-->

Thursday, January 23, 2025

#తలతోటి_పృథ్విరాజ్_హైకూలు #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle

డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ హైకూలు 
(1)
మట్టిలోపొర్లిన కుక్క 
వొళ్ళువిదిల్చుతుంటే ధూళి కణాలు-
ఉదయకిరణాలపై రాలుతున్నాయి!

(2)
కటిక చలిరాత్రులు:
వీధికుక్కలు పిల్లులంత 
అవుతున్నాయి ముడుక్కుని

(3)
సువిశాల పచ్చటి దుప్పటి.
ఓ చిన్ని ఓజోన్ రంధ్రం పూడ్చుతోంది-
తిమ్మమ్మ మర్రిమాను.

(4)
రాత్రంటే‌ భయం:
అలాగని జాబిలి, తారలులేని 
ఒక్క పగటినే కోరుకోలేను

(5)
సూర్యుడు పడమర
ఉదయిస్తాడన్నంత అబద్దం-
వ్యవస్థల్లో నిజాయితీ!

(6)
చిన్ని తూనీగకు తాను
కనబడకుండా పడుతున్నట్లు -
చిన్ని పాపాయి భ్రమిస్తోంది
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle

No comments:

Post a Comment