-->

Tuesday, September 29, 2020

గౌరవనీయులైన ఏ.ఎం. ఏ ఎల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారికి.

గౌరవనీయులైన ఏ.ఎం. ఏ ఎల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారికి.


 నన్ను నోరు మెదపకుండా చెయ్యడానికి ఎవరైతే నాపై తప్పుడు కేసు పెట్టారో వారిని కాలేజీకి పిలిపించి, వారున్న చోటుకి నన్ను పిలిపించి ఏదైనా ఘర్షణ జరిగితే పోలీస్ స్టేషన్ కు నన్ను తీసుకెళ్లడానికి సి ఐ వావాహనాన్ని సిద్ధం చేసి ఉంచారు. కళాశాలవారే రాసిన కంప్లైంట్ పై వారిచేత సంతకం చేయించి వారిచ్చిన ఫిర్యాదు కాగితం అన్నట్లుగా నటిస్తూ 3/12/2018న సదరు కళాశాల కరస్పాండెంట్ కోర్ట్ పరిధిలో ఉన్న విషయంపై మాట్లాడకూడదని లా చదివిన వ్యక్తిగా తెలిసికూడా నా సహా అధ్యాపకులైన వారిని తన జి.బి. రూమ్ లోకి పిలిపించి వారు రాసిన లెటర్ ఆ అధ్యాపకులకు ఇచ్చి చదివిచ్చి నా కేస్ ను సెటిల్ చేసుకోమని నాతో నా మిత్రులను చెప్పమని పంచాయితీ పెట్టాడు కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు. లెటర్ చదివిన మిత్రులద్వారా ఆవిషయం తెలుసుకొని ఆ లెటర్ ప్రతి నాకు కావాలని కోరుతూ 10/12/2018న  ఈక్రింది విధంగా లెటర్ రాసి ప్రిన్సిపాల్ కు అందించాను. విషయం ఏమిటంటే ఆ ప్రతిని ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. ఎందుకంటే దాని రూపకర్తలు వారే. అదేవిధంగా 14/12/2018న ప్రిన్సిపాల్ డా జి జయబాబు నన్ను తన ఛాంబర్ కు పిలిచి కేసును సెటిల్ చేసుకోమని తన మాటగా కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) చెప్పమని నీతో మాట్లాడమని చెప్పినట్లు నాతో అన్నాడు.  

ఇలా సాగుతున్న ఈ క్రమంలో నాకు రావాల్సిన CAS  ఎరియర్స్ రాకుండా నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని తప్పు లెక్కలు గట్టి 1,11,250 కు బదులు 3,64,423 రూపాయలతో బిల్లు తయారు చేశారు. సర్వీస్ రిజిస్టర్ లో రాసి పంపించారు . క్లర్క్, సూపరిండెంట్,  ప్రిన్సిపాల్ సంతకాలు చేసి కరెస్పాండెంట్ సంతకం చేసేటప్పుడు ఆ తప్పు ఉందని నాది పక్కన బెట్టి మిగతా వారిది పంపించారు. నిజంగా అనుకోకుండా తప్పే దొర్లింది అనుకుంటే ఆ తప్పును సరిచేసి అందరి బిల్లులు కలిపి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు పంపించవచ్చు. కానీ వారు అలా చెయ్యకుండా నాది తప్పించారు. నాతోటి వారందరికీ 1/7/2019 సి.ఎ.ఎస్. ఎరియర్స్ వస్తే నాకు నేటివరకు ఆ ఎరియర్స్ రాలేదు.  ఈ క్రింద 1,11,250 కు బదులు 3,64,423 రూపాయలతో తప్పుడు బిల్లు తయారుచేసి నా సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేసిన సాక్ష్యం 

     నాకు రావాల్సిన CAS ఎరియర్స్ గూర్చి జిల్లా కలెక్టర్ కు మరియు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు పత్రం రాసి పంపగా విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి శ్రీ కృష్ణా కాలేజీ ఎ. ఒ. కు వివరణ కోరగా, వారు మా కాలేజీ వారిని వివరణ కోరారు. ఆలా అడిగినందుకు, "దళిత అధ్యాపక సంఘానికి ఛైర్మన్ గా ఉన్నందుకు, అలా లెటర్ హెడ్ పై నేను ఫిర్యాదు చేసినందుకు, ఏ ఏం ఏ ఎల్ కాలేజీ పేరు ప్రస్తావించినందుకు, కులాన్ని వాడుకున్నట్లు అందుచేత నన్ను కరస్పాండెంట్ సస్పెండ్ చెయ్యగలిగే అధికారాలు ఉన్నాయని కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు నన్ను సస్పెండ్ చేస్తానని అందరిముందు బెదిరించారు.

కొన్ని నెలలుగా మా కళాశాల కరస్పాన్ డెంట్ నన్ను టార్గెట్ చేస్తూ , మీ గురించే మీటింగ్ పెట్టింది అంటూ నా వ్యక్తిగత విషయాలు అందరిముందు  ప్రస్తావిస్తూ  నన్ను అవమానిస్తున్నారు. 13/9/2019 మా కాలేజీ జి బి హాల్ ల్లో జరిగిన సమావేశంలో నా వ్యక్తిగత విషయాలను ఎలా ప్రస్తావించారో మీరు గమనించ వచ్చు.  


"పృథ్వి రాజ్ గారు మీకు డైరెక్ట్ గా అడుగుతున్నాను . మీరు అన్ని రూల్స్ మాట్లాడుతూ అంతా  కరెక్ట్ గా వెళుతున్నారు అన్నంత ఇదిగా వెళుతున్నారు . పోనీ యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా మీరేమైనా ఫాలో అవుతున్నారా ? ఒక విషయం. మీ పర్సనల్ విషయం కూడా నేను మాట్లాడుతున్నాను.  మీ సెషన్స్ లోని ఆల్రడీగా షెడ్యూల్డ్ ఇచ్చారు  . ఒక నెలరోజులు, నెలా పదిహేను రోజుల్లో గాని డెసిషన్ కూడా  వచ్చేస్తది    భగవంతుని దయవల్ల మీకు కోపరేటివ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ షెడ్యూల్డ్ లో మరుసగా మీకు వాయిదాలు పడుతుంటాయి . రెండు రోజులకు మూడు రోజులకు పడుతుంటాయి. అసలు మీరు ఏ బేస్ చేసుకొని అగెనెస్ట్ మేనేజ్మెంట్ వెళుతున్నారో నాకు అర్థం కావడం లేదు .    పోనీ మీరు కరెక్ట్ గా వెళు తున్నారా అంటే మీరు చేసిన దానిలో ప్రతిదాంట్లో తప్పు వెతక వచ్చు.  మొన్న ఏడవ తారీఖున లీవ్ ఇచ్చారు.   కడుపునొప్పి వస్తుందని లీవ్ ఇచ్చారు . మీరు ఎం చేశారు. కృష్ణా కాలేజీకి దగ్గరకు వెళ్లి   అతనితో ఎవరితో గొడవబడ్డారు.  వాళ్ళేమో ఆఫీస్ కు ఫోన్ చేశారు. ఆ తర్వాత మొన్నేమో కోర్టు వాయిదా అని లీవ్ పెట్టారు. కోర్ట్ వాయిదా ఏమిటో నాకు ప్రూఫ్ కావాలి. ఎలాగా. మీరు ఏ వాయిదా వెళ్లారు, ఏ పనిమీద వెళుతున్నారు. మీరు విక్టిం గా వెళుతున్నారా, లేదా ఎక్యూజ్ డా. కాన్సర్న్ అడ్వొకేట్ దగ్గర లెటర్ తీసుకొని  సబ్మిట్ చేస్తే దాని సపోర్ట్ చేసే డాక్యుమెంట్స్ ఇస్తే గాని   నేను అల్లౌ చెయ్యను.  ఎందుకు అల్లౌ చేస్తాము. అంటే ఇవన్ని ఏమిటంటే ....కెలికితే మేము కెలికే పద్దతులు.   ఆవిధంగా అన్నమాట. ఇన్ని   హెడ్దేక్ లు పెట్టుకుని అంత గోక్కోవడం అవసరమా అండి. ఇవ్వాళ్ళ  ప్రత్యేకించి మీటింగ్ పెట్టడానికి కారణం మిమ్మల్ని ఉద్దేశించి పెట్టుకోవడమే ! " ఇదీ మా కళాశాల కరస్పాండెంట్ వైఖరి. 
     వ్యక్తిగతం అన్నప్పుడు నా ఒక్కడితోనే వ్యక్తిగత విషయాలు మాట్లాడ వచ్చుకదా ? ఆతని ఉద్దేశం అదికాదు. నన్ను అవమానించడమే ఆయన పరమార్థం. "కెలికితే మేము కెలికే పద్దతులు"అని కక్ష సాధింపు ,వేదింపు మాటలు మాట్లాడారు  కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు. ఆయన మాటల్ని బట్టి నాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా, నన్ను టార్గెట్ చేసి వేదించినా నేను ఉన్నతాధికారులెవరికీ తెలియ జేయకూదదనేది కరస్పాండెంట్ మాట. అదే మేము వారిని కెలుక్కోవడం అంటా. దానికి ప్రతిగా వారు మా వ్యక్తిగత విషయాలను అందరిలో ప్రస్తావిస్తూ, అవమాన పరుస్తూ వ్యవహరించే శైలి వారు మమ్మల్ని కెలుక్కోవడమే.
~ ఫైన్స్ 2,000, 750, 250 హాజరు చాలని పిల్లలకు నిర్ణయించారు.
~ క్యాస్ట్ బెస్ పై లెటర్ పెట్టినందుకు మేనేజ్మెంట్ ఎంతవరకైనా వెళ్ళ వచ్చు అని బెదిరింపు.
~   కాలేజీ పేరును నేను ఉపయోగించినందుకు గాను ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చని బెదిరింపు
~ లీవ్ మెయిల్ ల్లో పెట్టకూడదట.  దూరంగా ఉన్నప్పుడు మెయిల్
~ మమ్మల్ని గోకుతున్నాడు. నేను గోకేనంటే   కాంక్రీటేను. మేమేదేసినా కాంక్రీట్లా ఉంటది .
~ అతని కేస్ హియరింగ్ కు వచ్చింది. ఇప్పటివరకు బుర్ర పెట్టలేదు. ఇక బుర్ర పెట్టానంటే ఏమైనా జరుగుతది అని బెదిరింపు.
~  మీ వర్షన్ ప్రకారం పృథ్వి రాజ్ మేనేజ్మెంట్ కు యాంటీగా ఉన్నాడంటున్నారు కదా. ఆయన్ని వేరే కాలేజికి పంపించ వచ్చు కదా అనిన అధ్యాపకుడు ఎం . కొండల రావు మాటలకు కరస్పాండెంట్ స్పందన :" నేను అలా ఎందుకు వదులుతాను మాస్టారు. భయపెట్టి వదులుతానని అనుకుంటున్నారా? మేము దిగామంటే కాంక్రీట్ సార్. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము సార్".
            
~ ఒకపేజీ అరపేజీ కాదట. రెండు మూడు పేజీల షో కాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారట. అది స్ట్రాంగ్. కాంక్రీట్  వేసినట్టే ఉంటది నేను తలుసుకుంటే. ఇక నేను దిగిపోతున్నాను  అని బెదిరింపు.
~ లాయర్ ని కూడా నేను కలిసి వచ్చాను. ఎలా ఇవ్వాలి ఏమిటనేది ?  నేను తీసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతది. నేనొకసారి ముందు స్టెప్ వేస్తే మరలా బ్యాక్ స్టెప్ పడడం అనేది తెలియదు నాకు.
~ నేను షో కాజ నోటీసు ఇష్యూ చేస్తాను మాస్టారు . అతను ఒపీనియన్ రాస్తాడు. ఆ ఒపీనియన్ కు నేను సాటిస్ఫాక్షన్ అవను. నేను సాటిస్ఫాక్షన్ అవను గనుక మా జి.బి. లో పెట్టి సస్పెన్షన్ తయారుచేసి ఇష్యూ చేస్తాను


18-10-2019న కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు , సూపరిండెంట్, ప్రిన్సిపాల్ డా జి జయబాబు బోటనీ అధ్యాపకుడు డా ఎమ్.  హరిబాబును , కామర్స్ అధ్యాపకుడు శ్రీ ఎం. కొండల రావును పిలిపించి నాగూర్చి వారివద్ద మాట్లాడిన విషయాలను నాతో తెలియజేయమని చెప్పగా ఫోన్లో శ్రీ ఏం కొండల రావు కళాశాల  కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు ఆ మీటింగ్ లో ఏవిధంగా  హెచ్చరించి - బెదిరించారో తెలియ జేశాడు.


