-->

Tuesday, June 11, 2019

Talathoti Prithvi Raj Mini Poetry

Talathoti Prithvi Raj Mini Poetry




INDEX 
పరస్పర అవసరం (మినీ కవిత)

స్వార్థ రాజకీయం

ఎన్నికల కోడ్ (మినీ కవిత)
"సారా"౦శం (మినీ కవిత)
లోకం "పోకడ (మినీ కవిత )
పొత్తు పెటాకులు (కవిత)
పజిల్ 
జంపింగ్ జిలానీలు (మినీ కవిత)
మేస్త్రి బాబు (మినీ కవిత )

కొండను తవ్వి (మినీ కవిత)

పురిటి నొప్పుల్తో 
మోదీ పాలన!
కాషాయం!
పిల్లర్ ప్రమాదం.
షరామామూలే...
అబ్రకదబ్ర....(మినీ కవిత )
వెలవెల బోతోంది 
ఔనౌను...(మినీకవిత)
సామాజికవర్గం అలియాస్ కులం (మినీ కవిత)
ఇ(నా )న్ సెక్యు (లర్)రిటీ

మన'స్వభావం

ఇక్కడ 1 (మినీకవిత )

కట్టల పాములు

అసార్ధక నామధేయులు(మినీ కవిత)

కులం గుర్తు (మినీ కవిత )
వీథుల్లో చెత్తంతా 
 ---------------------------------------------------------------------------------------------------------- 

  

పరస్పర అవసరం

సీటిస్తే నీ పార్టీలోకి వస్తా!.",
సీటిస్తా 'రా!' నా పార్టీలోకి"
.... ..... ....
తిట్టినన్నాళ్ళు తిట్టి
చేరేవాడూ సిగ్గు పడటల్లేదు!
ఇన్నాళ్ళూ తిట్టించుకుని 
తిట్టినవాడ్ని చేర్చుకునేవాడూ సిగ్గు పడటల్లేదు!!
<<<>>> 

మత్తు కోసం
పార్టీలలో "ఆ" తీర్థం!
అధికార మత్తు కోసం
కొత్త పార్టీ తీర్థం!!
<<<>>>  
ఎన్నికల కోడ్ 
నాయకుల విగ్రహాలకు 
తొడిగారు ముసుగులు!
వినాయకులు నిగ్రహానికి
తొలగించారు ముసుగులు!!
 <<<>>> 
"సారా"౦శం
అన్నలు ఆలోచించాల్సింది 
మందుపాతరలు అమర్చి
బలిగొనడానికి కాదు;
బడుగుల్ని బలిగొంటున్న 
'
మందు పాత్ర'గూర్చి... 
<<<>>>  
లోకం "పోకడ  
పోయినోడి మంచి గూర్చి 
ఆ రోజే
తలపోస్తారు!

ఆ మరుసటిరోజు నుండి
చెడుగూర్చే 
తవ్విపోస్తారు !!
 <<<>>> 
పొత్తు పెటాకులు
నాడు
అన్యోన్యపు జంటలా
హత్తుకున్నారు పొత్తుల్తో!
నేడు
అనుమానపు దంపతుల్లా 
కత్తులు దూస్తున్నారు ఎత్తుల్తో!!
 <<<>>> 
పజిల్ 

