-->

Thursday, December 12, 2019

18 జూలై 2018న 8మంది దళిత అధ్యాపకులు లేఖకు యాజమాన్య వక్రీకరణ సమాధానంలోని వాస్తవాలు.

       18 జూలై 2018న 8మంది దళిత అధ్యాపకులు ప్రిన్సిపాల్ గారి ద్వారా యాజమాన్యానికి లేఖను అందించాము. ఆ లేఖలో ఏ విధంగా ఏ.ఎం.ఏ.ఎల్ కళాశాల యాజమాన్యం మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చేరిననాటినుండి మాపట్ల వివక్షత ప్రదర్శిస్తూ వస్తున్నారో పాయింట్ వైస్ ఉదహరిస్తూ నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ ద్వారా తెలిపాము.       ఈ లేఖలో మేము లేవనెత్తిన అనేక విషయాలను యాజమాన్యం సమర్ధించుకుంటూ మా పట్ల వారు ఏరకమైన తప్పులు చేయనట్టు, వివక్ష ప్రదర్శించనట్టు మా లేఖకు సంజాయిషిగా 3/8/2018న స్పెషల్ కమిషనర్ కు లేఖ రాశారు.  పాత తేదీతో యాజమాన్యం అధికారులకు తప్పుదోవపట్టించడానికి సృష్టించిన దొంగ లేఖ.  నన్ను సరెండర్ చేస్తూ నాకు మేనేజ్మెంట్ ఇచ్చిన పేపర్స్ లో ఒకటి ఈ లేఖ. యాజమాన్యం వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, యాజమాన్యం వారి తప్పులను సమర్ధించుకుంటూ అధికారులను తప్పుదోవ పట్టించడానికి ఎలా రాస్తారో మీరూ పరిశీలించండి.1వ పాయింట్:
       మొదటిపేజీ చివరి పేరాలో ...  ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి .,  హాస్టల్ వార్డెన్ లను పార్ట్ టైం లెక్చరర్స్ కు; అదీ యాజమాన్యంవారి కులానికి సంబంధించిన వారికి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమైన నియామకం కాదట!  వాళ్లకు మేనేజ్మెంట్ జీతాలు ఇస్తుంది కనుక ఎయిడెడ్ అధ్యాపకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైన పార్ట్ టైం అధ్యాపకుల నియామకాలను గూర్చి మేనేజ్మెంట్ ను అడిగే హక్కు లేదట! ఆ పదవులు,  పోస్ట్ లు ఎలా రూల్స్ ను  అతిక్రమిస్తూ సమర్థించుకున్నారో ప్రతి ఒక్కరు గ్రహించవచ్చు.

3వ పాయింట్ :
       ఇద్దరు ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాల అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థినీలను ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్నారట! అందువల్ల కళాశాల విద్యార్థుల అడ్మిషన్లు పడిపోయాయని విచిత్రమైన వింత ఆరోపణలు చేశారు కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు. ఏ.ఎం.ఏ ఎల్. కళాశాల పూర్వ విద్యార్థినీలను పెళ్లి చేసుకున్నందుకు కళాశాల యాజమాన్యం ఆశీర్వదించి అభినందించాల్సింది పోగా వారిపై బురదజల్లి , వారిని అవమానపరిచేలా ఈ విధమైన కార్యక్రమానికి  కూడా యాజమాన్యం వెనుకాడలేదంటే వారి స్వభావం అర్థం చేసుకోవచ్చు.  ఆ అమ్మాయిల తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే వారికి పెళ్లిళ్లు జరిగాయా? అయిన వారి వ్యక్తి గతవిషయలతో యాజమాన్యానికి పని ఏమిటి? ఆరోపింపబడిన అధ్యాపకులేకాదు; వారి భార్యలు సైతం యాజమాన్యం వైఖరిని తీవ్రమైన విషయంగా పరిగణించారు. పృథ్వీ రాజ్ సరెండర్ రిపోర్ట్ కు సంబంధించిన పేపర్స్ లో దీని ప్రస్తావన అవసరం ఏమిటి ?

