-->

Wednesday, May 29, 2019

Book reviews of Prithvi Raj

Book reviews of Prithvi Raj:


Prithvi as Book reviewer:

పృథ్వి రాజ్ వివిధ కవుల కవితా సంపుటులకు రాసిన సమీక్షా వ్యాసాలు:

బలమైనది మౌనం - (ఎన్ అరుణ రచించిన "మౌనం మాట్లాడుతుంది" కవితా సంపుటిపై చేసిన సమీక్ష)  సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - జనవరి & ఫిబ్రవరి .
రెప్పల చప్పుడు 'లో గుండెల చప్పుళ్ళు -( సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన 'రెప్పల చప్పుడు ' నానీ సంపుటికి రాసిన సమీక్ష ) . సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - జనవరి & ఫిబ్రవరి .

అశోక్ కుమార్ చెప్పిన "ఆధ్యాత్మిక ర'హా'స్యాలు" - (శింగం పల్లి అశోక్ కుమార్ రచించిన "ఆధ్యాత్మిక రహస్యాలు"మినీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -  సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక -మార్చి -ఏప్రిల్.
'నా నీ 'లో వెలుగు వెదజల్లుతూ "గోరంతా దీపాలు" (అనిశెట్టి రజిత రచించిన "గోరంత దీపాలు " నానీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) - సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - మార్చి -ఏప్రిల్.
అందిన ఆకాశం (లంకా వెంకటేశ్వర్లు రచించిన "ఆకాశం నేలపాలైంది " హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష) - హైకూ సాహిత్య మాసపత్రిక , మే 2003.
హైకూ చినుకులు (బొబ్బిలి జోసెఫ్ రచించిన "పూల చినుకులు" హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -హైకూ సాహిత్య మాస పత్రిక
సామాజిక గీతం ఆలపించిన పిట్ట (రౌతు రవి రచించిన "వేకువ పిట్ట" హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -హైకూ సాహిత్య మాస పత్రిక

నానీ మురిపాల "పాలకంకి " (నేతల ప్రతాప్ కుమార్ రచించిన "పాలకంకి" నానీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష) - -హైకూ సాహిత్య మాస పత్రిక ఆగస్ట్ 2003.

Tuesday, May 21, 2019

Prithvi as a Lyricist,composer and singer

Prithvi as a Lyricist,composer and singer

     పాటలు రాయడం, మంచి బాణీని రూపొందించి చక్కగా పాడాలనేది నా కోరిక. కాస్త సంగీత స్పృహ ఉంది.  మొదటి ప్రయత్నంగా నేను రచించిన కొన్ని క్రైస్తవ గీతాలలోని ఒక గీతానికి బాణీ సమకూర్చి ఆలపించిన పాట. ట్రాక్ పై పాడటం క్రొత్త. పెద్దగా ప్రాక్టీస్ కూడా చెయ్యలేదు. సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసిన శ్యామ్ గారికి నా ధన్యవాదాలు. 
     హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎం.ఏ.  చదివే రోజుల్లో సినిమాలకై సుమారు 50 వరకు పాటలు రాశాను. రెండు మూడిటికి ట్యూన్ కూడా చేశాను. కొంతమంది దర్శక నిర్మాతల వద్దకు తిరిగాను. విసిగి కొన్నాళ్ళకు  ఆ ప్రయత్నం విరమించుకున్నాను. మునుముందు క్రైస్తవ గీతాలనే గాక, సామాజిక చైతన్యాన్ని కలిగించే పాటలను కూడా రాసి మంచి ట్యూన్ సమకూర్చి పాడాలనేది నా ఆలోచన.



