Prithvi as Columnist:
ఈమధ్య కాలం
రాజకీయాలలో మనం మునుపెన్నడూ చూడని సన్నివేశాలను, దృశ్యాలను చూశాము.
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ కొన్ని రాజకీయ
పార్టీలు , నాయకులు వ్యవహరించారు. శత్రువులు మిత్రులుగా నాయకులు కలవడంలో
లక్ష్యం , ప్రయోజనం ఏదైనా వారిని గమనించిన ప్రజలకు ఆ కలయిక ఏవగింపు
కలిగించింది. నాయకుల్లో నిస్వార్థ ఐక్యత కంటే స్వార్థ పూరితమైన, అనైతికమైన పొత్తే
ప్రజలకు కనిపించింది, అనిపించింది.
డిసెంబర్,7, 2018 తెలంగాణా ముందస్తు
ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్రంలో తెరాసా పార్టీననీ, ఆ తర్వాత జరగనున్న
లోకసభ ఎన్నికల్లో కేంద్రంలో బి జె పి ని ఓడించడానికి తెరాసా యేతర పార్టీలన్నీ
ఏకమయ్యాయి ఎం ఇ ఎం పార్టీ మినహా. విచిత్రమేమిటంటే తెలుగు దేశం కాంగ్రెస్ తో
జతకట్టడం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ లక్ష్యాన్ని విస్మరించి బాబు కాంగ్రెస్ తో
కలవడం. మరింత విచిత్రమేమిటంటే...ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉండగా తనపై
కాల్పులు జరిపించాడని చెప్పుకునే చంద్రబాబు ను ప్రజా గాయకుడు గద్దర్ ఆకాశానికి
ఎత్తడం, ఆలింగనం చేసుకోవడం. అదేవిధంగా రాహుల్ ను (కాంగ్రెస్ ను )
పొగడ్తలతో ముంచెత్తడం.
ఇక ఆంధ్రప్రదేశ్
లో 2010 ఏప్రిల్ 11 ఎన్నికల లో వై ఎస్ ఆర్ సి పి పై విజయం
సాధించడానికి, జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు వివిధ రాష్ట్రాలలోని
అధికార పార్టీ అధినేతలను (జాతీయ నాయకులను) రంగంలోకి దించాడు. ఇలా తంతంతా
ముగిశాక...ఫలితాలు వెలువడినాక ఓటు ద్వార ప్రజలు తెలియ జేసింది ఏమిటంటే రాష్ట్ర
స్థాయిలో ఒంటరిగా బరిలో నిల్చున్న పార్టీకి అధికారాన్నికట్టబెట్టడమే గాక, అనైతిక పొత్తులను
ఛీకొట్టారు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు, పార్టీలు నీతివంతమైన రాజకీయాలు చెయ్యాలని ప్రజలు ఆశిస్తున్నట్లు
గ్రహించాలి.
ఇక
ఆంధ్రప్రదేశ్ లో 2010 ఏప్రిల్ 11 ఎన్నికల
లో వై ఎస్ ఆర్ సి పి పై విజయం సాధించడానికి, జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు వివిధ
రాష్ట్రాలలోని అధికార పార్టీ అధినేతలను (జాతీయ నాయకులను) రంగంలోకి దించాడు. ఇలా
తంతంతా ముగిశాక...ఫలితాలు వెలువడినాక ఓటు ద్వార ప్రజలు తెలియ జేసింది ఏమిటంటే
రాష్ట్ర స్థాయిలో ఒంటరిగా బరిలో నిల్చున్న పార్టీకి అధికారాన్నికట్టబెట్టడమే గాక, అనైతిక
పొత్తులను ఛీకొట్టారు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు, పార్టీలు
నీతివంతమైన రాజకీయాలు చెయ్యాలని ప్రజలు ఆశిస్తున్నట్లు గ్రహించాలి.
1/6/2019~డా
తలతోటి పృథ్వి రాజ్.
