-->

Tuesday, May 5, 2020

Wednesday, April 29, 2020

కమీషనర్ వంటి అధికారుల ఆదేశాలను సైతం లెక్కలేని అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల యాజమాన్యం


కళాశాల యాజమాన్యం పైఅధికారుల ఆదేశాలను తూ.చా. తప్పక తక్షణమే అమలు చేసేవారిలా అధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తారు అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాల యాజమాన్యం. అందుకొరకు సదరు ఉద్యోగి పై కక్ష సాధిస్తూ... వేధిస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు అందిస్తారు.
ఉదాహరణకు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను నిబంధనలకు విరుద్ధంగా కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి సరెండర్ చేస్తున్నట్లు 7 /11/ 2019 న రాసిన లేఖ లోని 2వ పేజీ లోని 3వ పాయింట్:
"As per the orders issued by C.C.E., he revoked to discharge his duty on 4-5-2016" అని రాశారు. 
కాని నిజమేమిటీ?
(1) 26/11/2015న కాలేజీ కి సంబంధించని తప్పుడు కేసు విషయంలో కళాశాల యాజమాన్యం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను సస్పెండ్ చేశారు. 
పృధ్విరాజ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి చేర్చుకోమని కమీషనర్ 15/3/2016న ప్రొసీడింగ్ ఇస్తే చేర్చుకోకుండా కళాశాల యాజమాన్యం పృథ్విరాజ్ ను తిప్పిస్తూ ఉండగా- కమీషనర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ కళాశాల యాజమాన్యం తనను చేర్చుకోకుండా వేధిస్తున్న తరుణంలో 19/ 4/ 2016 న ఏ.పి. ఎస్సీ-ఎస్టీ కమిషన్ కు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా 26/4/2016 న రాజమహేంద్రవరం ఆర్జేడి వారికి కమీషనర్ రివోక్ ప్రొసీడింగ్ పంపినాకూడా కళాశాల యాజమాన్యం తనని కళాశాల విధుల్లోకి తీసుకోవడం లేదని పృథ్వీరాజ్ ఫిర్యాదు చేశారు. 

కమీషనర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ కళాశాల యాజమాన్యం తనను విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుందని 19/4/ 2016న ఏ.పి ఎస్సీ- ఎస్టీ కమీషనర్ కు పృథ్వీరాజ్ ఇచ్చిన ఫిర్యాదుకు వారు స్పందించి 27/4/2016 న కళాశాలకు ఎస్సి-ఎస్టి కమీషన్ వారు లేఖను పంపించారు.
26/4/2016న పృథ్వీరాజ్ ఆర్జేడీ వారికి చేసిన ఫిర్యాదుకు స్పందించి వారు 29/4/2016న పృథ్వీరాజ్ ను చేర్చుకొమని వారు కూడా మరొక ప్రొసీడింగ్ పంపించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యం 4/5/2016న డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను కళాశాల విధుల్లోకి చేర్చుకున్నారు. 
అంటే డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ సస్పెండ్ ను కమీషనర్ రివోక్ చేసిన 15/3 /2016 నుంచి చేరిన 4/ 5/2016 వరకు అంటే 50 రోజులకుగాని డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను కళాశాల యాజమాన్యం విధుల్లోకి తీసుకున్నారు. ఇదీ! కళాశాల యాజమాన్యానికి కమిషనర్ ఆదేశాల పై ఉన్న గౌరవం!!

   





ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల యాజమాన్యం వారి కల్పనాత్మక సరెండర్ రిపోర్ట్ కథ

ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల యాజమాన్యం వారి కల్పనాత్మక సరెండర్ రిపోర్ట్ కథ 

ఒక వ్యక్తి గిట్టకపోతే మంచివాడిని చెడ్డోడు అని నింద వెయ్యడం పెద్ద పనికాదు. పాపం నాలుకదేముంది ఎలా తిరగమంటే అలా తిరుగుతుంది . అలాగే పెన్నుదేముంది మనం ఏం రాయాలనుకుంటే దానిచేత అలా రాయగలుగుతాం. సరిగ్గా నా సరెండర్ రిపోర్ట్ కూడా అలాగే రాశారు. నేను ఉద్యోగంలో చేరిన 2000 మొదలు 2015 ముందువరకు ఇదే కళాశాల యాజమాన్యానికి ఉత్తముడిని, ప్రతిభావంతుడ్ని.  ప్రశంసించబడిన ఇదే యాజమాన్యానికి ఇప్పుడు దుర్మార్గుడనైపోయాను.  ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా యాజమాన్యం చేసే పనిని ప్రశ్నించకుండా చెయ్యడానికి అనేకరకాలుగా ఆర్థిక ఇబ్బందులను సృష్టించారు యాజమాన్యం టీమ్. నా ఆర్థిక ప్రయోజనాలను అడ్డుకున్నారు. అయినా నా ప్రశ్నించే తత్వం ఆగలేదు . నా మీద ఉన్న దొంగ కేసును అడ్డుపెట్టుకొని వారిని కళాశాలకు రప్పించి ఫోటోలు తీయించి గొడవ సృష్టించి ఏదో చేద్దామనుకున్నారు . కుదరలేదు . ఆపై ఉమెన్ హెరాస్మెంట్ కేసు నాపై పెట్టిద్దామని స్థానిక రాజకీయ నేతను అడ్డుపెట్టుకొని మద్దతుకోసం ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నం విరమించారు. ఇవేవీ కుదరక చివరాఖరికి సరెండర్ కథకు శ్రీకారం చుట్టారు .








"Due to unforeseen events taken place in the college by Dr.T. Prithvi Raj, Lecturer in Telugu, the college reputation was spoiled."

"The following cases (disturbances) created him." అని నాలుగు పేజీల రిపోర్ట్ ను రిపోర్ట్ ను తయారుచేసి కమీషనర్ గారికి సమర్పించారు.


కాలేజీకి సంబంధించని ఇష్యూ.  గృహనిర్మాణ విషయంలో డబ్బులు దండుకుందామని బయటివారు నాపై పెట్టిన 306 దొంగకేసును పెట్టారు. 13/12/2015న అప్పటి కరస్పాండెంట్ శ్రీ మళ్ల సత్యనారాయణ గారు కేసు వాస్తవ విషయాలను గ్రహించి నన్ను విధుల్లోకి   తీసుకోవడానికి కమీషనర్ గారికి పై విధంగా లేఖను రాశారు. రెండేళ్లకోసారి కరస్పాండెంట్ మారే సిస్టం ఏ. ఎం.ఏ.ఎల్. కళాశాలది. కమీషనర్ ప్రొసీడింగ్స్ ను ధిక్కరించి 50 రోజులపాటు నన్ను తిప్పించి, నన్ను అనేకరకాలుగా ఇబ్బంది పెట్టి విధిలేని పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకున్నారు. ఆనాటి నుండి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆర్థికంగా నష్ట పరుస్తూనే ఉన్నారు.    

