-->

Saturday, May 18, 2019

Talathoti Prithvi Raj Created C.D.s



పృథ్వి రాజ్ రూపొందించిన ఆడియో వీడియో సీడీలు
ఈ క్రింది ఏ సీ.డీ.నైనా మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవాలంటే  /- ఎం.ఓ. ను డా.తలతోటి పృథ్వి రాజ్ ,డోర్ నెం.6 -5 ,6 వ వీధి,శారదా నగర్, అనకాపల్లి-53100. ఆంధ్రప్రదేశ్,ఇండియా "అనే ఈ క్రింది అడ్రస్ కు పంపించవచ్చు.

       నేను ఇండియన్ హైకూ క్లబ్ అధ్యక్షునిగా ప్రముఖ కవులు,వక్తలతో నిర్వహిస్తున్న సాహిత్య ప్రసంగాలను రికార్డు చేసి అందరికీ అందుబాటులో ఉండేలా సీ.డీ.లు గా రూపొందించాను. కొన్ని సీడీలు ఇతర సంస్థలలో ఉపన్యసించిన వక్తల ఉపన్యాసాలను రికార్డ్ చేశాను. వక్తలు మాట్లాడే విలువైన మంచి సాహిత్య ప్రసంగాలను గాలిలో కలిసిపోకుండా పదికాలాలపాటు అందరూ విని ఆనందించేలా సీ.డీ.లుగా రూపొందించాను. ఇప్పటివరకు 250 కి పైగా ఆడియో,వీడియో సాహితీ సీ.డీలను రూపొందించాను. నేను రూపొందించిన సీ.డీ.లను

(అ) సాహిత్యోపన్యాస ఆడియో సీ.డీ.లు.
(ఆ) సాహిత్యోపన్యాస వీడియో సీ.డీ.లు
(ఇ) పద్య కవిత్వం ఆడియో సీ.డీ.లు
(ఈ) పద్య కవిత్వం వీడియో సీ.డీ.లు
(ఉ) వచన కవిత్వం ఆడియో సీ.డీ.లు
(ఊ) వచన కవిత్వం వీడియో సీ.డీ.లు
(ఋ) స్వీయ కవితా పనం ఆడియో సీ.డీ.లు
(రూ) స్వీయ కవితా పనం వీడియో సీ.డీ.లు
(ఎ) ఆత్రేయ సాహిత్యంపై ఆడియో సీడీలు.
(ఏ) ఆత్రేయ సాహిత్యంపై వీడియో సీడీలు.
(ఐ) సినీ కవుల సాహిత్యం పై ఆడియో వీడియో సీడీలు
(ఒ) డాక్యుమెంటరీలు
(ఓ) లఘు చిత్రాలు
(ఔ) ఇతరులపై చేసిన సీడీలు
(అం) కవితా చిత్రాలు:


(అ) సాహిత్యోపన్యాస ఆడియో సీ.డీ.లు:

01) ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు  గారు ఉపన్యసించిన " వర్తమాన కవిత్వం " అనే ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

02) శ్రీ మహీధర నళినీ మోహన్  గారి  పద్యాలపై  శ్రీ ఓరుగంటి రాజ రాజేశ్వర ప్రసాద్ గారు ఉపన్యసించిన " ప్రతిపద్య శిరః కంపం " ఆడియో సీ.డీ.నేను రూపొందించాను.

03) శ్రీ పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు ఉపన్యసించిన "ఉత్తమ కథా లక్షణాలు" ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

04) శ్రీ జ్వాలాముఖి గారు ఉపన్యసించిన "సాహిత్యం - సమాజం" ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
05) శ్రీ గన్ను కృష్ణ మూర్తి గారు ఉపన్యసించిన వాల్మీకి రామాయణం - మరో కోణం  " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

06) డా. రావూరి భరద్వాజ గారు ఉపన్యసించిన "అనుభవాలు - జ్ఞాపకాలు" ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

07)  డా.అద్దేపల్లి రామ మోహన్ రావు  గారు ఉపన్యసించిన అభివ్యక్తి మార్గాలు " ఆడియో  సీ.డీ.ని నేను రూపొందించాను.

