2019న సాయంత్రం నన్ను కళాశాల యాజమాన్యం సరెండర్ చేసినట్లు పంపిన సమాచారాన్ని కమీషనర్ గారు తిరస్కరించి పృథ్విరాజ్ ను విధుల్లోకి తీసుకోమని కమిషనర్ గారు 29/11/2019న ఆర్డర్ పంపినా నన్ను చేర్చుకొనక పోతే  కమీషనర్ 3/12/2019న ఆర్జేడీ ద్వారా హెచ్చరించి చెప్పించినా కళాశాల వారు నన్ను నేటి వరకు అంటే 12/12/2019 వరకు విధుల్లోకి తీసుకోలేదు దీన్నిబట్టి గ్రహించవచ్చు ప్రభుత్వ నిబంధనలన్నా, ప్రభుత్వ అధికారాలన్నా కళాశాల యాజమాన్యానికి ఎంత లెక్కలేని తనమో!

5వ పాయింట్ :
       నేను కాలేజీ రికార్డులను టాంపరింగ్ చేస్తూ మేనేజ్మెంట్ వారికి పట్టు పడ్డానని సరెండర్ రిపోర్టులో కరస్పాండెంట్ శ్రీ  దాడి శ్రీనివాస రావు  రాశారు. పార్ట్ టైం అధ్యాపకులను లెక్చరర్ అని, ఫుల్ టైం అన్ ఎయిడెడ్ లెక్చరర్ అని పై అధికారులకు కళాశాల యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు అది తప్పుడు సమాచారం అని తెలియజేసే సాక్ష్యమైన పార్ట్ టైం అధ్యాపకుల అటెండెన్స్ రిజిస్టర్ ఫోటో కాపీ తీసి వాస్తవాలను అధికారులు చూపడం ట్యాంపరింగ్ అంటా. ఇదే కాదు ఈ క్రింది అటెండెన్స్ రిజిస్టర్ లో వీరు చేసేవన్నీ వారి తప్పిదాలను అధికారులకు తెలియజేసేవే ! వైట్ ఫ్లూయిడ్ తో తుడిపి  చేస్తూ ఉంటారు.  ఇటువంటి ట్యాంపరింగ్ అటెండెన్స్ రిజిస్టర్ లో రికార్డులు పరిశీలిస్తే వీరి నిజస్వరూపం అందరికీ అర్థమవుతుంది


6వ పాయింట్ :
       నా నోటి వెంట వచ్చే ప్రతి పదం దళిత పదంతో కూడుకొని ఉంటుందని, యాజమాన్యం వారికి క్యాస్టిజం లేదని, నేను కాలేజీ వాతావరణాన్ని నాశనం చేస్తున్నానని కరస్పాండెంట్ రిపోర్టులో పేర్కొన్నారు.  యాజమాన్యానికి కులతత్వం లేకపోతే హాస్టల్ వార్డెన్, రెండు ఎన్.సి.సి. పోస్టులు వారి కులానికి సంబంధించిన వారికి, అందునా ఎయిడెడ్ అధ్యాపకులు ఉండగా   పార్ట్ టైం అధ్యాపకులు అయిన వారికే ఎందుకు ఇస్తారు? ఉద్యోగ నియామకాన్ని బట్టి నాన్ టీచింగ్ లో ఎవరు ఏ పోస్టు లో కూర్చొని పనిచేస్తున్నారో గుర్తించవచ్చు. చివరికి కాలేజీలో పార్ట్ టైం అధ్యాపకులు ఏకులం వారు ఎక్కువ ఉన్నారో, టెంపరర్ నాన్ టీచింగ్ వారు ఏకులం వారు ఎక్కువ ఉన్నారో  అర్థం చేసుకోవచ్చు.   ఎవరు కులతత్వాన్ని అనుసరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు

7వ పాయింట్ :
       ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించే తీరుపై ఎన్.సి .సి.   వారికి ఫిర్యాదు చేశామని మీటింగ్ లో మా దళిత అధ్యాపకులను ఉద్దేశించి "తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకాలు మీరు " అని మనల్ని నిందించి దూషించిన విషయాన్ని ఎలా సమర్థించుకుంటున్నారో ఈ ఏడో పాయింట్ లో మీరే గమనించవచ్చు.