రికార్డ్స్   వాస్తవ విషయాలను వెల్లడించే రిజిస్టర్ లు ఫోటో తీస్తే అది టాంపరింగ్ అట !


3వ పాయింట్:
 "నీ కేసు క్లియర్ అయితే సస్పెన్షన్ పిరియడ్ ను మేమే ర్యాటీఫై చేయాలి జాగ్రత్త "అంటూ మీటింగ్ లలో కరస్పాండెంట్ నన్ను బెదిరించడం చేశారు. అంటే యాజమాన్యం ఏ విషయాలపై నన్ను ప్రశ్నించకుండా చెయ్యడానికి నా నోరు నొక్కేందుకు  ప్రయత్నం చెయ్యడం కాదా!
4 పాయింట్:
వల్గర్ లాంగ్వేజ్ లో యాజమాన్యంపై నేను పోస్టులు పెట్టాను అని రాశారు. కవిగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా నేను  సామాజిక మాధ్యమాలలో  పోస్టులు పెట్టినవి వారికి ఆపాదించుకుంటున్నారు. ఎవరి పేర్లు పెట్టి , ఏ వల్గర్ లాంగ్వేజ్ లో నేను పోస్ట్ లు పెట్టానో యాజమాన్యం నిరూపించాల్సి ఉంటుంది. 

5వ పాయింట్ :
కళాశాల రికార్డులలో పార్ట్ టైం అధ్యాపకులని రాసి ఎన్.సి.సి. పేర్లు ప్రపోజ్ చేస్తూ పంపే డాక్యుమెంట్లలో పార్ట్ టైం  లెక్చరర్స్ అని రాయకుండా లెక్చరర్స్ (పర్మినెంట్ లెక్చరర్ అని అధికారులు అనుకునేలాగా) మరియు " ఫుల్ టైం అన్ ఎయిడెడ్ లెక్చరర్" అని కళాశాల ప్రిన్సిపాల్ ~ కళాశాల యాజమాన్యం రాసి పంపించడం తప్పు కదా? వారు ఎయిడెడ్ లెక్టరర్స్ కాదు ;  టైం లెక్చరర్స్ మాత్రమే అని నిరూపించే అటెండెన్స్ రిజిస్టర్ లోని వారి సంతకాలతో కూడిన పేజీని ఫోటో తీయడం ట్యాంపరింగ్ ఎలా అవుతుంది?
 వైట్ ఫ్లూయిడ్  పెట్టి అటెండెన్స్ రిజిస్టర్ లను, రికార్డులను ఎవరు ట్యాంపరింగ్ చేస్తున్నారో అధికారులు పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు. 

6వ పాయింట్:
మేనేజ్మెంట్ అండర్ టేకింగ్ లెటర్లు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ తేదీల్లో కళాశాల అధ్యాపకులనుండి తీసుకున్నారో వివరిస్తాను. అధికారులను తప్పు దోవ పట్టించడానికి వీటిని ఎలా ఉపయోగించుకుంటారో అందరూ గ్రహించాలి. ఆన్ లైన్ లో సి.ఏ.ఎస్. వివరాలను అప్లోడ్ చేస్తున్న సందర్భంలో అధ్యాపకులందరిచేత బలవంతంగా ఒక అండర్ టేకింగ్ లెటర్ రాయించుకున్నారు. అది ఇస్తేనే సి.ఏ.ఎస్. వివరాలను అప్లోడ్ చేస్తామని విడివిడిగా కళాశాలలోని అధ్యాపకుల అందరిచేత అండర్ టేకింగ్ లెటర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. 11/05/2017న అటువంటి అండర్ టేకింగ్ లెటర్ పై సంతకం పెట్టించుకున్నాకేసి.ఏ.ఎస్. వివరాలు అప్లోడ్ చేశారు.  నేను ఏదో తప్పు చేస్తే నేను మాత్రమే వారికి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చినట్లు అధికారులను తప్పుదోవపట్టించే ఉద్దేశంతో యాజమాన్యం ఈ విషయాన్ని నా సరెండర్ రిపోర్టులో పేర్కొని దానిని ఈక్రింది విధంగా జతపరిచారు.


సి.ఏ.ఎస్. ఇంటర్వ్యూలు పూర్తి అయిపోయి ప్రొసీడింగ్స్ వస్తున్న సమయంలో అనగా 4/4/2018 న ఒక పేపర్ పై మరో అండర్ టేకింగ్ గా అధ్యాపకులందరి సంతకాలు క్రింది విధంగా  తీసుకున్నారు.






10,14 వరుస తేదీలలో 7,000  8,000   9,000   10,000 ప్రొసీడింగ్స్ వచ్చాయి

7వ పాయింట్ :
ఏడవ పాయింట్ గత విద్యా సంవత్సరం అంటే 2018-2019లో దళిత అధ్యాపకులు అందరిని ప్రేరేపిస్తూ  కులతత్వాన్ని సృష్టించానట!  నా నోట ప్రతి పదం దళిత అనే పదంతో కూడుకుని ఉంటుందట.  కులతత్వం యాజమాన్యానికి ఉన్నది కనుకనే  ఎన్ .సి.సి., హాస్టల్ వార్డెన్, ఎన్.ఎస్.ఎస్. వంటి బాధ్యతలు ఎయిడెడ్ అధ్యాపకులకు ఇవ్వాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్ధం గా పార్ట్ టైం అధ్యాపకులను నియమించారు. అందునా యాజమాన్యం కులానికి సంబంధించిన అధ్యాపకులకు అధ్యాపకులకే బాధ్యతలు అప్పజెప్పారు . 

9వ పాయింట్ :
యాజమాన్యానికి క్యాస్ట్ ఫీలింగ్ లేదన్నట్టు రాసుకొచ్చారు నా సరెండర్ రిపోర్టులో. నేటికి ఉన్న 15 మంది ఎయిడెడ్ అధ్యాపకులలో నలుగురు మినహాయించి అందరూ ఎస్సీ అధ్యాపకులే! విధిలేని పరిస్థితుల్లో ఈ బాధ్యతలు అప్పచెప్పారు.  అందరూ సక్రమంగానే చేశారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా సీనియర్ అయిన దళిత అధ్యాపకుడైన శ్రీ  రవీంద్ర ప్రసాద్ గారికి ఆనాడు ప్రిన్సిపాల్ షిప్ ఇచ్చారా?

10వ పాయింట్ :
కళాశాలకు వచ్చే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులు అంటున్నారు.  అటువంటి వారి వద్ద నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాండోనేషన్ పేరుతో యాజమాన్యం కాలేజీ డెవలప్మెంట్  రసీదు ఇస్తూ 500 రూపాయల 20% , 30% హాజరు ఉన్న విద్యార్థులనుండి బలవంతంగా వసూలు చేస్తున్నది నిజం కాదా?