08) డా.రెంటాల వెంకటేశ్వర రావు  గారు ఉపన్యసించిన సాహిత్యం ఎందుకు? " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

09) డా.బేతోలు రామ బ్రహ్మం గారు ఉపన్యసించిన ఆధునిక పద్య సాహిత్యం - దాని వైశిష్ట్యం " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

10) డా.ద్వానా. శాస్త్రి గారు ఉపన్యసించిన ఆధునిక కవిత్వ ఉద్యమాలు " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

11) ఆచార్య తంగిరాల సుబ్బా రావు గారు ఉపన్యసించిన " కవిత్వమంటే ఏమిటి? " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

12) శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు ఉపన్యసించిన " కథలంటే..." ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

13) శ్రీ షేక్ కరిముల్లా గారు ఉపన్యసించిన " ఇస్లాం వాద సాహిత్యం " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
14) శ్రీ వేపా పార్వతీశం గారు ఉపన్యసించిన " చాటువులు - చమత్కారాలు " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

15) శ్రీ వి.ప్రభాకర గాంధీ గారు ఉపన్యసించిన వేమన పద్యాలు " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

() సాహిత్యోపన్యాస వీడియో సీ.డీ.లు:
     ఇండియన్ హైకూ క్లబ్ కు వచ్చి ఉపన్యసించిన వక్తల ప్రసంగ అంశాలను నేను ఆడియో సీ.డీ.గానే కాదు...వీడియో సీ.డీ.గాకూడా రూపొందించాను. అటువంటి సీడీలలో పేర్కొనదగినవి కొన్ని.

01) తన సోదరుడు  శ్రీ  టి.వి కె.సోమయాజులు సంకలనం చేసిన "సాహిత్య సాగరంలో ఏరిన ముత్యాలు" అనే పుస్తకంపై ఆచార్య తంగిరాల సుబ్బా రావు గారు చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.

02) శ్రీ జటావల్లభుల జగన్నాథం గారు "పారిజాతాపహరణం" అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.

03) శ్రీ శివా రెడ్డి గారు "సాహిత్యం-సామాజిక స్పృహ" అనే అంశంపై చేసిన సాహిత్య ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.

04) శ్రీ జాలాది గారు " నా సినిమా సాహిత్యం" అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.


() పద్య కవిత్వం ఆడియో సీ.డీ.లు:
      పద్య కవిత్వానికి సంబంధించిన ఈ ఐదు సీడీ లు శ్రీ ఇవటూరి గౌరీశం ఆలపించగా నేను రూపొందించినవి.

01) పద్య మంజూష: తెలుగు ప్రాచీన సాహిత్యంలోనుంచి అద్భుతమైన పద్యాలను నేను పద్య మంజూష " పేరిట ఆడియో సీ.డీ.గా రూపొందించడం జరిగింది. మంచి ఆదరణ పొందిన సీ.డీ.ఇది.   అమెరికాలాంటి దేశాలలోకూడా ఆదరింప బడిన సీ.డీ.  ఇందులోని పద్యాలను కూడా శ్రీ ఇవటూరి గౌరీశం గారు మృదుమధురంగా ఆలపించారు.

02) శ్రీ రామలింగేశ్వర శతకం: శ్రీ  వేదుల సోమనాథ సర్వతోముఖయాజులు గారు రచించిన శతకాన్ని శ్రీ కొడుకుల విశ్వేశ్వర రావు గారి ఆర్ధిక సహాయంతో నేను " శ్రీ రామలింగేశ్వర శతకం " పేరుతో ఆడియో సీ.డీ.గా నేను రూపొందించడం జరిగింది.

03) వేమన పద్య రత్నాలు: వేమన సుప్రసిద్ధ పద్యాలను ఎంపిక చేసి " వేమన పద్య రత్నాలు " అనే ఆడియో సీ.డీ.నేను రూపొందించాను.