16-10-2019న కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు , సూపరిండెంట్, ప్రిన్సిపాల్ డా జి జయబాబు బోటనీ అధ్యాపకుడు డా ఎమ్.  హరిబాబును , కామర్స్ అధ్యాపకుడు శ్రీ ఎం. కొండల రావును పిలిపించి నాగూర్చి వారివద్ద మాట్లాడిన విషయాలను నాతో తెలియజేయమని చెప్పగా ఫోన్లో శ్రీ ఏం కొండల రావు కళాశాల  కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు ఆ మీటింగ్ లో ఏవిధంగా  హెచ్చరించి - బెదిరించారో తెలియ జేశాడు


~ కరస్పాండెంట్, సూపరిండెంట్  ఆర్ జె డి ఆఫీస్ కు వెళ్లి ఆర్ జె డి ని కలిసినట్టు.
~ మెమో ,ఆతర్వాత షో కాజ్ నోటీస్, రెండు నెలలు సస్పెన్షన్, ఆర్ జె డి పర్మిషన్ తో మరో రెండు నెలలు సస్పెన్షన్ , ఆ   తర్వాత టెర్మినేట్ చేసే పవర్ మీకే ఉంది అని ఆర్ జె డి చెప్పారట.
~ మేనేజ్మెంట్ జోలి రానని, ఏ విషయంలో ఇన్వాల్ కానని ఆన్ పేపర్ పై ఇచ్చేస్తే కామ్ గా ఉంటుంది. ఆయన ఉద్యోగం ఆయన చేసుకోమను. మా పనులు మేము చేసుకుంటాము అని కరస్పాండెంట్ అన్నారట.
~   రేపు రిటైర్మెంట్ అయినా సరే మనం మేనేజ్మెంట్ కు చెప్పాలి. ఈ రోజు నేను ఉండొచ్చో రేపు మరోకరుండా వచ్చు. కాని మేనేజ్మెంట్ మాదేకదా. 
~ హాఫ్ డే సాలరీ కట్ చెయ్యాలట.    
~ మెమో ~ రెడీ చేశారట.  

23/10/2019 న సాయంత్రం ఎ ఏం ఏ ఎల్ కళాశాల స్టాఫ్ తో కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు సమావేశం కానున్నాడని సమాచారం  

ఏ ఎం ఏ ఎల్ కళాశాలలో అధ్యాపకులు విచిత్ర పరిస్థితి లో ఉన్నారు. మరి ముఖ్యంగా దళిత అధ్యాపకులు. ఒకప్పటి మేనేజ్మెంట్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టా రాజ్యంగా చేసుకుంటూ పోయే వారు.


06-12-2018 నాటి సమావేశంలోని అంశాలు:
అనేక సంవత్సరాలుగా వివక్షకు గురియైన దళిత అధ్యాపకులు ఇచ్చిన లెటర్ గూర్చి, సి ఏ ఎస్ గూర్చి., హాస్టల్ వార్డెన్, ఎన్ సి సి ఎవరికైనా తాము ఇచ్చుకోవచ్చని, అడిగే హక్కు ఎయిడెడ్ అధ్యాపకులకు లేదని ..మొదలగు విషయాలు.
10-4-2019 సాధారణ సమావేశం 
16-04-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అధికారాల గూర్చి,లీవ్స్ ,ఆడారి నాగ భూషణం ప్రస్తావన ,మేనేజ్మెంట్ ను మీరేమి చెయ్యలేరు , మాకు పోయేది ఏమీలేదు ... మొదలగు ప్రధాన విషయాలు
06-07-2019 నాటి సమావేశంలోని అంశాలు:
వర్క్ లోడ్ , మినిమం 40 అవర్స్ ఇచ్చినా చెయ్యాల్సిందే, 30 అవర్స్ మినిమం 
03-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
లీవ్స్ సూపరింటెన్ డెంట్ ద్వారా ,ఇ.పి.ఎఫ్.   ఫైన్  ప్రస్తావన,సాలరీస్ , కొందరి అధ్యాపకుల  వ్యక్తిగత విషయాల ప్రస్తావన, గోకితే పుండ్లు పడతాయి, మేనేజ్మెంట్ పవర్స్, లీవ్స్ పై పట్టు గోక్కోవ డాన్ని బట్టి అని చెబడం, ఆడారి నాగభూషణం ~చెరుకూరి నూకేశ్వర రావు లకు నిబందనలకు విరుద్ధంగా డబ్బులు ఇప్పించిన వైనం,పి జి అర్హత చాలట , హాఫ్ డే సి ఎల్, లీవ్ కావాలంటే  సూపరింటెన్ డెంట్ వద్దకు వెళ్ళాల్సిందే అని చెబడం,లీవ్ ఫండమెంటల్ రైట్ కాదని చెపడం, మాకు రోకుంటే ఎవరికైన సెలవు ఇచ్చి అడ్జెస్ట్ చేసుకుంటా మనడం, సూపరింటెన్ డెంట్ ను కలవలేదు గనుక లీవ్ లెటర్ ఇచ్చినా అబ్సెంట్ మార్క్ రాసి అధ్యాపకుడు విక్టర్ ను బెదిరించుట , మమ్మల్ని కెలికితే ఇలానే ఉంటుందని చెబడం,
07-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అడగమన్న ప్రకారం కాలేజీ పనిపైనే ఎ. ఒ. డి టి ఒ ఆఫీస్ లకు  వెళ్లి నా ఎరియర్ గూర్చి అడుగుట
సాధారణ విషయాలు.
12-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కడుపులో నొప్పి అని ఎ ఒ వద్దకు వెళ్లి నా ఎరియర్స్ గూర్చి విచారించానని,   డిసిప్లీనరీ యాక్షన్ గూర్చి,లీవ్స్ గూర్చి, మేనేజ్మెంట్ ను క్వశ్చన్ చెయ్యడానికి లేదని , అధ్యాపకులను బెదరించడం, అబ్సెంట్ మార్క్ నోట్ చేస్తామనడం, కెలికితే -గోకితే , సస్పెండ్  చేస్తే కాలేజీకి రాలేనని, ఆడారి నాగభూషణం గూర్చి. లీవ్స్ థ్రూ ప్రోపర్ ఛానెల్,అలా చెయ్యకుంటే అబ్సెంట్ మార్క్ చేస్తాననడం, నాకు మేమో ఇష్యూ చెయ్యమని ప్రిన్సిపాల్ కు చెబడం.     
24-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
సంఘాలలో(యూనియన్స్)లో అధ్యాపకులు ఉండకూడదని, కులాన్ని ఉపయోగించుకుంటున్నానని, వీటిని బట్టి నాపై చర్యలు తీసుకోవచ్చని కరెస్పాండెంట్ నన్ను సస్పెండ్ చేస్తానని బెదిరింపులు.

16-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:
18-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:

అధ్యాపకులపై కళాశాల యాజమాన్యం రోకు (మోజు-ఇష్టం ) ఉంటే అన్నీ సాధ్యం !:   
కళాశాలను నిర్వహించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక కరస్పాండెంట్  ప్రభుత్వ నిబంధనలతో మాకు పనిలేదు మా ఇష్టం వచ్చిన వారికి సెలవు మంజూరు చేస్తాము, ఇష్టం లేని వ్యక్తి అనుకో సెలవు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వం , మంజూరు చెయ్యం  అని పబ్లిక్ గా స్టాఫ్ మీటింగ్ లో చెబుతున్నారంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరస్పాండెంట్ చెప్పిన దానిలో తప్పేలేదు. ఎందుకంటే ఏళ్ళ తరబడి వారు చేసుకొస్తుంది అదే. వారి దయతో లీన్ పేరిట విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, రకరకాల సెలవలతో విదేశీ పర్యటనలు, తీర్థ యాత్రలు చేసినవారు, విదేశాలకు పురుళ్ళకు వెళ్ళిన వాళ్ళు అనేకులున్నారు. కొన్ని సంవత్సరాలుగా  కళాశాలలో జరుగుతున్న తంతు.   

సెలవు చీటీ ఇచ్చినా అబ్సెంట్ రాస్తారు :
డి డబ్లూ.విక్టర్ అనే అధ్యాపకుడు సెలవుచీటి రాసి సంబంధిత క్లర్క్ కు ఇచ్చినా అటెండెన్స్ రిజిస్టర్ లో సి ఎల్ నోట్ చెయ్యక పోగా , సూపరింటెండెంట్ చేత సంతకం చేయించ లేదని సాకు చూపి ఒక క్లర్క్  కరస్పాండెంట్ సూచన మేరకు అబ్సెంట్ మార్క్ చేశాడంటే ఏమనాలి.  ఆ క్లర్క్ చెయ్యాల్సిన డ్యూటీ ఏమిటి . పట్టించుకునే ప్రభుత్వ అధికార గణం లేకుంటే అధ్యాపకులను యాజమాన్యం ఇలానే వేధిస్తుంటారు . అ చర్యకు భయపడి, మనసు చంపుకొని ఆ అధ్యాపకుడు తన లీవ్ లెటర్ ను తానే స్వయంగా సూపరిండెంట్ వద్దకు వెళ్లి సంతకం చేయించాక వైట్ ఫ్లూయిడ్ తో అబ్సెంట్ చెరిపి సి ఎల్ నోట్ చేశారు.    

కళాశాల యాజమాన్యం దయ ఉంటే ఉద్యోగం ఎగగొట్టినా లక్షలు లక్షణంగా పొందవచ్చు :
చేసిన ప్రభుత్వ వ్యతిరేకమైన పనులను ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు స్టాఫ్ సమావేశంలో నిర్భయంగా చెబుతున్నారు. అయన పరిభాషలోనే ...వారి రోకు ఎవరిపైనైతే ఉంటుందో మెడికల్ లీవ్ లు ఆ లీవ్ లు , ఈ లీవ్ లు మాత్రమే కాదు సంవత్సరాల పాటు ఎటువంటి లీవ్ లు పెట్టకుండానే కాలేజీ మానెయ్యొచ్చు. బుద్దిపుట్టిన కొన్నేళ్ళ తర్వాత యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని, రికార్డ్ లు తారుమారు చేయించుకొని, అధికారులను మేనేజ్ చేసుకొని రావాల్సిన అణా పైసాతో సహా పొందవచ్చు. అటువంటి వారికి ఉదాహరణే నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రీ చెరుకూరి నూకేశ్వర రావు, ఆడారి నాగభూషణంల ఉదంతం . కళాశాలకు కొన్నేళ్ళపాటు రాకున్నా కళాశాల యాజమాన్యంతో లౌక్యంగా వ్యవహరించి లక్షలాది రూపాయలను పొందినవాడు నూకేశ్వర రావు . కోర్టుకు వెళ్లి నేటికీ తిరుగుతున్నవాడు నాగ భూషణం. 
ఈ కథలో కరస్పాండెంట్ ఎయిడెడ్ స్టాఫ్ కు చెప్పిన నీతి , హెచ్చరిక ఏమిటంటే ...మమ్మల్ని ధిక్కరించి మీరు కోర్టుకు వెళ్ళినా సదరు కోర్టువారు తిరిగి కళాశాల యజమాన్యానికే పరిష్కరించమని సూచిస్తారు. ఆవిధంగా మేము మిమ్మల్ని సాధిస్తాము, వేధిస్తాము. జాగ్రత్త అని బెదిరించడం. యాజమాన్యం వారు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడినా మనం నోరుమేదప కూడదు.  అనేక సమావేశాలలో వీరి విషయాన్ని కరస్పాండెంట్ ప్రస్తావించాడు.
ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు?   
   