8వ పాయింట్ :
       దళిత అధ్యాపకులను యాజమాన్యం అనేక మార్లు దూషించిన మాట వాస్తవం. భయ భ్రాంతులకు గురి చేయడం..  బెదిరించడం వాస్తవం. అటువంటి సందర్భంలో మాకు ఎటువంటి హాని జరిగినా దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేయడం ఎవరైనా చెప్పేదే.  దాన్ని హెచ్చరించారని వక్రీకరించి యాజమాన్యం నా సరెండర్ రిపోర్టులో రాయడం జరిగింది.

9వ పాయింట్ :
       యాజమాన్యానికి కులతత్వం ఉన్నది కనుకనే వివిధ ఆరోపణలో ఒక అంశంగా ఒకే కులానికి చెందిన వారిని అధికులను ఉద్యోగాల్లో తీసుకోగా కొందరి ఆరోపణలమేరకు  ఎంక్వైరీ జరిగి 1984 నుంచి 1997 మధ్య ఎస్ ఓ పాలనలోకి కళాశాల వెళ్ళింది.  2000 సంవత్సరం నాటికి సుమారు 112 మంది ఎయిడెడ్ అధ్యాపకులు ఉంటే ఎస్సీ అధ్యాపకులు కేవలం ఐదుగురు అంటే ఐదుగురే ఉన్నారు.  అందుకే ఆనాటి కమిషనర్ శ్రీ కృపానందం గారు అనేక నెలలపాటు ఎయిడెడ్ స్టాఫ్ జీతాల గ్రాంటును ఆపి యాజమాన్యం పై ఒత్తిడి తీసుకురాగా 2000 సంవత్సరంలో బ్యాక్ లాగ్  పోస్టులు భర్తీ చేశారు. కులతత్వం విషయంలో యాజమాన్యం  అసమానతలు ప్రదర్శించనట్లు అధికారులను తప్పుదోవ పట్టించడానికి లేఖలో రాసుకొచ్చారు. పైగా నేను కళాశాలలో కులతత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు రాశారు.

       మేము చెబుతున్నవన్నీ ఫాల్స్ అని, ప్రిన్సిపాల్ మాకు అనేక బాధ్యతలు అప్పజెబితే చెయ్యలేదని ఆరోపించారు.  ఏఏ బాధ్యతలు అప్పజెబితే చెయ్యలేదో నిరూపించాలి. దళిత అధ్యాపకుల యూనియన్ ప్రారంభించి కళాశాలలో సమస్యలను సృష్టిస్తున్నట్టు రాశారు. ఆక్టా వలె డాక్టా(ఎయిడెడ్ దళిత అధ్యాపకుల సంఘం ) రాష్ట్రస్థాయి అధ్యాపకుల సంఘం ఉంది. ఆ సంఘంలో సభ్యుడిగా చేరాను. మేము ప్రారంభించినటువంటి సంఘం కాదు. ఇటువంటి సంఘాలలో సభ్యులుగా ఉన్నందుకు మాపై యాజమాన్యం ఏ చర్యలైనా తీసుకోవచ్చునని కరస్పాండెంట్ గారు అనేకమార్లు మీటింగులలో హెచ్చరించారు బెదిరించారు.

       ఎవరు వ్రాతపూర్వక అనుమతి లేకుండా కళాశాల పనివేళల్లో కళాశాల బయటికి వెళ్లారు? క్లాస్ లో ఎవరు ఫోన్ లో మాట్లాడుతున్నారో వారిని గుర్తించి హెచ్చరించ వచ్చు కదా! నోటీస్ ఇచ్చి హెచ్చరించారా?