04) శ్రీ భమిడిపాటి ప్రసాదరావు గారి సాహిత్యం: శ్రీ భమిడిపాటి ప్రసాదరావు గారి పద్యాలను వ్యాఖ్యానించి రూపొందించిన " శ్రీ భమిడిపాటి ప్రసాదరావు గారి సాహిత్యం " అనే ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

05) వేమన పద్యాలలో స్త్రీ: శ్రీ గౌరీశం పద్యాలనూ ఆలపించగా నేను కొన్ని పద్యాలను వ్యాఖ్యానించి రూపొందించిన ఆడియో సీ.డీ.నే వేమన పద్యాలలో స్త్రీ "
() పద్య కవిత్వంపై వీడియో సీ.డీ.లు:
పద్య కవిత్వానికి సంబంధించిన నేను రూపొందించినవి.


(ఉ) వచన కవిత్వం ఆడియో సీ.డీ.లు:
     నేను  సాహితీ మిత్రుల ఆసక్తిని బట్టి వారి కవితా సంపుటులను,అందులోని కొన్ని కవితలను  నా వ్యాఖ్యానంతో ఆడియో సీ.డీ.లుగా రూపొందించాను.

01) శ్రీ అపరాజితగారి వచన కవితా సంపుటిలోని కవితలన్నింటిని వ్యాఖ్యానిస్తూ తొలి ఆడియో సీ.డీ.ని నేను " కలల  కుంచె " అనే పేరుతో రూపొందించాను.

02) శ్రీ చింతాడ రామా రావు రాసిన సామాజిక గజళ్ళను  శ్రీ ప్రదాన ఆదినారాయణ మృదుమధురంగా ఆలపించగా " సిరా గజళ్ళు " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.

03) వివిధ కవుల  ప్రసిద్ధ నానీలు తీసుకొని వాటికి నా వ్యాఖ్యానంతో బాటు బాణీలు సమకూర్చి " నానీ బాణీలు " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను. ఇందులోని నానీలను శ్రీ ప్రదాన ఆదినారాయణ మృదుమధురంగా ఆలపించారు.

04) శ్రీ పి. లక్ష్మణ్ రావు గారి నానీ సంపుటి ని వ్యాఖ్యానిస్తూ నేను నావి - నీవి " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.

05) శ్రీ లంకా వెంకటేశ్వర్లు హైకూ సంపుటి లోని కొన్ని హైకూలను వ్యాఖ్యానిస్తూ  నేను "ఆకాశం నేల పాలైంది " అనే ఆడియో సీ.డీ. నీ రూపొందించాను.

06) డా.ఎస్.రఘు రచించిన " జీవన లిపి " లోని కొన్ని నానీలను తీసుకొని వాటికి నా వ్యాఖ్యానం జోడించి " జీవన లిపి " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.

07) శ్రీ సూరిశెట్టి జ్యోతీస్వర రావు రచించిన కవితా సంపుటిలోని కవితలకు నా వ్యాఖ్యానం జోడించి " మూగ రాగం " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.

08) నేను "ZEN POETRY" అనే పేరుతో హైకూకు సంబంధించిన ప్రసిద్ధ వ్యాసాలను ఆడియో సీ.డీ.గా నేను రూపొందించాను.

(ఊ) వచన కవిత్వం వీడియో సీ.డీ.లు:
    సామాన్యులకు సైతం కవిత్వం  అర్థమయ్యేలా నేను అనేకమంది కవుల కవిత్వాన్ని,కవితా సంపుటుల్లోని కవితలకు వ్యాఖ్యానంతోపాటు దృశ్యాలను జతచేసి ఆకట్టుకునేలా అందంగా రూపొందించినవే ఈ  వచన కవిత్వ వీడియో  సీ.డీ.లు.

01) శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి నానీసంపుటుల్లోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని " శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య నానీలు" అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.శ్రీ పాపినేని శివశంకర్ గారు ఈ సీ.డీ.ని ఆవిష్కరించారు.
02) డా.ద్వానా శాస్త్రి గారి సాహిత్య నానీలలోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని " సాహిత్య నానీలు " అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
03) శ్రీమతి ఎన్.అరుణ గారి గుప్పెడు గింజలు అనే నానీ సంపుటిలోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని " గుప్పెడు గింజలు "  అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

04) శ్రీ పి.లక్ష్మణ్ రావు గారి  హైకూ సంపుటి " భావ చిత్రాలు " లోని ప్రసిద్ధ హైకూలను ఎంపిక చేసుకొని  వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

05) నేను రచించిన  " పృథ్వి ఫోటో హైకూ " అనే సంపుటిని వీడియో సీ.డీ.గా రూపొందించాను.
06) మినీ కవితా ప్రక్రియలోని ప్రసిద్ధ మినీ కవితల్ని ఎంపిక చేసుకొని " మినీ కవిత్వం " అనే సాహిత్య వీడియో సీ.డీ.ని రూపొందించాను.
07) నేను రచించిన  " రుతుభ్రమణం "  అనే సంపుటిని వీడియో సీ.డీ.గా రూపొందించాను.