నాడు అనుభవజ్ఞుడని
ఓట్లతో అందలమెక్కిచ్చారు
కమలదళం హోదాహామీ మరచి
ప్యాకేజీతో మభ్యపెట్టిందని
నమ్మబలుకుతున్నాడు
విపక్షం ఫిరాయింపుదారులకు
ఆశ్రయ వృక్షం అయ్యాడు.
ప్లేటు ఫిరాయించి
ప్రత్యేక హోదా రాగం ఎత్తుకున్న 
ఆ ఘనుడెవరయ్యా?!
<<<>>>  
జంపింగ్ జిలానీలు 
పదవి ఎరతో
ఆశలగేలానికి చిక్కిన
నాయకుడు!
పొగిడిన అధినాయకుడ్నే
తెగుడుతూ బలిసిన
మాయకుడు!!
సాకుల పోపుసామాను మాటలతో
పార్టీ ఫిరాయింపు
రాజకీయ తాలింపు!!!
<<<>>> 
 మేస్త్రి బాబు
అనుభవమున్న మేస్త్రినని
నమ్మబలికి గద్దెనెక్కాడు
పోల-వరం మూల-ధనం
రాజధాని నిర్మాణం
మాటల్లో అన్నీ ఘనం 
రెండు చేతులా ధనం 
దోపిడీలో క్రొత్తదనం-విధానం 
అధికార వర్గం 
అవినీతి దుర్గంధం
<<<>>>  
పెద్దనోట్ల రద్దు 
మరింత పెద్ద నోట్లు గుద్దు .
మునుపటిలా వెలుగులోకి 
నకిలీ నోట్లు
సామాన్యులకు తప్పని పాట్లు 
తరగని రేట్లూ 
పెరిగిన పన్ను పోట్లు
బడా బాబుల నల్ల ధనం 
పౌడరు పూసుకున్న ముఖంలా తెల్లనై
కొండను తవ్వారు 
కాని ....
ఎలుకనుకూడా పట్టలా !
<<<>>>  
పురిటి నొప్పుల్తో 
కొంగ్రొత్త పార్టీల ప్రసవ వేదన
పొత్తిళ్ళ లోనే 
ఇంకా మౌనంగా మరో పార్టీ
పొత్తుల ఎత్తులలో 
ఇంకొన్ని పార్టీలు
మంత్రసాని పాత్రలో
ఎన్నికల సంఘం
బలహీనంగా పుట్టి
బాలారిష్టాలతో 
సంకీర్ణ శిశువు నూతన ప్రభుత !!
<<<>>>  
మోదీ పాలన!
పన్నులు మోదే పాలన!!
మోళీ పాలన!!!
<<<>>>  
కాషాయం!
లౌకికదేశం గొంతుకలో
దిగజాలని కషాయమై!!
<<<>>>  
పిల్లర్ ప్రమాదం.
దేశ సమస్యలను విడిచి 
ప్రమాదంలో 
ప్రజాస్వామ్యపు
నాలుగో పిల్లర్ ! 
<<<>>>  
షరామామూలే...
నిన్న చీపురు కట్లతో...
నేడు ఎర్రబుగ్గలతో...
వి.ఐ.పి.ల ఫోటో ఫోజు!
వదలని సమస్యల బూజు!!
 <<<>>> 
అబ్రకదబ్ర....
నిన్నటి దాక
నగరం నిండా చెత్తా చెదారం! 
తెల్లరికల్లా 
తుడిచిన అద్దం!! 
- ఈ రోజు మంత్రి పర్యటన !!! 
<<<>>>  
వెలవెల బోతోంది 
జెండా పండుగ !
రెపరెపలాడుతోంది 
జెండాల పండుగ.!!
ఎన్నికల కాలం. 
రాజకీయ రైతుల 
స్వల్పకాల వాణిజ్య పంట!!!
<<<>>>  
ఔనౌను...
దేశం 
అభివృద్ధి చెందుతోంది.
కార్పోరేట్ ఎం.పి. అయ్యాడు!
రైతు - కూలీ అవుతున్నాడు !!
<<<>>>  
సామాజికవర్గం అలియాస్ కులం
పలుకులోనే
క్రొత్తదనాన్ని కోరుకుంటున్నాం.
నిర్మూలనలో
పాత పంథానే అనుసరిస్తున్నాం.
"
సామాజిక వర్గం" పదం 
"
కులం" పర్యాయపదమై కూర్చుంది!
<<<>>> 
నడిరోడ్డుపై 
దేవాలయాలేగాని ,
మసీదులు, చర్చీలు కాదు.

అవును 
ఇది హిందూ దేశమే!
ఎవడ్రా కూసింది
సెక్యులర్ దేశమని!!
<<<>>>  

మన'స్వభావం

దేవుడి
గుడి
రోడ్డు మధ్యలోనైనా సరే 
ఎవరికీ అడ్డులేనట్లు!

