-->

Tuesday, January 14, 2025

భోగి, సంక్రాంతి, కనుమ హైకూలు - తలతోటి పృథ్విరాజ్

అందరికీ 'భోగి' పండుగ శుభాకాంక్షలు 💐 Bhogi Festival _ Talathoti Prithvi Raj Haiku 
https://youtube.com/shorts/1YIFW0aYiXU?si=-tKT2c7zQcPs4Suh
(1)
భోగిమంటల్లో
పాడైన పడకకుర్చీని వేయలేదు-
అది నాన్నజ్ఞాపకం!

(2)
శీతాకాలమంతా
రోజూ భోగిమంట పక్షులకు-
ఉదయభానుడు

(3)
పిల్లల శిరస్సుపై 
పెద్దల దీవెనల అభిషేకం -
పూలు,శనగలు, భోగి పండ్లు

(4)
బొమ్మల్లో కలిసిపోయి
కొన్ని సజీవ బొమ్మలూ:
బొమ్మల కొలువు

(5)
ఇచ్చిపుచ్చుకునే 
పేరంటం వాయనం -
మానవతలో తప్ప!

(6)
దక్షిణాయనం:
దూరమైతే చలి, దగ్గరైతే వేడి
సూర్యుడి ఇంద్రజాలం
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle 
#bhogi

అందరికీ 'సంక్రాంతి' పండుగ శుభాకాంక్షలు 💐 Sankranti Festival _ Talathoti Prithvi Raj Haiku 
https://youtube.com/shorts/If6KkRTixb4?si=KJxQy4gs0hwj4c6g
(01)
సంక్రాంతి సెలవులు
స్కూల్ పిల్లలకే కాదు-
రైతు నేస్తాలకూ!

(02)
కళ్ళాపి, ముగ్గులు 
గొబ్బెమ్మలతో పల్లె వీథులు:
ఆ కొస ఇంటికెలా వెళ్ళను?

(03)
హరినామ సంకీర్తనలు:
వేకువ చీకటి మంచులో
ఇంటింటికి హరిదాసు 

(04)
అక్షయ పాత్రలోని
వివిధ వంగడాల బియ్యంలా-
ఒకటిగా ఉందా దేశజనాభా!?

(05)
గంగిరెద్దులోడి 
సన్నాయిలోంచి కొత్త సినిమాపాట-
చెవులు రిక్కించి జనం 

(06)
డూడూ బసవన్న:
అధిష్టానంకు తలాడించే 
అధికారి గుర్తుకు...

(07)
కత్తుల్తో కోడిపందాలు:
విధిఆట ఆడే దేవుడ్నిమాత్రం 
నిందిస్తూ మనుషులు 

(08)
రోమ్ గ్లాడియేటర్ నుండి
కోడిపందేల శిబిరాల వరకు:
మనిషిలో చావని క్రూరత్వం

(09)
రైతుల పండుగరోజూ
అదేదోచోట అప్పులతో -
ఓ రైతు ఆత్మహత్య!

(10)
అస్పృశ్యతాపోషకులూ-
హరిదాసులు మాలదాసరులని
తెలిసేనా స్పర్శకు దూరం?

(11)
పండుగ పిండివంటల రుచి
ఆత్మీయ బంధువులరాక,
ప్రేమ ఆప్యాయతలే కదూ!

(12)
కోడిపందాల శిబిరంలో
సంస్కృతి చట్టం ముసుగుతో
జూదలన్నీ జొరబడ్డాయి!
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle 
#sankranthi

అందరికీ 'కనుమ' పండుగ శుభాకాంక్షలు 💐 Kanuma Festival _ Talathoti Prithvi Raj Haiku 
(1)
పూజలందుకుంటూ
రైతులచే పశువులు-నాయకుల 
ఛీత్కారాలతో రైతులు!

(2)
ఇత్తడి కుప్పెలు, కొత్త పగ్గాలు
మువ్వల పట్టీలు, మూజంబరాలు :
పశువుల అలంకరణ కనుమ

(3)
వరికంకుల తోరణం.
రైతు భాగస్వామి పక్షులకు
కనుమ స్వాగతం!

(4)
కోడెద్దులు
యజమాని గౌరవం పెంచాయి
ఎడ్లపందెం గెలుపుతో!

(5)
పతంగాలతో ఆకాశం
బాల్యం కేరింతలతో మైదానాలు-
సంక్రాంతి అందాలు 

(6)
కనుమ:
మూగజీవాల వ్యధనూ,
వధనూ కనుము
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle 
#kanuma

No comments:

Post a Comment