కళాశాల యాజమాన్యం పైఅధికారుల ఆదేశాలను తూ.చా. తప్పక తక్షణమే అమలు చేసేవారిలా అధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తారు అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాల యాజమాన్యం. అందుకొరకు సదరు ఉద్యోగి పై కక్ష సాధిస్తూ... వేధిస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు అందిస్తారు.
ఉదాహరణకు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను నిబంధనలకు విరుద్ధంగా కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి సరెండర్ చేస్తున్నట్లు 7 /11/ 2019 న రాసిన లేఖ లోని 2వ పేజీ లోని 3వ పాయింట్:
"As per the orders issued by C.C.E., he revoked to discharge his duty on 4-5-2016" అని రాశారు.
కాని నిజమేమిటీ?
(1) 26/11/2015న కాలేజీ కి సంబంధించని తప్పుడు కేసు విషయంలో కళాశాల యాజమాన్యం డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను సస్పెండ్ చేశారు.
పృధ్విరాజ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి చేర్చుకోమని కమీషనర్ 15/3/2016న ప్రొసీడింగ్ ఇస్తే చేర్చుకోకుండా కళాశాల యాజమాన్యం పృథ్విరాజ్ ను తిప్పిస్తూ ఉండగా- కమీషనర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ కళాశాల యాజమాన్యం తనను చేర్చుకోకుండా వేధిస్తున్న తరుణంలో 19/ 4/ 2016 న ఏ.పి. ఎస్సీ-ఎస్టీ కమిషన్ కు డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా 26/4/2016 న రాజమహేంద్రవరం ఆర్జేడి వారికి కమీషనర్ రివోక్ ప్రొసీడింగ్ పంపినాకూడా కళాశాల యాజమాన్యం తనని కళాశాల విధుల్లోకి తీసుకోవడం లేదని పృథ్వీరాజ్ ఫిర్యాదు చేశారు.
కమీషనర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ కళాశాల యాజమాన్యం తనను విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుందని 19/4/ 2016న ఏ.పి ఎస్సీ- ఎస్టీ కమీషనర్ కు పృథ్వీరాజ్ ఇచ్చిన ఫిర్యాదుకు వారు స్పందించి 27/4/2016 న కళాశాలకు ఎస్సి-ఎస్టి కమీషన్ వారు లేఖను పంపించారు.
26/4/2016న పృథ్వీరాజ్ ఆర్జేడీ వారికి చేసిన ఫిర్యాదుకు స్పందించి వారు 29/4/2016న పృథ్వీరాజ్ ను చేర్చుకొమని వారు కూడా మరొక ప్రొసీడింగ్ పంపించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యం 4/5/2016న డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను కళాశాల విధుల్లోకి చేర్చుకున్నారు.
అంటే డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ సస్పెండ్ ను కమీషనర్ రివోక్ చేసిన 15/3 /2016 నుంచి చేరిన 4/ 5/2016 వరకు అంటే 50 రోజులకుగాని డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను కళాశాల యాజమాన్యం విధుల్లోకి తీసుకున్నారు. ఇదీ! కళాశాల యాజమాన్యానికి కమిషనర్ ఆదేశాల పై ఉన్న గౌరవం!!
No comments:
Post a Comment