జాడలేని నటి దివ్యవాణి
2019 సార్వత్రిక ఎన్నికల ముందు
తెలుగుదేశం పార్టీలో చేరి తన మాటల తూటాలతో రాజకీయ ప్రత్యర్థుల నోరు మూపిద్దామని
అనుకొని ఎన్నికల ప్రచార సమయంలో తన నోటికి పనిబెట్టిన "బాపూ బొమ్మ"
దివ్యవాణి. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు వేసిన అనేక ఎత్తుల్లో ఒక ఎత్తు దివ్యవాణి
రాజకీయ ఆరంగేట్రం. మామూలు వారికే కాదు, క్రైస్తవులకు
విస్మయాన్ని కలిగించింది దివ్యవాణి రాజకీయ ప్రవేశం. దేవుణ్ణి నమ్ముకుని రక్షణ
పొందిన వ్యక్తిగా అనేక చోట్ల తన సాక్షాన్ని ప్రకటిస్తూ వస్తున్నక్రమంలో ఒక్కసారిగా
తెలుగు దేశం స్పోక్స్ పర్సన్ గా అవతారమెత్తింది. అంతర్జాతీయ సువార్తికుడు కె ఏ పాల్
రాజకీయ పార్టీ పెట్టగా, ఈవెడ
పార్టీలో చేరితే తప్పేమిటి అని సమర్ధించే వాళ్ళూ లేకపోలేదు. దళిత-క్రైస్తవుల ఓట్లు
పాల్ కొంత చీల్చగా, క్రైస్తవ్యాన్ని
స్వీకరించి అనేకులకు పరిచయమైన దివ్యవాణిని రంగంలోకి దింపితే మరికొన్ని
దళిత-క్రైస్తవుల ఓట్లు చీల్చ వచ్చనే వ్యూహం కావొచ్చు బాబుది. అలా దివ్యవాణి విషయం
బాబుకి బెడిసి కొట్టింది.
క్రైస్తవ్యంలోకి వచ్చాక అనేక చోట్ల
ప్రసంగించడం ద్వారా మాట్లాడడమైతే వచ్చింది గాని, రాజకీయ మాటలుకూడా క్రైస్తవ బోధలాగే సాగించింది దివ్యవాణి. పైగా
ప్రచారం చెయ్యడం "దేవుడప్పజెప్పిన పని అట !". నిజమే! "యేసు"
కాదు; "బాబు " అనే ఆమె దేవుడు అప్పజెప్పిన
పని. ఎన్నికలైపోగానే అప్పజెప్పాల్సిన మాటలన్నీ అయిపోయినట్లు అంతూపొంతూ లేకుండా ఎటు
వెళ్లి పోయిందో. ఇప్పటివరకు అగపడలేదు. అయినా బాబు అమాయకత్వం కాకపోతేగాని
...దివ్యవాణి ప్రచారం చేస్తేనో...కె ఏ పాల్ పార్టీ పెడితోనో వాళ్ళను చూసి దళిత
-క్రైస్తవులందరూ ఓట్లు వేస్తారనుకోవడం, ప్రభావం
చూపుతారానుకోవడం భ్రమ అని తెలిసొచ్చింది.
అమ్మా! దివ్యవాణీ. గట్టిగా మాట్లాడడమంటే
గొంతేసుకొని అవతలివాళ్ళపై పడడంకాదు; నిలదీయ
గలిగే మాటలతో,
పాయింట్లతో మాట్లాడడం.
ఫలితాలొచ్చాక కనబడడమే మానేశావు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మునుపటి దూకుడుని
ప్రదర్శించవచ్చుకదా. ముందూ వెనుక చూసుకోకుండా మాట్లాడితే ఇలా ముఖం
చాటెయ్యాల్సిఉంటుందని దివ్యవాణి ఆలశ్యంగా గ్రహించింది కాబోలు!
2/6/2019 ~డా తలతోటి పృథ్వి రాజ్
https://www.youtube.com/watch?v=kILuFQfSKOE
https://www.youtube.com/watch?v=uReopfNs1Vs
https://www.youtube.com/watch?v=EdaxWyxZk_g.
లగడపాటి ఘనాపాటి...దేనిలో?
----------------------------------
పెప్పర్ స్ప్రే అని విన్నా, పొలిటికల్ పోల్ సర్వే అని విన్నా
టక్కున మనందరికీ గుర్తుకు వచ్చేది లగడపాటి రాజ గోపాల్. గత ఎన్నికలలో ఖచ్చితమైన
పోల్ సర్వేని వెల్లడించి నాయకులు, ప్రజలనుండి
"ఆంధ్రా ఆక్టోపస్ "గా పేరు సంపాదించారు లగడపాటి.