#SongonWar #LyriconWar #Kavitalathoti #DrTalathotiPrithviRaj www.talathoti.com   www.litt.in దేశం ఏదైనా... ప్రజల ఆకాంక్షలు ఒకటే తీరు; శాంతి, దేశాభివృద్ధి! దేశాలేవైనా... దేశాధినేతల ఆలోచనల తీరు ఒక్కటే; అస్తవ్యస్త పాలననుండి దేశ ప్రజల దృష్టి మళ్ళించడానికి దేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం!! ఏ దేశప్రజలు యుద్ధాన్ని కోరుకోరు అది సిరియా అయినా, గాజా అయినా! అటువంటి యుద్ధాలలో పౌరులు వారి ఆస్తి, ప్రాణ నష్టాన్ని కోరుకోరు. నాయకులకు వారి పార్టీలు మధ్యనే గాక; దేశాధినేతలయ్యాక దేశాలపట్ల ఆధిపత్యాన్నీ ప్రదర్శించాలని చూస్తుంటారు. మరి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు  ఆధిపత్య పోరును ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి. పేదదేశాల... అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యవహారాల్లో తలదూర్చి పెత్తనం చెలాయించడానికి చూస్తాయి. ఐక్యరాజ్య సమితి లాంటివి కూడా అగ్రదేశాల కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నాయి. చివరిగా....ఏ దేశమైతే కోట్లాది రూపాయలు రక్షణ రంగానికిగాక;  ప్రజల జీవితాలకు నిజమైన రక్షణ కల్పించే విద్యా, వైద్య రంగాలకు కేటాయిస్తామని వాగ్దానాలు చేస్తాయో ఆ పార్టీలను, నేతలను ఎన్నుకోవాలి! ~ Dr TALATHOTI PRITHVI RAJ.   పల్లవి: నిర్వేదం... నిస్సహాయం... దేశం ఏదైనా కావచ్చు  ప్రజలంతా ఒక్కటే కదా! దేశాలేవైనా కావచ్చు  పాలకులంతా ఒక్కటే కదా! ఇది ప్రజాస్వామ్యమా! విధ్వంస గమ్యమా? ||దేశం||# 1 చరణం: ఖండాలలో ఎన్నెన్నో పేదదేశాలు దేశాల్ని దోచేసే పెట్టుబడిదారులు |2| కొంతమంది చేతుల్లోనే దేశసంపద ప్రాధాన్యత లేనివాటిగా విద్యా, వైద్యం దేశ ప్రగతినాశించే నేతలేందరు? స్వార్థమేలే దేశాలై ఈలోకంలో!  ||దేశం|| 2 చరణం  గాజాలో పౌరుల చావు కేకలు దేశాల్ని కమ్మేసే యుద్ధ మేఘాలు.|2| నేతి బీరకాయలోని నేతి చందము! ఐక్యరాజ్య సమితి తెచ్చిన ఐక్యతెక్కడా? అడ్డకత్తెరాలోని పోక చెక్కలా నలిగి పోతుంది  పౌరులేకదా! ||దేశం|| 3 చరణం: దేశాల హద్దుల్లో కవ్వింపు చర్యలు దేశాల్ని దెబ్బతీసే జీవాయుధాలు |2| అణ్వస్త్రాలుకాదు అన్న వస్త్రాలు శాంతినే కోరుకుంటూ ఈ ప్రజలు దేశమంటే మట్టికాదు మనుషులంటూ గుర్తెరిగి పాలించాలి దేశాధినేతలు! ||దేశం||