11వ పాయింట్ :
15/10/2019వ తారీకు సాయంత్రం ఆపరేషన్ చేయించుకున్నాను. 16న సెలవు పెట్టి ఇంటివద్ద విశ్రాంతి తీసుకున్నాను.  17న కళాశాలకు రైలు ప్రయాణం చేసి వెళ్లి వాంతులు, తలనొప్పితో ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇబ్బంది పడ్డాను.  డాక్టర్ సూచన మేరకు విశ్రాంతి కొరకు 16 అక్టోబర్ 2019 నుంచి 23 అక్టోబర్ 2019 వరకు మెడికల్ లీవ్ అప్లై చేసి ప్రిన్సిపల్ సంతకం పెట్టించి వెళ్లాను.  అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ తో పాటు  ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రిన్సిపాల్ చే సంతకం చేయించి వారికి అందించి విధుల్లో చేరాను.
కరస్పాండెంట్ కక్ష సాధింపుగా అక్టోబర్ నెలకు 15 రోజులు బిల్లు పెట్టించారు. ఎ ఒ బిల్లును పాస్ చెయ్యడానికి నిరాకరించడంతో  ఆ తర్వాత మెడికల్ లీవ్ ఎనిమిది రోజులు మినహాయించి 23 రోజులకు జీతం బిల్లు పెట్టారు.  నిజంగా నా మెడికల్ లీవ్ పై కరస్పాండెంట్ గారికి అనుమానం ఉంటే మెడికల్ బోర్డు కి 25 లేదా 26 తారీకు లో జన్యూనిటీ సర్టిఫికెట్ కోసం లెటర్ పెట్టివుండేవారు.  కక్ష సాధింపుగా 2/11/2019 న ఇంతా జరిగింది గనుక లెటర్ పెట్టారు.  ఇప్పటివరకూ మెడికల్ లీవ్ లను జన్యూనిటీ సర్టిఫికెట్ కోసం ఎందరివి మెడికల్ బోర్డు పంపించారో  తెలియజేయాలి. ఎందరి మెడికల్ లీవ్ లు సక్రమమైనవని నిర్ధారించుకుని జీతాలు పెట్టారో తెలియజేయాలి.  మెడికల్ లీవ్ లు మంజూరు చేయకుండా జీవితాల బిల్లును ఆపినవారి పేర్లు చెప్పాలి. సదరు కరెస్పాండెంట్  "సార్ మాకు రోకు(ఈ అనకాపల్లి మాండలిక పదానికి అర్థం మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్ పంపించుకుంటాము. నా చేతిలో పవర్ ఉంది. నేనేదో అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు రోక్ లేదనుకోండి ఒకరోజుకూడా నేను ఎలో చెయ్యను అది నా డిస్కషన్ పవర్. మీరది పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. ఆవిషయంలో మీరు నన్ను పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. నా ఇష్టం. నాకు రోకుంటే 6 నెలలు ఇస్తాను. నాకు రోకు లేదనుకో ఒకరోజుకూడా ఇవ్వను. నా పవర్ అది. నా పవర్ ను క్వచన్ చెయ్యడానికి మీకు రైట్ లేదు."అని స్టాఫ్ తో జి.బి. రూమ్ లో మీటింగ్ లో అన్నట్లు నాపై వారికి రోకు లేదుకనుకనే నా మెడికల్ లీవ్ లో మంజూరు చేయలేదు అనే వంకతో మెడికల్ బోర్డు సాకు చూపుతూ జాప్యం చేసి ఆర్థికంగా నన్ను విధించాలని చేశారు. 

12వ పాయింట్:
నేను ఉద్దేశ్యపూర్వకంగా కళాశాల అభివృద్ధి ని నాశనం చేయడానికి 30/10/2019న సి.సి. ఆఫీసులకు ఫేక్ కంప్లైంట్ చేశాను అని రాశారు.  ఉద్యోగులకు సకాలంలో ప్రభుత్వం జీతాలు అందేలా...  చెల్లించేలా  ఏర్పాటు చేస్తే సూపరింటెండెంట్, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వీరు ముగ్గురు కలిసి వారి ఇష్టానుసారంగా జీతాలు ఇస్తున్నది నిజం కాదా ?  సి.ఎ.ఎస్., పి.ఆర్.సి. ఎరియర్స్ ఇవ్వడంలో ఉద్దేశ పూర్వకంగా ముగ్గురూ జాప్యం చెయ్యడం నిజంకాదా ?సి.ఎ.ఎస్., పి.ఆర్.సి. స్కెల్స్ అమలు చేయడంలో ఉద్దేశ పూర్వకంగా ముగ్గురూ జాప్యం చెయ్యడం నిజంకాదా ?

13వ పాయింట్ :
సకాలంలో జీతాలు చెల్లించడం లేదని సి.ఎ.ఎస్. మార్చి ఎరియర్ మరియు  పి.ఆర్.సి. ఎరియర్ మరియు  స్కేల్ ఇంప్లిమెంటేషన్ అమలు గురించి వినతిపత్రంపై సంతకాలు పెట్టిన కొందరి అధ్యాపకులను బెదిరించి ఆ ఫిర్యాదు పత్రంలోని అధ్యాపకుల సంతకాన్ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు చేసింది నిజం కాదా? మీరు రాసినట్లు కాపీ చేసి వారు రాసినవే కదా! వారు జీవితాలు సకాలంలో అందుకున్నట్లు సంతకం పెట్టగానే నిజం అయిపోదు కదా?!











14వ పాయింట్ :
వాస్తవ విషయాలు ఎవరికైనా చేదుగానే ఉంటాయి మేము షోకాజ్ నోటీసులు సమాధానంగా నేను రాసిన సమాధానాలు నిజం కావా ?