       మేనేజ్మెంట్ వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలా మంది ఎయిడెడ్ అధ్యాపకులు వైజాగ్ నుండి వస్తున్నారు కనుక పార్ట్ టైం అధ్యాపకులకు నియామకాలలో ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని రిపోర్టులో రాశారు. ఇప్పుడున్న అధ్యాపకులలో ఉద్యోగం చేరిన నాటి నుండి తునిలో ప్రిన్సిపాల్, విశాఖపట్టణం నుండి ఎ.  రవీంద్ర- మేరీ హెలెన్- ఎం. హరిబాబు వస్తున్నారు. 2018 లో  కె.వి.ఎస్. నాయుడు, పృథ్విరాజ్  పిల్లల చదువు నిమిత్తం వైజాగ్  వెళ్లారు.  అనకాపల్లి నివసించే అధ్యాపకులకు ఏయే బాధ్యతలు అప్పజెప్పారు ? వైజాగ్ నివాసి అయిన హరి బాబుకు ఎన్ .ఎస్ . ఎస్. మరియు యుజిసి కో-ఆర్డినేటర్ పదవులు ఒకే వ్యక్తికి ఎందుకిచ్చారు? అసలు ఏ విషయాలలో కి సీనియార్టీ చూస్తున్నారు?
       కళాశాలలోని దళిత అధ్యాపకులకు వ్యతిరేకంగా హాని తలపెట్టాలనే తత్వంతో లేనివారిగా యాజమాన్యం తమ రిపోర్టులో పేర్కొన్నారు.
       పై అధికారులకు వాస్తవ విషయాలను మరుగుపరిచి , వాస్తవాలను మాట్లాడే ఉద్యోగులపై లేనిపోని ఆరోపణలు చెయ్యడం, అధికారులను తప్పుదోవ పట్టించేలా రిపోర్ట్ లను రూపొందించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య .


Sunday, December 8, 2019

ప్రభుత్వాధికారుల, అధికారాల కంటే అతీతమైన... అతీంద్రియమైన పవర్స్ కళాశాల గవర్నింగ్ బాడీ తీర్మానానికి ఉన్నాయనే భ్రమలో కళాశాల యాజమాన్యం.


ప్రభుత్వాధికారులకు, చట్టాలకు-నిబంధనలకు లోబడి పని చేయాల్సిన ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఒక తీర్మానం చేసుకుంటే సరిపోతుంది. చట్టాలతో పనిలేదు. ప్రభుత్వ నిబంధనలకంటే పవర్ ఫుల్ వారి తీర్మానం అనే ఆలోచన అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. ఎయిడెడ్ కళాశాల యాజమాన్యానిది. అటువంటి ఆలోచనలతో చేసిన తీర్మానాలెన్నో. 
ఉదాహరణకు:
(1)
యూ.జి.సి. గ్రాంట్స్ తో నిర్మించిన ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల లోని కొన్ని భవనాలను 2010లో స్థాపించిన ఆస్క్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ " ఇంజినీరింగ్ కళాశాల సొంత భవనాలు గా చూపారు దానిని నిర్వహించే అనకాపల్లి వర్తక సంఘం. ఆ కారణంచేత విశాలమైన సైన్స్ ల్యాబ్ లను క్లాస్ రూమ్ లుగా మార్చి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్లాస్ రూమ్ లను కుదిరించి క్లాస్ లు నిర్వహిస్తున్నారు.

(2) 
ప్రభుత్వ అనుమతితో, ఉద్యోగ నోటిఫికేషన్, సిక్స్ మెన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు, పోస్టుల భర్తీ , ఉద్యోగులకు ప్రభుత్వం జీతభత్యాల చెల్లింపులు, ప్రభుత్వ అధికారుల ఆమోదంతో ప్రిన్సిపాల్ - కళాశాల పాలకవర్గం కరస్పాండెంట్ గా ధ్రువీకరణ మొదలగునవి పొందే ఎయిడెడ్ కళాశాలకు తమపై ప్రభుత్వానికి నియంత్రణ అధికారంలేదని అహంభావపూరితంగా వ్యవహరించే యాజమాన్యం లేకపోలేదు. 