#songoncorruption #songonbribe మీరెదుర్కున్న అనుభవమేమిటో నాకు తెలియదు కానీ....నేను ఈలాంటి లంచగొండు ఆఫీసర్లని అనేకమార్లు ఫేస్ చేశాను. కొన్ని అసభ్యకరమైన, జుగుప్సాకరమైన పదజాలం ఈ పాటలో రాసినా కొందరు అవినీతి ఆఫీసర్స్ తీరు ముందు ఈ పదాలు చాలా చిన్నవి! ఈ లోకంలో తనా, మన అని చూడనివి రెండే రొండు. అవి చావు, ఈర్ష్యా. వీటి తర్వాత తారతమ్యాలకు చోటివ్వని అంశం లంచమే! ఈ సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎంత వేళ్ళూనికొనిపోయినా లంచగొండులకు క్యాష్ ఫీలింగ్ తప్పించి క్యాస్ట్ ఫీలింగ్ అస్సలుండదు! ఈ ఒక్కటే వారిలో ఉండే ఏకైక సుగుణం అనుకోవాలి! వేశ్యలాంటి అధికారి దగ్గర విటుడనే అక్రమదారుడు లంచం అనే డబ్బిచ్చి తాను అనుకున్నది పొందుతాడు. లంచం తీసుకున్నోడు ఫేవర్ చేశాననుకుంటాడు. "డబ్బులిస్తే వీడు పెంట తినమన్నా తింటాడని" లంచం ఇచ్చిన అక్రమదారుడనుకుంటాడు... పదిమందికి చెప్పుకుంటాడు. అవినీతిని రూపుమాపడం అనేది ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో వారిచ్చే హామీలాంటిదే! ఒక కవి అన్నట్లు అవి-నీతి నిరోధక శాఖల్లాగ ఉన్నాయే గాని అవినీతి నిరోధక శాఖల్లాగ చురుకుగా, నిజాయితీతో వ్యవహరించడంలేదు. ఒకోమారు కంచే చేను మేసిన చందంగా ఉన్నాయి. అవినీతి తిమింగలాల్ని వదిలేసి పిత్తపరిగెల్లాంటి చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటున్నారు.లంచం ఈ వ్యవస్థకు పట్టిన రాచపుండు. ఈ పాట మీకు గుర్తున్నా లేకున్నా లంచ పుచ్చుకునేటప్పుడల్లా లంచగొండులకు నేను గుర్తుకు రావొచ్చు. పల్లవి: ఐ యామ్ ది ఆఫీసర్ అవినీతిలో నే సూపర్ లంచాలే నా కల్చర్ అక్రమార్జన నా ఫ్యూచర్ సంకైనా నాకుతాను డబ్బు కోసం పెంటైనా తింటాను డబ్బు కోసం ఉచ్చైన తాగుతాను డబ్బు కోసం ||ఐ యామ్ ది|| (1). ఫైలు కదులుతుంది చేయి తడిపితే మసి పూసి మారేడౌను జేబు నింపితే బాధితులకు నే వంచన చేను మేసే కంచెను మేకవన్నె పులినిరా పాప పుణ్యాల్లేవురా! ||ఐ యామ్ ది|| (2). డొంక కలదయ్య తీగలాగితే గంజాయి తోటలో తులసి నిలవదు ఏసీబీ ఉన్నా కూడా గాలిలాగ పట్టుబడము కళ్ళుగప్పే ఇంద్రజాలం మా సొంతం ఈ కళ ||ఐ యామ్ ది|| 
~ రచన, స్వరకల్పన,గానం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ 
www.talathoti.com 
www.litt.in


 



రచనా, స్వరకల్పన,గానం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ 
#coronavirussong #talathoti #ModiGovernment 

కరోనా సెకెండ్ వేవ్ అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. రాజకీయ పార్టీలు అనుకున్న విధంగా ఎన్నికలు నిర్వహించుకుని విజయవంతంగా అనేకమంది చావుకు కారకులయ్యారు. ఢిల్లీలోని నిజాముదిన్ మర్కజ్ మసీదునందు జరిగిన సమావేశం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందింది అని తీవ్ర విమర్శలు చేసిన వారు ఇప్పుడు చేసిందేమిటి? ఇటువంటి పరిస్థితుల్లో కుంభమేళ అవసరమా? దేశం వల్లకాటిలా మారిపోయింది. లాక్ డౌన్ తో కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలు మీనా మేషాలు లెక్కపెట్టి, లాభనష్టాలు బేరీజు వేసి కర్ఫ్యూ నిర్ణయం తీసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందరో తనువు చాలించారు. కుటుంబాలు ఆప్తుల్ని కోల్పోయి తీవ్ర శోకాన్ని అనుభవిస్తున్నాయి. ఈ దేశంలో ప్రభుత్వాలు ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనంత కాలం ఇటువంటి మరణహోమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు కూడా వ్యక్తిగత క్రమశిక్షణ అలవర్చుకోవాలి.

