-->

Monday, January 8, 2018

అనకాపల్లి హైకూలు


ఈ హైకూలు సుమారు 2003 లో రాసినవి. అనకాపల్లి ప్రాంతవాసులను ఈ హైకూలు అలరిస్తాయని భావిస్తున్నాను . నేను సాహిత్యానికి దూరమైపోతున్న క్రమంలో పాతవి వడ్డించి మరో సాహిత్య సృజనలో రూపాంతరం చెందాలని భావిస్తున్నాను . ఈ హైకూలు నచ్చితే కామెంట్ రాయగలరు ~ 'కవి'తలతోటి
కొండకర్ల ఆవ.
మనసుకు రెక్కలొచ్చి
వలసపక్షైపోయింది . 
***
గోదావరి టు వైజాగ్ .
మబ్బుల్ని మోసుకెళ్తూ
ఏలేరు కాల్వ .
***
శారదా నది,
నిశ్చలంగా
బిడ్డనివీడలేని తల్లై ...
***
రగిలే పుటమి
ఆకలి అగ్నిని ఆర్పుకుంటూ
స్వర్ణకారులు
***
కళామ తల్లి
చల్లని ఒడి
~ కళా క్షేత్రం
***
నిభిడీకృతం
చేరుకుతోటల్లో
ఈ నేల తీపంతా !
***
బ్రతికే ఉంది
నాటకరంగం
~సాక్ష్యం మునగపాకే !
***
శారదానది నింగిలో
తేలాడుతూ మెరిసే తారలు
~కార్తీకమాసం
***
ఫోర్ రోడ్ జంక్షన్ లో
శిలై నెహ్రు
పూల తావికై !!
***
యదేచ్ఛగా తరలిస్తూ
నాటుబండ్లపై బంగారు దిమ్మెలు
~బెల్లం
***
ఐక్యతే మతం
ఊరి నడిబొడ్డున
~ పెద్దమసీదు
***
హైటెక్ యుగమే !
మనసుల దూరం తగ్గిస్తూ
సంతబజారు .
***

No comments:

Post a Comment