పృథ్వి రాజ్ రూపొందించిన కరపత్రాన్ని జనవిజ్ఞాన వేదిక , అనకాపల్లి సభ్యులు ఆవిష్కరిస్తున్న దృశ్యం
ఓటర్లను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో కవి ,ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు ,అధ్యాపకుడు డా. తలతోటి పృథ్వి రాజ్ ప్రజాస్వామ్య హితాన్ని కాంక్షిస్తూ "ఓటును నమ్ముకోండి - నోటుకు అమ్ముకోకండి "అనే శీర్షికతో కరపత్రాన్ని రచించి ముద్రించి వివిధ ప్రాంతాలలో ఓటరులకు పంచి తనవంతు చైతన్య పరిచాడు . మరీముఖ్యంగా సింహాద్రి రైల్లో పంచడం జరిగింది .
పృథ్వి రాజ్ రూపొందించి ముద్రించిన కరపత్రాలను పంచుతూ ఓటువిలువను చాటుతున్న
జనవిజ్ఞాన వేదిక సభ్యులు
*ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి.*
*ప్రజలకు జన విజ్ఞాన వేదిక పిలుపు.*
మద్యం, నగదు పంపిణీ వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జనవిజ్ఞాన వేదిక జాతీయ వర్కింగ్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి శంకర ప్రసాద్ పిలుపునిచ్చారు. కశింకోట మండలం కన్నూరుపాలెం ఉదయపు సంతలో జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా కమిటీ వినూత్నంగా నిర్వహించిన ఓటరు అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికలలో ఓటు వేయడం ప్రతి పౌరుని బాధ్యత అనీ దాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని అయన అన్నారు. ఎన్నికలలో నిర్భయంగా, నిజాయితీగా ఓటును వేయాలని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, పారదర్శకత ఉన్న అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రశ్నించే తత్త్వం గ్రామ స్థాయినుండే ప్రారంభం కావాలని పేర్కొన్నారు.
జేవీవీ రాష్ట్ర నాయకులు ఎం.ఎస్.వీ.ఎస్.పి. వర్మ మాట్లాడుతూ ఓటువేయడంలో నిజాయితీ కొరవడితే అవినీతి అభ్యర్థులు ఎన్నికవుతారని అన్నారు. ప్రజలు మారకుండా నాయకులు మారరని పేర్కొన్నారు.
జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన చిన్నారావు ఓటు హక్కును ఎలక్ట్రానిక్ వోటింగ్ ద్వారా ఎలా వినియోగించుకోవాలో తెలిపారు.
ఓటర్ల అవగాహనకై జేవీవీ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి చైతన్యపరిచారు.
జేవీవీ జిల్లా ఉపాధ్యక్షులు పిళ్లా రవిశంకర్, ఉపాధ్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడు డబ్బీరు శేష మల్లేశ్వర రావు, ఇండియన్ సిటిజెన్ ఫోరమ్ ప్రతినిధి కొణతాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.- జేవీవీ.
No comments:
Post a Comment