-->

Saturday, May 18, 2019

Talathoti Prithvi Raj’s Cartoons

     కార్టూనిస్ట్ కావాలనేది చిన్నప్పటి నా చిరకాల వాంఛ. ఈ కోరిక నేను డిగ్రీ చదివే సమయంలో నెరవేరింది. ఆంధ్ర సచిత్ర వారపత్రిక , బహుశా ఆంధ్రజ్యోతి లేదా వనితా జ్యోతిలోనో మరో కార్టూన్ ప్రచురింపబడ్డాయి . ఆతరవాత కామిక్స్ కథలకు బొమ్మలు గీశాను. ఆతరవాత మరలా ముట్టుకోలేదు.  కార్టూన్ గీయడానికి ఓపిక కావాలి . ఆ ఓపిక నాకు తక్కువ . మన దైనందిన జీవితంలో  జరిగే సన్నివేశాలు ,సందర్భాలలోనుండి కార్టూన్ గీయవచ్చు . ఏ కార్టూనిస్ట్ అయినా 75 శాతం తాను బొమ్మగీసిన విధానాన్ని బట్టే నవ్వించాలి . ఆబొమ్మకుతోడు - సరిఅయిన కార్టూన్ క్యాప్షన్ ఉంటే ఆ కార్టూన్  కు తిరుగుండదు . 
     ఒక కార్టూన్ సహజత్వంగా ఉన్నదనడానికి, కనిపించడానికి ఏమేమి గీయాలో  అటువంటి ఆబ్జాక్టివ్స్ అన్నీ ఉంటే బాగుంటుంది. నేను సాహిత్యానికి సంబంధించిన వాడిని గనుక ఎక్కువ అటువంటివే గీస్తూ ఉంటాను . మునుముందు చక్కగా కలర్ ఫుల్ కార్టూన్స్ గీయాలని ఆశపడుతున్నాను .   





















No comments:

Post a Comment