తెలుగు సినిమా పాటకూ,మాటకూ విజ్ఞాన సర్వస్వం వంటివారు ఆచార్య ఆత్రేయ. ఎందరో సినీ
కవులకు స్ఫూర్తి,మార్గదర్శకులు ఆత్రేయ.
అటువంటి గొప్ప కవిపై ఆమూలాగ్రంగా పరిశోధన చేసినవాడిని నేను. తెలుగు సినీ సాహిత్య
పరిశోధనలో సినిమా సంభాషణలపై జరిగిన తొలి పరిశోదన నాది. “ఆత్రేయ సినిమా సంభాషణలు – ఒక పరిశీలన” అనే అంశంపై నేను
పరిశోధన చేసి 2000 సంవత్సరంలో నా సిద్ధాంత గ్రంధాన్ని ఆంధ్ర విశ్వ విద్యాలయం
వారికి సమర్పించి నాటి గవర్నర్ డా.రంగరాజన్ గారి చేతుల మీదుగా పిహెచ్.డి.పట్టాను
స్వీకరించాను. ప్రత్యేకించి ఒక నాటక రచయిత సంభాషణలకు సంబంధించి వచ్చిన పరిశోధనా గ్రంధంకూడా నాదే. ఆత్రేయ నాటక సాహిత్యం
పైగల వ్యక్తిగత ఆసక్తినిబట్టి “ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు”అనే అంశంపై పరిశోధించి 1999 లో నేను దానిని
గ్రంధరూపంలోకి తీసుకు వచ్చాను. ఆత్రేయ గారి సినిమా పాటలపై “మన‘సు‘కవి”అనే మరో పుస్తకాన్ని
కూడా రచించి ఆత్రేయ అభిమానులకు అందించాను.ఆత్రేయగారి అభిమానుల కొరకు ఆత్రేయ గారి 151 ప్రసిద్ధ సినీగీతాలతో కూడిన “ఆత్రేయ ఆణిముత్యాలు” అనే mp3 audio
c.d. ని నేను తీసుకువచ్చాను. ఆత్రేయ మొదటి,చివరి పాటలే కాక సూపర్ హిట్ సాంగ్స్ ఇందులో పొందుపరిచాను. ఆత్రేయగారి
సాహిత్యం,వ్యక్తిత్వానికి
సంబంధించి పద్మావతి ఆత్రేయ,ఆకెళ్ళ,జె.కె.భారవి,డి.వి.నరసరాజు,గొల్లపూడి మారుతీరావు,బొల్లిముంత శివరామకృష్ణ,డా.డి.రామానాయుడు,కాశీవిశ్వనాథ్,తనికెళ్ళ భరణి వంటి ప్రముఖుల
ఇంటర్వ్యూలను “ఆత్రేయ సాహిత్యం – వ్యక్తిత్వం” పేరుతో ఆడియో సి.డీ. గా
రూపొందించాను. స్కాలర్ గా ఉన్న రోజుల్లోనే ఆత్రేయ జీవితం, సాహిత్యం పై “మహాకవి ఆత్రేయ” అనే డాక్యుమెంటరీ
వీడియో సి.డీ.ని రూపొందించాను. ఆతర్వాత “ఆత్రేయ సినిమా పాటలు”,”సంభాషణా చాణుక్యుడు ఆత్రేయ”అనే వీడియో సి.డీ.లనుకూడా నేను రూపొందించడం
జరిగింది.
2004 మే 7 వ తేదీన ఆచార్య ఆత్రేయ 83 వ జయంతిని
పురస్కరించుకొని “ఆత్రేయ సాహితీ స్రవంతి” అనే సంస్థ ని ఇండియన్ హైకు క్లబ్ అనుబంధ సంస్థగా నేను
స్థాపించాను.2004 వ సంవత్సరానికిగాను ఆత్రేయ సాహితీ స్రవంతి గౌరవ సలహాదారులుగా
శ్రీమతి పద్మావతి ఆత్రేయ, రసరాజు గార్లు వ్యవహరించారు.
సాయి కుల్వంత్ కళాశాలల కరస్పాండెంట్ శ్రీ ఎమ్.కామరాజు డిజిటల్ బ్యానర్ ను ఆవిష్కరించారు. తొలి కార్యక్రమాన్ని ప్రముఖ
గైనకాలజిస్ట్ డా.విజయలక్ష్మీ గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం ఆత్రేయ
జయంతి,వర్థంతి సభలను
నిర్వహించడమే గాక ప్రముఖ తెలుగు సినీ రచయితల సినీ సాహిత్యంపై కూడా ఈ సంస్థ సాహితీ కార్యక్రమాలను నిర్వహించాలనే
ఆలోచనతో వేటూరి సంస్మరణ సభను,ఆరుద్ర,దాశరధి సభలను నిర్వహించింది. ప్రతి సంవత్సరం విడుదలైన
తెలుగు చిత్రాలలోని సంభాషణలను, పాటలను, కథలను పరిశీలించి ఉత్తమ గేయ రచయిత,ఉత్తమ మాటల రచయిత,ఉత్తమ కథా రచయిత ల అవార్డ్ లను ఆత్రేయ సాహితీ స్రవంతి ప్రకటించి ప్రశంసా
పత్రంతో, సన్మాన – సత్కారాలతో విజేతలను
తగురీతిగా గౌరవించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. సినీ పరిశ్రమకు ఉత్తమ
సాహిత్యాన్ని అందించినవారికి సంస్థ “ఆత్రేయ సాహితీ పురస్కారం”ను ప్రదానం చేస్తోంది. సినీ రచయితగా విశిష్ట సేవలందిస్తున్న వారికి ఆత్రేయ సాహితీ స్రవంతి బిరుదు ప్రదానం
చేస్తోంది.
2006 మే 7 వ తేదీ , ఆత్రేయ 85 వ జయంతిని
పురస్కరించుకొని ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ జాలాది గారికి “జానపద గేయ శిరోమణి”బిరుదును ప్రదానం చేసింది. 13 సెప్టెంబర్ 2006 ఆత్రేయ గారి 17 వ వర్ధంతిని
పురస్కరించుకొని ఆత్రేయ శిష్యులు శ్రీ గురుచరణ్ గారికి “ఆత్రేయ సాహితీ పురస్కారం”ను ప్రదానం చేసింది ఆత్రేయ సాహితీ స్రవంతి.
No comments:
Post a Comment