కమిషనర్ కంటే పవర్ ఫుల్ . వీరి నిర్ణయానికి ఎదురే లేదు అన్నట్లు అనకాపల్లి లోని ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాలలోని ఎయిడెడ్ తెలుగు పోస్ట్ మాకు అక్కర్లేదు అంటూ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను 19 /11/ 2019 న కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి సరెండర్ చేశారు. అలా సరెండర్ చేసే అధికారం ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కళాశాల యాజమాన్యానికి లేదని , తక్షణమే పృథ్వీరాజ్ ను విధుల్లోకి తీసుకోమని కమీషనర్ గారు జె.డి.గారికి తెలియజేశారు. ప్రిన్సిపాల్ - కరస్పాండెంట్ లకు కమీషనర్ ఆదేశంగా తేలియజేయమన్నట్లు జాయింట్ డైరెక్టర్ గారు రాజమండ్రి ఆర్జెడి గారికి తెలియజేశారు. ఆతర్వాత ఆర్జేడీ గారు ఏ.ఎం.ఏ.ఎల్ . కళాశాల ప్రిన్సిపాల్ - కరస్పాండెంట్ లకు కమిషనర్ గారి ఆదేశాన్ని తెలియజేసినా నేటికీ, అనగా 8/12/2019 వరకు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ విధుల్లోకి తీసుకోకుండా ఉన్నారంటే అధికారుల ఆదేశాల పట్ల వీరికున్న గౌరవం, ప్రభుత్వం పట్ల భయం లేని వీరి తత్వం అందరీకీ అర్థమయ్యే ఉండాలి. 

Thursday, November 7, 2019

ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం-ఇష్టా రాజ్యం




ఏ ఎం ఏ ఎల్ కళాశాలలో అధ్యాపకులు విచిత్ర పరిస్థితి లో ఉన్నారు. మరి ముఖ్యంగా దళిత అధ్యాపకులు. ఒకప్పటి మేనేజ్మెంట్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టా రాజ్యంగా చేసుకుంటూ పోయే వారు. 


