-->

Sunday, December 8, 2019

ప్రభుత్వాధికారుల, అధికారాల కంటే అతీతమైన... అతీంద్రియమైన పవర్స్ కళాశాల గవర్నింగ్ బాడీ తీర్మానానికి ఉన్నాయనే భ్రమలో కళాశాల యాజమాన్యం.


ప్రభుత్వాధికారులకు, చట్టాలకు-నిబంధనలకు లోబడి పని చేయాల్సిన ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఒక తీర్మానం చేసుకుంటే సరిపోతుంది. చట్టాలతో పనిలేదు. ప్రభుత్వ నిబంధనలకంటే పవర్ ఫుల్ వారి తీర్మానం అనే ఆలోచన అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. ఎయిడెడ్ కళాశాల యాజమాన్యానిది. అటువంటి ఆలోచనలతో చేసిన తీర్మానాలెన్నో. 
ఉదాహరణకు:
(1)
యూ.జి.సి. గ్రాంట్స్ తో నిర్మించిన ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల లోని కొన్ని భవనాలను 2010లో స్థాపించిన ఆస్క్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ " ఇంజినీరింగ్ కళాశాల సొంత భవనాలు గా చూపారు దానిని నిర్వహించే అనకాపల్లి వర్తక సంఘం. ఆ కారణంచేత విశాలమైన సైన్స్ ల్యాబ్ లను క్లాస్ రూమ్ లుగా మార్చి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్లాస్ రూమ్ లను కుదిరించి క్లాస్ లు నిర్వహిస్తున్నారు.

(2) 
ప్రభుత్వ అనుమతితో, ఉద్యోగ నోటిఫికేషన్, సిక్స్ మెన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు, పోస్టుల భర్తీ , ఉద్యోగులకు ప్రభుత్వం జీతభత్యాల చెల్లింపులు, ప్రభుత్వ అధికారుల ఆమోదంతో ప్రిన్సిపాల్ - కళాశాల పాలకవర్గం కరస్పాండెంట్ గా ధ్రువీకరణ మొదలగునవి పొందే ఎయిడెడ్ కళాశాలకు తమపై ప్రభుత్వానికి నియంత్రణ అధికారంలేదని అహంభావపూరితంగా వ్యవహరించే యాజమాన్యం లేకపోలేదు. 

కమిషనర్ కంటే పవర్ ఫుల్ . వీరి నిర్ణయానికి ఎదురే లేదు అన్నట్లు అనకాపల్లి లోని ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాలలోని ఎయిడెడ్ తెలుగు పోస్ట్ మాకు అక్కర్లేదు అంటూ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను 19 /11/ 2019 న కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి సరెండర్ చేశారు. అలా సరెండర్ చేసే అధికారం ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కళాశాల యాజమాన్యానికి లేదని , తక్షణమే పృథ్వీరాజ్ ను విధుల్లోకి తీసుకోమని కమీషనర్ గారు జె.డి.గారికి తెలియజేశారు. ప్రిన్సిపాల్ - కరస్పాండెంట్ లకు కమీషనర్ ఆదేశంగా తేలియజేయమన్నట్లు జాయింట్ డైరెక్టర్ గారు రాజమండ్రి ఆర్జెడి గారికి తెలియజేశారు. ఆతర్వాత ఆర్జేడీ గారు ఏ.ఎం.ఏ.ఎల్ . కళాశాల ప్రిన్సిపాల్ - కరస్పాండెంట్ లకు కమిషనర్ గారి ఆదేశాన్ని తెలియజేసినా నేటికీ, అనగా 8/12/2019 వరకు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ విధుల్లోకి తీసుకోకుండా ఉన్నారంటే అధికారుల ఆదేశాల పట్ల వీరికున్న గౌరవం, ప్రభుత్వం పట్ల భయం లేని వీరి తత్వం అందరీకీ అర్థమయ్యే ఉండాలి. 

No comments:

Post a Comment