-->

Tuesday, December 20, 2011

Prithvi Created Literary Powerpoints

Prithvi Created Literary Powerpoints:


పృథ్వి రాజ్ రూపొందించిన పవర్ పాయింట్స్ :
మినీ కవితలు
హైకూలు
నానీలు
ఫోటో హైకూ -సెన్ ర్యూ-తంక  
మినీ -హైకూ -నానీ కవితలు
ఆధునిక కవితా ప్రక్రియలు
గురజాడ
మానవతా విలువలు

కృషి ఉంటే...























Tuesday, December 6, 2011

Dr.Talathoti Prithvi Raj



      

           Dr Talathoti Prithvi Raj, M.A., Ph.D., lecturer in Telugu, A.M.A.L.College, Anakapalle justly deserves high praise for his laudable endeavours in making the special genre of Haiku more popular in Telugu and also for his keen enthusiasm in innating a band young men who manifest an unfailing instinct for poetry writing.

       Dr. Talathoti Prithvi Raj has been a born poet and his poems as juveinile exercises even from his fifteenth year appeared in some of Telugu some of Telugu jounals. He has to his credit the following words published between 1997 and 2003. They are: I) Critical works; 1. Athreya Nataka Sahityam - Sambhashanalu, 2. Manasu Kavi, 3. Athreya Cinema Sambhashanalu - Oka Pariseelana, for which he was awarded Ph.D. in the year 2000 by Andhra University.
II) The Anthology of Poems: 1) Nalla Doralu, 2) Manishi. III) Poetic Definitions: 1) Manishilo...
Very early in life Dr. Talathoti Prithvi Raj developed a special love for the genre of Haiku - a genre which had its birth in Japan - and he has been doing a praise worthy service in writing Haiku and making it very popular in his native tongue of Telugu.

He has published sofar no less than 7 volumes of Haiku which have been greatly appreciated by the lovers of the poetry. Some of the titles of his publications are, 1) Vennela, 2) Chinukulu, 3) Vasantham, 4) Rojuko Suryudu, 5) Neelakasam, 6) Ruthu Bhramanam 7) Chandra Kireeti, 8) Kavitalathoti, besides these volumes he has also written 3 other books in three other genres namely 9) Prithvi Photo Haiku, 10) Prithvi Senryu and Prithvi Tanka.

He has passed through the pangs of Travails in giving a proper shape to The Indian Haiku Club and these effords on his part clearly reflects his earnest interest in his particular genre. He has initiated some young talented people into writing Haiku, thus trying to bring Haiku into vogue. In this connection it may well be mentioned that an Anthology of Haiku contributed poets of different temperments, is being brought out every year. In 2001 and 2002 Nelavanka and Sambhodhi have been respectively published. Besides these efforts, a monthly magazine is being published with a view to encourage talents to contribute Haiku to this magazine inviting them different regional languages.

Prithvi has the following proposals to realise in the near future. i) To hold seminars on Haiku, Senryu and Tanka at regular intervals. ii) A literary discussion every month on a noted Haiku poem irrespective of nationality. iii) To honour a Haku poet annually who ever is adjudged the best with a cash prize.
Haiku, the smallest literary Japanese genre has been very popular all world over. It exercises a great fascination on the minds of young poetic talents of every land and language.
Haiku has a special function; it describes, in the main, the seasons of the year, although it embraces subjects of varied interests. Stictly speaking , a Haiku should consist of only 17 syllables erranged in 3 lines, 5-7-5 respectively.

Shiki, the 19th century Japanese poet admits, a range of Haiku from 15 to 25 syllables. Every good Haku must be a sudden flash of insight revealing sum unexpected aspect of human life. In the vast corpus of Dr. Prithvi Raj’s Haiku are revealed an infinite variety of Kaleidoscopic moods, reflections and observations on life and things. They are characterised by a spontaniety of expression, felicity of phrase and sudden flash of insight. Most of his Haiku admit of interpretation on different levels. To quote a few of his Haiku;
"The Autumn flows off
All flowers down to dusty earth -
A flash in the dark sky."
     In this Haiku there is a concealed metaphor during the Autumn season. The sky is overcast with dark clouds and the stars are hid behind them. Here the comparison is between the stars and fallen flowers.
"The tree though barren
Yields shade; though it gives no shade
Beauty it doth shed!"
    In this Haiku reveals the poets deep love of Nature, in whatever form it is.
"The frogs in the well
Their comrade is the tortoise
Besides them The Moon."
    In this Haiku the poet presents a realistic picture a graphic manner.