06-12-2018 నాటి సమావేశంలోని అంశాలు:
అనేక సంవత్సరాలుగా వివక్షకు గురియైన దళిత అధ్యాపకులు ఇచ్చిన లెటర్ గూర్చి, సి ఏ ఎస్ గూర్చి., హాస్టల్ వార్డెన్, ఎన్ సి సి ఎవరికైనా తాము ఇచ్చుకోవచ్చని, అడిగే హక్కు ఎయిడెడ్ అధ్యాపకులకు లేదని ..మొదలగు విషయాలు. 
10-4-2019 సాధారణ సమావేశం 
16-04-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అధికారాల గూర్చి,లీవ్స్ ,ఆడారి నాగ భూషణం ప్రస్తావన ,మేనేజ్మెంట్ ను మీరేమి చెయ్యలేరు , మాకు పోయేది ఏమీలేదు ... మొదలగు ప్రధాన విషయాలు
06-07-2019 నాటి సమావేశంలోని అంశాలు:
వర్క్ లోడ్ , మినిమం 40 అవర్స్ ఇచ్చినా చెయ్యాల్సిందే, 30 అవర్స్ మినిమం 
03-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
లీవ్స్ సూపరింటెన్ డెంట్ ద్వారా ,ఇ.పి.ఎఫ్.   ఫైన్  ప్రస్తావన,సాలరీస్ , కొందరి అధ్యాపకుల  వ్యక్తిగత విషయాల ప్రస్తావన, గోకితే పుండ్లు పడతాయి, మేనేజ్మెంట్ పవర్స్, లీవ్స్ పై పట్టు గోక్కోవ డాన్ని బట్టి అని చెబడం, ఆడారి నాగభూషణం ~చెరుకూరి నూకేశ్వర రావు లకు నిబందనలకు విరుద్ధంగా డబ్బులు ఇప్పించిన వైనం,పి జి అర్హత చాలట , హాఫ్ డే సి ఎల్, లీవ్ కావాలంటే  సూపరింటెన్ డెంట్ వద్దకు వెళ్ళాల్సిందే అని చెబడం,లీవ్ ఫండమెంటల్ రైట్ కాదని చెపడం, మాకు రోకుంటే ఎవరికైన సెలవు ఇచ్చి అడ్జెస్ట్ చేసుకుంటా మనడం, సూపరింటెన్ డెంట్ ను కలవలేదు గనుక లీవ్ లెటర్ ఇచ్చినా అబ్సెంట్ మార్క్ రాసి అధ్యాపకుడు విక్టర్ ను బెదిరించుట , మమ్మల్ని కెలికితే ఇలానే ఉంటుందని చెబడం,
07-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అడగమన్న ప్రకారం కాలేజీ పనిపైనే ఎ. ఒ. డి టి ఒ ఆఫీస్ లకు  వెళ్లి నా ఎరియర్ గూర్చి అడుగుట
సాధారణ విషయాలు.
12-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కడుపులో నొప్పి అని ఎ ఒ వద్దకు వెళ్లి నా ఎరియర్స్ గూర్చి విచారించానని,   డిసిప్లీనరీ యాక్షన్ గూర్చి,లీవ్స్ గూర్చి, మేనేజ్మెంట్ ను క్వశ్చన్ చెయ్యడానికి లేదని , అధ్యాపకులను బెదరించడం, అబ్సెంట్ మార్క్ నోట్ చేస్తామనడం, కెలికితే -గోకితే , సస్పెండ్  చేస్తే కాలేజీకి రాలేనని, ఆడారి నాగభూషణం గూర్చి. లీవ్స్ థ్రూ ప్రోపర్ ఛానెల్,అలా చెయ్యకుంటే అబ్సెంట్ మార్క్ చేస్తాననడం, నాకు మేమో ఇష్యూ చెయ్యమని ప్రిన్సిపాల్ కు చెబడం.       
24-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
సంఘాలలో(యూనియన్స్)లో అధ్యాపకులు ఉండకూడదని, కులాన్ని ఉపయోగించుకుంటున్నానని, వీటిని బట్టి నాపై చర్యలు తీసుకోవచ్చని కరెస్పాండెంట్ నన్ను సస్పెండ్ చేస్తానని బెదిరింపులు.

16-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:
18-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:

అధ్యాపకులపై కళాశాల యాజమాన్యం రోకు (మోజు-ఇష్టం ) ఉంటే అన్నీ సాధ్యం !:   
కళాశాలను నిర్వహించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక కరస్పాండెంట్  ప్రభుత్వ నిబంధనలతో మాకు పనిలేదు మా ఇష్టం వచ్చిన వారికి సెలవు మంజూరు చేస్తాము, ఇష్టం లేని వ్యక్తి అనుకో సెలవు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వం , మంజూరు చెయ్యం  అని పబ్లిక్ గా స్టాఫ్ మీటింగ్ లో చెబుతున్నారంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరస్పాండెంట్ చెప్పిన దానిలో తప్పేలేదు. ఎందుకంటే ఏళ్ళ తరబడి వారు చేసుకొస్తుంది అదే. వారి దయతో లీన్ పేరిట విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, రకరకాల సెలవలతో విదేశీ పర్యటనలు, తీర్థ యాత్రలు చేసినవారు, విదేశాలకు పురుళ్ళకు వెళ్ళిన వాళ్ళు అనేకులున్నారు. కొన్ని సంవత్సరాలుగా  కళాశాలలో జరుగుతున్న తంతు.   

