-->

Tuesday, May 21, 2019

Prithvi as a Lyricist,composer and singer

Prithvi as a Lyricist,composer and singer

     పాటలు రాయడం, మంచి బాణీని రూపొందించి చక్కగా పాడాలనేది నా కోరిక. కాస్త సంగీత స్పృహ ఉంది.  మొదటి ప్రయత్నంగా నేను రచించిన కొన్ని క్రైస్తవ గీతాలలోని ఒక గీతానికి బాణీ సమకూర్చి ఆలపించిన పాట. ట్రాక్ పై పాడటం క్రొత్త. పెద్దగా ప్రాక్టీస్ కూడా చెయ్యలేదు. సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసిన శ్యామ్ గారికి నా ధన్యవాదాలు. 
     హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ.  చదివే రోజుల్లో సినిమాలకై సుమారు 50 వరకు పాటలు రాశాను. రెండు మూడిటికి ట్యూన్ కూడా చేశాను. కొంతమంది దర్శక నిర్మాతల వద్దకు తిరిగాను. విసిగి కొన్నాళ్ళకు  ఆ ప్రయత్నం విరమించుకున్నాను. మునుముందు క్రైస్తవ గీతాలనే గాక, సామాజిక చైతన్యాన్ని కలిగించే పాటలను కూడా రాసి మంచి ట్యూన్ సమకూర్చి పాడాలనేది నా ఆలోచన.#SongonWar #LyriconWar #Kavitalathoti #DrTalathotiPrithviRaj www.talathoti.com   www.litt.in దేశం ఏదైనా... ప్రజల ఆకాంక్షలు ఒకటే తీరు; శాంతి, దేశాభివృద్ధి! దేశాలేవైనా... దేశాధినేతల ఆలోచనల తీరు ఒక్కటే; అస్తవ్యస్త పాలననుండి దేశ ప్రజల దృష్టి మళ్ళించడానికి దేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం!! ఏ దేశప్రజలు యుద్ధాన్ని కోరుకోరు అది సిరియా అయినా, గాజా అయినా! అటువంటి యుద్ధాలలో పౌరులు వారి ఆస్తి, ప్రాణ నష్టాన్ని కోరుకోరు. నాయకులకు వారి పార్టీలు మధ్యనే గాక; దేశాధినేతలయ్యాక దేశాలపట్ల ఆధిపత్యాన్నీ ప్రదర్శించాలని చూస్తుంటారు. మరి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు  ఆధిపత్య పోరును ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి. పేదదేశాల... అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యవహారాల్లో తలదూర్చి పెత్తనం చెలాయించడానికి చూస్తాయి. ఐక్యరాజ్య సమితి లాంటివి కూడా అగ్రదేశాల కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నాయి. చివరిగా....ఏ దేశమైతే కోట్లాది రూపాయలు రక్షణ రంగానికిగాక;  ప్రజల జీవితాలకు నిజమైన రక్షణ కల్పించే విద్యా, వైద్య రంగాలకు కేటాయిస్తామని వాగ్దానాలు చేస్తాయో ఆ పార్టీలను, నేతలను ఎన్నుకోవాలి! ~ Dr TALATHOTI PRITHVI RAJ.   పల్లవి: నిర్వేదం... నిస్సహాయం... దేశం ఏదైనా కావచ్చు  ప్రజలంతా ఒక్కటే కదా! దేశాలేవైనా కావచ్చు  పాలకులంతా ఒక్కటే కదా! ఇది ప్రజాస్వామ్యమా! విధ్వంస గమ్యమా? ||దేశం||# 1 చరణం: ఖండాలలో ఎన్నెన్నో పేదదేశాలు దేశాల్ని దోచేసే పెట్టుబడిదారులు |2| కొంతమంది చేతుల్లోనే దేశసంపద ప్రాధాన్యత లేనివాటిగా విద్యా, వైద్యం దేశ ప్రగతినాశించే నేతలేందరు? స్వార్థమేలే దేశాలై ఈలోకంలో!  ||దేశం|| 2 చరణం  గాజాలో పౌరుల చావు కేకలు దేశాల్ని కమ్మేసే యుద్ధ మేఘాలు.|2| నేతి బీరకాయలోని నేతి చందము! ఐక్యరాజ్య సమితి తెచ్చిన ఐక్యతెక్కడా? అడ్డకత్తెరాలోని పోక చెక్కలా నలిగి పోతుంది  పౌరులేకదా! ||దేశం|| 3 చరణం: దేశాల హద్దుల్లో కవ్వింపు చర్యలు దేశాల్ని దెబ్బతీసే జీవాయుధాలు |2| అణ్వస్త్రాలుకాదు అన్న వస్త్రాలు శాంతినే కోరుకుంటూ ఈ ప్రజలు దేశమంటే మట్టికాదు మనుషులంటూ గుర్తెరిగి పాలించాలి దేశాధినేతలు! ||దేశం||
#songoncorruption #songonbribe మీరెదుర్కున్న అనుభవమేమిటో నాకు తెలియదు కానీ....నేను ఈలాంటి లంచగొండు ఆఫీసర్లని అనేకమార్లు ఫేస్ చేశాను. కొన్ని అసభ్యకరమైన, జుగుప్సాకరమైన పదజాలం ఈ పాటలో రాసినా కొందరు అవినీతి ఆఫీసర్స్ తీరు ముందు ఈ పదాలు చాలా చిన్నవి! ఈ లోకంలో తనా, మన అని చూడనివి రెండే రొండు. అవి చావు, ఈర్ష్యా. వీటి తర్వాత తారతమ్యాలకు చోటివ్వని అంశం లంచమే! ఈ సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎంత వేళ్ళూనికొనిపోయినా లంచగొండులకు క్యాష్ ఫీలింగ్ తప్పించి క్యాస్ట్ ఫీలింగ్ అస్సలుండదు! ఈ ఒక్కటే వారిలో ఉండే ఏకైక సుగుణం అనుకోవాలి! వేశ్యలాంటి అధికారి దగ్గర విటుడనే అక్రమదారుడు లంచం అనే డబ్బిచ్చి తాను అనుకున్నది పొందుతాడు. లంచం తీసుకున్నోడు ఫేవర్ చేశాననుకుంటాడు. "డబ్బులిస్తే వీడు పెంట తినమన్నా తింటాడని" లంచం ఇచ్చిన అక్రమదారుడనుకుంటాడు... పదిమందికి చెప్పుకుంటాడు. అవినీతిని రూపుమాపడం అనేది ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో వారిచ్చే హామీలాంటిదే! ఒక కవి అన్నట్లు అవి-నీతి నిరోధక శాఖల్లాగ ఉన్నాయే గాని అవినీతి నిరోధక శాఖల్లాగ చురుకుగా, నిజాయితీతో వ్యవహరించడంలేదు. ఒకోమారు కంచే చేను మేసిన చందంగా ఉన్నాయి. అవినీతి తిమింగలాల్ని వదిలేసి పిత్తపరిగెల్లాంటి చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటున్నారు.లంచం ఈ వ్యవస్థకు పట్టిన రాచపుండు. ఈ పాట మీకు గుర్తున్నా లేకున్నా లంచ పుచ్చుకునేటప్పుడల్లా లంచగొండులకు నేను గుర్తుకు రావొచ్చు. పల్లవి: ఐ యామ్ ది ఆఫీసర్ అవినీతిలో నే సూపర్ లంచాలే నా కల్చర్ అక్రమార్జన నా ఫ్యూచర్ సంకైనా నాకుతాను డబ్బు కోసం పెంటైనా తింటాను డబ్బు కోసం ఉచ్చైన తాగుతాను డబ్బు కోసం ||ఐ యామ్ ది|| (1). ఫైలు కదులుతుంది చేయి తడిపితే మసి పూసి మారేడౌను జేబు నింపితే బాధితులకు నే వంచన చేను మేసే కంచెను మేకవన్నె పులినిరా పాప పుణ్యాల్లేవురా! ||ఐ యామ్ ది|| (2). డొంక కలదయ్య తీగలాగితే గంజాయి తోటలో తులసి నిలవదు ఏసీబీ ఉన్నా కూడా గాలిలాగ పట్టుబడము కళ్ళుగప్పే ఇంద్రజాలం మా సొంతం ఈ కళ ||ఐ యామ్ ది|| 
~ రచన, స్వరకల్పన,గానం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ 
www.talathoti.com 
www.litt.in


 రచనా, స్వరకల్పన,గానం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ 
#coronavirussong #talathoti #ModiGovernment 

కరోనా సెకెండ్ వేవ్ అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. రాజకీయ పార్టీలు అనుకున్న విధంగా ఎన్నికలు నిర్వహించుకుని విజయవంతంగా అనేకమంది చావుకు కారకులయ్యారు. ఢిల్లీలోని నిజాముదిన్ మర్కజ్ మసీదునందు జరిగిన సమావేశం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందింది అని తీవ్ర విమర్శలు చేసిన వారు ఇప్పుడు చేసిందేమిటి? ఇటువంటి పరిస్థితుల్లో కుంభమేళ అవసరమా? దేశం వల్లకాటిలా మారిపోయింది. లాక్ డౌన్ తో కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలు మీనా మేషాలు లెక్కపెట్టి, లాభనష్టాలు బేరీజు వేసి కర్ఫ్యూ నిర్ణయం తీసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందరో తనువు చాలించారు. కుటుంబాలు ఆప్తుల్ని కోల్పోయి తీవ్ర శోకాన్ని అనుభవిస్తున్నాయి. ఈ దేశంలో ప్రభుత్వాలు ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనంత కాలం ఇటువంటి మరణహోమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు కూడా వ్యక్తిగత క్రమశిక్షణ అలవర్చుకోవాలి.

 
                  
No comments:

Post a Comment