15వ పాయింట్ :
 ప్రభుత్వం ద్వారా మాత్రమే జీతాలు తీసుకుంటున్నాను గనుక నాపై యాజమాన్యం నియంత్రణ ఉండకూడదని నేను భావించడం లేదు.  గత షోకాజ్ నోటీసు సమాధానంలోనే నేను స్పష్టంగా రాశాను.  అందరం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన వారమేనని. కులతత్వాన్ని తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.  దళిత సంఘాల ఆహ్వానిస్తున్నట్లు రాశారు.  యాజమాన్యం గా మీరు నా పట్ల ఇప్పటివరకు పెట్టిన అనేక ఇబ్బందులను పరిష్కరించుకునే క్రమంలో మీరు చెప్పినట్లు ఎందరినో దళిత సంఘాల నాయకులను తీసుకొచ్చి మాట్లాడించాల్సి ఉంది. ఇప్పటికీ అలా చేయలేదు.  ఎందుకంటే 15/11/2019న ప్రిన్సిపాల్ అనుమతితోనే యాజమాన్యంతో మాట్లాడడానికి భీమ్ సేన ( వైజాగ్) వారు మాట్లాడి వెళ్లారు. 
నా ప్రవర్తనలో మార్పు కోరుతున్నట్లు రాశారు. సమయానికి కాలేజీకి రావడం లేదా? సమయానికి క్లాసులు తీసుకోవడం లేదా ? నా సబ్జెక్ట్ లో పాస్ శాతం తక్కువా ? పోనీ కాలేజీలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నానా? తాగి కాలేజీకి వస్తున్నానా ? విద్యార్థినీలతో మిస్ బిహేవ్ చేస్తున్నానా? ఇవేవి కానప్పుడు నా ప్రవర్తనలో మార్చుకోవాల్సిన అంశాలు ఏమిటి ? ఇప్పటివరకు యాజమాన్యం నాకు జారీ చేసిన మెమోలు ,షోకాజ్ నోటీసులతో వివరంగా పేర్కొలేక పోయారు. వారు చెప్పలేక పోతున్నా నేను మార్చుకోవాల్సిన నా ప్రవర్తన ఏమిటంటే రూల్స్ ను నేను  అడగకూడదు.  వారు నిబంధనలకు విరుద్ధంగా ఏం చేస్తున్నా అధికారుల దృష్టికి నేను తీసుకు వెళ్ళ కూడదు. యాజమాన్యం వారి దృష్టిలో ఇదే నా దురలవాటు!

2006లో న్యాక్ కి వెళ్లారు.  2012 తర్వాత సీనియర్ లెక్చరర్స్ రిటైర్డ్ అయ్యారని అన్నారు.  నేను మిగతా దళిత అధ్యాపకుల ప్రభావితం చేయడం ద్వారా యాజమాన్యం పై తిరుగుబాటు చేస్తున్నారని పేర్కొన్నారు. నాచే ప్రభావితమయ్యారని దళిత అధ్యాపకులు మీతో ఏమైనా చెప్పారా? ఎన్.సి.సి. ఎన్.ఎస్.ఎస్., హాస్టల్ వార్డెన్ మొదలగు వాటిలో వివక్ష చూపారు. కనుకనే వారందరూ ప్రశ్నించే స్థితికి వచ్చారు. నేను చేగొవీర, నెల్సన్ మండేలావంటి మహనీయుడ్ని కాదు అంతమందిని చైతన్యవంతుల్ని చేయడానికి. 

అనేక సమస్యలు నా ద్వారా కళాశాల యాజమాన్యం ఎదుర్కొంటున్నారని సరెండర్ రిపోర్టులో పేర్కొన్నారు. నిజంగా  ఆ సమస్యలు నిజమైనవే అయితే..  హేతుబద్ధమైనవే అయితే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి నాపై చర్యలు తీసుకునే అవకాశం మీకు ఉందికదా! ఇవి చేయకుండా సరెండర్ చేయాలనుకోవడం ఏమిటి?
~ విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల అంటే డిసిప్లైన్ కు పెట్టింది పేరు.  ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ చేసి అక్కడినుండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పి.జి.చదివి డిసిప్లైన్ ఉన్నవాడిని కనుకనే జె ఆర్ ఎఫ్ సాధించి, తెలుగు సాహిత్యంలో పి హెచ్.డి పొంది ఉద్యోగం సంపాదించాను. కనుకనే రూల్స్ కు విరుద్ధంగా మీరు చేసే వాటిని డిసిప్లేన్ ఉన్న వ్యక్తిగా అనుసరించలేక, చూస్తూ ఉండలేక అధికారులకు తెలియ జేస్తున్నాను. మీతో విబేధిస్తున్నాను.   

~  ఏ. ఎం. ఎ.ఎల్. కళాశాల యాజమాన్యానికి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం అలవాటు లేని పని.  ఇంత గొడవకి కారణం ఇదే!
నన్ను సరెండర్ చేసే అధికారం కళాశాల యాజమాన్యానికి లేదని తెలియకుండానే నన్ను కరస్పాండెంట్ సరెండర్  చేసారు అని అనుకుందాం. అప్పుడు ఏం చెయ్యాలి ? సరెండర్ పై సి.సి.ఇ. వారి అనుమతి వచ్చే వరకు నన్ను కళాశాలలో ఉద్యోగం చేయిస్తూ,  నా నెలసరి జీతాలు బిల్లు పెడుతూ ఉండగా వారు కోరుకున్నట్లు అనుమతి వచ్చాక నాకు రిలీవింగ్ సర్టిఫికెట్ ఇచ్చి పంపాలి. కానీ కళాశాల యాజమాన్యం అలా చేయలేదు. ముందే చెప్పానుకదా వారు రూల్స్ కు విరుద్ధం అని. నన్ను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టడమే యాజమాన్యం లక్ష్యం కనుక అధికారులను,  ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేయడమే వారి అలవాటు కనుక సరెండర్ చేసామని నన్ను కాలేజీలో ఉండనివ్వలేదు. క్లాసులు తీసుకొనివ్వలేదు. కమీషనర్ చేర్చుకోవాలి అని చెప్పినా వినలేదు. కమీషనర్  ఆర్డర్ పంపించిన నన్ను చేర్చుకోలేదు. కమిషనర్ జె.డి.,  ఆర్.జె.డి.ల చేత హెచ్చరించినా నన్ను కళాశాల విధుల్లోకి తీసుకోలేదు. 19 రోజులకే నా నవంబర్ జీతాన్ని పెట్టారు.  నవంబరు నెలాఖరు వరకు పెట్టాల్సిన
పి. ఆర్సీ. ఎరియర్స్ ను నవంబర్ 19వరకే పెట్టారు.  నాలుగేళ్ల నుండి నాకు ఇంక్రిమెంట్లు కలపకుండా జీతాలు  ఇస్తున్నారు. ఎనిమిది రోజుల మెడికల్ లీవ్ జీతం ఇవ్వకుండా ఆపారు. పిఆర్సి కొత్త జీతం ఇవ్వకుండా పంపించాలని  నవంబర్ 20 తేదీనుండి ఉద్యోగ బాధ్యతలో నేను లేకుండా ఇలా గాలిలో ఉండేలా చేశారు. ఇవి ఉద్దేశపూర్వకంగా చేసేవి గాక మరేమిటి? 

