-->

Monday, October 3, 2022

కరెస్పాండెంట్ కు తీరిపోయిన ముచ్చటైన మూడు కోర్కెలు_A.M.A.L.COLLEGE_ANAKAPALLI_Talathoti Prithvi Raj

 2016 నుండి అనకాపల్లి, ఏ.ఎమ్.ఏ.ఎల్ కాలేజీ మేనేజ్మెంట్, మరిముఖ్యంగా 2018 నుండి కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు గారు నాపై మూడురకాలైన ప్రయోగాలు చేసి తోటి మేనేజ్మెంట్ సభ్యులకు, వర్తకులకు, కళాశాలలోని సిబ్బందికి, కాలేజీ విషయాలను అనుసరించే బయటి వారికి ప్రయోగ ఫలితాలను చాటిచెప్పారు. ఆ ఫలితాలు ఏమిటంటే..‌. సస్పెన్షన్, సరెండర్, డిస్మిసల్ కాంపిటెంట్ అథారిటీ అనుమతిలేకుండా చేయ్యకూడదని, అలా చేసినవి చెల్లవని రుజువు చేశారు. వీరి నిరాధార - కక్షపూరిత చర్యలపై ఉన్నతాధికారులు వీరు కోరుకునే రీతిగా చెయ్యరు కనుకనే వీరికి అధికారాలున్నాయని కాలేజీలో, ఊళ్ళో గొప్పలు చెప్పుకుని నా విషయంలో వారు చేసిన ప్రతిదీ రివర్స్ కావడం జరిగింది. ఒక మీటింగ్ లో సదరు కరస్పాండెంట్ చెప్పిన ఆ సస్పెన్షన్ పొడిగింపు...సరెండర్, డిస్మిసల్ అంశంపై ఎలా మాట్లాడారో వినండి! ఈ మూడూ నాపై ప్రయోగించి విఫలమయ్యారు. అధికారుల కాళ్ళావేళ్ళా పడి కొనసాగించుకోగలుగుతున్నారు. కాని చెల్లుబాటు కాని వారి తీర్మానం సంతకాల్లాంటివే వారి నిర్ణాయలన్నది నగ్న సత్యం. నిరూపితం! ఈవిధంగా ముచ్చటైన మూడు కోర్కెలు తీరిపొయాయి

No comments:

Post a Comment