గత సంవత్సరం జరిగిన తెలంగాణా
ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించాడు. ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను
వెల్లడించడమే గాక, సర్వే వివాదంగా మారాక తనపై ప్రజలకున్న విశ్వాసం సడలకుండా ఉండడానికి
కె టి ఆర్ కు తనకు మధ్య సాగిన సర్వే ఫలితాల విషయాన్ని వాట్స్ అప్ చాటింగ్
రుజువులను చూపించారు. లగడపాటి చెప్పినదానికి బిన్నంగా ఫలితాలు వచ్చాయి.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక
ఎన్నికల లోనూ లగడపాటి మీడియా ముందుకు వచ్చి సర్వే ఫలితాలు ప్రకటించాడు. పవన్
కళ్యాణ్ గెలుస్తాడని, తెలుగు
దేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇలా సర్వే లెక్కలు చెప్పుకొచ్చాడు.
ఈ సర్వేకూడా తల్లకిందులయ్యింది.
లెక్కలు తప్పలేదు:
లగడపాటి వెల్లడించిన సర్వే లెక్కలు
తప్పినా ఆయన లెక్కలు ఆయనకు సరిగానే ఉన్నాయి. లగడపాటి సర్వే రిపోర్ట్ ఫలితాలు ఈ
మధ్యకాలం తాను చెప్పినదానికి విరుద్ధంగా ఎందుకు వచ్చాయో మొదట చాలా మందికి ఆర్థం కాలేదు. లగడపాటి ఓడే తన
సామాజిక వర్గానికి చెందిన పార్టీ విజయం కోసం అతి తక్కువ కాలం లో "సర్వేలకు
పెట్టింది పేరు లగడపాటి, ఆంధ్రా
ఆక్టోపస్"వంటి తనకున్న పేరునుసైతం ఫణంగా పెట్టాడని భావించారు.
రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలనుంచి
తప్పుకుంటానని శపథం చేసిన లగడపాటి రాజగోపాల్ చెప్పిన ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం
రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హాబీ గా మొదలైన సర్వే, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక లగడపాటి వెల్లడించిన సర్వే ఫలితాలతో
సరిపోవడంతో ఇటు రాజకీయ పార్టీలలో, అటు
ప్రజలలో లగడపాటి సర్వేలపై విశ్వాసం పెరిగింది.
మలుపు:
పేరుపొందిన లగడపాటి ఇక్కడే తన ఆర్ధిక
వనరుకు అనుకూలంగా సర్వేని మలుచుకున్నదనేది అనేకుల ఆరోపణ. తాను ఏ పార్టీ, ఎక్కడ ఏ నాయకుడు గెలుస్తాడని వెల్లడిస్తాడో, వారు ఓడిపోతారని తన మనుషులచేత
బెట్టింగులు కాయించి తెలంగాణా లోనూ , ఆ తర్వాత
ఆంధ్రా లోనూ కోట్లు గడించాదనేది ఆయనపై ఉన్న అభియోగం. ప్రజలకు నాయకులకు అర్ధమైంది. అందుకనే
నర్సీపట్నం తెలుగు దేశం నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు తన మాటలు తెలుగుదేశం పార్టీ
అభిమానులను నిరుత్సాహ పరచినా, చంద్రబాబు
ఏమనుకున్నా ఫర్వలేదనుకొని ఫలితాలకు ముందే లగడపాటి సర్వేని నమ్మి జనం బెట్టింగ్ లు
కాసి ఎలా దివాలా తీస్తున్నారో ఘాటుగా విమర్శించారు. ఈ వార్త మీడియాలో వచ్చినా
లగడపాటి ఎక్కడా ఖండించలేదు. ఇప్పటికైనా లగడపాటి తన సర్వేలు తప్పడానికి గల కారణాలను, బెట్టింగులు జరుపుతున్నారనే ఆరోపణలపై
మీడియా ముందుకు వచ్చి తానే స్వయంగా వివరణ ఇస్తే బాగుంటుందని జనం కోరుకుంటున్నారు.
3/6/2019~ డా తలతోటి పృథ్వి రాజ్
https://www.youtube.com/watch?v=boFMg8_xmbQ
https://www.youtube.com/watch?v=VLQe09-LS4A
శ్వేతపత్రం విడుదల చెయ్యాలి :
--------------------------------
చంద్రబాబు పాలన రామరాజ్యం, అమోఘం అద్భుతం, అద్వితీయం అన్నట్లు తెలుగు దేశంపార్టీ
ఆశ్రితులు, ఆపార్టీ ప్రతినిధులు, నాయకులు, సానుభూతిపరులు ఇన్నాళ్ళుగా...
ఇన్నేళ్ళగా... చెప్పుకునే...చెప్పుకొస్తున్న మాట.
