ఎన్నికల సమయం . "ఎన్నో కలల" సమయం నాయకులకు. కలలలను సాకారం చేసుకోడానికి ఎత్తులు వేయని, పాచికలు వేయని నాయకుడు~పార్టీలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ప్రజాశాంతి పార్టీ మొదలుకొని ప్రధాన పార్టీల వరకు మా మానిఫెస్టో చూస్తే మీ ఓటు మాకే అంటూ ఊహల్లో తేలుతున్నారు . గత కొన్ని దశాబ్దాలుగా ఆయా పార్టీల మేనిఫెస్టోలను పరిశీలిస్తే అధికారంలోకివచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్నికలముందు సదరు పార్టీవారు ప్రజలముందు పెట్టిన మేనిఫెస్టో లలోని ఎన్నింటిని అమలుపరిచారో మనం అర్థం చేసుకోవచ్చు.
కొన్ని పార్టీ లైతే'మమ'అనిపించేందుకు నాలుగున్నర సంవత్సరాలు గడిచాక గాలికొదిలేసిన వాగ్దానాలు పోయినవి పోగా మేనిఫెస్టో లొ ఉన్నవాటిలో కొన్నిటిని మాత్రమే అరా కొరగా చెప్పుకోడానికి నామమాత్రంగా అమలుపరుస్తారు.
చదువులేని ఓటర్లే కాదు; చదువుకున్న ఓటర్లు సైతం మేనిఫెస్టో లను చదివి ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయించుకొని ఓటు వేస్తారని అనుకోవడం పొరబాటే శుష్క వాగ్దానాలను ఇచ్చే నాయకులను ప్రజలు ఎలా నమ్మడంలేదో అదేవిధంగా మేనిఫెస్టో లను ప్రజలు నమ్మడం లేదు .
"ప్రజలను మభ్యపెట్టి వంచించేందుకు మాటల గారడీతో మోసపుచ్చేందుకు కోటి ఆశలు రేకెత్తించి ఓట్లు దండుకొని అధికారాన్ని చేజిక్కించుకొని కోట్లు గడించేందుకు నెరవేరని హామీలతో మోసగించిన పార్టీని శిక్షించేందుకు ప్రజలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచినవే మేనిఫెస్టో లు.
No comments:
Post a Comment