   

పృథ్వి రాజ్ అనే అధ్యాపకుణ్ణి వేధింపులు, బెదిరింపులతో కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు:

ఎయిడెడ్ కళాశాలలలొ మేనేజ్మెంట్ ఏమిచెబితే అది చేయాలనే తత్వం. బానిసలుగా చూసినా అధ్యాపకులు పడియుండాలి. మన వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ సహ ఆధ్యాపకుల ముందు  బెదిరించినా మనం పడాలి అనే వారి వైఖరి. ఉద్దేశపూర్వకంగా మన ఆర్ధిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా ఉన్నతాధికారులకు తెలియజేయకూడదు. దీనిని వేధించడం అనిగాక మరేమి అంటారు. రాష్ట్రంలో ఇన్ని ఎయిడెడ్ కళాశాలలు ఉంటే మరే కళాశాలలో లేని రీతిగా అధ్యాపకులైన మేము ప్రిన్సిపాల్ గారికి కాకుండా మా సెలవు చీటీని మేమే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ కి ఇవ్వాలనే కరెస్పాండెంట్ శాసనం. అలా గాకుండా సెలవు చీటీ సంబంధిత లీవ్స్ క్లర్క్ కు ఇచ్చినా , ప్రిన్సిపాల్ గారికి అందించినా అటెండెన్స్ రిజిస్టర్ లో ఆబ్సెంట్ మార్క్ నోట్ చేసి బెదిరించడం. అలా  ఆబ్సెంట్ మార్క్ నోట్ చేయబడినవాళ్లు భయపడిపోయి హోదాను మరచి తామే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ చేత సంతకం చేయించుకోగా ఆబ్సెంట్ గా రాసిన స్థానంలో వైట్ ఫ్లూయిడ్ పెట్టి సి. ఎల్. మార్క్ చెయ్యడం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే తీరిక లేదు. కళాశాల యాజమాన్యం అందించే ముడుపులకు ఆర్ జెడి రాజమండ్రిలో, విజయవాడ లోని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ లోను క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకటి కాదు మా ఎయిడెడ్ కళాశాల లీలలు.


15-5-1984 commissioner order no:5030 commissioner  MEDAM SATISH NAYAR. REPORT
SOWCAUSE NOTICE. 1st S.O. Ronanki  Anandarao .  15-5-1984 TO 6/11/1997 so to management.

బహుశా ....ఇప్పుడు మీరు చదవబోయే విషయాలు ఎయిడెడ్ అధ్యాపకులైన వారిని విస్మయానికి గురిచేస్తాయి. ఏ ఎం ఏ ఎల్ కళాశాల, అనకాపల్లి అధ్యాపకుల పట్ల కళాశాల యాజమాన్యం ఎంత అరాచకంగా వ్యవహరిస్తుందో, అధ్యాపకులను ఎంత బానిసలుగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.  ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కళాశాల యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో....అనేక మార్లు స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు  మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్ లో ఎలా అధ్యాపకులను భయపెడుతూ, హెచ్చరిస్తూ మాట్లాడారో గ్రహించవచ్చు.
ఏ ఎం ఏ ఎల్ కళాశాల సుమారు పదమూడేళ్ళ పాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలో సాగింది. కారణం....యాజమాన్యంలోని అంతర్గత కారణాలచేత ఒక వ్యక్తి కళాశాలలో జరిగిన అవకతవకలు, యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించిన తీరుమీద ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నాటి కమీషనర్ స్పందించి రికార్డ్స్ పరిశీలించి నాటి కళాశాల యాజమాన్యాన్ని తొలగించి స్పెషల్ ఆఫీసర్ (ఎస్.ఒ )ను నియమించింది.  ఎటువంటి అవకతవకలకు, ప్రభుత్వ  నిబంధనలకు విరుద్ధమైన రీతిలో వ్యవహరించమని అండర్ టేకింగ్ లెటర్ కళాశాలవారు ఇచ్చాకే ప్రభుత్వం ఎస్ .ఒ తీసి కళాశాలను యాజమాన్యానికి అప్పజెప్పింది. యాజమాన్యాన్ని డిస్మిస్ చెయ్యడానికి నాడు కారణాలు కొన్నే. కాని నేడు పరిశీలిస్తే లెక్కలేనన్ని. అయినా  అనేక మార్లు స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు  మీటింగ్స్ పెట్టి నిర్భయంగా, నిసిగ్గుగా వారి చట్టవిరుద్ధమైన పనులను ప్రస్తావిస్తూ 
6/12/2018

           
సి ఎల్స్ విషయంలో కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి శాసనం:
".....ఎస్పెషల్లీ....యూ జి సి      స్కేల్ ఎయిడెడ్ ఫ్యాకల్టీ విషయంలో చెబుతున్నాను... మీ క్యాజువల్ లీవ్స్ 8 ఉన్నాయి. ప్లస్  స్పెషల్ క్యాజువల్ లీవ్స్ విషయంలో రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లయి చెయ్యడానికి లేదు. ఇప్పుడు చెబుతున్నాను. ఇప్పుడు  సుపరిండేంట్ కూడా కాదు ......నా పర్మిషన్ లేకుండా లీవ్ అలౌ చెయ్యడానికి అవదు"

02B- మా దయ మీమీద ఉంటేనే నిబంధనలకు విరుద్ధమైనా మీకు సెలవులు మంజూరు చేస్తామనే కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి మాటలు:     
"సార్ మాకు రోకు(మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్. మేము పంపించుకుంటాము. నా చేతిలో పవర్ ఉంది. నేనేదో అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు రోక్ లేదనుకోండి ఒక్క రోజుకూడా నేను ఎలో చెయ్యను. అది నా డిస్కషన్ పవర్. మీకది పాయిన్టౌట్ చెయ్యడానికి లేదు. ఆవిషయంలో మీరు నన్ను పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. నా ఇష్టం.  నాకు రోకుంటే 6 నెలలు ఇస్తాను. నాకు రోకు లేదనుకో ఒకరోజుకూడా ఇవ్వను. నా పవర్ అది. నా పవర్ ను మీరు క్వచన్ చెయ్యడానికి మీకు రైట్ లేదు."

03C: 
"సార్ ఇంకో విషయం సార్.  పక్కా రూల్స్ పాటించేసి మీరేదో చేస్తే ఆ మోటో కాదు సార్. మీరు కెలుకుతున్నారు కాబట్టే మేము కెలికితే మీకు ఈవిధంగా ఉంటుందని చెప్పడానికే"

మేము తలుచుకుంటే కులం పనిచెయ్యదు,  ఎం పనిచేయదు.01A: " మీరు కెలుక్కోవడం వల్ల మేము సబ్జెక్ట్ లోకి వెళ్లి పోయి మేము డెప్త్ కు వెళుతున్నాము.  మేము ఏది  చెప్పినా సరే ఆన్ రికార్డ్, ఆన్ గవర్నమెంట్ జి వొ ప్రకారంగా మాట్లాడుతున్నాను"
01A:"కాజ్వల్ లీవ్స్ 8 ఉన్నాయి. స్పెషల్ కజ్వల్ లీవ్స్ రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లై చెయ్యడానికి లేదు."
01A:"లీవ్ మీకు ఫండమెంటల్ రైట్ కాదు"
01A:"మీరు లీవ్ అప్లై చేస్తే ఇవ్వాలని రైటేమి లేదు. నాకు నచ్చలేదనుకోండి నేను కంపిటి టీవ్ అథారిటీ కాబట్టి ఏ ఎం ఏ ఎల్ కాలేజీకి నేను లీవ్ సంక్షన్ చెయ్యక్కర లేదు. అది అబ్సెంట్ క్రిందే పడుతుంది. "


 సస్పెండ్ విధానమే ప్రభుత్వ నిబంధనలు - మానవ హక్కులకు విరుద్ధం:
అధికారులు నా  సస్పెండ్ ను రివోక్ చేసినా కళాశాల యాజమాన్యం నన్ను విధులలోకి  తీసుకోకుండా నన్ను వేధించిన వైనం:
అధికారులు, మంత్రి , ఎస్సీ కమీషన్ దృష్టికి తీసుకు వెళ్ళగా జరిగిన న్యాయం :
కళాశాల యాజమాన్యం మొదలు పెట్టిన వేధింపులు:
నిష్కారణంగా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
మా ఇబ్బందులను అధికారులకు తెలియ జేసినా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
జీతాలు యాజమాన్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాల్సిందే :
వ్యక్తిగతంగా మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసినా మనం ఏ అధికారి దృష్టికి తీసుకు వెళ్ళకూడదు:
నిద్రబోతున్న ప్రభుత్వ యంత్రాంగం:
అవినీతికి మరిగిన స్పందించి న్యాయం చెయ్యాల్సిన అధికారులు:
వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని చస్తేనే స్పందించే వ్యవస్థ:               

Friday, July 3, 2020

ఏ ఎం ఏ ఎల్ కళాశాల నుండి నాకు రావాల్సిన బకాయిలు

   

డాక్టర్ తలతోటి పృథ్వీ రాజ్ అనే ప్రొఫెసర్ అయిన నా పట్ల ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు వేధింపులు , బెదిరింపులు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో సాక్ష్యాలు.... 
అ ) ఆర్ధిక వేధింపులు:  
ఆ) మానసిక వేధింపులు , బెదిరింపులు:

అ ) ఆర్ధిక వేధింపులు: 

1) సి ఏ.ఎస్. వేధింపు:
  నాకు రావాల్సిన సి ఏ.ఎస్. (కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ) ఎరియర్స్ ఇవ్వడంలో నా సర్వీస్ రిజిస్టర్ లో తప్పు రాసి , వేధించి,  వేధించి అందరికీ యిచ్చిన 60 రోజుల తర్వాతా  ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు ఇచ్చారు. 
సాక్ష్యాలు: 
1)  ఉద్దేశపూర్వకంగా నా ఎస్ ఆర్ లో తప్పు రాసి నన్ను తప్పించినట్లు రుజువుచేసే ఆధారం
2) ఆ తోటివారికి ఇచ్చిన తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్ మారాయని సాకు చెప్పే వారివద్దే ఉంచుకున్నట్లు డాక్యుమెంట్స్ 
3) నా కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ఎరియర్ వేధింపుల గూర్చి అధికారులకు సమర్పించిన వినతి పత్రాలు. 
4) చివరిగా అందరికీ యిచ్చిన ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారో రుజువుచేసే పత్రాలు.  నావి - ముందువారివి.  
5)  సి ఏ.ఎస్. (కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ) ఎరియర్స్ గూర్చి జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేసెనని అందరి సమక్షంలో  ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు నన్ను బెదిరించినట్లు సాక్ష్యం.  

