ఉత్తరాలు. మధుర జ్ఞాపకాలు. ఇన్నిరోజులనుండి ఇవి భద్రంగా దాచాను. ఇప్పుడు ఇలా ఈ వెబ్ సైట్ లో పెట్టాలనిపించింది. కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తుంది. ఇందులో అనేక రకాల ఉత్తరాలు ఉన్నాయి. నా కవిత్వ రచనపై, సంపుటాలపై స్పందిస్తూ రాసినవి, నా వ్యాస రచన విధానం పై స్పందిస్తూ రాసినవి, ఇండియన్ హైకూ క్లబ్ కు స్థాపనపై స్పందిస్తూ రాసినవి, ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో నేను సంపాదకుడుగా నిర్వహించిన "హైకూ"సాహిత్య మాసపత్రిక గూర్చి రాసినవి. ఇలా వివిధ రకాల లేఖలు ఇందులో ఉన్నాయి.
Thursday, January 11, 2018
Monday, January 8, 2018
అనకాపల్లి హైకూలు
ఈ హైకూలు సుమారు 2003 లో రాసినవి. అనకాపల్లి ప్రాంతవాసులను ఈ హైకూలు అలరిస్తాయని భావిస్తున్నాను . నేను సాహిత్యానికి దూరమైపోతున్న క్రమంలో పాతవి వడ్డించి మరో సాహిత్య సృజనలో రూపాంతరం చెందాలని భావిస్తున్నాను . ఈ హైకూలు నచ్చితే కామెంట్ రాయగలరు ~ 'కవి'తలతోటి
కొండకర్ల ఆవ.
మనసుకు రెక్కలొచ్చి
వలసపక్షైపోయింది .
***
గోదావరి టు వైజాగ్ .
మబ్బుల్ని మోసుకెళ్తూ
ఏలేరు కాల్వ .
***
శారదా నది,
నిశ్చలంగా
బిడ్డనివీడలేని తల్లై ...
***
రగిలే పుటమి
ఆకలి అగ్నిని ఆర్పుకుంటూ
స్వర్ణకారులు
***
కళామ తల్లి
చల్లని ఒడి
~ కళా క్షేత్రం
***
నిభిడీకృతం
చేరుకుతోటల్లో
ఈ నేల తీపంతా !
***
బ్రతికే ఉంది
నాటకరంగం
~సాక్ష్యం మునగపాకే !
***
శారదానది నింగిలో
తేలాడుతూ మెరిసే తారలు
~కార్తీకమాసం
***
ఫోర్ రోడ్ జంక్షన్ లో
శిలై నెహ్రు
పూల తావికై !!
***
యదేచ్ఛగా తరలిస్తూ
నాటుబండ్లపై బంగారు దిమ్మెలు
~బెల్లం
***
ఐక్యతే మతం
ఊరి నడిబొడ్డున
~ పెద్దమసీదు
***
హైటెక్ యుగమే !
మనసుల దూరం తగ్గిస్తూ
సంతబజారు .
***
మనసుకు రెక్కలొచ్చి
వలసపక్షైపోయింది .
***
గోదావరి టు వైజాగ్ .
మబ్బుల్ని మోసుకెళ్తూ
ఏలేరు కాల్వ .
***
శారదా నది,
నిశ్చలంగా
బిడ్డనివీడలేని తల్లై ...
***
రగిలే పుటమి
ఆకలి అగ్నిని ఆర్పుకుంటూ
స్వర్ణకారులు
***
కళామ తల్లి
చల్లని ఒడి
~ కళా క్షేత్రం
***
నిభిడీకృతం
చేరుకుతోటల్లో
ఈ నేల తీపంతా !
***
బ్రతికే ఉంది
నాటకరంగం
~సాక్ష్యం మునగపాకే !
***
శారదానది నింగిలో
తేలాడుతూ మెరిసే తారలు
~కార్తీకమాసం
***
ఫోర్ రోడ్ జంక్షన్ లో
శిలై నెహ్రు
పూల తావికై !!
***
యదేచ్ఛగా తరలిస్తూ
నాటుబండ్లపై బంగారు దిమ్మెలు
~బెల్లం
***
ఐక్యతే మతం
ఊరి నడిబొడ్డున
~ పెద్దమసీదు
***
హైటెక్ యుగమే !
మనసుల దూరం తగ్గిస్తూ
సంతబజారు .
***
Sunday, January 7, 2018
Friday, December 29, 2017
Saturday, May 13, 2017
Friday, May 12, 2017
పరిమళ తరంగాలు - డా బెజవాడ గోపాల రెడ్డి పై తలతోటి పృథ్వి రాజ్ వ్యాసం
Subscribe to:
Comments (Atom)





























