Friday, March 27, 2020

31 అక్టోబర్ 2019న నాటి జెడి శ్రీమతి ప్రమీలా దేవి గారికి విచారణకై సమర్పించిన వినతి పత్రం 
ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై డాక్టా సెక్రెటరీ డాక్టర్ కాకాని సుధాకర్  
విద్యాశాఖ మంతివర్యులకు వివరించి  విచారణకై సమర్పించిన వినతి పత్రం 

ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై డాక్టా సెక్రెటరీ డాక్టర్ కాకాని సుధాకర్  
31 అక్టోబర్ 2019న విద్యాశాఖ మంతివర్యులకు వివరించి  విచారణకై సమర్పించిన వినతి పత్రం 

ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై డాక్టా సెక్రెటరీ డాక్టర్ కాకాని సుధాకర్  
31 అక్టోబర్ 2019న నాటి జెడి శ్రీమతి ప్రమీలా దేవి గారికి వివరించి  విచారణకై సమర్పించిన వినతి పత్రం 

ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై విచారణ జరిపి రిపోర్ట్ తనకు సమర్పించమని విద్యాశాఖ మంతివర్యులు నాటి రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ ఎమ్ బాబూ రావు గారిని ఆదేశిస్తూ చేసిన సంతకం   

ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై  విద్యాశాఖ మంతివర్యులు ఆదేశించిన ప్రకారం విచారణ చేయుటకై అనుమతిని కోరుతూ కమీషనర్ గారికి రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ ఎమ్ బాబూ రావుగారు 14-11-2019న రాసిన లేఖ 

రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ ఎమ్ బాబూ రావుగారు విచారణ జరిపేలోపు కళాశాల యాజమాన్యం పృథ్వి రాజ్ ను ఎడ్యుకేషన్ ఆక్ట్ కు విరుద్ధంగా, అధికారుల అనుమతులు లేకుండానే కమీషనరేట్ కు 19/11/2019న  సరెండర్ చేయుట.  
ఉద్దేశ పూర్వకంగా ఆర్జేడీ విచారణ జాప్యం, డా తలతోటి పృథ్వీ రాజ్ ను  కళాశాల యాజమాన్యం సరెండర్ చేసిన విషయం ,మరోమారు మంత్రివర్యుల తీసుకొని వెళ్లగా డి డి స్థాయి అధికారిచే ఎంక్వయిరీ చేయించమని కమీషనర్ కు 27/11/2019న లేఖ రాయుట. 
14) స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన  కమీషనర్ గారిని డాక్టా కార్యవర్గం కలిసి అభినందించి,  సరెండర్ విషయం వివరించుట, పలుమార్లు కమీషనర్ కళాశాల వారిని హెచ్చరించినా , పృథ్వి రాజ్ ను విధుల్లోకి తీసుకోవాలని కమీషనర్ గారు 29 నవంబర్ 2019న  కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఆదేశించినా యాజమాన్యం చేర్చుకొనక పోయిన తర్వాత రాజమండ్రి ఆర్జేడీ గారిని ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై విచారణ జరిపించమని ఆదేశించగా 17/12/2019న ఎంక్వయిరీ రానున్నట్టు ఆర్జేడీ మెయిల్ ద్వారా తెలియజేయుట  
15)  డా తలతోటి పృథ్వీ రాజ్ సరెండర్ ను నిరాకరిస్తూ విధులలోకి తీసుకోవాలని 29 నవంబర్ 2019న  కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా కమీషనర్ ఆదేశించుట:
16) కమీషనర్ ఆదేశాలను అనుసరించకుండా నన్నుటీచింగ్ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయనివ్వకుండా క్లాసులు తీసుకోవద్దని , కరెస్పాండెంట్ ఆదేశాలని 30 నవంబర్ 2019న  ప్రిన్సిపాల్ తెలుపుట :
17)  కమీషనర్ ఆదేశాలను యాజమాన్యం అమలు చెయ్యని విషయాన్నీ సి సి ఇ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళుట :

ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై 17/12/2019న రాజమండ్రి ఆర్జేడీ గారు ఎంక్వయిరీ నిర్వహించి, సుదీర్ఘ సమయం తర్వాత 29/1/2020న కమీషనర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చెయ్యడం (ఎంక్వయిరీ  కోరిన డాక్టా సెక్రెటరికి ఎటువంటి ఎంక్వయిరీ ప్రతి అందించకుండానే),  ఆఘమేఘాలతో కమీషనరేట్ వారు పృథ్వి రాజ్ ను కళాశాలనుండి రిలీవ్ చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల,  పెరుమాళ్ళపురం కు ఆన్ డ్యూటీ పై పంపించామని కళాశాల కరస్పాండెంట్ కు ప్రొసీడింగ్స్ జారీ చేయుట.   

కమీషనర్ కార్యాలయంవారు మెయిల్ ద్వారా 31/1/2020 న  కళాశాల కరస్పాండెంట్ కు ప్రొసీడింగ్స్ జారీ చేసిన మరుక్షణం, కళాశాల రిజిస్టర్లో పేరుతొలగించిన పృథ్వి రాజ్ ను హుటాహుటిన విధులనుండి రిలీవ్ చేసి ఆన్ డ్యూటీ పై పంపిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ ప్రొసీడింగ్ తయారుచేసి ఉద్యోగులచేత అందజేయించారు 
కమీషనర్ ఆదేశాలను గౌరవిస్తూ ముందు విధుల్లో చేరిన తర్వాత ఎంక్వయిరీ పరిణామాలపై కమిషనర్ గారిని కలిసి మాట్లాడదామనుకోని డాక్టా నాయకత్వ సలహామేరకు ప్రభుత్వ కళాశాల విధుల్లో చేరిక 

Tuesday, March 3, 2020

మినీ మిరపకాయలు ఇ -బుక్ ఆవిష్కరణ


నేను రచించిన  "మినీ మిరపకాయలు" అనే  ఇ -బుక్ ను ఆంధ్ర విశ్వ విద్యాలయం జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ శాఖాధిపతి ఆచార్య పి.బాబీ వర్ధన్ గారు  3 మార్చి 2020 సాయంత్రం ఆవిష్కరించారు. ఇది నా మూడవ ఇ ~ బుక్. అనివార్య కారణాల వల్ల ఇన్నాళ్లు అముద్రితాలుగా ఉన్న ఎన్నో నా కవితా సంపుటులు ఇలా రంగుల అక్షరాలలో , ఆకర్షణీయంగా ఇ -బుక్స్ గా కొత్తరూపును సంతరించుకొని మీ ముందుకు వస్తున్నాయి. చదివి ఆస్వాదించండి. కామెంట్ రాస్తే సంతోషం. అభిరుచిగల మీ మిత్రులకు సాహితీ అభిమానులకు షేర్ చేసినా , ఫార్వార్డ్ చేసినా మరీ సంతోషం. ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్   

పృథ్వి రాజ్ రూపొందించిన ఈ బుక్స్:



  