(ఋ) స్వీయ కవితా పనం ఆడియో సీ.డీ.లు
స్వీయ కవితా పటనానికి సంబంధించి రెండు ఆడియో సీ.డీ.లను నేను రూపొందించాను.

01) డా.ఎన్.గోపి గారు తన " జలగీతం"  అనే దీర్ఘ కవితా సంపుటిని చదవగా నేను ఆడియో సీ.డీ.గా  రూపొందించాను.

02) శ్రీ షేక్ కరిముల్ల గారు తన " సాయిబు "  అనే దీర్ఘ కవితా సంపుటిని చదవగా నేను ఆడియో సీ.డీ.గా  రూపొందించాను.

(రూ) స్వీయ కవితా పనం వీడియో సీ.డీ.లు




(ఎ) ఆత్రేయ సాహిత్యంపై ఆడియో సీడీలు:
     నేను ఆత్రేయగారి సినిమా సంభాషణలుపై పిహెచ్.డి.చేశాను. "మన' సు'కవి"," ఆత్రేయ నాటక సాహిత్యం - సంభాషణలు " అనే పుస్తకాలను ప్రచురించడమే కాకుండా ఆత్రేయ గారిపై నేను ఆడియో,వీడియో సీడీలను కూడా రూపొందించాను.

01) " ఆత్రేయ వ్యక్తిత్వం - సాహిత్యం " అనే అంశంపై నేను శ్రీమతి పద్మావతి ఆత్రేయ, శ్రీయుతులు డి.వి.నరసరాజు,తనికెళ్ళ భరణి,డి.రామానాయుడు,కాశీ విశ్వనాధ్ ,బొల్లిముంత శివరామ కృష్ణ,గొల్లపూడి మారుతీరావు ,జె.కె.భారవి ఇంటర్వ్యూ చేసి ఆడియో సీ.డీ.గా నేను రూపొందించాను.

02) ఆత్రేయ గారి ప్రసిద్ధమైన 151  సినిమా పాటలను " ఆత్రేయ ఆణిముత్యాలు " అనే పేరుతో MP3 ఆడియో సీ.డీ.గా నేను రూపొందించాను.
03) ఆత్రేయగారి మాటలు,పాటలపై నా విశ్లేషణతో కూడిన స్క్రిప్ట్ తో " మనసుకవి " అనే వీడియో సీ.డీ.ని రూపొందించాను.

04) " మహాకవి ఆత్రేయ సినిమా పాటలు " అనే వీడియో సీ.డీ.ని రూపొందించి శ్రీ శేఖరమంత్రి ప్రభాకర్ గారికి అంకిత మిచ్చాను.

05) " సంభాషణా చాణుక్యుడు ఆత్రేయ " అనే వీడియో సీ.డీ.ని నేను రూపొందించి శ్రీ పి.లక్ష్మణ్ రావు గారికి అంకిత మిచ్చాను.

(ఏ) ఆత్రేయ సాహిత్యంపై వీడియో సీడీలు.


(ఐ) సినీ కవుల సాహిత్యం పై ఆడియో వీడియో సీడీలు


(ఒ) డాక్యుమెంటరీలు:


(ఓ) లఘు చిత్రాలు:


(ఔ) ఇతరులపై చేసిన సీడీలు:


(అం) కవితా చిత్రాలు:



మీకు అందుబాటులో ఉన్న ఈ సీ.డీ.లను తెప్పించుకొని విని సాహిత్యాంశాలను ఆస్వాదించ గలరని ఆశిస్తున్నాను.
~ డా.తలతోటి పృథ్వి రాజ్
(ప్రచురితం : https://talathoti.blogspot.com/2019/05/blog-post.html)


No comments:

Post a Comment