దరిద్రుడి 
గుడిసె 
రోడ్డుప్రక్కనైనా సరే 
ఎందరికో అడ్డన్నట్లు!!   
<<<>>> 
ఇక్కడ
రాసేది
దొంగ పద్దులు!
కూసేది
సుద్దులు !!
 
 <<<>>>  

కట్టల పాములు

బ్యాంకుల్లో వందల కట్టలే 
లభ్యం!
పెద్దనోట్లన్నీ పెద్దోళ్ళ పుట్టల్లో
సౌలభ్యం!!
<<<>>>  

అసార్ధక నామధేయులు

రక్షక భటులు.
అవినీతి నిరోధక శాఖ
న్యాయస్థానం..
 <<<>>> 
కులం గుర్తు

మనుషుల పేర్లలోనేకాదు 
సంఘాలకూ
రాజకీయ పార్టీలకూ 
పుట్టుమచ్చలా 
<<<>>> 

వీథుల్లో చెత్తంతా 
డంపింగ్ యార్డ్ లోకి 
ప్రజోపయోగాకరం !

బుర్రల్లోని చెత్తంతా 
సామాజిక మధ్యమాలలోకి 
ప్రమాదకరం !!
<<<>>>  
బాధ  కలిగించినా 
ఉద్యోగ బాధ్యతగా 
తలారి!
దోపిడీ అని తెలిసినా 
స్వలాభమే పరమావధిగా 
దళారి!!
 <<<>>>  
అరణ్యంలో
సకల జీవుల్నీ సంహరించేవి
సింహాలు!
జనారణ్యంలో
సామాన్యుల్ని హరించేవి
నర సింహాలు !!
<<<>>>  
అమీబాలు
పేరుకు
పేదల పార్టీ
పెత్తనం మాత్రం
పెద్ద కులపోళ్ళదే !!
 <<<>>>  
ఇ.వి.ఎమ్
ఒక్కసారినొక్కి
నాయకుడ్ని నిర్ణయిస్తారు
ప్రజలు

సంవత్సరాలపాటు నొక్కేస్తూ
ప్రజా ధనాన్ని మింగేస్తారు 
ప్రజా ప్రతినిధులు
 <<<>>> 
 "సం" క్షేమం
గోరుముద్దల
రుచి
వార్డెన్ పిల్లలవరకే!

పురుగులన్నం
పచి
హాస్టల్ పిల్లలకెరుకే!!
<<<>>>   
ఆ కలి
సిల్వర్  కలర్
దేశమంతా తెగ ఖర్చవుతుంది
ఆరాతీస్తే తెలిసింది 
ఆకలిలోంచి 
బాల గాంధీలు పుట్టుకొస్తున్నారని
<<<>>>        
తక్షణ  చికిత్స అవసరం
రోగులకు కాదు
అవినీతి జబ్బు పట్టిన
సర్కారు ఆసుపత్రులకు
-----------------

