-->

Sunday, September 18, 2022

తెలుగు తక్కువ-కాలేజీ

https://youtube.com/shorts/qf2CL5C7Fzg?feature=share

పేరులోనే ఉన్నత విద్య. ఉత్తుత్తి విద్యా విధానంగా అధికారులు తయారు చేస్తూ ప్రభుత్వ ఆశయాలను నీరుగారుస్తున్నారు. అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కాలేజీ లో సంస్కృతం బోధించే అధ్యాపకుల విద్యార్హత వివరాలు ఆర్టిఐ ద్వారా అడిగితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో "కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ " ఉండి కూడా తమ అఫిలియేటెడ్ కాలేజీలలో ఏ సబ్జెక్టును ఏ విద్యార్హత గలవారు బోధిస్తున్నారో వారి దగ్గర ఉండాల్సిన సమాచారం లేకపోవటం విచారకరం. ఇదీ కళాశాలల పర్యవేక్షణ. సిడిసి దుస్థితి. కాలేజీలో సంస్కృతం బోధించే అధ్యాపకులలో ఎం.ఎ. సంస్కృతం చదివిన వారు ఒక్కరే! మిగతా ఇద్దరూ పి.జి. తెలుగు చదివినవారే!

ఏ.ఎం.ఏ.ఎల్ కాలేజీలో తెలుగు సబ్జెక్ట్ వర్క్ లోడ్ గూర్చి, బోధించే అధ్యాపకుల విద్యార్హత వివరాలు గూర్చి, అధికారుల అనుమతి లేకుండానే సంస్కృతం సబ్జెక్ట్ ను నిర్వహించుకోవడం గూర్చి రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) రాజమహేంద్రవరం వారిని ఆర్టిఐ ద్వారా కోరితే వారి వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన సమాచారం కూడా లేక అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కాలేజీ నుండి తెప్పించుకుని ఇచ్చే దుస్థితిలో ఆర్జేడీ అధికారులు ఉన్నారు.
ఏ.ఎం.ఏ.ఎల్ కాలేజీలో తెలుగు సబ్జెక్ట్ వర్క్ లోడ్ గూర్చి, బోధించే అధ్యాపకుల విద్యార్హత వివరాలు గూర్చి, అధికారుల అనుమతి లేకుండానే తెలుగు తీసివేసి సంస్కృతం సబ్జెక్ట్ ను నిర్వహించుకోవడం గూర్చి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వారిని ఆర్టిఐ ద్వారా కోరితే అరా కొర సమాచారం ఇచ్చి అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కాలేజీ వారు 2020-2021 విద్యాసంవత్సరం ఎటువంటి యూ.జి. అన్ ఎయిడెడ్ ప్రోగ్రామ్ మంజూరు చేయలేదని తెలియజేశారు.
పెరుమాళ్ళపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఏ.ఎం.ఏ.ఎల్ కాలేజీకి లో నేను వచ్చింది మొదలు తెలుగు సబ్జెక్ట్ వర్క్ లోడ్ తీసివేసి నన్ను దూరంగా మరో కాలేజీ కి మార్చే వ్యూహం లో భాగంగా నా పై కక్షతో, కాలేజీ విద్యార్థులు ఏమైపోయినా ఫర్వాలేదని నా తెలుగు ఎయిడెడ్ పోస్ట్, తెలుగు సబ్జెక్ట్ ఉండగా అధికారుల అనుమతి లేకుండా తెలుగు తీసివేసి సంస్కృతం పెట్టి పిల్లల్ని బలవంతంగా కూర్చోబెట్టి నిర్వహిస్తున్నారు కాలేజీ మేనేజ్మెంట్. 95% కంటే ఎక్కువగా తెలుగు విద్యార్ధులు పాసయ్యే వారు. ఇప్పుడు సంస్కృతం పాసయినవారు 40%
ఇంత జరుగుతున్నా, నేను అనేక లేఖలు ద్వారా కళాశాలలో తెలుగు వర్క్ లోడ్ గూర్చి, సంస్కృతం సబ్జెక్ట్ అనుమతి లేకుండా మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న విషయాలు తెలియజేసినా వచ్చి విచారించిన ఆర్జేడీ, కమీషనర్ కార్యాలయం అధికారులే లేరు! రెండు సంవత్సరాల నుండి నన్ను కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారని, నన్ను 42జి.వొ. ద్వారా వేరే కళాశాలకు మార్చమని తెలియజేసినా స్పందించని కమీషనర్ కాలేజీ మేనేజ్మెంట్ వారు నాపై కక్ష సాధింపుగా చేసే చట్టవ్యతిరేకమైన పనులకు మేనేజ్మెంట్ కు తన పూర్తి సహాయ - సహకారాలు అందజేస్తున్నారు.
విద్యా వ్యవస్థను పరిరక్షించడంలో కంటే, మేనేజ్మెంట్ వారు నన్ను శిక్షించడంలో తన సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు. ఈ కాలేజీ పై తన పర్యవేక్షణ లేకపోగా, కళాశాల రూల్స్ కు విరుద్ధమైన చర్యలపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ, మురిసిపోతూ తన మద్దతు ప్రదర్శిస్తున్నారు కమీషనర్ గారు.

No comments:

Post a Comment