సెలవు చీటీ ఇచ్చినా అబ్సెంట్ రాస్తారు :
డి డబ్లూ.విక్టర్ అనే అధ్యాపకుడు సెలవుచీటి రాసి సంబంధిత క్లర్క్ కు ఇచ్చినా అటెండెన్స్ రిజిస్టర్ లో సి ఎల్ నోట్ చెయ్యక పోగా , సూపరింటెండెంట్ చేత సంతకం చేయించ లేదని సాకు చూపి ఒక క్లర్క్  కరస్పాండెంట్ సూచన మేరకు అబ్సెంట్ మార్క్ చేశాడంటే ఏమనాలి.  ఆ క్లర్క్ చెయ్యాల్సిన డ్యూటీ ఏమిటి . పట్టించుకునే ప్రభుత్వ అధికార గణం లేకుంటే అధ్యాపకులను యాజమాన్యం ఇలానే వేధిస్తుంటారు . అ చర్యకు భయపడి, మనసు చంపుకొని ఆ అధ్యాపకుడు తన లీవ్ లెటర్ ను తానే స్వయంగా సూపరిండెంట్ వద్దకు వెళ్లి సంతకం చేయించాక వైట్ ఫ్లూయిడ్ తో అబ్సెంట్ చెరిపి సి ఎల్ నోట్ చేశారు.    

కళాశాల యాజమాన్యం దయ ఉంటే ఉద్యోగం ఎగగొట్టినా లక్షలు లక్షణంగా పొందవచ్చు :
చేసిన ప్రభుత్వ వ్యతిరేకమైన పనులను ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు స్టాఫ్ సమావేశంలో నిర్భయంగా చెబుతున్నారు. అయన పరిభాషలోనే ...వారి రోకు ఎవరిపైనైతే ఉంటుందో మెడికల్ లీవ్ లు ఆ లీవ్ లు , ఈ లీవ్ లు మాత్రమే కాదు సంవత్సరాల పాటు ఎటువంటి లీవ్ లు పెట్టకుండానే కాలేజీ మానెయ్యొచ్చు. బుద్దిపుట్టిన కొన్నేళ్ళ తర్వాత యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని, రికార్డ్ లు తారుమారు చేయించుకొని, అధికారులను మేనేజ్ చేసుకొని రావాల్సిన అణా పైసాతో సహా పొందవచ్చు. అటువంటి వారికి ఉదాహరణే నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రీ చెరుకూరి నూకేశ్వర రావు, ఆడారి నాగభూషణంల ఉదంతం . కళాశాలకు కొన్నేళ్ళపాటు రాకున్నా కళాశాల యాజమాన్యంతో లౌక్యంగా వ్యవహరించి లక్షలాది రూపాయలను పొందినవాడు నూకేశ్వర రావు . కోర్టుకు వెళ్లి నేటికీ తిరుగుతున్నవాడు నాగ భూషణం. 
ఈ కథలో కరస్పాండెంట్ ఎయిడెడ్ స్టాఫ్ కు చెప్పిన నీతి , హెచ్చరిక ఏమిటంటే ...మమ్మల్ని ధిక్కరించి మీరు కోర్టుకు వెళ్ళినా సదరు కోర్టువారు తిరిగి కళాశాల యజమాన్యానికే పరిష్కరించమని సూచిస్తారు. ఆవిధంగా మేము మిమ్మల్ని సాధిస్తాము, వేధిస్తాము. జాగ్రత్త అని బెదిరించడం. యాజమాన్యం వారు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడినా మనం నోరుమేదప కూడదు.  అనేక సమావేశాలలో వీరి విషయాన్ని కరస్పాండెంట్ ప్రస్తావించాడు.
ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు?   
   
   

పృథ్వి రాజ్ అనే అధ్యాపకుణ్ణి వేధింపులు, బెదిరింపులతో కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు:

