-->

Saturday, January 18, 2025

బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని 90 వ పద్యం_లావొక్కింతయు లేదు, ధైర్యంబ విలోలంబయ్యెఁ

https://www.facebook.com/share/r/15XBfbHJtY/
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#HighCourt #lawyer #advocate #judiciary #justice #adjournment  
#bammerapotana #mahabhagavatha 
"లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛవచ్చెఁ; తనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్,
నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్,
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!"
(బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని 90 వ పద్యం. )

మొసలి చేత చిక్కబడి, తననుతాను విడిపించుకునే ప్రయత్నంలో అలసి సొలసి చివరికి నీవే నన్ను రక్షించాలి స్వామి అని గజరాజు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నట్లు పోతన రాసిన ఈ పద్యంలోని గజరాజును పిటీషనర్ గా, మొసలిని రెస్పాండెంట్ లాయర్ గా, విష్ణుమూర్తిని న్యాయమూర్తిగా, మడుగును న్యాయస్థానానికి ప్రతీకగా భావిస్తూ నేటి న్యాయవ్యవస్థకు అన్వయించి చెబితే ఇలా ఉంటుంది:

'లావొక్కింతయు లేదు' అన్వయింపు: లావు అంటే బలం, శక్తి దీన్ని న్యాయ పరిభాషకై విరిచితే- లా (Law) 'న్యాయం' కాస్తంత కూడ లభించడంలేదు. (ఆలస్యంగా లభించిన న్యాయం అన్యాయంతో సమానం)

'ధైర్యము విలోలంబయ్యెఁ;' అన్వయింపు: న్యాయంకోసం కోర్టు మెట్లెక్కి నాకు, విలోలంబయ్యెన్ అంటే ధైర్యం పూర్తిగా చెదిరిపోయింది... న్యాయం పొందేందుకు ఎన్ని 
సంవత్సరాలు కోర్టుకు వెచ్చించాల్సి ఉంటుందోనని!

'బ్రాణంబులున్ ఠావుల్ దప్పెన్'అన్వయింపు:  న్యాయంకోసం కోర్టు మెట్లెక్కిన నాకు వాయిదాలతో పంచప్రాణాలు తమతమ స్థానాలను కోల్పోయాయి.

'మూర్ఛవచ్చెఁ; తనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్' అనచవయింపు: న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన నాకు మూర్ఛవచ్చెన్ అంటే స్పృహకోల్పోయే స్థితి వచ్చింది. తనువున్ అంటే శరీరం కూడా డస్సెన్ అంటే అలసిపోయింది. శ్రమంబు + అయ్యెడిన్ అంటే కష్టం కూడా కలిగింది.

'నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్' అన్యయింపు: న్యాయస్థానంతప్ప అంటే న్యాయమూర్తికాకుండా, ఇతఃపరంబెరుగ అంటే వేరొకరిని ఎరుగను. దీనునిన్ అంటే దైన్యము పొందిన నన్ను, మన్నింపందగున్ అంటే ఆదరించు.

'రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా' అన్వయింపు: ఈశ్వర అంటే న్యాయమనే ప్రపంచాన్ని పాలించే న్యాయాధిపతీ, రావే అంటే రమ్ము. వరద అంటే తీర్పు అనే దానం చేసేవాడా. కావవే అంటే కాపాడు. భద్రాత్మకా అంటే తీర్పుతో మంచిని కలిగించే మనసుగల ఓ న్యాయాధిపతి! సంరక్షించు అంటే... నన్ను ఈ కోర్టు బంధకాలనుండి రక్షించు అని తాత్పర్య భావం
~అన్వయింపు భావం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
ఏదో ఒక విషయంలో కోర్టును ఆశ్రయించిన వారు ఈ పద్యంతో కనెక్ట్ అవుతారు. నేటి భారతదేశ న్యాయవ్యవస్థలో కోర్టును ఆశ్రయించిన వారి మనో దర్పణం ఈ పద్య భావం అన్వయింపుతో! మహాభారతలో18 పర్వాలే! న్యాయభారతంలో వగతెగని వాయిదా పర్వాలు!! ఒక్కో పిటీషనర్ ది ఒక్కో వ్యధ, ఒకో కథ! సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేవారు కొందరైతె, న్యాయం పొందేలోపు పరమపదించేవారు మరికొందరు. అక్రమార్కులు , దుర్మార్గుల దురాగతాలను నిరూపించి సమాజం ముందు తీర్పు కాపీ అనే చరిత్రపుటల్లో చరిత్రహీనులుగా నిలబెట్టేందుకు ఎంత సమయం పట్టినా పోరాడేవారు మరికొందరు. నేను మూడో రకం.
   న్యాయస్థానం మెట్లెక్కిన పిటీషనర్సు పరిశీలనలో 
ప్రత్యర్ధి లాయర్ తో కుమ్మక్కై పోయిన పిటీషనర్ లాయర్. ప్రత్యర్థి లాయర్ ఉద్దేశపూర్వకంగా కేసును సాగదీసేందుకు, కేసును వాదించి గెలిచే సత్తాలేక, ఆ కేసులో విషయంలేక పదేపదే వాయిదాలు అడుగుతుంటే నియంత్రించకుండా ఇస్తూపోయే న్యాయమూర్తులు. కేసు స్వీకరిస్తూ ఫీజు తీసుకునేటప్పుడు ఉండే లాయర్ పలకరింపు కేసు పురోగతి గూర్చి పిటీషనర్ తన లాయర్ కు ఫోన్ చేసినప్పుడు స్పందించకపోవడం. వీరి తలలోదూరినట్లు వీరి జూనియర్స్. క్లైంట్ లు వ్యక్తీకరించక పోవచ్చు. కాని ఇతరులవద్ద సదరు లాయర్ తీరును ఎండగడతాడనేది న్యాయవాదులు గ్రహించాలి. 

::న్యాయస్థానాల్లో సంస్కరించదగినవి ఎన్నో::

*కొందరుకారణంగా న్యాయవాదులపై ఆశ్రితులకు సదాభిప్రాయం లేదనడం సత్యదూరం కానేకాదు!

*ప్రత్యర్ధి లాయర్ తో కుమ్మక్కు కాని లాయర్లు మన న్యాయస్థానాల్లో లేరంటారా?

*ఒక పిటీషనర్ కేసు మధ్యలో తన ఫైల్ తీసుకున్నాడంటే ఆ లాయర్ సబ్జెక్ట్ లేనివాడైన, అమ్ముడుపోయినోడైనా ఉండాలి!

*కేసుల జాప్యానికి న్యాయవాదులకంటే వాయిదాలిచ్చే న్యాయమూర్తులే కారణం!

*కోర్టులు వాయిదాల పరిమితిని నిర్ణయించాలి

*విఐపిలు, సెలబ్రెటీల కేసులకు ఇచ్చే ప్రాధాన్యతే  సామాన్యుల కేసుల పరిష్కారానికీ  ఇవ్వాలి !

*దైవసమానంగా భావించే న్యాయమూర్తులపై న్యాయస్థానాల పనితీరు ఆధారపడి ఉంది!

*ఆన్ లైన్ విధానంవల్ల లాయర్లు, న్యాయమూర్తులు... వెరసి న్యాయవ్యవస్థ పనితీరును ప్రజలు గమనిస్తున్నారు!

*సత్యమేవ జయతే... ధర్మో రక్షతి రక్షితః
~ Dr Talathoti Prithvi Raj

No comments:

Post a Comment