4వ పాయింట్ :
       డబ్బులు కోసం నాపై కొందరు తప్పుడు కేసు పెట్టారు. కళాశాల యాజమాన్యం ఆర్జేడి, సి.సి.ఇ. అధికారుల దృష్టికి తీసుకుపోకుండా ఏకపక్షంగా నన్ను సస్పెండ్ చేశారు. ఇలా సస్పెండ్ చెయ్యాల్సిన యాజమాన్యం కులానికి సంబంధించిన ఎందరినో సస్పెండ్ చేయకుండా రక్షించారు. నా సస్పెన్షన్ని కూడా నేను వ్యతిరేకించలేదు.  కానీ కమిషనర్ సస్పెన్షన్ ఎత్తివేసి నన్ను విధుల్లోకి తీసుకోమని 15/3/2016న ప్రోసిడింగ్ పంపిస్తే కళాశాల యాజమాన్యం వెంటనే నన్ను చేర్చునట్లు కమిషనర్ వంటి అధికారులను తప్పుదోవ పట్టించేలా ఈ లేఖలో పేర్కొన్నారు.

       15/3/2016న నన్ను విధుల్లోకి తీసుకోమని కమిషనర్ ప్రొసీడింగ్స్ పంపినా కళాశాల యాజమాన్యం నన్ను విధుల్లోకి తీసుకోకుండా తిప్పిస్తున్న నేపథ్యంలో 19/4/2016న ఏపీ ఎస్సీ-ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. సి. సి. ఇ. కమిషనర్ కు లేఖ రాశాను. అదేవిధంగా 26/4/2016న రాజమహేంద్రవరం ఆర్జెడి గారికి లెటర్ రాశాను.  27/4/ 2016 న ఏపీ ఎస్సీ-ఎస్టీ కమిషన్ స్పందించింది నాకూ మరియు కరస్పాండెంట్ కు ఒక లేఖను పంపారు.  29/4/2016 న రాజమహేంద్రవరం ఆర్జెడి వారు కూడా స్పందించి నాటి కరస్పాండెంట్ ను హెచ్చరిస్తూ ప్రొసీడింగ్ పంపగా అప్పుడుగాని 4/5/2016న నన్ను కళాశాల వారు విధిలేని పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకున్నారు. అంటే కమిషనర్ గారి ఉత్తర్వులు 50 రోజులపాటు అమలు చేయకుండా బేఖాతరు చేసి వారు కమీషనర్ ప్రొసిడింగ్ కు విలువ ఇచ్చినట్లు పై వివరాలను పొందుపరచకుండా కప్పిపుచ్చి అధికారులకు విధేయులు అన్నట్లు కళాశాల యాజమాన్యం నటిస్తున్నారు.

       అప్పటి సస్పెన్షన్ రివోక్ విషయంలోనే కాదు; 19/11/2019న సాయంత్రం నన్ను కళాశాల యాజమాన్యం సరెండర్ చేసినట్లు పంపిన సమాచారాన్ని కమీషనర్ గారు తిరస్కరించి పృథ్విరాజ్ ను విధుల్లోకి తీసుకోమని కమిషనర్ గారు 29/11/2019న ఆర్డర్ పంపినా నన్ను చేర్చుకొనక పోతే  కమీషనర్ 3/12/2019న ఆర్జేడీ ద్వారా హెచ్చరించి చెప్పించినా కళాశాల వారు నన్ను నేటి వరకు అంటే 12/12/2019 వరకు విధుల్లోకి తీసుకోలేదు దీన్నిబట్టి గ్రహించవచ్చు ప్రభుత్వ నిబంధనలన్నా, ప్రభుత్వ అధికారాలన్నా కళాశాల యాజమాన్యానికి ఎంత లెక్కలేని తనమో!