Thus we find many a Haiku with deep reflection on social, romantic and philosophical matters.
The poet ardently hopes that this Haiku will certainly delight the reader and inspire him inturn to write Haiku making this genre more popular than it has ever been.

I heartily wish Dr. Prithvi Raj that all his genuine efforts in this direction may will be crowned with grand success.
- S.Ramu,Anakapalle,25-04-2010

Sunday, December 4, 2011

Tappeta Gullu - My literary essays -pdf

Thappeta Gullu

Prithvi Created e-books

Prithvi Created e-books:


పృథ్వి రాజ్ రూపొందించిన ఈ బుక్స్:



 

"మినీ మిరపకాయాలు " ఇ - బుక్ ను ఆవిష్కరిస్తున్న ఎ యు . జర్నలిజం  శాఖాధిపతి 
ఆచార్య పి. బాబీ వర్ధన్, శ్రీ చల్లా రామకృష్ణా రెడ్డి  


"మినీ మిరపకాయాలు " ఇ - బుక్ పై ఆంధ్ర విశ్వకళా పరిషత్, తెలుగు జె.ఆర్.ఎఫ్.స్కాలర్   భీమవరపు వెంకటేష్  రాసిన   సమీక్ష :
"హితేన సహితం సాహిత్యం" అని సాహిత్యమునకు వ్యుత్పత్తి ఉన్నది.అనగా మంచితో కూడుకున్నది సాహిత్యం అని అర్థం.పూర్వం సాహిత్యం పద్య రూపం లో ఉండేది. ఎన్నో కావ్యాలు,ప్రబంధాలు పద్యరూపం లో వెలువడ్డాయి. ఆ తర్వాత వచన కవిత్వం సాహిత్యంలో పెను మార్పులను తీసుకువచ్చింది.వచన కవిత్వం లో నవల,కథ,కథానిక మొదలైన ఎన్నో ప్రక్రియలు తెలుగున వచ్చి చేరాయి.వచన కవిత్వంనకు మరింత సంక్షిప్తంగా మినీ కవిత అనే ప్రక్రియ వచ్చినది.      
     చెప్పదలుచుకున్న విషయాన్ని  సూటిగాను, వ్యంగ్య భవనతోనూ చెప్పేదే ఈ మినీ కవిత.ఆచార్య జీ.వీ సుబ్రమణ్యం గారు అన్నట్లు"మినీ కవిత తన హ్రస్వత్వం చేత కాదు ఆకర్షించింది,ఒక భావాన్ని బలంగా చెప్పడానికి ఒక క్రొత్త వాహికగా అవతరించడం చేతనే ఇంత ఆదరణ పొందింది".ఇది నూటికి నూరు పాళ్లు సత్యము.అందుచేతనే 1975 లో మొదలైన ఈ మినీ కవితలు నేటికి అనేకంగా వెలువడుతూనే ఉన్నాయి.అలా వెలువడిన మినీ కవితల ముత్యాల హారాలలో చేర్చదగిన మరో అణిముత్యమే మినీ మిరపకాయలు అనే మినీ కవిత సంపుటి.
డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ గారు నూతన కవితా ప్రక్రియలను వినూత్నంగా తెలుగు సాహిత్యంనకు పరిచయం చేసేలా అనేక రచనలు చేశారు.వాటిలో దీర్ఘకవితా సంపుటిలు,హైకూ సంపుటిలు,నానీలు ఇలా అనేక రచనలు చేశారు.అంతేకాక ఆయన సంపాదకత్వం లో అనేక హైకూలు కూడా వెలువడ్డాయి.పృథ్విరాజ్ గారి సాహిత్య సింధువు నుండి వెలువడిన మరో రత్నమే ఈ మినీ మిరపకాయలు.