"మినీ మిరపకాయాలు " ఇ - బుక్ పై ఆంధ్ర విశ్వకళా పరిషత్, తెలుగు జె.ఆర్.ఎఫ్.స్కాలర్   భీమవరపు వెంకటేష్  రాసిన   సమీక్ష :
"హితేన సహితం సాహిత్యం" అని సాహిత్యమునకు వ్యుత్పత్తి ఉన్నది.అనగా మంచితో కూడుకున్నది సాహిత్యం అని అర్థం.పూర్వం సాహిత్యం పద్య రూపం లో ఉండేది. ఎన్నో కావ్యాలు,ప్రబంధాలు పద్యరూపం లో వెలువడ్డాయి. ఆ తర్వాత వచన కవిత్వం సాహిత్యంలో పెను మార్పులను తీసుకువచ్చింది.వచన కవిత్వం లో నవల,కథ,కథానిక మొదలైన ఎన్నో ప్రక్రియలు తెలుగున వచ్చి చేరాయి.వచన కవిత్వంనకు మరింత సంక్షిప్తంగా మినీ కవిత అనే ప్రక్రియ వచ్చినది.      
     చెప్పదలుచుకున్న విషయాన్ని  సూటిగాను, వ్యంగ్య భవనతోనూ చెప్పేదే ఈ మినీ కవిత.ఆచార్య జీ.వీ సుబ్రమణ్యం గారు అన్నట్లు"మినీ కవిత తన హ్రస్వత్వం చేత కాదు ఆకర్షించింది,ఒక భావాన్ని బలంగా చెప్పడానికి ఒక క్రొత్త వాహికగా అవతరించడం చేతనే ఇంత ఆదరణ పొందింది".ఇది నూటికి నూరు పాళ్లు సత్యము.అందుచేతనే 1975 లో మొదలైన ఈ మినీ కవితలు నేటికి అనేకంగా వెలువడుతూనే ఉన్నాయి.అలా వెలువడిన మినీ కవితల ముత్యాల హారాలలో చేర్చదగిన మరో అణిముత్యమే మినీ మిరపకాయలు అనే మినీ కవిత సంపుటి.
డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ గారు నూతన కవితా ప్రక్రియలను వినూత్నంగా తెలుగు సాహిత్యంనకు పరిచయం చేసేలా అనేక రచనలు చేశారు.వాటిలో దీర్ఘకవితా సంపుటిలు,హైకూ సంపుటిలు,నానీలు ఇలా అనేక రచనలు చేశారు.అంతేకాక ఆయన సంపాదకత్వం లో అనేక హైకూలు కూడా వెలువడ్డాయి.పృథ్విరాజ్ గారి సాహిత్య సింధువు నుండి వెలువడిన మరో రత్నమే ఈ మినీ మిరపకాయలు.
      పృథ్విరాజ్ గారి తత్వమేమిటో మనకు"నిక్కమైన నీలమొక్కటి చాలు"అనే పీఠిక లో వివరించారు.అలాగే ఆయన రాసిన ఈ మినీ కవితలకు ప్రేరణలను కూడా పేర్కొన్నారు."వేరు వేరయా"అనే కవితలో ప్రస్తుత సమాజ తీరును ఆయన కవిత్వికరించారు.నీతి,అవినీతి గురించి అందరూ మాట్లాడతారు.నీతిగా, న్యాయం గా ఉండాలని అందరూ ఎదుటివారికి చెబుతుంటారు.కానీ లోకం అంతా అవినీతిమయం గా ఉంటుందని,చెప్పేది వేరు,జరుగుతున్నది వేరు అని వేరు వేరయా కవిత లో పేర్కొన్నారు.
      చనిపోయిన వారి గురించి ఆ రోజు మంచిగా మాట్లాడి మరుసటి రోజు నుండి ఆ వ్యక్తి చేసిన చెడ్డ గురించి మాట్లాడేవారిని ఉద్దేశించి 'లోకం పోకడ'అనే కవితను రచించారు.అలాగే సమాజం లోని సమనత్వంను ఎంతవరకు పాటిస్తున్నారో,ఒక జాతికి చెందిన మనుషులలోనే అంటరానితనాన్ని నిరసిస్తూ'అంట్ల వెధవలు'అనే కవిత ఉన్నది.
        నేటి ప్రధాన సమస్య అయిన మద్యపానం గురించి,దానివలన బలైపోతున్న జీవితాలను గురించి,మద్యపాన నిర్ములించడం యొక్క ఆవశ్యకతను" సారాంశం"అనే కవితలో చక్కగా చెప్పారు.న్యాయవ్యవస్థ గురించి,పోలీస్ వ్యవస్థ గురించి "జడ్జిమెంట్, అసార్ధకనామధేయులు,అనే కవిత లో చెప్పడం జరిగింది.నేటి న్యాయ వ్యవస్థలలో తీర్పులు చెప్పని కేసులు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి పృథ్వి రాజ్ గారు"న్యాయ భారతం లో ఎడతెగని వాయిదా పర్వాలు"ఈ రెండు ముక్కల మాటలలో ఎన్నో వందల కేసులు గురించి, వాటి వెనుక జరుగుతున్న అవినీతిని గురించి,వాయిదాల జాప్యం గురించి ఆలోచింపచేశారు.
         నేటి కార్పొరేట్ రంగంలో పెంచిన ఫీజుల గురించి,పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద వారికోసమే ఉన్నట్లుగా భావిస్తున్న నేపథ్యం లో కార్పొరేట్ రంగంను ఎండగడుతూ రాసిన కవిత కార్పొరేట్. "షరా మాములే" అన్న కవితలో ఫోటోల కోసం ఫోజులిస్తూ పనిచేస్తున్న వారిగా     చిత్రించడం గురించి సోషల్ వర్క్ చేస్తున్నామని మనల్ని నమ్మించేందుకు వాళ్ళు చేస్తున్న షో వర్క్ గురించి పేర్కొన్నారు.అప్పుడప్పుడు నాయకులు పర్యటనకు వచ్చే సమయంలో నగరాలను,ఆయా ప్రాంతాలను తుడిచిన అద్దం లా పరుస్తుంటారు. అటువంటి వారిని మాయలు చేసే వారిగా చెబుతూ రచించిన "అబ్రకదబ్రా"అనే రచన రాజకీయ నాయకుల స్వభావాన్ని తెలుపుతున్నాయి.