5వ పాయింట్ :
       నేను కాలేజీ రికార్డులను టాంపరింగ్ చేస్తూ మేనేజ్మెంట్ వారికి పట్టు పడ్డానని సరెండర్ రిపోర్టులో కరస్పాండెంట్ శ్రీ  దాడి శ్రీనివాస రావు  రాశారు. పార్ట్ టైం అధ్యాపకులను లెక్చరర్ అని, ఫుల్ టైం అన్ ఎయిడెడ్ లెక్చరర్ అని పై అధికారులకు కళాశాల యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు అది తప్పుడు సమాచారం అని తెలియజేసే సాక్ష్యమైన పార్ట్ టైం అధ్యాపకుల అటెండెన్స్ రిజిస్టర్ ఫోటో కాపీ తీసి వాస్తవాలను అధికారులు చూపడం ట్యాంపరింగ్ అంటా. ఇదే కాదు ఈ క్రింది అటెండెన్స్ రిజిస్టర్ లో వీరు చేసేవన్నీ వారి తప్పిదాలను అధికారులకు తెలియజేసేవే ! వైట్ ఫ్లూయిడ్ తో తుడిపి  చేస్తూ ఉంటారు.  ఇటువంటి ట్యాంపరింగ్ అటెండెన్స్ రిజిస్టర్ లో రికార్డులు పరిశీలిస్తే వీరి నిజస్వరూపం అందరికీ అర్థమవుతుంది


6వ పాయింట్ :
       నా నోటి వెంట వచ్చే ప్రతి పదం దళిత పదంతో కూడుకొని ఉంటుందని, యాజమాన్యం వారికి క్యాస్టిజం లేదని, నేను కాలేజీ వాతావరణాన్ని నాశనం చేస్తున్నానని కరస్పాండెంట్ రిపోర్టులో పేర్కొన్నారు.  యాజమాన్యానికి కులతత్వం లేకపోతే హాస్టల్ వార్డెన్, రెండు ఎన్.సి.సి. పోస్టులు వారి కులానికి సంబంధించిన వారికి, అందునా ఎయిడెడ్ అధ్యాపకులు ఉండగా   పార్ట్ టైం అధ్యాపకులు అయిన వారికే ఎందుకు ఇస్తారు? ఉద్యోగ నియామకాన్ని బట్టి నాన్ టీచింగ్ లో ఎవరు ఏ పోస్టు లో కూర్చొని పనిచేస్తున్నారో గుర్తించవచ్చు. చివరికి కాలేజీలో పార్ట్ టైం అధ్యాపకులు ఏకులం వారు ఎక్కువ ఉన్నారో, టెంపరర్ నాన్ టీచింగ్ వారు ఏకులం వారు ఎక్కువ ఉన్నారో  అర్థం చేసుకోవచ్చు.   ఎవరు కులతత్వాన్ని అనుసరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు

7వ పాయింట్ :
       ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించే తీరుపై ఎన్.సి .సి.   వారికి ఫిర్యాదు చేశామని మీటింగ్ లో మా దళిత అధ్యాపకులను ఉద్దేశించి "తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకాలు మీరు " అని మనల్ని నిందించి దూషించిన విషయాన్ని ఎలా సమర్థించుకుంటున్నారో ఈ ఏడో పాయింట్ లో మీరే గమనించవచ్చు.

8వ పాయింట్ :
       దళిత అధ్యాపకులను యాజమాన్యం అనేక మార్లు దూషించిన మాట వాస్తవం. భయ భ్రాంతులకు గురి చేయడం..  బెదిరించడం వాస్తవం. అటువంటి సందర్భంలో మాకు ఎటువంటి హాని జరిగినా దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేయడం ఎవరైనా చెప్పేదే.  దాన్ని హెచ్చరించారని వక్రీకరించి యాజమాన్యం నా సరెండర్ రిపోర్టులో రాయడం జరిగింది.

9వ పాయింట్ :
       యాజమాన్యానికి కులతత్వం ఉన్నది కనుకనే వివిధ ఆరోపణలో ఒక అంశంగా ఒకే కులానికి చెందిన వారిని అధికులను ఉద్యోగాల్లో తీసుకోగా కొందరి ఆరోపణలమేరకు  ఎంక్వైరీ జరిగి 1984 నుంచి 1997 మధ్య ఎస్ ఓ పాలనలోకి కళాశాల వెళ్ళింది.  2000 సంవత్సరం నాటికి సుమారు 112 మంది ఎయిడెడ్ అధ్యాపకులు ఉంటే ఎస్సీ అధ్యాపకులు కేవలం ఐదుగురు అంటే ఐదుగురే ఉన్నారు.  అందుకే ఆనాటి కమిషనర్ శ్రీ కృపానందం గారు అనేక నెలలపాటు ఎయిడెడ్ స్టాఫ్ జీతాల గ్రాంటును ఆపి యాజమాన్యం పై ఒత్తిడి తీసుకురాగా 2000 సంవత్సరంలో బ్యాక్ లాగ్  పోస్టులు భర్తీ చేశారు. కులతత్వం విషయంలో యాజమాన్యం  అసమానతలు ప్రదర్శించనట్లు అధికారులను తప్పుదోవ పట్టించడానికి లేఖలో రాసుకొచ్చారు. పైగా నేను కళాశాలలో కులతత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు రాశారు.

