-->

Monday, October 3, 2022

రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ సి.కృష్ణగారు నా డిస్మిసల్ సమస్యను పరిష్కరించాలి|A.M.A.L.College,Anakapalle

 01-09-2022వతేదీ అనకాపల్లి, ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల మేనేజ్మెంట్ చట్ట విరుద్ధంగా, అధికారుల అనుమతి లేకుండా చేసిన నా సర్వీస్ డిస్మిసల్ చెల్లదని, నన్ను విధుల్లోకి తీసుకోవాలని కళాశాల కరస్పాండెంట్ ను ఆదేశిస్తూ రాజమహేంద్రవరం ఆర్జేడీ 20-09-2022వతేదీ జారీచేసి నాకు పంపిన ఉత్తర్వులను బట్టి నా జాయినింగ్ రిపోర్ట్ తో అదేరోజు నేను నా విధుల్లో చేరుటకు కళాశాలకు వెళ్ళగా, కళాశాలవారు నన్ను చేర్చుకోలేదు. ఆర్జేడీ ఆదేశాలను మేనేజ్మెంట్ ధిక్కరిస్తూ నన్ను విధుల్లోకి చేర్చుకోకుండా జాప్యం చేయడానికే గవర్నింగ్ బాడీ సమావేశానికి సమయం కావాలని కోరుతూ కరస్పాండెంట్ 21-09-2022వతేదీ ఆర్జేడీ గారికి లెటరు రాసారు. మేనేజ్మెంట్ సమయం కోరడాన్ని అనుమతించవద్దని నేను ఆర్జేడీ గారికి 23-09-2022వతేదీ లేఖను రాయగా, కరస్పాండెంట్ ను రెండోమారు ఆర్జేడీ 24-09-2022వతేదీ అదే ఉత్తర్వును హెచ్చరిస్తూ పంపించారు. రెండవసారికూడా నేను నా జాయినింగ్ రిపోర్ట్ తో కళాశాలకు వెళ్ళగా నన్ను వారు విధుల్లో చేర్చుకోకుండా 26-09-2022తేదీ గవర్నింగ్ బాడీ సమావేశం అనంతరం నా జాయినింగ్ పై వారి అభిప్రాయం తెలియజేస్తారని ఆర్జేడీ గారికీ, నాకూ కరస్పాండెంట్ తన లేఖ ద్వారా తెలిపారు. కరస్పాండెంట్/ మేనేజ్మెంట్ వారు చెప్పినట్లే 26-09-2022న గవర్నింగ్ బాడీ సమావేశం ముగిసిన తర్వాత కూడా నాకు ఏ సమాచారం చెప్పకుండా, నా జాయినింగ్ కు అనుమతివ్వకుండా, ఈ విషయాన్ని మరికొంతకాలం పొడిగించడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ సాకుతో నాకు జీతాలు చెల్లించకుండా ఆర్థికంగా వేధిస్తున్నారు. ఇందుకు ఆర్జేడీ మున్నగువారి పూర్తి సహాయ - సహకారాలు మేనేజ్మెంట్ వారికి అందిస్తున్నారుగానీ..., నిబంధనలకు విరుద్ధమైన మేనేజ్మెంట్ చర్యలపై, అధికారుల ఆదేశాలను ధిక్కరించిన దానిపై కమీషనర్, ఆర్జేడీలు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

20-11-2019వ తేదీ కూడా ఇదే మేనేజ్మెంట్ ఆర్జేడీ అనుమతిలేకుండా నాడు సరెండర్ సాకుతో నన్ను విధుల్లోకి రాకుండా, 73రోజులు జీతాలు ఇవ్వకుండా ఆర్థికంగా వేధించారు. సరెండర్ చెల్లదని, నన్ను విధుల్లోకి తీసుకోమని కమీషనర్ Memo No.45/Admn.I/2019 అనే లేఖ ద్వారా 28-11-2019వతేదీన ఆదేశించినా 31-01-2020వరకు నన్ను ఇప్పటిలాగే విధుల్లోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ వేధించి చివరికి అధికారుల సహకారంతో పెరుమాళ్ళపురం ప్రభుత్వ డిగ్రీకళాశాలకు అక్రమంగా నన్ను బదిలీ చేయించారు.

No comments:

Post a Comment