-->

Thursday, November 3, 2022

అవి-నీతిమయమైన కాలేజీయేట్ ఎడ్యుకేషన్ అధికారులు_కమీషనర్_ఆర్జేడీ

 



విద్యా చట్టాల్ని అమలు పరచాల్సిన ఏ.పి. కాలేజీయేట్ ఎడ్యుకేషన్ అధికారులు, విద్యా చట్టాలన్ని ధిక్కరించిన అనకాపల్లి, ఏ. ఎం. ఏ.ఎల్. కాలేజీ మేనేజ్మెంట్ తో లాలూచిపడి వ్యవహరిస్తున్నారని రాజమండ్రి ఆర్జేడీ డా॥ సి. కృష్ణ, కమీషనర్ డా॥పోలా భాస్కర్ గారు నా డిస్మిసల్ విషయం రెండునెలలైనా సమస్యను పరిష్కరించని వారి మౌనం ద్వారా నిరూపించారు. కాలేజీయేట్ ఎడ్యుకేషన్లోని అధికారులైన కమీషనర్,ఎ.డి.,డి.డి.,జె.డి, ఆర్జేడీలు అవినీతికి, లంచాలకు తావులేకుండా ఎంత నిజాయితీగా, ఎంతో పారదర్శకంగా వారి విధులను నిర్వర్తిస్తుంటారో ఈ శాఖతో సంబంధమున్న ఉద్యోగులందరికీ తెలిసిన విషయమే. ఎవరేమనుకున్నా ఈ అధికారులు వారు నిర్ధేశించుకున్న లక్ష్యాలను లక్ష-ణంగా సంపాదించడమే వారి ప్రథమ కర్తవ్యమని బాగా తెలిసిన అధికారులు.

(01) 01-09-2022 అనకాపల్లి, ఏ.ఎం.ఏ.ఎల్. కాలేజీ మేనేజ్మెంట్ ఏ.పి. ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982, సెక్షన్ 79( 1) కు విరుద్ధంగా, కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా నన్ను నా సర్వీస్ నుండి డిస్మిస్ చేశారు.
(02) 06-09-2022 కమీషనర్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను. మేనేజ్మెంట్ అపాయింటింగ్ అథారిటీ అనీ.., కమీషనరేట్ వారు కేవలం జీతాలు ఇచ్చేవారు మాత్రమే అని కమీషనర్ సెలవియ్యడం జరిగింది.
(03) కమీషనర్ కాలేజీ మేనేజ్మెంట్ తో చేతులు కలిపారని, లాలూచీ పడ్డారని అర్థమయి 06-09-2022వ తేదీనే లాయరుకు కేసు అప్పగించడం జరిగింది.
(04) 16-09-2022న అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష ద్వారా అధికారుల అకృత్యాలను చాటాలని నేను దీక్ష లో కూర్చోవడం జరిగింది.
(05) 20-09-2022న కాలేజీ వారు జారీచేసిన డిస్మిస్ ఆర్డర్ చెల్లదని, నన్ను విధుల్లో కొనసాగించాలని ఆర్జేడీ ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. నేను నా జాయినింగ్ రిపోర్ట్ తో చేరడానికి ప్రయత్నించగా వారు అధికారుల అండదండలు ఉన్న మేనేజ్మెంట్ నన్ను చేర్చుకోలేదు. తాత్కాలికంగా కేసు ఫైలింగ్ అపమని లాయర్ గారికి చెప్పాను.
(06) అధికారుల సహకారంతో, సలహాతో 21,28-09-2022న కళాశాల కరస్పాండెంట్ నన్ను చేర్చుకోవడంలో సమయాన్ని కోరుతూ ఆర్జేడీ కి ఎత్తుగడలతో లేఖ రాశారు.
(07) 13-10-2022న డాక్టా నాయకులతో కమీషనర్ ను కలిసి పరిణామాలను వివరించాము. ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టంలోని కృష్నుడ్లా వెంటనే ప్రత్యక్షమై చీరను ప్రసాదించినట్లు నాకు న్యాయం ప్రసాదించలేనట్లు చెప్పారు కమీషనర్ గారు. నా ఒక్కడికే తాను కమీషనర్ కాదని కూడా చెప్పారు. సమస్యను పరిష్కరించడానికి సమయం కావాలని కోరారు. డిస్మిస్ సాకుతో మేనేజ్మెంట్ నా విధులను అడ్డుకుని రెండు నెలలు గడిచినా, రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా మేనేజ్మెంట్ వేధిస్తున్నా కమీషనర్ నా సమస్యను పరిష్కరించలేదు. పరిష్కరించే దిశగా వారి ప్రయత్నాలు లేవు. అయినా... నాకు న్యాయం జరిగేవరకు ఈ పోరాటం ఆపను; ఆగదు!

No comments:

Post a Comment