       మేము చెబుతున్నవన్నీ ఫాల్స్ అని, ప్రిన్సిపాల్ మాకు అనేక బాధ్యతలు అప్పజెబితే చెయ్యలేదని ఆరోపించారు.  ఏఏ బాధ్యతలు అప్పజెబితే చెయ్యలేదో నిరూపించాలి. దళిత అధ్యాపకుల యూనియన్ ప్రారంభించి కళాశాలలో సమస్యలను సృష్టిస్తున్నట్టు రాశారు. ఆక్టా వలె డాక్టా(ఎయిడెడ్ దళిత అధ్యాపకుల సంఘం ) రాష్ట్రస్థాయి అధ్యాపకుల సంఘం ఉంది. ఆ సంఘంలో సభ్యుడిగా చేరాను. మేము ప్రారంభించినటువంటి సంఘం కాదు. ఇటువంటి సంఘాలలో సభ్యులుగా ఉన్నందుకు మాపై యాజమాన్యం ఏ చర్యలైనా తీసుకోవచ్చునని కరస్పాండెంట్ గారు అనేకమార్లు మీటింగులలో హెచ్చరించారు బెదిరించారు.

       ఎవరు వ్రాతపూర్వక అనుమతి లేకుండా కళాశాల పనివేళల్లో కళాశాల బయటికి వెళ్లారు? క్లాస్ లో ఎవరు ఫోన్ లో మాట్లాడుతున్నారో వారిని గుర్తించి హెచ్చరించ వచ్చు కదా! నోటీస్ ఇచ్చి హెచ్చరించారా?

       మేనేజ్మెంట్ వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలా మంది ఎయిడెడ్ అధ్యాపకులు వైజాగ్ నుండి వస్తున్నారు కనుక పార్ట్ టైం అధ్యాపకులకు నియామకాలలో ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని రిపోర్టులో రాశారు. ఇప్పుడున్న అధ్యాపకులలో ఉద్యోగం చేరిన నాటి నుండి తునిలో ప్రిన్సిపాల్, విశాఖపట్టణం నుండి ఎ.  రవీంద్ర- మేరీ హెలెన్- ఎం. హరిబాబు వస్తున్నారు. 2018 లో  కె.వి.ఎస్. నాయుడు, పృథ్విరాజ్  పిల్లల చదువు నిమిత్తం వైజాగ్  వెళ్లారు.  అనకాపల్లి నివసించే అధ్యాపకులకు ఏయే బాధ్యతలు అప్పజెప్పారు ? వైజాగ్ నివాసి అయిన హరి బాబుకు ఎన్ .ఎస్ . ఎస్. మరియు యుజిసి కో-ఆర్డినేటర్ పదవులు ఒకే వ్యక్తికి ఎందుకిచ్చారు? అసలు ఏ విషయాలలో కి సీనియార్టీ చూస్తున్నారు?
       కళాశాలలోని దళిత అధ్యాపకులకు వ్యతిరేకంగా హాని తలపెట్టాలనే తత్వంతో లేనివారిగా యాజమాన్యం తమ రిపోర్టులో పేర్కొన్నారు.
       పై అధికారులకు వాస్తవ విషయాలను మరుగుపరిచి , వాస్తవాలను మాట్లాడే ఉద్యోగులపై లేనిపోని ఆరోపణలు చెయ్యడం, అధికారులను తప్పుదోవ పట్టించేలా రిపోర్ట్ లను రూపొందించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య .


No comments:

Post a Comment