 








 



                 












Prithvi's Essays Links

Prithvi's Essays Links


పృథ్వి రాజ్ రచించిన సాహిత్య వ్యాసాలు : 

తిలక్ కవితా తత్త్వం -ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ మల్టీ దిసిప్లీనరీ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ జర్నల్ -2012
గిడుగు - పిడుగు-ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ మల్టీ దిసిప్లీనరీ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ జర్నల్ -2013 
కళింగాంధ్ర జానపద కళా రూపాలు - తప్పెట గుళ్ళు -ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ మల్టీ దిసిప్లీనరీ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ జర్నల్ -2014 
జాషువా కవిత్వం -వ్యక్తిత్వ వికాసం-ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ మల్టీ దిసిప్లీనరీ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ జర్నల్ -2012
డా.బెజవాడ గోపాలరెడ్డి  పరిమళ తరంగాలు -ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ అకడమిక్అ రిసెర్చ్ జర్నల్ -2015 
టంకాలు (TANKA)-హైకూ పొయిట్రీ బులిటెన్, నవంబర్ 2002.

నానీలు -హైకూ సాహిత్య మాస పత్రిక, అక్టోబర్ 2003.
కవితానిక - హైకూ సాహిత్య మాసపత్రిక, నవంబర్ 2003.
హైకూ చంద్రుడు (హైకూ కవి "గణపతిరాజు చంద్రశేకర రాజు" హైకూ కవితా సంపుతులపై )  - హైకూ మాస పత్రిక, జూలై 2003.
హైకూనలు (సనారా రూపొందించిన కవితా సంపుటి పై వ్యాసం ) హైకూ సాహిత్య మాస పత్రిక, మే 2003.
మనస్తత్వవేత్త మన ఆత్రేయ - ఆంధ్రప్రభ దినపత్రిక(విశాఖ) , గురువారం 7 మే 1998.
సామాజిక హైకూలు-భావతరంగిని-వార్షిక సంచిక, సెప్టెంబర్ 2005.
తెలుగు సాహిత్యంలో ఆధునిక పోకడలు - ఐ.డి.ఎల్. మాసపత్రిక-సెప్టెంబర్ 2006.
టంకాలు - ఎక్స్ రే పత్రిక -అక్టోబర్, నవంబర్,డిసెంబర్ 2003.
సింహద్వారం - నానీ -రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక - నవంబర్ 2006 -జనవరి 2007.
తెలుగులో ఆధునిక సాహిత్య ప్రక్రియ ద్వారా పర్యావరణ చేతన - వాజ్ఞ్మయి , మార్చి 2007.
హైకూ టెక్నిక్ పట్టుకోవాలి - హైకూ మాస పత్రిక, జనవరి - మార్చి 2005.
ఫోటో హైకూ  - హైకూ మాస పత్రిక, జనవరి - మార్చి 2005.

Prithvi Created Literary Video files

Prithvi Created Literary Video files:


సాహిత్యోపన్యాస వీడియో సీ.డీ.లు:
     ఇండియన్ హైకూ క్లబ్ కు వచ్చి ఉపన్యసించిన వక్తల ప్రసంగ అంశాలను నేను ఆడియో సీ.డీ.గానే కాదు...వీడియో సీ.డీ.గాకూడా రూపొందించాను. అటువంటి సీడీలలో పేర్కొనదగినవి కొన్ని.
01) తన సోదరుడు  శ్రీ  టి.వి కె.సోమయాజులు సంకలనం చేసిన "సాహిత్య సాగరంలో ఏరిన ముత్యాలు" అనే పుస్తకంపై ఆచార్య తంగిరాల సుబ్బా రావు గారు చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.

02) శ్రీ జటావల్లభుల జగన్నాథం గారు "పారిజాతాపహరణం" అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.
03) శ్రీ శివా రెడ్డి గారు "సాహిత్యం-సామాజిక స్పృహ" అనే అంశంపై చేసిన సాహిత్య ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.