      రాజకీయ పార్టీల గురించి ఎన్నికల ముందు వారు చేసే మాయలు గురించి "వ్యూహం"అనే కవితను రచించారు."మండే గుణం పెట్రోలిది,దండే గుణం పార్టీలది"ఈ వాక్యంలో అనంతమైన అర్ధాన్ని మనం గ్రహించవచ్చు.నేడు జరుగుతున్న కుంభకోణాలు,అవినీతి అంతా రెండు మూడు పదాలతో చెప్పడం జరిగింది.అలాగే అధికార పార్టీలు ప్రజాధనం ను ఎలా వృధా చేస్తున్నాయో చెప్పేందుకు చేసిన ప్రయత్నం "అధికారపార్టీ" అనే కవిత.ఫ్లెక్సబుల్ లీడర్ అనే కవిత లో గెలిచిన నాయకుల తత్వాన్ని,వారు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చక్కగా తెలియజేసారు.రాజకీయ పార్టీల వ్యూహాలు గురించి,అధికారం కోసం వారు చేసే ఎత్తుగడలు గురించి"నూతన ప్రభుత"అనే కవితలో తెలియజేసారు.
     నోట్లరద్దు గురించి ఆ సమయం లో సామాన్యులు పడిన బాధ గురించి కొండను త్రవ్వి అనే కవితలో తెలియజేసారు.
   పృధిరాజ్ గారి మినీ మిరపకాయలు లో సామాజిక అంశాలు కోకొల్లలు.రాజకీయ పార్టీల తీరును తెలియజేస్తూ వారు ఎక్కువ కవితలు రాయడం జరిగింది. సమాజ తీరును గురించి"లోకంపోకడ, వేరు వేరయా,అంట్ల వెధవలు, సారాంశం,స్వార్థంతీరు మొదలైన కవితలలో చెప్పారు.అలాగే రాజకీయాల గురించి ఎన్నికల కోడ్,పొత్తు పెటాకులు,ఫ్లెక్సబుల్ లీడర్స్,అధికారపార్టీ ఇలా అనేక కవితలు రాసారు.
  మినీ మిరపకాయలు అనే శీర్షిక గురించి మనం చెప్పుకోవాలి.చిన్న మిరపకాయలు ఎంత ఘాటుగా ఉంటాయో అంత ఘాటుగా ఉండే నా ఈ కవిత్వం అని పృథ్విరాజ్ గారు అన్నారు.ఆ వాక్యాన్ని నిజం చేసేలా అన్ని కవితలు ఉన్నాయి.దీర్ఘమైన విషయాన్ని కూడా సంక్షిప్తంగా చెప్పడం మినీ కవితకు మాత్రమే చెల్లుతుంది,అందులోనూ పృథ్విరాజ్ గారు సంక్షిప్తతకు మరో సంక్షిప్త రూపం తీసుకు వచ్చారని చెప్పక తగదు.ప్రతి కవితకు శీర్షిక ను ఎన్నుకోవడం లో ఆయన చూపిన నేర్పు అద్వితీయం అనే చెప్పాలి."లోకం 'పోకడ' ", 'చీప్' గెస్ట్, ఎన్ని'కల' కోడ్,'సారాం'శం ఇలా ఈ శీర్షికలు గమనిస్తే ఆయన చెప్పదలుచుకున్న అంశం గూఢంగా దాగి ఉన్నదని మనం గుర్తించవచ్చు.

   ఈ విధం గా అన్ని అంశాలలో "మినీ మిరపకాయలు" ను రచించి మన ముందు ఉంచారు పృథ్విరాజ్ గారు.మినీ మిరపకాయల లోని విషయం సంగ్రహణ గురించి చెప్పాలంటే ఇది" మినీ కాదు   *soo many* " అని కచ్చితంగా చెప్పాల్సిందే.

"మినీ మిరపకాయలు "ఫై సాహితీ మిత్రుల స్పందన :
"మీ మిరపకాయలు బావున్నాయి. బాగా పేలాయి. ఘాటుగా, కారంగా వున్నాయి. "~ మైత్రేయ

"కొన్ని చదివాను...చాలా బాగున్నాయి... అసార్థక నామధేయులు...కార్పొరేట్... సామాజిక వర్గం...గుడి గుడిసె. హ్యూమనిస్ట్... ఇంకా కొన్ని..."~ఎం. నరసింహులు 9391111307

మీ మిరపకాయలు ఆసాంతం ఆబగా ఆ స్వాదించాను. చాలా బాగున్నాయ్. శ్రీ శ్రీ మహాప్రస్థానానికి యోగ్యతా పత్రాన్ని రాస్తూ చలం ఒక దగ్గర ఇలా అంటాడు. " కృష్ణశాస్త్రి తన బాధ ను అందరి లో పలికిస్తే, శ్రీ శ్రీ అందరి బాధ నూ తనలో పలికిస్తాడు " బహుశా మీరు  శ్రీ శ్రీ కోవ కు చెందిన వారనుకుంటా. భూమ్మీ ద కవిత్వం బతికి వున్నంతవరకూ ఆ కవితాత్మ లో మీ యశ క్కాయం బతికే వుంటుంది. మున్ముందు ఇంకా ఎన్నో ఇలాంటి రచనలు మీ నుండి రావాలని కోరుకుంటూ. ~నిష్ఠల శాస్త్రి.

'మినీ మిరపకాయలు ' మహా ఘాటుగా వున్నాయి. ఎల్లప్పుడూ సమాజ స్థితిగతులను పరిశీలిస్తూ.. మనుషుల వ్యక్తిత్వాలను పరిశోధిస్తూ...సాంఘిక పక్షిలా...సంఘంలో మమేకమై వుండే "డా.తలతోటి పృథ్వీరాజ్ గారి వాడి ,వేడి భావాలకు ఆ ఘాటు తప్పదు మరి.~అమరజ్యోతి
"మిని మిర్చి....చాలా ఘాటుగా,చమత్కారముగ,మంచి మెసేజ్ తో చాలా బాగున్నాయి పృధ్వీ రాజ్ గారు..మీకు నా అభినందన సుమాలు" -.మీ..బల్లా నాగభూషణము..thankyou..పృధ్వీ గారు..*****

congratulation sir...big message with small words✍ GLV

స్పందన తెలియ జేసిన మిత్రులకు నా ధన్యవాదాలు. సమీక్షించిన స్కాలర్ చిరంజీవి భీమవరపు వెంకటేష్ కు నా నా కృతజ్ఞతాభినందనాలు. 
        ~ ధన్యవాదాలతో డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్  .   



 



తెలుగు హైకూ కవిత్వం

యజ్జల నానీలు  




నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాల వాళ్ళు అందిపుచ్చుకోవాలని ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. జయబాబు అన్నారు.
   ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు, కవి, అధ్యాపకులు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ సంపాదకత్వంలో వెలువడిన "వెన్నెల రాత్రి" అనే హైకూ ఈ-బుక్ ను బుధవారం(12/06/2019) కళాశాలలో జయబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాగితాల వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని  కార్యాలయాలను కంప్యూటరీకరణచేసి పేపర్ లెస్ పద్ధతులను అవలంబిస్తూ ప్రోత్సహిస్తుంది. ఈ ఫైలింగ్ విధానాన్ని అనుసరిస్తుంది. ఇదే విధానాన్ని అవలంబిస్తూ పృథ్విరాజ్ తన సంపాదకత్వంలో "వెన్నెల రాత్రి "అనే ఈ-బుక్ ను తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా చిటికెలో ఖండాంతరాలకు వాట్సాప్, ఫేస్ బుక్ , బ్లాగ్స్  మొదలగు సామాజిక మాధ్యమాల ద్వారా పాఠకులకు ఈతరహా ఈ-బుక్స్ ను ఒక్క క్లిక్ తో చేరవేయవచ్చని అన్నారు.

     ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు శ్రీమతి పి.వి.ఎస్. జ్యోతి , డబ్బీరు అరవింద్ ఘోష్ మరియు సంస్కృత అధ్యాపకురాలు  శ్రీమతి రజనీ కుమారి, బాబూ హరినాథ్ మొదలగు వారు పాల్గొన్నారు.






Monday, March 2, 2020

"జానపద జానపద విజ్ఞానం-ప్రపంచీకరణ ప్రభావం " అనే జాతీయ స్థాయి సదస్సుకు సమర్పించిన "ఉత్తరాంధ్ర కళారూపం - తప్పెట గుళ్ళు " పత్రం

"జానపద జానపద విజ్ఞానం-ప్రపంచీకరణ ప్రభావం " అనే అంశంపై ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం(రాజమహేంద్రవరం)లో జరిగిన రెండురోజుల సదస్సుకు నేను హాజరయ్యాను. మొదటి సెషన్ కు నేను సమీక్షకునిగా నియమింపబడి పదిమంది పత్ర సమర్పకులు పత్రాలపై సమీక్షించాను. అదేవిధంగా "ఉత్తరాంధ్ర కళారూపం - తప్పెట గుళ్ళు "అనే అంశంపై నేను పేపర్ సమర్పించాను. అనంతరం సమీక్షకునిగా నన్ను శాలువాతో సదస్సు నిర్వాహకులు సత్కరించడం జరిగింది. అంతే కాదు ; 2020 మార్చి 13,14 తేదీలలో "ఆధునిక తెలుగు ,సంస్కృత వచన కవితా రూపాలు "అనే అంశంపై ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సుకు "ఆధునిక కవితా రూపాలలో హైకూలు -నానీల స్థానం"అనే అంశంపై సెమినార్ పేపర్ సమర్పించనున్నాను  ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ 




Wednesday, February 19, 2020

నాకు రావాల్సినవి


  1. సరెండర్ సందర్భంలో సర్వీస్ రిజిస్టర్ లో ఏమి రాశారో తెలియదు. 
  2.  సర్వీస్ రిజిస్టర్ లో ఏమేమి అప్ డేట్ చేశారో, ఏమి అప్ డేట్ చెయ్యలేదో తెలియదు. 
  3. 2016,2017,2018,2019 ల ఇంక్రిమెంట్స్ కలపకుండా ఈనాటివరకు సరెండర్ నాటి వరకు నా జీతాలు ఇస్తున్నారు. కేసు పెండింగ్ లో ఉన్నా ఇంక్రిమెంట్స్ అప్పాలనే నిబంధన లేకున్నా వారి ఇష్టానుసారంగా ఆపారు ఇన్నాళ్లు. 
  4. 8 రోజుల మెడికల్ లీవ్ తాలూకా జీతం డబ్బులు ఇవ్వాల్సినది ఉన్నది. 
  5. సరెండర్ 19-నవంబర్ 2019 నుండి 31 జనవరి 2020 మధ్య కాలంనాటి నా జీతం ఇవ్వాలి 
  6. 2016 పి ఆర్ సి అరియర్స్ పెట్టమంటున్నారు 
  7. సరెండర్ కాలాన్ని సర్వీస్ రిజిస్టర్ లో ఎలా చూపిస్తారు? 
ఇవేమీ తేలకుండా...  తేల్చకుండా   ... అధికారులు నన్ను చేయని పనికి శిక్షించారు. యాజమాన్యాన్ని రక్షించారు   

Thursday, February 6, 2020

Talathoti కవి'తలతోటి': Book reviews on Prithvi poetry

Book reviews on Prithvi poetry

ఇప్పటివరకు నేను రచించిన కవితా సంపుటులను వివిధ పత్రికలలో సమీక్షించిన సమీక్షకులకు, సాహితీ మిత్రులకు ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఆవిష్కరణ రోజు వేదికపై పుస్తకాన్ని సమీక్షించే దానికి, అదే పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చెయ్యడానికి పత్రికలకు రాసే సమీక్షా వ్యాసానికి తేడా ఉంది. సమీక్ష గీటు రాయిల ఉండాలి.  

పృథ్వి రాజ్ కవితా సంపుటులపై ఇతరులు రాసిన సమీక్షా వ్యాసాలు:
హైకూ కొలనులో పృథ్వి " కలువలు" -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.  - హైకూ సాహిత్య మాస పత్రిక - జూలై 2003.  
భూమికి పృథ్వీరాజ్ అలంకరించిన కిరీటం చంద్ర కిరీటం - కొంపెల్ల కామేశ్వరరావు - చినుకు మాసపత్రిక , 54 వ పేజి , డిసెంబర్ 2005.
"పృథ్వీ" -హైకూలు!! టంకాలు!!!  -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
హైకూ కిరీటి - తలతోటి    -వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
మనవ జీవితాన్ని ప్రతిబింబించే హైకూ - సెన్ ర్యూ  - కొంపెల్ల కామేశ్వరరావు - ...వార్తా పక్షపత్రిక, 54 వ పేజి , 15  డిసెంబర్ 2002
నీలాకాశం  - సెన్ ర్యూ  -కన్నా - భావ తరంగిణి, జనవరి 2003.
"హైకూ కొలనులో " "పృథ్వీ కలువలు " ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.,ఈరోజు ,శుక్రవారం 13 జూన్ 2003.
అనుభూతి తడిలో హృదయాంకురాలు 'హైకూలు' ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు.
తటాకంలో చంద్రకిరణాలు ! కలువలు !!- ("కలువలు ఆవిష్కరణ సందర్భంగా ) - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు. -సర్కార్ ఎక్స్ ప్రెస్-కాకినాడ,శుక్రవారం 13 జూన్ 2003.
పృథ్వీ 'సెన్ ర్యూలు - టంకాలు' - వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు. - ఈరోజూ-కాకినాడ,శుక్రవారం 12 డిసెంబర్ 2003.
అరటాకుల్లో వడ్డించిన పసందైన హైకూల విందు - మకినీది సూర్య భాస్కర్ (సమీక్షణం) -సర్కార్ ఎక్స్ ప్రెస్-కాకినాడ, మంగళవారం 21 డిసెంబర్ 2004.
అరటాకుల్లో వడ్డించిన పసందైన హైకూల విందు - మకినీది సూర్య భాస్కర్ - సంవీక్షణ, జనవరి & ఫిబ్రవరి 200?.

నెలవంక (హైకూ సంకలనం ) -రాజా విజయ సారధి -మావార్త తెలుగు పక్ష పత్రిక -శుక్రవారం. 28 ఫిబ్రవరి 2003.

సప్త అంతరంగాల అక్షర నక్షత్రాల మధ్యన తళుక్కు మన్న "నెలవంక " - (అక్షర వీక్షణం ) జయకేతనం , 1 జనవరి 2002.