దబ్బున్నోడికే
ఎలక్షన్లో సీటు
గెలిచాక అవినీతే
వాడికిష్టమైన స్వీటు
 <<<>>> 
 (అ)మాయికులు
నాయకుల్ని విశ్వసిస్తూ
నష్ట పోయే ప్రజలు
ప్రజల్ని నమ్మిస్తూ
లాభపడే నాయకులు
<<<>>>   
కార్యాలయాలు
కాసులిస్తే చాలు
కాళ్ళు వస్తాయి ఫైల్స్ కి
ఫైల్స్ వచ్చేలా కూర్చొని
పనిచేస్తాయి.
అవి నీతికి ఆలయంగా 
ఉండాల్సింది  పోయి 
అవినీతి   కార్యాలయాలుగా
పనిచేస్తున్నాయి 
కాసుల ముందు అందరూ
దాసులే !
 <<<>>> 
నక్కలు - గొర్రెలు
లోటేలేదు
నక్కలకు 
అవివేకపు 
గొర్రెలున్నంత కాలం...
<<<>>>  
రాజకీయ నాయకుడు
ఓట్లతో
మనుషుల్ని 
కొలిచేవాడు 
<<<>>> 
రహస్య స్థావరం
ఉన్నట్టుండి 
కొందరు దొంగలు 
కనబడడం మానేశారు!
ఎన్నికలయ్యాక
స్థావరం మార్చారు ...
<<<>>> 
యుద్ధం 
కూలేవి
భవంతులు కావు 
బతుకులు!
<<<>>> 
గ్రేటిండియా
పన్నెండేళ్ళకోసారే
పవిత్ర  కుంభమేళ
రోజుకెన్నెన్నో
అపవిత్ర కుంభకోణాలు ...
<<<>>> 
రెడ్ లైట్ ఏరియా
అక్కడ ఎన్నెన్నో
ఆకలి కోరలలో చిక్కి
కామందుల నఖచ్చేదనతో
రక్తం ఒలుకుతున్న
మాంసపు ముద్దలు
ఓ ప్రమాద సూచిక కూడలిగా
(అ)సభ్య సమాజం పెట్టిన పేరు
 <<<>>>  
పేపరుకెక్కాడు
పేద రైతు పేరుకూడా
పేపర్లో పడింది
ఏదో సాధించాడని కాదు
కుదవపెట్టిన పెళ్ళాం పుస్తెలు
బ్యాంక్ వాళ్ళ వేలం ప్రకటనలో ...
<<<>>>  
అటెన్షన్
ఎన్నికల నోటిఫ్ కే షన్ కోసం
నిరుద్యోగుల నిరీక్షణ 
ఓటుహక్కు వినియోగం కోసం కాదు
ఉద్యోగ అవకాశాల
నోటిఫ్ కే షన్ కోసం...

<<<>>>   

సన్మాన పత్రం
గోరంత 
కొండంత
రూప'కల్పన

<<<>>>  

జీవితార్థం
జీవితాన్ని
గాయాల కొలబద్దతో 
కొలుచుకుంటూ పొతే
మరుభూమి గమ్యం 
చేరుకుంటావు
మాయని మచ్చల్ని
పాఠాలుగా పఠిస్తూ పొతే
జీవితార్థానికి
నిఘంటువు అవుతావు...

<<<>>>  

మతం గజ్జి
ఆలయ ప్రవేశం లేదంటారు
ఆదరించి చేరదీసినవాడ్ని అనుసరిస్తే
మత మార్పిడంటారు
మందేలేదేమో
వీళ్ళ జబ్బుకి
<<<>>> 
నీది
పదవుల పలుకుబడిని బట్టి
హెచ్చుతగ్గుల
షేర్ మార్కెట్ లాంటి  గౌరవం!

నాది
పెదవుల పలుకునుబట్టి
షేర్ లా నిలిచే
సహజ గౌరవం!!
<<<>>> 
కండీషన్స్ అప్లై

మీరు కోటీశ్వరులా
మీరెలా చచ్చినా
సచ్చింది మొదలు 
కాలి బూడిదయ్యేవరకు
సంప్రదించండి
ప్రత్యక్ష ప్రసారానికై
<<<>>> 
కార్పో’రేట్’
పేరు అంతర్యం తెలియక
చేర్చాక బావురుమంటున్నారు
కార్పోరేట్ విద్యాలయాల్లో
కార్పోరేట్ హాస్పిటల్లో
<<<>>> 
మంత్రి దాదా ఎం.బి.బి.ఎస్.
నాడు
డెంటల్ డాక్టర్ గా
రాణించలేదు
పన్ను పీకడం రాక

నేడు
ఆర్ధిక మంత్రిగా
రాణిస్తున్నాడు
వరుసపెట్టి పన్నులు పీకుతూ ...
<<<>>> 
థింక్ బిగ్
వాళ్ళను చూసి నేర్చుకోండి
ఎన్ని పెళ్ళిళ్ళైనా ...
ఒక తల్లి బిడ్డలు కాకున్నా ...
ఎంత అన్యోన్యంగా ఉన్నారో !