2) మెడికల్ లీవ్ వేధింపు :
ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు తనకు రోకు( అత్యంత ఇష్టం)న్నవారికి మెడికల్ లీవ్ ఇస్తానని మెడికల్ లీవుపై నేను సెలవు పెట్టి జేరిన తర్వాతకూడా నా సెలవులు మంజూరు చెయ్యకుండా, మొదట నేను 15 రోజులకే బిల్లుపెట్టించి విఫలమై , తర్వాత 8 రోజులు మినహాయించి బిల్లు పెట్టారు . ఆతర్వాత తనమీదకి వస్తుందని జెన్యూనిటీ సెర్టిఫికెట్ కు రిఫర్ చేశారు. అది ఇచ్చిన నెలలు గడుస్తున్నా బిల్లు కానివ్వకుండా ఆపారు 
సాక్ష్యాలు:
1) తనకు రోకు( అత్యంత ఇష్టం)న్నవారికి మెడికల్ లీవ్ ఇస్తానని కరెస్పాండెంట్ చెప్పుకొచ్చిన వీడియో.  
2) డాక్యుమెంట్ ఆధారాలు   15 రోజులకే బిల్లుపెట్టించి విఫలమైనట్టు రుజువుచేసే డాక్యుమెంట్ 
3) ప్రిన్సిపాల్ తో  మెడికల్ లీవ్ వేధింపు సాక్ష్యం ఆడియో కాల్ 
4)  జెన్యూనిటీకీ రిఫర్ చేసిన డాక్యుమెంట్ 
5) డాక్టర్లు పరిశీలించి ఇచ్చిన జెన్యూనిటీ సర్టిఫికెట్. 
6) జెన్యూనిటీ ఇచ్చినా కరెస్పాండెంట్ చెల్లించకుండా నన్ను వేధిస్తుండగా అధికారులకు నేను పెట్టిన అర్జీలు   
7) ఎస్సి కమీషన్ నుంచి వచ్చిన స్పందన పత్రాలు 

3) సరెండర్ పీరియడ్ జీతాల వేధింపు :
నిజంగా నేను సరెండర్ చేయాల్సిన  ఘోరమైన తప్పే చేసేననుకో యాజమాన్యం ఏమి చెయ్యాలి? మొదటిగా కమీషనర్ అనుమతి తీసుకోవాలి. కమీషనర్ అనుమతిచ్చాక నన్ను సరెండర్ చెయ్యాలి. కానీ వీరు ఏమి చేశారు . నన్ను 20 నవంబర్ 2019న నన్ను సరెండర్ చేసినట్లు కాలేజీ టీచింగ్ స్టాఫ్ రిజిస్టర్ లో నా పేరు తొలగించారు. అధికారులు మేనేజ్మెంట్ కు తొలగించే అధికారం లేదని ఫైల్ తిప్పి పంపించారు. కాలేజీ కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస్ రావు కు పృథ్వీరాజ్ ను చేర్చుకోమని ఆర్డర్  పంపారు. అయినా నన్ను చేర్చుకోలేదు. చివరికి నన్ను  ఏ. ఎమ్. ఏ. ఎల్. కాలేజీ నుండి పెరుమాళ్ళపురం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కి రిలీవ్ చేస్తూ పంపించమని కమీషనర్  ప్రొసీడింగ్ ఇస్తే   దానిని ఆధారం చేసుకొని నన్ను  ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు రిలీవ్ చేస్తూ ప్రొసీడింగ్ పంపించారు. 20 నవంబర్ 2019 న నన్ను సరెండర్ చేశారు. 1 ఫిబ్రవరి 2020న  ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు రిలీవ్ చేయగా ఓ డి (ఆన్ డ్యూటీ పై ) పెరుమాళ్ళ పురం లో చేరినా , ఎన్నో వినతి పత్రాలు పెట్టుకున్నా కరెస్పాండెంట్ కు లెటర్ పెట్టినా ఈ నాటివరకు ఇవ్వక పోగా దాటవేసే సాకు వెతుకుంటున్నాడు. సరెండర్ పిరియడ్ జీతం ఎరియర్ డబ్బులు  మీరు ఇమ్మని నాకు ప్రొసీడింగ్ ఇస్తే నేను ఇస్తాను అని  రాజమహేంద్రవరం ఆర్జేడీ వారికి లెటర్ రాసినట్లు చెప్పుకుంటున్నారు?
లాపాయింట్ :
- అసలు ఎవరి అనుమతి తీసుకొని  20 ఏళ్ళ సర్వీసున్న ఎంప్లొయిని సరెండర్ చేశారు 
- ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం ఏ రూలు ప్రకారం సరెండర్ చేశారు ?
- రిలీవ్ చెయ్యడమంటేనే విధుల్లో కొనసాగుతున్నట్లు లెక్క. సరెండర్ ఆమోదించినట్లు , కానట్లు లెక్క. ఎన్నో  . ఈనాటివరకు నా జీతం ఇవ్వకుండా కాలయపన చెయ్యడం వేధింపు కాదా ?

సాక్ష్యాలు: 
1)  సరెండర్ చేసినట్లు కాలేజీ టీచింగ్ స్టాఫ్ రిజిస్టర్ లో నా పేరు తొలగించిన ఆధారం. 
2) మేనేజ్మెంట్ సరెండర్ రిపోర్ట్ . 
3) కమీషనర్ ప్రొసీడింగ్స్ 
4) శ్రీ దాడి శ్రీనివాస్ రావు నన్ను రిలీవ్ చేస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్. 
5) నాకు రావాల్సిన ఈ జీతం గూర్చి శ్రీ దాడి శ్రీనివాస్ రావుకు వ్రాసిన లెటర్. 
6)  అధికారులకు ఇదేవిషయంపై నేను రాసిన లేఖలు 
7) ప్రిన్సిపాల్ ఈ విషయాలపై మాట్లాడిన ఆడియో కాల్స్. 
8) ఆర్జెడీకి చెబితే ఇప్పిస్తానని హామీ యిచ్చిన ఆర్జేడీ వీడియో 
ఇలా ఎన్నో ఆధారాలు ... 

4) ఇంక్రిమెంట్ ఎరియర్స్  వేధింపులు :
నాకు ఇంక్రిమెంట్ కలపకుండా 2016 నుండి నేటివరకు జీతాలు ఇస్తున్నారు. ఏ డాక్యుమెంట్ ఆధారంగా లేకుండా , రూల్ కు విరుద్ధంగా నా ఇంక్రిమెంట్ ఆపారు. ఎన్నో వినతి పత్రాలు సమర్పించాను . స్పందించలేదు. నామీద కాలేజీకి సంబంధం కానీ బయటివారు పెట్టిన తప్పుడు కేసు తేలేవరకు ఇవ్వరట. అది కోర్టులో హియరింగ్ లో ఉంది.   అది తేలేవరకు సదరు ఉద్యోగికి నాకు ఇవ్వవద్దని ఏ కాగితంపై ఉంది. ఇలా ఎన్నో రకాలుగా ఆర్ధిక వేధింపులు. 
సాక్ష్యాలు :
1)  నా సస్పెన్షన్ పిరియడ్ డబ్బులు ఇమ్మని ఇచ్చిన ప్రొసీడింగ్ 
2) నేను నా ఇంక్రిమెంట్స్ కోరుతూ ఇచ్చిన అర్జీలు. ఇతర డాక్యుమెంట్స్ 

ఆ) మానసిక వేధింపులు , బెదిరింపులు:

మానసికంగా కూడా ఏ ఏం ఏ ఎల్ . కళాశాల వారు నన్ను వేధించనావికూడా ఇన్నీ అన్నీ కావు. గతంలోకూడా నన్ను సస్పెండ్ చేసి  కమీషనర్ సస్పెన్షన్ రివోక్ ప్రొసీఈడింగ్ ఇచ్చినా నన్ను చేర్చుకోకుండా 53 రోజులపాటు తిప్పారు. వేధించారు . అప్పటి కరస్పాండెంట్ వేరు. ఇప్పటి ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు 

1) నా కేసును సెటిల్మెంట్ చేసుకోమని ఆయన పంచాయితీ పెడితే నేను ఒప్పుకోనందుకు నన్ను వేధింపు 
సాక్ష్యాలు : 
2) రెండుమార్లు నాపై కేసుపెట్టిన వారిని కళాశాలకు పిలిపించి నన్ను మానసికంగా వేధించారు. 
3) సహా అధ్యాపకుల సమక్షంలోనీవు ముద్దాయివా  ఏమిటి కోర్టుకు ఎలా వెళుతున్నావు . ఇవన్నీ చెబితేనే నీకు సెలవు మంజూరు చేస్తాను అని అవమాన పరచడం 
4) జీతాలు సమయానికి ఇప్పించండి అని అడిగితే "నీకు దమ్మూ ధైర్యం ఉంటె ఎ. ఒ . (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ - జీతాల బిల్లు పాస్ చేసే ఉద్యోగి ) ని అడగమని అవమానిస్తూ మాట్లాడారు. ఎ. ఒ .ని కలిసినందుకు అందరిముందు మరలా అవమాన కరంగా మాట్లాడారు. 
5) కక్షపూరితంగా నన్ను సరెండర్ చేశారు .  కమీషనర్ గారే చెప్పారు. 
6) సరెండర్ చేసే అధికారం మాకు లేకుంటే ఉద్యోగంలోనుండి  టెర్మినేట్ చేసే అధికారం మాకుంది అంటూ  ఏ .ఏం.ఏ. ఎల్. కరెస్పాండెంట్ గా శ్రీ దాడి శ్రీనివాస్ రావు బెదిరింపు.    
-


అధ్యాపకునిగా వేధింపులు 

-సస్పెన్షన్ పిరియడ్ :26/11/2015 నుండి 3/5/2016.
-జాయినింగ్ రిపోర్టు: 4/11/2016.
-తిరిగి కట్టిన జీతం: 26/11/2019 నుండి 30/11/2015. (5రోజులు తిరిగి కట్టినవి రూ. 9,257 23/11/2016 ).
-తిరిగి నాకు రావాల్సిన జీతం: 26/11/2019 నుండి 30/11/2015. (5రోజులు తిరిగి కట్టినవి రూ. 9,257 23/11/2016 ).
50% చెల్లించిన మొత్తం, నెలలు:
50% చెల్లించగా నాకు రావాల్సినవిగా మిగిలినవి:
75% చెల్లించిన మొత్తం, నెలలు:
75% చెల్లించగా నాకు రావాల్సినవిగా మిగిలినవి:

-ఇంక్రిమెంట్లు కలపాల్సినవి: ( 1జులైకు) 2016,2017,2018,2019.
-మెడికల్ లీవ్ జీతం ఇవ్వాల్సినది: 16/10/2019 నుండి 23/10/2019 (8రోజులు)
-సరెండర్ పిరియడ్ జీతాలు రావాల్సినవి: 20/11/2019 నుండి...
-2016 పి.ఆర్.సి. ఎరియర్స్ ఇచ్చినవి అప్ టు 19/11/2019
-2016 పి.ఆర్.సి. ఎరియర్స్ ఇంకా ఇవ్వాల్సినవి 20/11/2019 నుండి 30/11/2019 వరకు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1) నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ .
2) లాస్ట్ పే స్లిప్.
3)
4)
5)


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అన్యాయం, వివక్ష, వేధింపు జరుగుతున్నా సర్దుకు పోవడమే మంచిదనే ఆలోచన కలుగజేసేలా స్పందనలేని, అధికారం చూపి న్యాయం చేయలేని అధికారులతీరు చూసి ఒకింత ఆశ్చర్యం వేస్తోంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బెదిరింపులు వల్గర్ లాంగ్వేజ్

హెచ్చరించినా ముగ్గురు చేసిన తప్పిదాలకు సస్పెన్షన్ శిక్ష కోరుతున్న డాక్టా సంఘం
Sunday, June 28, 2020

STING OPERATION TIMELINE TEXT

UNDERTAKING
ఏ. ఎం.ఏ. ఎల్ .కళాశాల (అనకాపల్లి ) కరస్పాండెంట్ , ప్రిన్సిపాల్ ,సూపరిండెంట్ ముగ్గురూ కలిసి అధ్యాపకులను లక్ష్యంగా చేసుకొని వేధించే ఉద్దేశంతో సి.ఎఫ్.ఎమ్.ఎస్. విధానం ద్వారా జీతాల చెల్లింపులు 1వ తేదీకల్లా ప్రభుత్వం చెల్లిస్తుంటే ఈ కాలేజీ యాజమాన్యం మాత్రం వారి దయ ఉన్నప్పుడు ఇస్తారు . 30/10/2019న కళాశాల యాజమాన్యం సి ఎ ఎస్ స్కేల్ ఎరియర్స్ , నెల నెల జీతాలు ఉద్యోగులకు సకాలంలో చెల్లించక పోవడం , డా తలతోటి పృథ్వీ రాజ్ అనే లెక్చరర్ కు ఉద్దేశ పూర్వకంగా మెడికల్ లీవ్ మంజూరు చెయ్యకుండా 23 రోజులకే ఆక్టోబర్ జీతాన్ని చెల్లించడం , 2016 పి ఆర్ సి స్కెల్స్ అమలు చెయ్యక పోవడం వీటన్నింటిపై ప్రిన్సిపాల్ కు లేఖ ద్వారా రిప్రజెంటేషన్ ఇద్దామని రాసి అధ్యాపకులవద్దకు వెళ్లి చెప్పగా చదివి సంతకాలు చేశారు. ఆ వినతి పత్రాన్ని ఇవ్వబోగా ప్రిన్సిపాల్ ట్రైన్ టైం అయినదని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ బి. ఎస్, సాగర్ కు ఇమ్మని సూచించి వెళ్లగా తానూ తీసుకోడానికి తిరస్కరించగా అప్పుడు ప్రిన్సిపాల్ వాట్సాప్ కు , కాలేజీ మెయిల్ తో పాటు ఆర్ జె డి - సి సి ఇ మెయిల్స్ కు వినతి పత్రం సాఫ్ట్ కాపీ ని పంపుతూ ప్రిన్సిపాల్ కు ." గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు. టీచింగ్ స్టాఫ్ మాకు రావాల్సిన 2016 పి.ఆర్.సి. స్కేల్ జీతాలు మరియు ఇతరేతర ఎరిఎర్స్ గూర్చి ఒక వినతి పత్రం తయారుచేసి ఈ రోజు మధ్యాహ్నం మీకు ఇవ్వబోగా మీరు ట్రైన్ టైం అయిపోతుంది కనుక ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా మీరు సూచించిన శ్రీ బి. ఎస్, సాగర్ కు ఇమ్మని సూచించారు. తాను తీసుకోడానికి నిరాకరించారు. అందులోను అధికారికంగా తనని మీరు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా మీరు ద్రువపరచలేదు కనుక, రేపు నాగుల చవితి సెలవు దినం గనుక మీకు వాట్సాప్ , మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ గా మా వినతి పత్రాన్ని అందించి ఆ తర్వాత హార్డ్ కాపీని అందించగలము. ~ఇట్లు: ఏ ఎం ఏ ఎల్ కళాశాల ఆక్టా చైర్మన్, ఏ పి డాక్టా ఛైర్మన్ డా తలతోటి పృథ్వి రాజ్ " అని తెలియ జేశాము ఇక ఇక్కడినుండి వాస్తవ విషయాలను కళాశాల సూపరింటెండెంట్ ఎలా వక్రీకరించి ప్రయత్నం చేసిందో , అధ్యాపకులను బెదిరించి ఆమె రాసిన ప్రకారం వారిచేత రాయించి వారిచే సంతకం చేయించి వారు ఆఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు రాయించింది . కళాశాల యాజమాన్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అని సృష్టించింది . "నాకు రావాల్సిన SALARY మరియు ARREARS అన్ని కూడా UPDATE గా వచ్చినవి "~ శ్రీమతి జె సామ్రాజ్యం "Dr T పృథ్వీరాజ్ గారు వచ్చినట్లైతే అనుమానంతో మొత్తం చదివేదాన్ని , ఎందుకంటే అయన నిత్యం Management వారితో వాదిస్తూ ఉంటారు . " అని "Salaries ప్రతినెల అందుకుంటున్నాము " అని తనను Mislead చేశామని శ్రీమతి ఎం మేరీ హెలెన్ రాశారు . "ఓవర్ look లో చూచుకోకుండా సంతకం పెట్టినందుకు నా తప్పిదంగా భావించి అందులోని నా సంతకాన్ని ఉపసంహరించుకుంటున్నానని" శ్రీమతి యెన్ శ్యామల "వారికి Management తో గొడవ ఉంటె వారు చూసుకోవాలి . వారు మమ్మల్ని పావులుగా వాడుకుంటూ Misguide చేసి నాచే సంతకం చేయించినారు "అని శ్రీ ఎ రవీంద్ర గారు "వారికి Management తో గొడవ ఉంటె వారు చూసుకోవాలి . వారు మమ్మల్ని పావులుగా వాడుకుంటూ Misguide చేసి every month regular గా Salary వస్తున్నా , నాచే సంతకం చేయించినారు "అని డా ఎ వాసుదేవ రావు "లెటర్ చదవడానికి అవకాశము ఇవ్వకుండా నా చేత సంతకము చేయించారు." అని , "మార్చి CAS బకాయిలు , Dr పృథ్విరాజ్ CAS బకాయిలు DTO , visakhapatnam లో head of accounts తెలియక ఆగిపోయినవి" అని ,"నేను మొత్తం proceedings , arrears list xerox తీసి bills ready చేసి correspondent సంతకంకి రడీగా ఉన్న సమయంలో వారి personal ప్రయోజనాలకు, Management వారిని bad చేయుటకు నన్ను తప్పుదోవ పట్టించి నాచే సంతకం చేయించినారు. " అని "పృథ్వీరాజ్ గారి గొడవకి ,staff salaries , arrears కి సంబంధం లేదు " అని శ్రీ బి . సత్యానంద సాగర్ అనే ఆంగ్ల అధ్యాపకునిచేత రాయించారు. ఈ విధంగా ఫిర్యాదు పత్రంపై సంతకాలు పెట్టిన కొందరి సంతకాన్ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ చే యాజమాన్యం చేయించిందిగనుక వాస్తవ విషయాలను ఈవిధంగా స్పై కెమెరా ద్వారా రికార్డ్ చెయ్యడం జరిగింది. ఇటువంటి వ్యూహాలు పన్ని ప్రభుత్వాధికారులకు దొరకకుండా, ప్రశ్నించే ఉద్యోగులపై నిందలు వేయిస్తూ, వేధిస్తూ , వారి ఆర్ధిక ప్రయోజనాలను దెబ్బతీసే ఎన్నో ఎత్తుగడలు సూపరింటెండెంట్ , కరస్పాండెంట్ సంయుక్తంగా పన్నుతుంటారు. ఉదాహరణకు 2019 జీతాలు వీళ్ళు ఎప్పుడు పెట్టారో పరిశీలించండి. ఈ 2019 డిసెంబర్ జీతాలు జనవరి 1 లేదా 2 తేదీలకు అందాలంటే జీతాల బిల్లులు డిసెంబర్ 25వ తేదీకల్లా సిద్ధం చేసి ప్రిన్సిపాల్, కరస్పాండెంట్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఎ. ఒ ) సంతకాలు చేయించి ఆన్ లైన్ లో అప్లోడ్ చేశాక , ఎ . ఒ . డిస్ట్రిక్ట్ ట్రెజరీ కి ఫార్వర్డ్ చేస్తారు. ఇదీ ప్రాసెస్. కానీ ఉద్దేశపూర్వకంగా జీతాలు లేట్ చేసే మా యాజమాన్యం జీతాలు ఎప్పుడెప్పుడు పెట్టారో గమనించండి :జనవరి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 21 మార్చి 2019( టి.బి.ఆర్.నెం. 2018000024) , ఫిబ్రవరి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 26 ఏప్రిల్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000001), మార్చి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 12 జూన్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000030), ఏప్రిల్ 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 6 జులై 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000038), మే , జూన్ బిల్లులు 5 జులై 2019న, జులై 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 3 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000036,2019000037), ఆగస్టు 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 1 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000040), సెప్టెంబర్ జీతాల బిల్లు 19 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000043), అక్టోబర్ జీతాలబిల్లు 30 అక్టోబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000047), నవంబర్ జీతాలు నేటివరకు అనగా డిసెంబర్ 8వ తేదీవరకు కూడా తీసుకోలేదు. అభూత కల్పనలతో వాస్తవాలు అసత్యాలు అబద్దాలు కాలేవు. ఇటువంటివి రుజువు చేయగలవెన్నో ఉన్నాయి . నిజాయితీగల అధికారులే పెద్ద ప్రశ్నార్థకంగా

ESI

ఎ ఎం ఎ ఎల్ కళాశాల ఆర్థిక అవకతవకల గూర్చి చెప్పాలంటే అన్ని ఇన్ని కాదు. పరిశీలించేకొద్దీ, తవ్వేకొద్దీ వెలుగుచూసేవి ఎన్నో. ఇ పి ఎఫ్ అవక తవ్వకలు కూడా పరిశీలించాలి. ఆడిట్ కు ముడుపులు ముట్టజెబుతూ అన్నీ సక్రమమే అని సరిపెడతారు. ఎంప్లొయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఇ .ఎస్ . ఐ ) అనే దానిలో స్కామ్ . సుమారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 50 లక్షల డబ్బును లంచంతో లక్షరూపాయల ఫైన్ తో సరిపెట్టి ప్రభుత్వానికి ఎగగొట్టిన ఘనులు. చేసిన తప్పుడు పనిని సూపరింటెండెంట్ ఘనమైన పనిగా కరస్పాండెంట్ అభినందించడం గమనించగలరు.


ఎ ఎం ఎ ఎల్ కళాశాల ఆర్థిక అవకతవకల గూర్చి చెప్పాలంటే  అన్ని ఇన్ని కాదు. పరిశీలించేకొద్దీ, తవ్వేకొద్దీ వెలుగుచూసేవి ఎన్నో. ఆడిట్ కు ముడుపులు ముట్టజెబుతూ అన్నీ సక్రమమే అని సరిపెడతారు. ఎంప్లొయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఇ .ఎస్ . ఐ ) అనే దానిలో స్కామ్ . సుమారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 50 లక్షల డబ్బును లంచంతో    లక్షరూపాయల ఫైన్ తో సరిపెట్టి ప్రభుత్వానికి ఎగగొట్టిన ఘనులు.    చేసిన తప్పుడు పనిని సూపరింటెండెంట్ ఘనమైన పనిగా కరస్పాండెంట్ అభినందించగా  ఇదే కళాశాలలో ఉద్యోగం చేసే ఉద్యోగి మాటలు మీరూ వినండి . ఇ పి ఎఫ్ అవక తవ్వకలు కూడా పరిశీలించాలి

IRREGULAR SALARIES

సి.ఎఫ్.ఎమ్.ఎస్. విధానం ద్వారా ప్రతి ప్రభుత్వోద్యోగి వలె ఎయిడెడ్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారుకూడా ఫస్ట్ తారీఖుకే జీతాలు అందుకునేలా ప్రభుత్వం వరం ఇస్తే బహుశా  అనకాపల్లి ఎయిడెడ్ కళాశాల అయిన ఏ ఎం ఏ ఎల్ కళాశాల సూపరింటెండెంట్ ,ప్రిన్సిపాల్ , కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు వీరు ముగ్గురు ఒక్కటై సకాలంలో జీతాలు అందించకుండా కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులను వేధిస్తున్నారు. డా తలతోటి పృథ్వి రాజ్ అనే నేను ఎ .పి . దళిత దళిత అధ్యాపకుల సంఘం చైర్మన్ గా అడుగుతున్నందుకు , అధికారుల దృష్టికి ఈ అంశాలు తీసుకు వెళుతున్నందుకు నన్ను   ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమాన పరుస్తున్నారు. వివిధ అధ్యాపకుల పేర్లు ప్రస్తావించకుండా నిందారోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు.    ఉదాహరణకు 2019 జీతాలు వీళ్ళు ఎప్పుడు పెట్టారో పరిశీలించండి. ఈ 2019 డిసెంబర్ జీతాలు జనవరి 1 లేదా 2 తేదీలకు అందాలంటే జీతాల బిల్లులు డిసెంబర్ 25వ తేదీకల్లా సిద్ధం చేసి ప్రిన్సిపాల్, కరస్పాండెంట్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఎ. ఒ ) సంతకాలు చేయించి ఆన్ లైన్ లో అప్లోడ్ చేశాక , ఎ . ఒ . డిస్ట్రిక్ట్ ట్రెజరీ కి ఫార్వర్డ్  చేస్తారు. ఇదీ ప్రాసెస్. కానీ ఉద్దేశపూర్వకంగా జీతాలు లేట్ చేసే మా యాజమాన్యం జీతాలు ఎప్పుడెప్పుడు పెట్టారో గమనించండి :జనవరి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 21 మార్చి 2019( టి.బి.ఆర్.నెం. 2018000024)   , ఫిబ్రవరి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 26 ఏప్రిల్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000001), మార్చి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 12 జూన్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000030), ఏప్రిల్   25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 6 జులై 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000038),  మే , జూన్ బిల్లులు 5 జులై 2019న, జులై 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 3 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000036,2019000037), ఆగస్టు 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 1 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000040), సెప్టెంబర్  జీతాల బిల్లు 19 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000043), అక్టోబర్ జీతాలబిల్లు 30 అక్టోబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000047), నవంబర్ జీతాలు నేటివరకు అనగా డిసెంబర్ 8వ తేదీవరకు కూడా తీసుకోలేదు.జీతాల ఆలస్యాన్ని అడిగితే దమ్మూ ధైర్యం ఉంటే కృష్ణా కాలేజీ ఏ ఓ ను అడగమని కరస్పాండెంట్ సమాధానం చెబుతాడు . అడిగితేనేమో అధికారుల కు మాపై ఫిర్యాదు చేస్తారా ? కళాశాల ప్రతిష్టను దెబ్బతీస్తారా అని మెమోలు షో కాజ్ నోటీసులు డా తలతోటి పృథ్వి రాజ్ అనే అధ్యాపకునికి ఇవ్వడమే గాక , చివరికి అతనిని నవంబర్ 20, 2019న కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి సర్వీస్ రిజిస్టర్ తో సహా సరెండర్ చేశారు. సరెండర్ చేసే అధికారం యాజమాన్యానికి లేదు అని కళాశాల కరస్పాండెంట్ కు కమీషనర్ ఆర్డర్ పంపినా, ఆతర్వాత చేర్చుకొని విషయాన్నీ తెలియజేయగా కమీషనర్ మాటగా జాయింట్ డైరెక్టర్ , రాజమహేంద్రవరం ఆర్ జె డి హెచ్చరించినా ఈ నాటి వరకు అనగా 8/12/2019 వరకు సదరు అధ్యాపకుణ్ణి విధుల్లోకి తీసుకోలేదు సరికదా... డిసెంబర్ టీచింగ్ స్టాఫ్ రిజిస్టర్ లో పేరు తొలిగించారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు ఎంక్వయిరీ కి ఆదేశించినా అధికారులు ఇంతవరకు ఎంక్వయిరీ నిర్వహించలేదు.

DAMMU DHAIRYAM

3/9/2019 న ఏ ఏం ఏ, ఎల్ కళాశాల గవర్నింగ్ బాడీ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో జీతాల ఆలశ్యానికి సంబంధించి "నీకేమన్నా దమ్మూ ధైర్యం ఉంటే ...సార్ కృష్ణా కాలేజీ కి వెళ్లి ఆ మేడం గారిని నిలదీయండి " అని కరస్పాండెంట్ తమ తప్పును కప్పిపుచ్చుకుంటూ తన స్థాయిని దిగజార్చుకుంటూ దమ్మూ ధైర్యంఅంటూ సవాలు విసురగా 7/9/2019న కృష్ణ కాలేజీ ఎ ఒ గారిని కలిసి జీతాల ఆలస్యానికి గల కారణాన్ని అడిగితే ఏ ఎం ఏ ఎల్ కళాశాలవారు ఎలా జీతాల బిల్లులు పెడుతున్నారో వివరించింది.  సిబ్బందిని ఇబ్బందుల పలు చేసే వారే యాజమాన్యానికి కావాలి. ఇటువంటివి ఎన్నో ....   ప్రతినెలా 25వ తేదీ లోపు కృష్ణా కాలేజీ ఎ ఒ గారిచే సంతకం చేయించి ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తే తర్వాతినెలా 1 లేదా 2వ తారీఖులలో జీతాలు ఎకౌంట్స్ లో పడుతాయి . కానీ ఉద్దేశపూర్వకంగా  జీతాలను ఆలశ్యం చెయ్యడమే గాక ఆలస్యానికి కారణాన్ని ఎ ఒ పై నెట్టగా ఎ ,ఒ వివరణ వినండి . మా కళాశాల వారు బిల్లులు పెట్టిన తేదీలను పరిశీలించండి. ఉదాహరణకు 2019 జీతాలు వీళ్ళు ఎప్పుడు పెట్టారో పరిశీలించండి. ఈ 2019 డిసెంబర్ జీతాలు జనవరి 1 లేదా 2 తేదీలకు అందాలంటే జీతాల బిల్లులు డిసెంబర్ 25వ తేదీకల్లా సిద్ధం చేసి ప్రిన్సిపాల్, కరస్పాండెంట్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఎ. ఒ ) సంతకాలు చేయించి ఆన్ లైన్ లో అప్లోడ్ చేశాక , ఎ . ఒ . డిస్ట్రిక్ట్ ట్రెజరీ కి ఫార్వర్డ్  చేస్తారు. ఇదీ ప్రాసెస్. కానీ ఉద్దేశపూర్వకంగా జీతాలు లేట్ చేసే మా యాజమాన్యం జీతాలు ఎప్పుడెప్పుడు పెట్టారో గమనించండి :జనవరి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 21 మార్చి 2019( టి.బి.ఆర్.నెం. 2018000024)   , ఫిబ్రవరి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 26 ఏప్రిల్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000001), మార్చి 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 12 జూన్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000030), ఏప్రిల్   25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 6 జులై 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000038),  మే , జూన్ బిల్లులు 5 జులై 2019న, జులై 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 3 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000036,2019000037), ఆగస్టు 25 లోపు పెట్టాల్సిన జీతాల బిల్లు 1 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000040), సెప్టెంబర్  జీతాల బిల్లు 19 సెప్టెంబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000043), అక్టోబర్ జీతాలబిల్లు 30 అక్టోబర్ 2019న ( టి.బి.ఆర్.నెం. 2019000047), నవంబర్ జీతాలు నేటివరకు అనగా డిసెంబర్ 8వ తేదీవరకు కూడా తీసుకోలేదు.

3/9/2019 న ఏ ఏం ఏ, ఎల్ కళాశాల గవర్నింగ్ బాడీ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో జీతాల ఆలశ్యానికి సంబంధించి "నీకేమన్నా దమ్మూ ధైర్యం ఉంటే ...సార్ కృష్ణా కాలేజీ కి వెళ్లి ఆ మేడం గారిని నిలదీయండి " అని కరస్పాండెంట్ తమ తప్పును కప్పిపుచ్చుకుంటూ తన స్థాయిని దిగజార్చుకుంటూ దమ్మూ ధైర్యంఅంటూ సవాలు విసురగా 7/9/2019న కృష్ణ కాలేజీ ఎ ఒ గారిని కలిసి జీతాల ఆలస్యానికి గల కారణాన్ని అడిగితే ఏ ఎం ఏ ఎల్ కళాశాలవారు ఎలా జీతాల బిల్లులు పెడుతున్నారో వివరించింది.  సిబ్బందిని ఇబ్బందుల పలు చేసే వారే యాజమాన్యానికి కావాలి. ఇటువంటివి ఎన్నో ....

ROKU

కళాశాలను బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి నిర్వహించాల్సిన ఉన్న ఒక కరస్పాండెంట్ ప్రభుత్వ నిబంధనలతో మాకు పనిలేదు మా ఇష్టం వచ్చిన వారికి సెలవు మంజూరు చేస్తాము, ఇష్టం లేని వ్యక్తి అనుకో సెలవు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వం , మంజూరు చెయ్యం అని పబ్లిక్ గా స్టాఫ్ మీటింగ్ లో చెబుతున్నారంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరస్పాండెంట్ చెప్పిన దానిలో తప్పేలేదు. ఎందుకంటే ఏళ్ళ తరబడి వారు చేసుకొస్తుంది అదే. వారి దయతో లీన్ పేరిట విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, మెడికల్ లీవులు రకరకాల లీవులతో విదేశీ పర్యటనలు, తీర్థ యాత్రలు చేసినవారు, విదేశాలకు పురుళ్ళకు వెళ్ళిన వాళ్ళు అనేకులున్నారు. కొన్ని సంవత్సరాలుగా కళాశాలలో జరుగుతున్న తంతు. ఇదీ తంతు . 3/9/2019న కరెస్పాండెంట్ మాటల్లోనే వినండి "సార్ మాకు రోకు(ఈ అనకాపల్లి మాండలిక పదానికి అర్థం మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్ పంపించుకుంటాము. నా చేతిలో పవర్ ఉంది. నేనేదో అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు రోక్ లేదనుకోండి ఒకరోజుకూడా నేను ఎలో చెయ్యను అది నా డిస్కషన్ పవర్. మీరది పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. ఆవిషయంలో మీరు నన్ను పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. నా ఇష్టం. నాకు రోకుంటే 6 నెలలు ఇస్తాను. నాకు రోకు లేదనుకో ఒకరోజుకూడా ఇవ్వను. నా పవర్ అది. నా పవర్ ను క్వచన్ చెయ్యడానికి మీకు రైట్ లేదు." నెలన్నర పాటు ట్రీట్మెంట్ తీసుకున్న నా కిడ్నీలో ఉన్న స్టోన్ బయటికి రాకపోతే 15/10/2019న లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఆపరేషన్ చేయించుకొని 16/10/2019న సెలవు పెట్టి విశ్రాంతి తీసుకొని 17/10/2019న కళాశాలకు వెళ్లగా వాంతులు కాగా డాక్టర్ విశ్రాంతి తీసుకోమనగా 16వ తేదీనుండి 23వ తేదీవరకు మెడికల్ లీవ్ గా అప్లై చేసి వెళ్ళాను. మెడికల్ లీవ్ కు సంబంధించిన  నా మెడికల్ సర్టిఫికెట్ , మెడికల్ లీవ్ లెటర్ ఇచ్చాను. 24./10/2019 న జాయినింగ్ రిపోర్ట్ తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి విధుల్లో చేరాను.   కరెస్పాండెంట్ ను  కలవలేదని , నాపై తనకు రోకు లేదని నిరూపించుకుంటూ  15 రోజుల వరకు, ఆ తర్వాత 8 రోజులు మెడికల్ లీవ్ ను మినహాయించి 23 రోజులకు అక్టోబర్ జీతాలు పెట్టారు.  జెన్యూనిటీ సర్టిఫికెట్ కోసమని కె జి హెచ్ మెడికల్ బోర్డు కు రిఫర్ చేసినట్లు నాటకం మొదలు పెట్టారు . ఆ సర్టిఫికెట్ వచ్చేవరకు 8రోజుల వేతనాన్ని ఇవ్వరట.    ఇది వీరి వెన్నుపోటు పనులు

ABSCAND EMPLYEES


చేసిన ప్రభుత్వ వ్యతిరేకమైన పనులను ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు స్టాఫ్ సమావేశంలో నిర్భయంగా చెబుతున్నారు. అయన పరిభాషలోనే ...వారి రోకు ఎవరిపైనైతే ఉంటుందో మెడికల్ లీవ్ లు ఆ లీవ్ లు , ఈ లీవ్ లు మాత్రమే కాదు సంవత్సరాల పాటు ఎటువంటి లీవ్ లు పెట్టకుండానే కాలేజీ మానెయ్యొచ్చు. బుద్దిపుట్టిన కొన్నేళ్ళ తర్వాత యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని, రికార్డ్ లు తారుమారు చేయించుకొని, అధికారులను మేనేజ్ చేసుకొని రావాల్సిన అణా పైసాతో సహా పొందవచ్చు. అటువంటి వారికి ఉదాహరణే నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రీయుతులు చెరుకూరి నూకేశ్వర రావు, ఆడారి నాగభూషణంల ఉదంతం . కళాశాలకు కొన్నేళ్ళపాటు రాకున్నా కళాశాల యాజమాన్యంతో లౌక్యంగా వ్యవహరించి లక్షలాది రూపాయలను పొందినవాడు నూకేశ్వర రావు . కోర్టుకు వెళ్లి తనకు తీర్పు అనుకూలంగా వచ్చినా నేటికీ తిరుగుతున్నవాడు ఆడారి నాగ భూషణం. ఈ వ్యవహారాన్ని ప్రస్తావించడం ద్వారా కరస్పాండెంట్ ఎయిడెడ్ స్టాఫ్ కు చెప్పిన నీతి , హెచ్చరిక ఏమిటంటే ...మమ్మల్ని ధిక్కరించి మీరు కోర్టుకు వెళ్ళినా సదరు కోర్టువారు తిరిగి కళాశాల యాజమాన్యానికే సూచిస్తారు . ఆవిధంగా మేము మిమ్మల్ని సాదిస్తాము, వేధిస్తాము. జాగ్రత్త అని బెదిరించడం. యాజమాన్యం వారు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడినా మనం నోరుమేదప కూడదు. అనేక సమావేశాలలో వీరి విషయాన్ని కరస్పాండెంట్ ప్రస్తావించారు. ప్రభుత్వ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం !


CL APPROVAL

ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాల డి ప్రత్యేక రాజ్యాంగం. మరే ఇతర కళాశాలలో లేనివిధంగా సెలవు కావాల్సినవారు స్వయంగా వారే సూపరింటెండెంట్ వద్దకు సెలవుచీటి తీసుకొనివెళ్ళి ఇనీషియల్ చేయించుకోవాలట !

ABSENT MARK
డి డబ్లూ.జె. విక్టర్ అనే మాథ్స్ అధ్యాపకుడు సెలవుచీటి రాసి సంబంధిత క్లర్క్ కు ఇచ్చినా అటెండెన్స్ రిజిస్టర్ లో సి ఎల్ నోట్ చెయ్యక పోగా , సూపరింటెండెంట్ చేత సంతకం చేయించ లేదని సాకు చూపి ఒక క్లర్క్ కరస్పాండెంట్ సూచన మేరకు అబ్సెంట్ మార్క్ చేశాడంటే ఏమనాలి. ఆ క్లర్క్ చెయ్యాల్సిన డ్యూటీ ఏమిటి . పట్టించుకునే ప్రభుత్వ అధికార గణం లేకుంటే అధ్యాపకులను యాజమాన్యం ఇలానే వేదిస్తుంటారు . అ చర్యకు భయపడి, మనసు చంపుకొని ఆ అధ్యాపకుడు తన లీవ్ లెటర్ ను తానే స్వయంగా సూపరిండెంట్ వద్దకు వెళ్లి సంతకం చేయించాక వైట్ ఫ్లూయిడ్ తో అబ్సెంట్ చెరిపి సి ఎల్ నోట్ చేశారు.

CONDONATION FEES

20%హాజరులేని విద్యార్థులకు సైతం 750 రూపాయలవరకు కాండోనేషన్ ఫీజు.
కాలేజీ డెవలప్మెంట్ రశీదు ఇస్తూ వసూలు. అటువంటి వారిచే పరీక్షలు రాయించి పాస్ పర్సెంటేజ్ గూర్చి అధ్యాపకులను యాజమాన్యం చివాట్లు పెట్టడం

INDIVUDUAL ISSUES.


.
కొన్ని నెలలుగా మా కళాశాల కరస్పాన్ డెంట్ నన్ను టార్గెట్ చేస్తూ , మీ గురించే మీటింగ్ పెట్టింది అంటూ నా వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ అందరిముందు నన్ను అవమానిస్తున్నారు.13/9/2019 మా కాలేజీ జి బి హాల్ ల్లో జరిగిన సమావేశంలో నా వ్యక్తిగత విషయాలను ఎలా ప్రస్తావించారో గమనించ వచ్చు .
పృథ్వి రాజ్ గారు మీకు డైరెక్ట్ గా అడుగుతున్నాను . మీరు అన్ని రూల్స్ మాట్లాడుతూ అంతా కరెక్ట్ గా వెళుతున్నారు అన్నంత ఇదిగా వెళుతున్నారు . పోనీ యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా మీరేమైనా ఫాలో అవుతున్నారా ? ఒక విషయం. మీ పర్సనల్ విషయం కూడా నేను మాట్లాడుతున్నాను. మీ సెషన్స్ లోని ఆల్రడీగా షెడ్యూల్డ్ ఇచ్చారు . ఒక నెలరోజులు, నెలా పదిహేను రోజుల్లో గాని డెసిషన్ కూడా వచ్చేస్తది భగవంతుని దయవల్ల మీకు కోపరేటివ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ షెడ్యూల్డ్ లో మరుసగా మీకు వాయిదాలు పడుతుంటాయి . రెండు రోజులకు మూడు రోజులకు పడుతుంటాయి. అసలు మీరు ఏ బేస్ చేసుకొని అగెనెస్ట్ మేనేజ్మెంట్ వెళుతున్నారో నాకు అర్థం కావడం లేదు . పోనీ మీరు కరెక్ట్ గా వెళు తున్నారా అంటే మీరు చేసిన దానిలో ప్రతిదాంట్లో తప్పు వెతక వచ్చు. మొన్న ఏడవ తారీఖున లీవ్ ఇచ్చారు. కడుపునొప్పి వస్తుందని లీవ్ ఇచ్చారు . మీరు ఎం చేశారు. కృష్ణా కాలేజీకి దగ్గరకు వెళ్లి అతనితో ఎవరితో గొడవబడ్డారు. వాళ్ళేమో ఆఫీస్ కు ఫోన్ చేశారు. ఆ తర్వాత మొన్నేమో కోర్టు వాయిదా అని లీవ్ పెట్టారు. కోర్ట్ వాయిదా ఏమిటో నాకు ప్రూఫ్ కావాలి. ఎలాగా. మీరు ఏ వాయిదా వెళ్లారు, ఏ పనిమీద వెళుతున్నారు. మీరు విక్టిం గా వెళుతున్నారా, లేదా ఎక్యూజ్ డా. కన్సర్న్ అడ్వొకేట్ దగ్గర లెటర్ తీసుకొని సబ్మిట్ చేస్తే దాని సపోర్ట్ చేసే డాక్యుమెంట్స్ ఇస్తే గాని నేను అల్లౌ చెయ్యను. ఎందుకు అల్లౌ చేస్తాము.అంటే ఇవన్ని ఏమిటంటే ....కెలికితే మేము కెలికే పద్దతులు. ఆవిధంగా అన్నమాట. ఇన్ని హెడ్దేక్ లు పెట్టుకుని అంత గోక్కోవడం అవసరమా అండి.ఇవ్వాళ్ళ ప్రత్యేకించి మీటింగ్ పెట్టడానికి కారణం మిమ్మల్ని ఉద్దేశించి పెట్టుకోవడమే ! " ఇదీ మా కళాశాల కరస్పాండెంట్ వైఖరి.
వ్యక్తిగతం అన్నప్పుడు నా ఒక్కడితోనే వ్యక్తిగత విషయాలు మాట్లాడ వచ్చుకదా ? ఆతని ఉద్దేశం అదికాదు. నన్ను అవమానించడమే ఆయన పరమార్థం. "కెలికితే మేము కెలికే పద్దతులు"అని కక్ష సాధింపు ,వేదింపు మాటలు మాట్లాడారు కరస్పాండెంట్. ఆయన మాటల్ని బట్టి నాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా, నన్ను టార్గెట్ చేసి వేదించినా నేను ఉన్నతాధికారులెవరికీ తెలియ జేయకూదదనేది కరస్పాండెంట్ మాట. అదే మేము వారిని కెలుక్కోవడం అంటా. దానికి ప్రతిగా వారు మా వ్యక్తిగత విషయాలను అందరిలో ప్రస్తావిస్తూ, అవమాన పరుస్తూ వ్యవహరించే శైలి వారు మమ్మల్ని కెలుక్కోవడమే.

CORRESPONDENT THRETNING TO PRITHVI RAJ

ఎయిడెడ్ కళాశాలలలొ మేనేజ్మెంట్ ఏమిచెబితే అది చేయాలనే తత్వం. బానిసలుగా చూసినా పడియుండాలి. మన వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ సహ ఆధ్యాపకుల ముందు బెదిరించినా మనం పడాలి అనే వారి వైఖరి. ఉద్దేశపూర్వకంగా మన ఆర్ధిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా ఉన్నతాధికారులకు తెలియజేయకూడదు. దీనిని వేధించడం అనిగాక మరేమి అంటారు. రాష్ట్రంలో ఇన్ని ఎయిడెడ్ కళాశాలలు ఉంటే మరే కళాశాలలో లేని రీతిగా అధ్యాపకులైన మేము ప్రిన్సిపాల్ గారికి కాకుండా మా సెలవు చీటీని మేమే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ కి ఇవ్వాలనే కరెస్పాండెంట్ శాసనం. అలా గాకుండా సెలవు చీటీ సంబంధిత లీవ్స్ క్లర్క్ కు ఇచ్చినా , ప్రిన్సిపాల్ గారికి అందించినా అటెండెన్స్ రిజిస్టర్ లో ఆబ్సెంట్ మార్క్ నోట్ చేసి బెదిరించడం . అలా ఆబ్సెంట్ మార్క్ నోట్ చేయబడినవాళ్లు భయపడిపోయి హోదాను మరచి తామే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ చేత సంతకం చేయించుకోగా ఆబ్సెంట్ గా రాసిన స్థానంలో వైట్ ఫ్లూయిడ్ పెట్టి సి ఎల్ మార్క్ చెయ్యడం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే తీరిక లేదు. కళాశాల యాజమాన్యం అందించే ముడుపులకు ఆర్ జెడి రాజమండ్రిలో, విజయవాడ లోని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ లోను క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకటి కాదు మా ఎయిడెడ్ కళాశాల లీలలు.

Monday, June 15, 2020

ఒక హైకూ~ ఎన్ని అభివ్యక్తీకరణలో ... Haiku-whatsApp

కొన్ని హైకూలు ఒక్క ఉదుటున అక్షర రూపంలో ఒదగవు.  కాస్త శ్రమించాలి సంక్షిప్త పరిధిని ఏర్పరచడానికి. ఆ అనుభవాన్ని పంచుకోడానికే ఈ వివరణ

హైకూ నేపథ్యం :   
మనపై ప్రేమ చూపేవారిని మనం పట్టించుకోము. మనతో స్నేహించేవారిని పెద్ద విలువివ్వము. దూరపు కొండలు నునుపు తత్త్వం. నిత్యం మన కళ్ళముందు కనబడుతుంది ... పలకరిస్తుంది మనిల్లు తనిల్లులా రోజూ వస్తూ పోతుంది . కానీ కోకిలేమి చేస్తుంది  సంవత్సరానికోసారి వసంత కోకిలలా వచ్చి వినిపిస్తుంది . కనిపించదు.  మన ముంగిటికి రాదు. తన ప్రతిభను ప్రదర్శించడానికే... గొప్పలు పోడానికే వచ్చినట్లు చేస్తుంది.
    ఇప్పుడు చెప్పండి ...    ఎవరు మనకు దగ్గరి వారు? ఎవరు మన ఆత్మీయులు ?  కాకమ్మా? కోకిలమ్మా ? 


ఫస్ట్ థాట్:
(1)
కాకి మన చుట్టం
వసంత కోయిల
బడాయి అతిథి...

నగిషీ పట్టగా....:
(2)
రోజూ మనల్ని
పలకరించే స్నేహం కాకి.
బడాయి అతిథి కోయిల.

ఇంకా చిత్రిక పట్టగా:
(3)
రోజూ మనతో
మాట్లాడే స్నేహి కాకి.
-బడాయి అతిథి కోయిల!!
(లేదా.‌.)
షోకిల కోకిల

ఇంత చేసినా ఎలా చెబితే భావం పరిపూర్ణమౌతుందో తేల్చుకోలేని పరిస్థితులు ఒకోసారి ఎదురౌతాయి . మూడు లైన్లు కుదరగానే హైకూగా మలిచే ప్రయత్నం చేస్తే తేలిపోతాయి


[8:01 am, 13/06/2020] Gudimetla Gopalkrishna Haiku: 🚩🇳🇪🚩
[8:02 am, 13/06/2020] IHC IMMIDISETTI: రోజూ పలకరించే
కాకిమిత్రుడు
మన అతిథి కోయిల
[8:06 am, 13/06/2020] IHC IMMIDISETTI: రోజూ కావ్ కావంటూ
పలకరిచే కాకి
మన మిత్రకోకిలే
[8:10 am, 13/06/2020] Naidugari Jayanna Haiku Poet: అప్పుడప్పుడు ఇలాంటి పాఠాలు అవసరమే సార్👍🏽🙏
[8:15 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: అందుకే మిత్రమా ఈ పోస్టింగ్. ఆంతర్యాన్ని గ్రహించావు. ధన్యవాదాలు🙏

[8:21 am, 13/06/2020] shekaramanthri prabhakar: రోజూ వచ్చే
అతిథి కాకి
వసంతాన్నిచ్చే కోయిల

శేఖరమంత్రి ప్రభాకర్
[8:24 am, 13/06/2020] Mohanram Haiku Poet: రెండూ నలుపంటే/కాదని వసంతం/ గుట్టు విప్పి0ది....   పి. మోహన రామ ప్రసాదు
[8:30 am, 13/06/2020] Nelapuri Rathnaji: కరెక్ట్ నైస్ ఏదీపడితే అది రాయటం వల్ల హైకూ తత్వం దెబ్బతింటుంది కాబట్టి హైకూ కవులు ఆచితూచి ఎంచి రాయాలి
విమర్శను స్వీకరించాలి
పృధ్వి రాజ్ గారు మంచి సూచన చేశారు
[8:32 am, 13/06/2020] Deputy. Collector Govarthan Srikakulam: Nice sir,  good suggestion-🌷👌
[8:32 am, 13/06/2020] Nelapuri Rathnaji: కోకిలతో కాకిని పోల్చే పనేలేదు
మీరు అందులో రెండు హైకూలు వచ్చేవి..
రెండోది కోకిల కంటే కాకిని తక్కువ చేసి చూపటమే..
[8:37 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: కాకిలో ఐక్యత గుణం మానవ జాతికి సందేశం. కోకిల గాన కోకిలే ....!  గూడు కట్టుకోదు ... పొదగదు ... పిల్లల్ని పోషించదు . ఒక్క మాటలో చెప్పాలంటే మాతృత్వానికి కళంకం. నా దృష్టిలో మనిషికి ఆత్మ బంధువు కాకి . రెండింటిని పోలిస్తే కాకే ఆదర్శనీయం
[9:01 am, 13/06/2020] PO VEMANA SRIKAKULAM Haiku Poet VEMANA SRIKAKULAM: కోకిల చుట్టం
కావు కావు కాకియే
నిత్య అతిధి
[9:04 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: చుట్టం దగ్గరివాడా ?అతిథి దగ్గరివాడా సార్ ?
[9:06 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: కవిత్వం వార్తకాదు . ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడానికి. భావం లోనో ..భావ వ్యక్తీకరణ లోనో.. భాషలోనో ... ఏదో ఒక ప్రత్యేకత ప్రదర్శించకపోతే కవిత్వం ఎందుకవుతుంది ? ఆలోచించండి !

[9:31 am, 13/06/2020] PO SIREESHA: మాసంపాటే కోకిల/నిత్యం కావ్ కావ్ తత్వం/కాకి ప్రభోధం. డా.వేదుల'శిరీష'

[9:39 am, 13/06/2020] PO SIREESHA: పాటచుట్టం కోకిల/కాలమంతాబంధువే/లోకంకాకులు. డా.వేదుల'శిరీష'
[9:47 am, 13/06/2020] Perugu haiku: 👌
[9:51 am, 13/06/2020] PO SIREESHA: ఐక్యఆదర్శం/కోకిలపిల్లకాశ్రయం/కాకులగూడు. డా.శిరీష
[9:57 am, 13/06/2020] shekaramanthri prabhakar: కాకిగూట్లో
కోయిల గుడ్లు
ప్రసూతి కేంద్రం

శేఖరమంత్రి ప్రభాకర్
[9:57 am, 13/06/2020] PO SIREESHA: ఉదయరాగం/ఆత్మబంధుకాకులు/నిత్యగానమై. డా.శిరీష
[10:02 am, 13/06/2020] PO SIREESHA: వసంతరాగం/ఏటికోసారి కాకిగూళ్ళూ/కోకిల గొంతై. డా.శిరీష

[10:25 am, 13/06/2020] PO SARADHI HAIKU: ఎన్ని రకాలుగా వ్రాసారండీ👏👏👏👏👏

[11:51 am, 13/06/2020] Veera Hanuman Haiku Poet: Kaki kokila/manaki spoortynistu/shabdala dwara
[0:00 pm, 13/06/2020] PO VEMANA SRIKAKULAM Haiku Poet VEMANA SRIKAKULAM: నిజమే సర్

Friday, June 12, 2020

ఎయిడెడ్ కళాశాల

           
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  ఉద్దేశపూర్వకంగా సకాలంలో జీతాలు చెల్లించకుండా అధ్యాపకులను వేధించడం అధికారుల దృష్టిలో తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
ఉద్దేశపూర్వకంగా ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం సి.ఎ.ఎస్.అమలులో జాప్యం చేస్తే తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.   

* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యంఉద్దేశ పూర్వకంగా  2016 పి.ఆర్.సి. స్కేల్ స్కేల్ అమలు-ఎరియర్స్ లో జాప్యం చేస్తే తప్పు లేదని తేల్చారు.   
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం పెట్టె ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకు వెళితే , యాజమాన్యం దృష్టిలోనే కాదు; అధికారుల దృష్టిలోనూ నేరమేనని విచారణతో అధికారులు తేల్చిపారేశారు!
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం దళిత అధ్యాపకుల్ని  వేధించడమే లక్ష్యంగా  మెమోలు, షో కాజ్ నోటీసులు, సస్పెన్షన్స్, సరెండర్ చెయ్యడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం స్టాఫ్ అందరిముందు వ్యక్తిగత విషయాల ప్రస్తావనతో అవమాన పరచడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వారికి "రోకు" ఉన్నవారికి   మెడికల్ లీవ్ లు మంజూరు చెయ్యడం, లేనివారికి జీతాలు ఆపడం  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎన్.సి.సి., హాస్టల్ వార్డెన్ బాధ్యతలను ఎయిడెడ్ అధ్యాపకులకు కాకుండా పార్ట్ టైం అధ్యాపకులకు ఇచ్చుకోవడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* దళితేతర అధ్యాపకులు 15మంది ఎఫ్.ఐ.పి. ద్వారా పిహెచ్.డి. చేయడానికి అనుమతించిన ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  దళిత అధ్యాపకులను ఎఫ్.ఐ.పి.కి అనుమతించకపోవడం వివక్ష కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టా రాజ్యంగా పే ఆర్డర్స్ తో ఇర్రెగ్యులర్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
అబ్స్ క్యాన్డ్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ ఎరియర్స్ బెనిఫిట్స్ ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టా రాజ్యంగా వ్యవహరించడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టా రాజ్యంగా ఇష్టులకు లీన్ లతో అనుమతివ్వడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  దశాబ్దాలుగా సీనియారిటీకి తావేలేకుండా ప్రిన్సిపాల్ షిప్ ను జూనియర్స్ కు ఇవ్వడం, ఎఫ్.ఎ. సి. క్రింద ప్రిన్సిపాల్ ను ఏళ్ళ తరబడి ఉంచడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.   
ఎయిడెడ్ కళాశాల యాజమాన్యంవర్గానికి, కులానికి చెందిన ఉద్యోగులు వారికి నచ్చినప్పుడు కాలేజీకి వచ్చి వెళ్లడం  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* యూ.జి.సి. గ్రాంట్స్ తో కట్టిన బిల్డింగ్స్ ను ప్రభుత్వ అనుమతి లేకుండానే ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  ప్రయివేట్ పరం చెయ్యడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* యూ.జి.సి. గ్రాంట్స్ తో స్టేడియం నిధుల దుర్వినియోగం ~ నాసిరకం నిర్మాణం ~ కూలిపోవడం ~ తప్పుడు రిపోర్టులు ఇవేవీ  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* కాండోనేషన్ పేరుతో ప్రభుత్వ  విరుద్ధంగా ఇష్టానుసారంగా అధిక మొత్తంలో విద్యార్థులనుండి ఫీజు వసూలు చెయ్యడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 

వల్గర్ లాంగ్వేజ్ : "మీరు గోకితే మాకు దురదొస్తుంది . మేము గోకితే పుండ్లు పడతాయి "

"...అంటే ఇవన్ని ఏమిటంటే ....కెలికితే మేము కెలికే పద్దతులు.   ఆవిధంగా అన్నమాట. ఇన్ని   హెడ్దేక్ లు పెట్టుకుని అంత గోక్కోవడం అవసరమా అండి."
"సార్ మాకు రోకు(ఈ అనకాపల్లి మాండలిక పదానికి అర్థం మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్ పంపించుకుంటాము
"సార్ ఇంకో విషయం సార్.  పక్కా రూల్స్ పాటించేసి మీరేదో చేస్తే ఆ మోటో కాదు సార్. మీరు కెలుకుతున్నారు కాబట్టే మేము కెలికితే మీకు ఈవిధంగా ఉంటుందని చెప్పడానికే"
"మమ్మల్ని గోకుతున్నాడు. నేను గోకేనంటే   కాంక్రీటేను. మేమేదేసినా కాంక్రీట్లా ఉంటది ."
జీతాల ఆలశ్యానికి సంబంధించి "నీకేమన్నా దమ్మూ ధైర్యం ఉంటే ...సార్ కృష్ణా కాలేజీ కి వెళ్లి ఆ మేడం గారిని నిలదీయండి "

బెదిరింపులు:
"అతని కేస్ హియరింగ్ కు వచ్చింది. ఇప్పటివరకు బుర్ర పెట్టలేదు. ఇక బుర్ర పెట్టానంటే ఏమైనా జరుగుతది అని బెదిరింపు."
"భయపెట్టి వదులుతానని అనుకుంటున్నారా? మేము దిగామంటే కాంక్రీట్ సార్. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము సార్".
"మెమో ,ఆతర్వాత షో కాజ్ నోటీస్, రెండు నెలలు సస్పెన్షన్, ఆర్ జె డి పర్మిషన్ తో మరో రెండు నెలలు సస్పెన్షన్ , ఆ   తర్వాత టెర్మినేట్ చేసే పవర్ మీకే ఉంది అని ఆర్ జె డి చెప్పారట."
"మమ్మల్ని ధిక్కరించి మీరు కోర్టుకు వెళ్ళినా సదరు కోర్టువారు తిరిగి కళాశాల యజమాన్యానికే పరిష్కరించమని సూచిస్తారు"


కొన్ని హైకూలు ఒక్క ఉదుటున అక్షర రూపంలో ఒదగవు.  కాస్త శ్రమించాలి సంక్షిప్త పరిధిని ఏర్పరచడానికి. ఆ అనుభవాన్ని పంచుకోడానికే ఈ వివరణ

హైకూ నేపథ్యం :     
మనపై ప్రేమ చూపేవారిని మనం పట్టించుకోము. మనతో స్నేహించేవారిని పెద్ద విలువివ్వము. దూరపు కొండలు నునుపు తత్త్వం. నిత్యం మన కళ్ళముందు కనబడుతుంది ... పలకరిస్తుంది మనిల్లు తనిల్లులా రోజూ వస్తూ పోతుంది . కానీ కోకిలేమి చేస్తుంది  సంవత్సరానికోసారి వసంత కోకిలలా వచ్చి వినిపిస్తుంది . కనిపించదు.  మన ముంగిటికి రాదు. తన ప్రతిభను ప్రదర్శించడానికే... గొప్పలు పోడానికే వచ్చినట్లు చేస్తుంది. 
    ఇప్పుడు చెప్పండి ...    ఎవరు మనకు దగ్గరి వారు? ఎవరు మన ఆత్మీయులు ?  కాకమ్మా? కోకిలమ్మా ?   

ఫస్ట్ థాట్:
(1)
కాకి మన చుట్టం
వసంత కోయిల
బడాయి అతిథి...
 
నగిషీ పట్టగా....:
(2)
రోజూ మనల్ని
పలకరించే స్నేహం కాకి.
బడాయి అతిథి కోయిల.

ఇంకా చిత్రిక పట్టగా:
(3)
రోజూ మనతో
మాట్లాడే స్నేహి కాకి.
-బడాయి అతిథి కోయిల!!
(లేదా.‌.)
షోకిల కోకిల

ఇంత చేసినా ఎలా చెబితే భావం పరిపూర్ణమౌతుందో తేల్చుకోలేని పరిస్థితులు ఒకోసారి ఎదురౌతాయి . మూడు లైన్లు కుదరగానే హైకూగా మలిచే ప్రయత్నం చేస్తే తేలిపోతాయి 

మీరైతే దీనిని హైకూగా ఎలా ముగిస్తారు? రాసి సాయం చెయ్యండి....   

కాకిలో ఐక్యత గుణం మానవ జాతికి సందేశం. కోకిల గాన కోకిలే ....!  గూడు కట్టుకోదు ... పొదగదు ... పిల్లల్ని పోషించదు . ఒక్క మాటలో చెప్పాలంటే మాతృత్వానికి కళంకం. నా దృష్టిలో మనిషికి ఆత్మ బంధువు కాకి . రెండింటిని పోలిస్తే కాకే ఆదర్శనీయం