ఎన్టీయార్ చేతిలోనుండి పార్టీ లాక్కొని బాబు సి.ఎం. అయినది మొదలుకొని మొన్న
ఓడిపోయే వరకు ఆయన పాలనా విధానం పై నాకు స్పష్టమైన, నిర్ధిష్టమైన అభిప్రాయలు ఎన్నో ఉన్నాయి. వీలు చూసుకొని అవి
ప్రత్యేక అంశంగా రాస్తాను. అయితే నా దృష్టిలో అయనకు ఉండాల్సిన అర్హతలే లేవు. కానీ
అనేక పర్యాయాలు సి ఎం గా ఎన్నుకోబడ్డాడు. పరిపాలించాడు. గొప్ప సి ఎం గా భజన
చేశారు. చేయించుకున్నాడు. ఇదేదో పనికట్టుకొని విమర్శించడానికి నేను అనేమాటలు కావు.
బాబును విభేదించడానికి హేతుబద్ధమైన అనేక కారణాలను చూపుతాను. ఈ సంగతి అలా ఉంచుదాము.
గత ప్రభుత్వ పనులపై, వివిధ విషయాలపై నూతనంగా ప్రభుత్వాన్ని
ఏర్పాటుచేసిన వై ఎస్ జగన్ విచారణ జరిపించడం రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు.
ఎల్లకాలం రాష్ట్రాన్ని జగనే పరిపాలించడు కదా? తన
ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా తనలాగే తన పాలనా పరమైన విషయాలపై విచారణ
జరపవచ్చు అనే ఆలోచన ఉన్నా తాను దానికి సిద్ధమే అన్నట్టు ఇప్పుడు బాబు పనులపై జగన్
విచారణ చేయించడానికి సిద్ధపడుతున్నట్లు మనం భావించవచ్చు.
ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏయే
అవసరాలకు ఎంతెంత ఖర్చు చేసింది. ఆదాయ వ్యయాల వివరాలను, వివిధ శాఖల్లోని ఆర్ధిక స్థితిని
తక్షణమే ప్రస్తుత ప్రభుత్వం శ్వేత ప్రత్రంగా మొదట విడుదల చెయ్యాలి. ఆతర్వాత విచారణ
జరిపించాల్సిన వాటిని గుర్తించి ఎటువంటి విమర్శలకు తావులేని రీతిలో కమిటీచే విచారణ జరిపి, విచారణ అనంతరం ఏమైనా అవినీతి అవక
తవకలు జరిగితే ప్రజలకు వెల్లడిస్తే ప్రజలు ఎన్నుకోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీలపై
ఒక నమ్మకం ఏర్పడుతుంది. గత
ప్రభుత్వం - ప్రస్తుత ప్రభుత్వాలపై ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వేల
వాగ్దానాలు చేసి 2014లో అధికారాన్ని చేజిక్కించుకున్న
తెలుగుదేశం పార్టీ, తన పార్టీ అధికారిక వెబ్ సైట్ నుండి ఆ
మేనిఫెస్టో ను తీసి వేసినట్లే బాబుగారు ఆయ శాఖల్లో సమాచారం ప్రజలకు తెలియజేసేందుకు, తాను పారదర్శకమైన పాలన
అందిస్తున్నానని చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన సి ఎం డ్యాష్ బోర్డ్ ఎన్నికల
ఫలితాల అనంతరం పనిచెయ్యకుండా చేసి వెళ్ళాడు. ఆంధ్ర ప్రదేశ్ ఖజానా ఊడ్చి వెళ్ళాడు.
వీటన్నిటిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని ప్రజలు కోతుతున్నారు. విచారణలో బాబు దోషిగా తేలితే ప్రజా
ధనాన్ని కక్కించి ఆపై చట్ట ప్రకారం ఎం చెయ్యాలో అది చేస్తే బాగుంటుంది. ఈ దిశగా
ఇప్పటికే జగన్ వివిధ శాఖలతో సమావేశమై సమీక్షిస్తున్న విష్యం తెలిసింది. ఇప్పటికే
అనేకమైన విషయాలు బయటికి వచ్చాయి. వాస్తవాలు కోరే ప్రజలకు ప్రభుత్వం శ్వేత పత్రం
విడుదల చేసి తెలియజేయాలి!!
4/6/2019~ డా తలతోటి పృథ్వి రాజ్
https://core.ap.gov.in/CMDASHBOARD/SiteMapReport.aspx
https://core.ap.gov.in/cmdashboard/index.aspx.
No comments:
Post a Comment