మీరెందుకో
బంధాలు అనుబంధాలు మరచి
బతుకు జట్కాను నడిపిస్తున్నారు ?
రచ్చబండకెక్కుతున్నారు??
<<<>>>> 
పెట్రోల్ ఉంటేనే
ముందుకు వాహనాలు

పథకాలు ఉంటేనే
మునుముందుకు ప్రభుత్వాలు
మండే గుణం
పెట్రోల్ ది !!
మాయబుచ్చే తత్వం
పథకాలది
 <<<>>>
హ్యుమనిస్ట్

ప్రాణాలు తీసే
ఫ్యాక్షనిస్ట్ కాదు ...
ఆశపెట్టి జెండాపట్టించి తిప్పుకునే
కమ్యూనిస్ట్ కాదు...
ఆడాళ్ళ హక్కులుగూర్చి మాట్లాడే
ఫెమినిస్టు కాదు...
హింసిస్తూ ఆనందించే
శాడిస్ట్ కాదు ...
.....................
లోకంలో విలువలేనోడు
<<<>>> 
వేరు వేరయ్య  
నీతంటే
అవినీతికి
భయమే!
న్యాయమంటే అన్యాయానికి అదురే!!
కాని లోకం
నీతిని కోరుతోంది;
అవినీతిని అనుసరిస్తోంది.
న్యాయం కోరుతోంది;
అన్యాయంగా నడుస్తోంది.
<<<>>> 
నీది
పదవుల పలుకుబడిని బట్టి
హెచ్చుతగ్గుల షేర్ మార్కెట్ లాంటి
  గౌరవం!

నాది
పెదవుల పలుకుల్నిబట్టి
షేర్ లా నిలిచే
ఆత్మగౌరవం!!
<<<>>> 
పిల్లర్ ప్రమాదం.
దేశ సమస్యలను విడిచి
ప్రమాదంలో
ప్రజాస్వామ్యపు
నాలుగో పిల్లర్
<<<>>> 
కార్పో’రేట్’
పేరులోని
విలువను పసిగట్టలేక
చేరాక గగ్గోలు పెడుతున్నారు
విద్యాలయాలు హాస్పటళ్ళలో   
చేర్చాక బావురుమంటున్నారు
విద్యాలయాలు, హాస్పిటల్లో
<<<>>> 
మంత్రి దాదా ఎం.బి.బి.ఎస్.
నాడు
డెంటల్ డాక్టర్ గా
రాణించలేదు
పన్ను పీకడం రాక

నేడు
ఆర్ధిక మంత్రిగా
రాణిస్తున్నాడు
వరుసపెట్టి ‘పన్నులు’ పీకుతూ ...
<<<>>> 
థింక్ బిగ్
వాళ్ళను చూసి నేర్చుకోరేం !
ఎన్ని పెళ్ళిళ్ళైనా ...
ఒక తల్లి బిడ్డలు కాకున్నా ...
ఎంత అన్యోన్యంగా ఉన్నారో !

వీళ్ళెందుకో
బంధాలు తెంపుకుంటూ
బతుకు జట్కాను నడిపిస్తున్నారు
రచ్చబండకెక్కుతున్నారు
<<<>>> 
పెట్రోలు ఉంటేనే
ముందుకు వాహనాలు.
పథకాలు ఉంటేనే
ప్రజల్లోకి అధికార పార్టీ !

మండే గుణం
పెట్రోల్ ది !!
దండే గుణం
పార్టీలది.
<<<>>>
 హ్యుమనిస్ట్
ప్రాణాలు తీసే
ఫ్యాక్షనిస్ట్ కాదు...
ఆశపెట్టి జెండాపట్టించి తిప్పుకునే
కమ్యూనిస్ట్ కాదు...
ఆడాళ్ళ హక్కులుగూర్చి మాట్లాడే
ఫెమినిస్టు కాదు...
హింసిస్తూ ఆనందించే
శాడిస్టూ కాదు...
.......................
లోకంలో విలువే లేనోడిలా
<<<>>> 
వేరు వేరయ్య  
నీతంటే అవినీతికి భయమే!
న్యాయమంటే అన్యాయానికి
అదురే!!
కాని అదేంటో ...
లోకం
నీతిని కోరుతోంది;
అవినీతిని అనుసరిస్తోంది.
న్యాయం కోరుతోంది;
అన్యాయంగా నడుస్తోంది.

No comments:

Post a Comment