      పృథ్విరాజ్ గారి తత్వమేమిటో మనకు"నిక్కమైన నీలమొక్కటి చాలు"అనే పీఠిక లో వివరించారు.అలాగే ఆయన రాసిన ఈ మినీ కవితలకు ప్రేరణలను కూడా పేర్కొన్నారు."వేరు వేరయా"అనే కవితలో ప్రస్తుత సమాజ తీరును ఆయన కవిత్వికరించారు.నీతి,అవినీతి గురించి అందరూ మాట్లాడతారు.నీతిగా, న్యాయం గా ఉండాలని అందరూ ఎదుటివారికి చెబుతుంటారు.కానీ లోకం అంతా అవినీతిమయం గా ఉంటుందని,చెప్పేది వేరు,జరుగుతున్నది వేరు అని వేరు వేరయా కవిత లో పేర్కొన్నారు.
      చనిపోయిన వారి గురించి ఆ రోజు మంచిగా మాట్లాడి మరుసటి రోజు నుండి ఆ వ్యక్తి చేసిన చెడ్డ గురించి మాట్లాడేవారిని ఉద్దేశించి 'లోకం పోకడ'అనే కవితను రచించారు.అలాగే సమాజం లోని సమనత్వంను ఎంతవరకు పాటిస్తున్నారో,ఒక జాతికి చెందిన మనుషులలోనే అంటరానితనాన్ని నిరసిస్తూ'అంట్ల వెధవలు'అనే కవిత ఉన్నది.
        నేటి ప్రధాన సమస్య అయిన మద్యపానం గురించి,దానివలన బలైపోతున్న జీవితాలను గురించి,మద్యపాన నిర్ములించడం యొక్క ఆవశ్యకతను" సారాంశం"అనే కవితలో చక్కగా చెప్పారు.న్యాయవ్యవస్థ గురించి,పోలీస్ వ్యవస్థ గురించి "జడ్జిమెంట్, అసార్ధకనామధేయులు,అనే కవిత లో చెప్పడం జరిగింది.నేటి న్యాయ వ్యవస్థలలో తీర్పులు చెప్పని కేసులు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి పృథ్వి రాజ్ గారు"న్యాయ భారతం లో ఎడతెగని వాయిదా పర్వాలు"ఈ రెండు ముక్కల మాటలలో ఎన్నో వందల కేసులు గురించి, వాటి వెనుక జరుగుతున్న అవినీతిని గురించి,వాయిదాల జాప్యం గురించి ఆలోచింపచేశారు.
         నేటి కార్పొరేట్ రంగంలో పెంచిన ఫీజుల గురించి,పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద వారికోసమే ఉన్నట్లుగా భావిస్తున్న నేపథ్యం లో కార్పొరేట్ రంగంను ఎండగడుతూ రాసిన కవిత కార్పొరేట్. "షరా మాములే" అన్న కవితలో ఫోటోల కోసం ఫోజులిస్తూ పనిచేస్తున్న వారిగా     చిత్రించడం గురించి సోషల్ వర్క్ చేస్తున్నామని మనల్ని నమ్మించేందుకు వాళ్ళు చేస్తున్న షో వర్క్ గురించి పేర్కొన్నారు.అప్పుడప్పుడు నాయకులు పర్యటనకు వచ్చే సమయంలో నగరాలను,ఆయా ప్రాంతాలను తుడిచిన అద్దం లా పరుస్తుంటారు. అటువంటి వారిని మాయలు చేసే వారిగా చెబుతూ రచించిన "అబ్రకదబ్రా"అనే రచన రాజకీయ నాయకుల స్వభావాన్ని తెలుపుతున్నాయి.

      రాజకీయ పార్టీల గురించి ఎన్నికల ముందు వారు చేసే మాయలు గురించి "వ్యూహం"అనే కవితను రచించారు."మండే గుణం పెట్రోలిది,దండే గుణం పార్టీలది"ఈ వాక్యంలో అనంతమైన అర్ధాన్ని మనం గ్రహించవచ్చు.నేడు జరుగుతున్న కుంభకోణాలు,అవినీతి అంతా రెండు మూడు పదాలతో చెప్పడం జరిగింది.అలాగే అధికార పార్టీలు ప్రజాధనం ను ఎలా వృధా చేస్తున్నాయో చెప్పేందుకు చేసిన ప్రయత్నం "అధికారపార్టీ" అనే కవిత.ఫ్లెక్సబుల్ లీడర్ అనే కవిత లో గెలిచిన నాయకుల తత్వాన్ని,వారు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చక్కగా తెలియజేసారు.రాజకీయ పార్టీల వ్యూహాలు గురించి,అధికారం కోసం వారు చేసే ఎత్తుగడలు గురించి"నూతన ప్రభుత"అనే కవితలో తెలియజేసారు.
     నోట్లరద్దు గురించి ఆ సమయం లో సామాన్యులు పడిన బాధ గురించి కొండను త్రవ్వి అనే కవితలో తెలియజేసారు.
   పృధిరాజ్ గారి మినీ మిరపకాయలు లో సామాజిక అంశాలు కోకొల్లలు.రాజకీయ పార్టీల తీరును తెలియజేస్తూ వారు ఎక్కువ కవితలు రాయడం జరిగింది. సమాజ తీరును గురించి"లోకంపోకడ, వేరు వేరయా,అంట్ల వెధవలు, సారాంశం,స్వార్థంతీరు మొదలైన కవితలలో చెప్పారు.అలాగే రాజకీయాల గురించి ఎన్నికల కోడ్,పొత్తు పెటాకులు,ఫ్లెక్సబుల్ లీడర్స్,అధికారపార్టీ ఇలా అనేక కవితలు రాసారు.
  మినీ మిరపకాయలు అనే శీర్షిక గురించి మనం చెప్పుకోవాలి.చిన్న మిరపకాయలు ఎంత ఘాటుగా ఉంటాయో అంత ఘాటుగా ఉండే నా ఈ కవిత్వం అని పృథ్విరాజ్ గారు అన్నారు.ఆ వాక్యాన్ని నిజం చేసేలా అన్ని కవితలు ఉన్నాయి.దీర్ఘమైన విషయాన్ని కూడా సంక్షిప్తంగా చెప్పడం మినీ కవితకు మాత్రమే చెల్లుతుంది,అందులోనూ పృథ్విరాజ్ గారు సంక్షిప్తతకు మరో సంక్షిప్త రూపం తీసుకు వచ్చారని చెప్పక తగదు.ప్రతి కవితకు శీర్షిక ను ఎన్నుకోవడం లో ఆయన చూపిన నేర్పు అద్వితీయం అనే చెప్పాలి."లోకం 'పోకడ' ", 'చీప్' గెస్ట్, ఎన్ని'కల' కోడ్,'సారాం'శం ఇలా ఈ శీర్షికలు గమనిస్తే ఆయన చెప్పదలుచుకున్న అంశం గూఢంగా దాగి ఉన్నదని మనం గుర్తించవచ్చు.

   ఈ విధం గా అన్ని అంశాలలో "మినీ మిరపకాయలు" ను రచించి మన ముందు ఉంచారు పృథ్విరాజ్ గారు.మినీ మిరపకాయల లోని విషయం సంగ్రహణ గురించి చెప్పాలంటే ఇది" మినీ కాదు   *soo many* " అని కచ్చితంగా చెప్పాల్సిందే.

"మినీ మిరపకాయలు "ఫై సాహితీ మిత్రుల స్పందన :
"మీ మిరపకాయలు బావున్నాయి. బాగా పేలాయి. ఘాటుగా, కారంగా వున్నాయి. "~ మైత్రేయ

"కొన్ని చదివాను...చాలా బాగున్నాయి... అసార్థక నామధేయులు...కార్పొరేట్... సామాజిక వర్గం...గుడి గుడిసె. హ్యూమనిస్ట్... ఇంకా కొన్ని..."~ఎం. నరసింహులు 9391111307

మీ మిరపకాయలు ఆసాంతం ఆబగా ఆ స్వాదించాను. చాలా బాగున్నాయ్. శ్రీ శ్రీ మహాప్రస్థానానికి యోగ్యతా పత్రాన్ని రాస్తూ చలం ఒక దగ్గర ఇలా అంటాడు. " కృష్ణశాస్త్రి తన బాధ ను అందరి లో పలికిస్తే, శ్రీ శ్రీ అందరి బాధ నూ తనలో పలికిస్తాడు " బహుశా మీరు  శ్రీ శ్రీ కోవ కు చెందిన వారనుకుంటా. భూమ్మీ ద కవిత్వం బతికి వున్నంతవరకూ ఆ కవితాత్మ లో మీ యశ క్కాయం బతికే వుంటుంది. మున్ముందు ఇంకా ఎన్నో ఇలాంటి రచనలు మీ నుండి రావాలని కోరుకుంటూ. ~నిష్ఠల శాస్త్రి.

'మినీ మిరపకాయలు ' మహా ఘాటుగా వున్నాయి. ఎల్లప్పుడూ సమాజ స్థితిగతులను పరిశీలిస్తూ.. మనుషుల వ్యక్తిత్వాలను పరిశోధిస్తూ...సాంఘిక పక్షిలా...సంఘంలో మమేకమై వుండే "డా.తలతోటి పృథ్వీరాజ్ గారి వాడి ,వేడి భావాలకు ఆ ఘాటు తప్పదు మరి.~అమరజ్యోతి
"మిని మిర్చి....చాలా ఘాటుగా,చమత్కారముగ,మంచి మెసేజ్ తో చాలా బాగున్నాయి పృధ్వీ రాజ్ గారు..మీకు నా అభినందన సుమాలు" -.మీ..బల్లా నాగభూషణము..thankyou..పృధ్వీ గారు..*****

congratulation sir...big message with small words✍ GLV

స్పందన తెలియ జేసిన మిత్రులకు నా ధన్యవాదాలు. సమీక్షించిన స్కాలర్ చిరంజీవి భీమవరపు వెంకటేష్ కు నా నా కృతజ్ఞతాభినందనాలు. 
        ~ ధన్యవాదాలతో డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్  .   



 



తెలుగు హైకూ కవిత్వం

యజ్జల నానీలు  




నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాల వాళ్ళు అందిపుచ్చుకోవాలని ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. జయబాబు అన్నారు.
   ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు, కవి, అధ్యాపకులు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ సంపాదకత్వంలో వెలువడిన "వెన్నెల రాత్రి" అనే హైకూ ఈ-బుక్ ను బుధవారం(12/06/2019) కళాశాలలో జయబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాగితాల వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని  కార్యాలయాలను కంప్యూటరీకరణచేసి పేపర్ లెస్ పద్ధతులను అవలంబిస్తూ ప్రోత్సహిస్తుంది. ఈ ఫైలింగ్ విధానాన్ని అనుసరిస్తుంది. ఇదే విధానాన్ని అవలంబిస్తూ పృథ్విరాజ్ తన సంపాదకత్వంలో "వెన్నెల రాత్రి "అనే ఈ-బుక్ ను తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా చిటికెలో ఖండాంతరాలకు వాట్సాప్, ఫేస్ బుక్ , బ్లాగ్స్  మొదలగు సామాజిక మాధ్యమాల ద్వారా పాఠకులకు ఈతరహా ఈ-బుక్స్ ను ఒక్క క్లిక్ తో చేరవేయవచ్చని అన్నారు.

     ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు శ్రీమతి పి.వి.ఎస్. జ్యోతి , డబ్బీరు అరవింద్ ఘోష్ మరియు సంస్కృత అధ్యాపకురాలు  శ్రీమతి రజనీ కుమారి, బాబూ హరినాథ్ మొదలగు వారు పాల్గొన్నారు.