ఎయిడెడ్ కళాశాలలలొ మేనేజ్మెంట్ ఏమిచెబితే అది చేయాలనే తత్వం. బానిసలుగా చూసినా అధ్యాపకులు పడియుండాలి. మన వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ సహ ఆధ్యాపకుల ముందు  బెదిరించినా మనం పడాలి అనే వారి వైఖరి. ఉద్దేశపూర్వకంగా మన ఆర్ధిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా ఉన్నతాధికారులకు తెలియజేయకూడదు. దీనిని వేధించడం అనిగాక మరేమి అంటారు. రాష్ట్రంలో ఇన్ని ఎయిడెడ్ కళాశాలలు ఉంటే మరే కళాశాలలో లేని రీతిగా అధ్యాపకులైన మేము ప్రిన్సిపాల్ గారికి కాకుండా మా సెలవు చీటీని మేమే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ కి ఇవ్వాలనే కరెస్పాండెంట్ శాసనం. అలా గాకుండా సెలవు చీటీ సంబంధిత లీవ్స్ క్లర్క్ కు ఇచ్చినా , ప్రిన్సిపాల్ గారికి అందించినా అటెండెన్స్ రిజిస్టర్ లో ఆబ్సెంట్ మార్క్ నోట్ చేసి బెదిరించడం. అలా  ఆబ్సెంట్ మార్క్ నోట్ చేయబడినవాళ్లు భయపడిపోయి హోదాను మరచి తామే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ చేత సంతకం చేయించుకోగా ఆబ్సెంట్ గా రాసిన స్థానంలో వైట్ ఫ్లూయిడ్ పెట్టి సి. ఎల్. మార్క్ చెయ్యడం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే తీరిక లేదు. కళాశాల యాజమాన్యం అందించే ముడుపులకు ఆర్ జెడి రాజమండ్రిలో, విజయవాడ లోని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ లోను క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకటి కాదు మా ఎయిడెడ్ కళాశాల లీలలు.


15-5-1984 commissioner order no:5030 commissioner  MEDAM SATISH NAYAR. REPORT
SOWCAUSE NOTICE. 1st S.O. Ronanki  Anandarao .  15-5-1984 TO 6/11/1997 so to management.

బహుశా ....ఇప్పుడు మీరు చదవబోయే విషయాలు ఎయిడెడ్ అధ్యాపకులైన వారిని విస్మయానికి గురిచేస్తాయి. ఏ ఎం ఏ ఎల్ కళాశాల, అనకాపల్లి అధ్యాపకుల పట్ల కళాశాల యాజమాన్యం ఎంత అరాచకంగా వ్యవహరిస్తుందో, అధ్యాపకులను ఎంత బానిసలుగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.  ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కళాశాల యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో....అనేక మార్లు స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు  మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్ లో ఎలా అధ్యాపకులను భయపెడుతూ, హెచ్చరిస్తూ మాట్లాడారో గ్రహించవచ్చు.
ఏ ఎం ఏ ఎల్ కళాశాల సుమారు పదమూడేళ్ళ పాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలో సాగింది. కారణం....యాజమాన్యంలోని అంతర్గత కారణాలచేత ఒక వ్యక్తి కళాశాలలో జరిగిన అవకతవకలు, యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించిన తీరుమీద ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నాటి కమీషనర్ స్పందించి రికార్డ్స్ పరిశీలించి నాటి కళాశాల యాజమాన్యాన్ని తొలగించి స్పెషల్ ఆఫీసర్ (ఎస్.ఒ )ను నియమించింది.  ఎటువంటి అవకతవకలకు, ప్రభుత్వ  నిబంధనలకు విరుద్ధమైన రీతిలో వ్యవహరించమని అండర్ టేకింగ్ లెటర్ కళాశాలవారు ఇచ్చాకే ప్రభుత్వం ఎస్ .ఒ తీసి కళాశాలను యాజమాన్యానికి అప్పజెప్పింది. యాజమాన్యాన్ని డిస్మిస్ చెయ్యడానికి నాడు కారణాలు కొన్నే. కాని నేడు పరిశీలిస్తే లెక్కలేనన్ని. అయినా  అనేక మార్లు స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు  మీటింగ్స్ పెట్టి నిర్భయంగా, నిసిగ్గుగా వారి చట్టవిరుద్ధమైన పనులను ప్రస్తావిస్తూ 
6/12/2018

           
సి ఎల్స్ విషయంలో కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి శాసనం:
".....ఎస్పెషల్లీ....యూ జి సి      స్కేల్ ఎయిడెడ్ ఫ్యాకల్టీ విషయంలో చెబుతున్నాను... మీ క్యాజువల్ లీవ్స్ 8 ఉన్నాయి. ప్లస్  స్పెషల్ క్యాజువల్ లీవ్స్ విషయంలో రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లయి చెయ్యడానికి లేదు. ఇప్పుడు చెబుతున్నాను. ఇప్పుడు  సుపరిండేంట్ కూడా కాదు ......నా పర్మిషన్ లేకుండా లీవ్ అలౌ చెయ్యడానికి అవదు"