04) శ్రీ జాలాది గారు " నా సినిమా సాహిత్యం" అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.


() పద్య కవిత్వంపై వీడియో సీ.డీ.లు:
పద్య కవిత్వానికి సంబంధించిన నేను రూపొందించినవి.
(ఊ) లఘు కవితా ప్రక్రియలపై వీడియో సీ.డీ.లు, ఫైల్స్ :
    సామాన్యులకు సైతం కవిత్వం  అర్థమయ్యేలా నేను అనేకమంది కవుల కవిత్వాన్ని,కవితా సంపుటుల్లోని కవితలకు వ్యాఖ్యానంతోపాటు దృశ్యాలను జతచేసి ఆకట్టుకునేలా అందంగా రూపొందించినవే ఈ  వచన కవిత్వ వీడియో  సీ.డీ.లు.
01) శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి నానీసంపుటుల్లోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని " శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య నానీలు" అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.శ్రీ పాపినేని శివశంకర్ గారు ఈ సీ.డీ.ని ఆవిష్కరించారు.
02) డా.ద్వానా శాస్త్రి గారి సాహిత్య నానీలలోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని " సాహిత్య నానీలు " అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
03) శ్రీమతి ఎన్.అరుణ గారి గుప్పెడు గింజలు అనే నానీ సంపుటిలోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని " గుప్పెడు గింజలు "  అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
04) శ్రీ పి.లక్ష్మణ్ రావు గారి  హైకూ సంపుటి " భావ చిత్రాలు " లోని ప్రసిద్ధ హైకూలను ఎంపిక చేసుకొని  వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
05) నేను రచించిన  " పృథ్వి ఫోటో హైకూ " అనే సంపుటిని వీడియో సీ.డీ.గా రూపొందించాను.
06) మినీ కవితా ప్రక్రియలోని ప్రసిద్ధ మినీ కవితల్ని ఎంపిక చేసుకొని " మినీ కవిత్వం " అనే సాహిత్య వీడియో సీ.డీ.ని రూపొందించాను.
07) నేను రచించిన  " తుభ్రమణం "  అనే సంపుటిని వీడియో సీ.డీ.గా రూపొందించాను.
అరకు అందాలు (డా తలతోటి పృథ్వి రాజ్ రచించిన33 హైకూల వీడియో సీడి)
సీతాకోక చిలుక (డా తలతోటి పృథ్వి రాజ్ రచించిన 25 హైకూ కవితలతో వీడియో సీడీ )  
హైకు (వివిధ కవుల హైకూలు, హైకూ లక్షణాలకు సంబంధించి 99 ఫైల్స్ తో వీడియో సీడీ )
పృథ్వి ఫోటో హైకూ (పృథ్వి రాజ్ కవితా సంపుటిని ఫోటోల వీడియో గా )
ఋతుభ్రమణ౦ (పృథ్వి రాజ్ కవితా సంపుటిని ఫోటోల వీడియో గా )
ఫోటో హైకూ (4 ఫైల్స్ తో వీడియో )
సెన్ ర్యూ (39 ఫైల్స్ తో సెన్ ర్యూ వీడియో ఫైల్స్ )
తంకా (4  వీడియో ఫైల్స్)
డా ఎం శివప్రసాద్ హైకు వీడియో ఫైల్
సశ్రీ  రచించిన "నడిచే శవాలు "హైకూ సంపుటిలోని కొన్ని హైకులు వీడియోగా
మినీ కవిత్వం (వివిధ కవుల మినీ కవిత్వం, కవిత్వ లక్షణాలపై 67వీడియో ఫైల్స్ ) 
నానీలు (వివిధ కవుల నానీ కవిత్వం, కవిత్వ లక్షణాలపై 59వీడియో ఫైల్స్) 
ప్రపంచ పదులు /జూన్ 2010.

కూనలమ్మ పదాలు :
కూనలమ్మ పదాలు ప్రక్రియ పరిచయం -కవిత్వం పై 4 వీడియో ఫైల్స్ /మే ,జూన్ 2010. 

పద్య కవిత్వంపై వీడియోలు:
బి వి బంగార్రాజు రచించిన శతకాలలోనుంచి 27 పద్యలపై వీడియో  జూన్ 2012
పల్లె తిరుపతి రావు రచించిన "పల్లి(ల్లె) పలుకులు(రావు శతకం)నుండి 25 పద్యాలను వీడియో గా   జనవరి ఫిబ్రవరి 20 13 లో
ఆముక్త మాల్యద -మాల దాసరి ఇతివృత్తం /జూన్ 2014
గుర్రం జాషువా పద్య ఖండికలు :
గిజిగాడు /జనవరి 2013
చంద్రోదయం /మర్చి 2013
"గబ్బిలం"లోని "పామునకు పాలు" పద్యం /జనవరి 2013  


వీడియో డాటా ఫైల్స్  :
హైకూ వీడియో డాటా ఫైల్స్:
అరకు అందాలు (33 హైకూ వీడియో ఫైల్స్ )
సీతాకోక చిలుక (27 హైకూ  ఫైల్స్ )
తెలుగు హైకూ కవిత్వం (99 హైకూ వీడియో ఫైల్స్ )
ఫోటో హైకూ (5 ఫోటో హైకూ ఫైల్స్ )
సెన్ ర్యూ (39 సెన్ ర్యూ పోయెట్రీ ఫైల్స్ )
తంకా (4 తంక పోయెట్రీ ఫైల్స్ )
డా ఎం శివప్రసాద్ హైకూ వీడియో ఫైల్
సశ్రీ హైకూ వీడియో ఫైల్
డా తలతోటి పృథ్వి రాజ్ కిగో హైకూ వీడియో ఫైల్

మినీ కవితల వీడియో డాటా ఫైల్స్ :
మినీ కవితలు (67 మినీ కవితలు)
నానీలు (60 నానీల వీడియో ఫైల్స్ )

పద్యాల వీడియో డాటా ఫైల్స్ :
బివి బంగార్రాజు పద్యాలు (33 పద్యాలు )
పల్లె తిరుపతి రావు (25 వీడియో ఫైల్స్ )
ఆముక్త మాల్యద
గుర్రం జాషువా "గిజిగాడు"
గుర్రం జాషువా "చంద్రోదయం"
గుర్రం జాషువా "గబ్బిలం"నుండి "పామునకు పాలు "పద్యం
తలతోటి సత్యానందం-పృథ్వి రాజ్  అంకిత పద్యాలు

కూనలమ్మ పదాలు వీడియో డాటా ఫైల్స్:
కూనలమ్మ పదాలు (4 వీడియో ఫైల్స్ )

తలతోటి పృథ్వి రాజ్ పరిచయం
తలతోటి పృథ్వి రాజ్ కవిత సంపుటులు

డాక్యుమెంట్స్ వీడియో డాటా ఫైల్స్ :
అన్నమ్మ టీచర్ జీవితం
అన్నమ్మ టీచర్ ఇంటర్వ్యూ


బివి బంగార్రాజు జీవితం 
బివి బంగార్రాజు ఇంటర్వ్యూ


అంగ్ల పండితులు శ్రీ ఎస్ రాము మాస్టర్ తో డా పి వెంకట సుధాకర్ ఇంటర్వ్యూ

డా ద్వానా శాస్త్రి తో డా తలతోటి పృథ్వి రాజ్ ఇంటర్వ్యూ


బాలాంత్రపు రజని కాంతారావు పై వీడియో

సినిమా కవులు - సాహిత్యంపై వీడియో డాటా ఫైల్స్ :
ఆచార్య ఆత్రేయ 89 వ జయంతి సభ
ఆచార్య ఆత్రేయ మొదటి-చివరి సినిమా పాట
ఆచార్య ఆత్రేయ వీణ పాటలు -పార్ట్ 1
ఆచార్య ఆత్రేయ-జీవితం
ఆరుద్ర 12 వ వర్ధంతి సభ
ప్రపంచ పదులు వీడియో డాటా ఫైల్స్ :
పృథ్వి ప్రపంచ పది (1 ఫైల్ )

సాహిత్యోపన్యాసాలు వీడియో డాటా ఫైల్స్ :
ఆధునిక కవిత్వ ఉద్యమాలు-ద్వానా శాస్త్రి 

జానపద కవిత్వం -ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు


సాహిత్యం -సమాజం :జ్వాలాముఖి

స్వీయ కవితా పటఠనం వీడియో డాటా ఫైల్స్ :
నడిచే శవాలు-సశ్రీ హైకూలు


నూతన పరిచయం-ఆశారాజు కవిత


శ్రీ కె శివారెడ్డి కవిత


శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కవిత 





















Book reviews on Prithvi poetry

Book reviews on Prithvi poetry

ఇప్పటివరకు నేను రచించిన కవితా సంపుటులను వివిధ పత్రికలలో సమీక్షించిన సమీక్షకులకు, సాహితీ మిత్రులకు ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఆవిష్కరణ రోజు వేదికపై పుస్తకాన్ని సమీక్షించే దానికి, అదే పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చెయ్యడానికి పత్రికలకు రాసే సమీక్షా వ్యాసానికి తేడా ఉంది. సమీక్ష గీటు రాయిల ఉండాలి.  

పృథ్వి రాజ్ కవితా సంపుటులపై ఇతరులు రాసిన సమీక్షా వ్యాసాలు:
హైకూ కొలనులో పృథ్వి " కలువలు" -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.  - హైకూ సాహిత్య మాస పత్రిక - జూలై 2003.  
భూమికి పృథ్వీరాజ్ అలంకరించిన కిరీటం చంద్ర కిరీటం - కొంపెల్ల కామేశ్వరరావు - చినుకు మాసపత్రిక , 54 వ పేజి , డిసెంబర్ 2005.
"పృథ్వీ" -హైకూలు!! టంకాలు!!!  -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
హైకూ కిరీటి - తలతోటి    -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
మనవ జీవితాన్ని ప్రతిబింబించే హైకూ - సెన్ ర్యూ  - కొంపెల్ల కామేశ్వరరావు - ...వార్తా పక్షపత్రిక, 54 వ పేజి , 15  డిసెంబర్ 2002
నీలాకాశం  - సెన్ ర్యూ  -కన్నా - భావ తరంగిణి, జనవరి 2003.
"హైకూ కొలనులో " "పృథ్వీ కలువలు " ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.,ఈరోజు ,శుక్రవారం 13 జూన్ 2003.
అనుభూతి తడిలో హృదయాంకురాలు 'హైకూలు' ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
తటాకంలో చంద్రకిరణాలు ! కలువలు !!- ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు. -సర్కార్ ఎక్స్ ప్రెస్-కాకినాడ,శుక్రవారం 13 జూన్ 2003.
పృథ్వీ 'సెన్ ర్యూలు - టంకాలు' - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు. - ఈరోజూ-కాకినాడ,శుక్రవారం 12 డిసెంబర్ 2003.
అరటాకుల్లో వడ్డించిన పసందైన హైకూల విందు - మకినీది సూర్య భాస్కర్ (సమీక్షణం) -సర్కార్ ఎక్స్ ప్రెస్-కాకినాడ, మంగళవారం 21 డిసెంబర్ 2004.
అరటాకుల్లో వడ్డించిన పసందైన హైకూల విందు - మకినీది సూర్య భాస్కర్ - సంవీక్షణ, జనవరి & ఫిబ్రవరి 200?.

నెలవంక (హైకూ సంకలనం ) -రాజా విజయ సారధి -మావార్త తెలుగు పక్ష పత్రిక -శుక్రవారం. 28 ఫిబ్రవరి 2003.

సప్త అంతరంగాల అక్షర నక్షత్రాల మధ్యన తళుక్కు మన్న "నెలవంక " - (అక్షర వీక్షణం ) జయకేతనం , 1 జనవరి 2002.