-->

Sunday, January 30, 2011

Talathoti Prithvi Raj's Family

     ఈ సమాజంలో కుటుంబ వ్యవస్థ చాల గొప్పది. తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయం. నేను రాసిన "నీలాకాశం" అనే హైకూ సంపుటిని నా తండ్రికి అంకితం చేస్తూ కొన్ని అంకిత పద్యాలు రాశాను. వాటిని మధుర గాయకులు శ్రీ ఇవటూరి గౌరీశం గారిచే పాడించి వీడియోగా రూపొందించి యూట్యూబ్ లో పెట్టాను. ఈ సందర్భంగా చక్కగా పద్యాలను ఆలపించిన గౌరీశం గారికి నా ధన్యవాదాలు.
   పరిస్థితులు ఎలా ఉన్నా బిడ్డలపట్ల తల్లిదండ్రులకు ఉండే అవ్యాజ్యమైన ప్రేమా, వాత్సల్యం వెల కట్టలేనిది. అటువంటి ప్రేమ ఎలా ఉంటుందో నా తల్లిదండ్రులనుండి పొందినవాడిని.  అదే ప్రేమను బాధ్యతగల తండ్రిగా నా పిల్లలకు అందిస్తున్నాను. మన నడవడిక మన పిల్లలకు ఆదర్శప్రాయంగా ఉండాలి.  మనలనుంచే వారు ఎంతో మంచిని నేర్చుకోవాలి. ఈ సమాజంలో తండ్రి బాధ్యతను విస్మరించి తిరిగే తాగుబోతులు, తిరుగుబోతులను నేను ఎందరినో చూశాను. భర్త ఉండికూడా కుటుంబాన్ని లాక్కొచ్చే ఇల్లాళ్ళనీ చూశాను.   పిల్లలకు మంచి తండ్రిగా, భార్యకి మంచి భర్తగా ఉండాలి. తల్లిదండ్రులు వారి పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. నా తండ్రిలో నచ్చని ఒకటి, రెండు విషయాలు ఉన్నా అవన్నీ ఆయన కుటుంబం పట్ల చూపే ప్రేమ, శ్రద్ధ ముందు కొట్టుకు పోయాయి.  ఆయనను క్షమించేలా చేశాయి.

నా తండ్రిగారు కీ.శే.తలతోటి సత్యానందం గారిపై నేను రచించి,ప్రచురించిన
   "నీలాకాశం" అనే  హైకూ సంపుటిలోని అంకిత పద్యాలు


ఆ. నీవులేని యిల్లు నిరయంబుగా దోచె
   నీదు తోడులేని నాదు బ్రతుకు
   అంధకార మయ్యే ననుదినంబును, గాన
   పుత్రరూపదీప్తి పొందిరమ్ము!

తే. నీవుపెట్టిన  భిక్షయే నేర్పు చదువు
    నేను  పొందెడి సౌఖ్యమ్ము  నీదు శ్రమయె
    తీర్చుకొనలేని ఋణమును తీర్చుకొనక
    నన్ను  విడచియునేగితి నాకమునకు!

తే. తాను చేసిన బొమ్మను తానె చిదుపు
   మరణమను పేర దైవమ్ము మనసులేక
   నాకు  జన్మమ్మునిచ్చిన నాన్న!...నీవె
    అసలు  సిసలైన బ్రహ్మ నా ఆయువునకు


           
   




కుడివైపున నిల్చున్న బాలుడనే "పృథ్వి రాజ్ "అనే నేను 











No comments:

Post a Comment