02B- మా దయ మీమీద ఉంటేనే నిబంధనలకు విరుద్ధమైనా మీకు సెలవులు మంజూరు చేస్తామనే కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి మాటలు:     
"సార్ మాకు రోకు(మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్. మేము పంపించుకుంటాము. నా చేతిలో పవర్ ఉంది. నేనేదో అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు రోక్ లేదనుకోండి ఒక్క రోజుకూడా నేను ఎలో చెయ్యను. అది నా డిస్కషన్ పవర్. మీకది పాయిన్టౌట్ చెయ్యడానికి లేదు. ఆవిషయంలో మీరు నన్ను పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. నా ఇష్టం.  నాకు రోకుంటే 6 నెలలు ఇస్తాను. నాకు రోకు లేదనుకో ఒకరోజుకూడా ఇవ్వను. నా పవర్ అది. నా పవర్ ను మీరు క్వచన్ చెయ్యడానికి మీకు రైట్ లేదు."

03C: 
"సార్ ఇంకో విషయం సార్.  పక్కా రూల్స్ పాటించేసి మీరేదో చేస్తే ఆ మోటో కాదు సార్. మీరు కెలుకుతున్నారు కాబట్టే మేము కెలికితే మీకు ఈవిధంగా ఉంటుందని చెప్పడానికే"

మేము తలుచుకుంటే కులం పనిచెయ్యదు,  ఎం పనిచేయదు.



01A: " మీరు కెలుక్కోవడం వల్ల మేము సబ్జెక్ట్ లోకి వెళ్లి పోయి మేము డెప్త్ కు వెళుతున్నాము.  మేము ఏది  చెప్పినా సరే ఆన్ రికార్డ్, ఆన్ గవర్నమెంట్ జి వొ ప్రకారంగా మాట్లాడుతున్నాను"
01A:"కాజ్వల్ లీవ్స్ 8 ఉన్నాయి. స్పెషల్ కజ్వల్ లీవ్స్ రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లై చెయ్యడానికి లేదు."
01A:"లీవ్ మీకు ఫండమెంటల్ రైట్ కాదు"
01A:"మీరు లీవ్ అప్లై చేస్తే ఇవ్వాలని రైటేమి లేదు. నాకు నచ్చలేదనుకోండి నేను కంపిటి టీవ్ అథారిటీ కాబట్టి ఏ ఎం ఏ ఎల్ కాలేజీకి నేను లీవ్ సంక్షన్ చెయ్యక్కర లేదు. అది అబ్సెంట్ క్రిందే పడుతుంది. "













 సస్పెండ్ విధానమే ప్రభుత్వ నిబంధనలు - మానవ హక్కులకు విరుద్ధం:
అధికారులు నా  సస్పెండ్ ను రివోక్ చేసినా కళాశాల యాజమాన్యం నన్ను విధులలోకి  తీసుకోకుండా నన్ను వేధించిన వైనం:
అధికారులు, మంత్రి , ఎస్సీ కమీషన్ దృష్టికి తీసుకు వెళ్ళగా జరిగిన న్యాయం :
కళాశాల యాజమాన్యం మొదలు పెట్టిన వేధింపులు:
నిష్కారణంగా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
మా ఇబ్బందులను అధికారులకు తెలియ జేసినా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
జీతాలు యాజమాన్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాల్సిందే :
వ్యక్తిగతంగా మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసినా మనం ఏ అధికారి దృష్టికి తీసుకు వెళ్ళకూడదు:
నిద్రబోతున్న ప్రభుత్వ యంత్రాంగం:
అవినీతికి మరిగిన స్పందించి న్యాయం చెయ్యాల్సిన అధికారులు:
వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని చస్తేనే స్పందించే వ్యవస్థ: