ఈరోజుల్లో అస్పృశ్యత, అంటరానితనం ఎక్కడుందని చాలామంది అంటూ ఉంటారు. నాటి అనాగరిక సమాజంలో దళితుల్ని ముట్టుకుంటే మైలపడిపోతారన్నట్లు... వారి అడుగుల్లో అడుగులు వేసినా మైలపడిపోతారని మా దళితులపట్ల రాక్షసంగా ఈ సమాజం చాలానే చేసింది. వాళ్ళు అంటరానివారన్నట్లు కొన్ని శతాబ్ధాలపాటు దళిత జాతిని వేధించారు. అవమానపరిచారు. హక్కుల్ని హరించారు. అస్పృశ్యత, అంటరానితనం కాలానికి తగినట్లుగానే కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అటువంటి భావజాలం కలిగిన వాళ్లు కూడా ఈ ఆధునిక కాలంలో ఇదే అంటరానితనానికి కొత్త రూపాన్ని తొడుగుతారు అంటరానితనాన్ని ప్రదర్శించే వైతిళికుల్లా!. అలా అస్పృశ్యత కు, కుల దూషణకు కొత్త రూపాన్ని తొడిగినటువంటి వైతాళికులే ఏ.ఎమ్.ఎ.ఎల్. కళాశాల కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు. ఇప్పటిది రాకెట్ యుగమే అయినా దళితులు అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి కొందరు ఓర్చుకోలేక వారి అసూయ, ద్వేషాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ల చేష్టలు, హావభావాలు, రాతలతో వాళ్ళ అక్కసును వెళ్లగక్కుతుంటారు. అందుకే ఇవన్నీ ఎస్సీ- ఎస్టీ అట్రాసిటీ చట్టంలో పొందుపరిచి ఈ రకంగా ఎలా ఎవరు దళితుల పట్ల వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. విద్యాలయంలో అర్హత లేనివారిని ఉన్నత స్థానంలో కూర్చోబెడితే వాళ్ళ కులతత్త్వాన్ని ఇలాగే ప్రదర్శిస్తారు. మనుషులు మారాలి! మనసులు మారాలి!!
No comments:
Post a Comment