పృథ్వి "పున్నాగ పూలు" హైకూలు.
పున్నాగ పూలను ఇష్టపడనివారెవరు? అందునా బాల్యంలో మనకు బాగా పరిచితం!
(1)
తలెత్తి చూస్తుంటే -
మెల్లగా సుడులు తిరుగుతూ నాపై
రాలింది ఓ పొన్నాగ పూవు!
(2)
ఎలా వెళ్ళగలను
రాలిపడ్డ పున్నాగపూలను
కొన్నైనా ఏరుకోందే!
(3)
శరదృతువు:
తెలతెల్లగా జాబిలి, వెన్నెల
పున్నాగపూలు...
(4)
నేలతల్లి బోసిగా
ఉండడం ఇష్టంలేక చెట్టు-
పున్నాగపూలుపరిచింది
(5)
పీ... పీ అంటూ
పిల్లల సన్నాయి నొక్కులు :
పున్నాగపూలు
(6)
కోర్కెలు సిద్ధించినట్టే.
శివుడికి పున్నాగపూల లంచం
సమర్పించారుగా!
(7)
పున్నాగ పూలసుగంధం:
ఎవరో కుట్రచేసి మల్లెలకు
ప్రథమస్థానం కట్టబెట్టారు!
#talathoti_prithviraj_haiku
#Indian_Haiku_Club
#Anakapalle
No comments:
Post a Comment