-->

Thursday, January 23, 2025

#తలతోటి_పృథ్విరాజ్_హైకూలు #talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle

డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ హైకూలు 
(1)
మట్టిలోపొర్లిన కుక్క 
వొళ్ళువిదిల్చుతుంటే ధూళి కణాలు-
ఉదయకిరణాలపై రాలుతున్నాయి!

(2)
కటిక చలిరాత్రులు:
వీధికుక్కలు పిల్లులంత 
అవుతున్నాయి ముడుక్కుని

(3)
సువిశాల పచ్చటి దుప్పటి.
ఓ చిన్ని ఓజోన్ రంధ్రం పూడ్చుతోంది-
తిమ్మమ్మ మర్రిమాను.

(4)
రాత్రంటే‌ భయం:
అలాగని జాబిలి, తారలులేని 
ఒక్క పగటినే కోరుకోలేను

(5)
సూర్యుడు పడమర
ఉదయిస్తాడన్నంత అబద్దం-
వ్యవస్థల్లో నిజాయితీ!

(6)
చిన్ని తూనీగకు తాను
కనబడకుండా పడుతున్నట్లు -
చిన్ని పాపాయి భ్రమిస్తోంది
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle

Wednesday, January 22, 2025

#talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle #పెళ్ళి_హైకూలు #తలతోటిపృథ్విరాజ్_హైకూలు

శ్రీశ్రీ గారు చెప్పినట్లు కాదేదీ కవితకనర్హం అన్నట్లు... హైకూ కవితా వస్తువులలో రుతువులు, ప్రకృతి, దేశ సంస్కృతి- సంప్రదాయాలు, మానవ ఉద్వేగాలు ఇవన్నీ. పెళ్ళిపై నేను రాసిన ఈ హైకూలు మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తూ.... డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ 
(1)
ఓ చీమల్లారా!
జీలకర్ర- బెల్లం పసిగట్టి 
దారికట్టకండి!

(2)
శీతాకాల పెళ్లి ముహుర్తం.
మంగళవాద్య సంగీతం 
కొంకర్లు పోతుంది 

(3)
ఆకాశంలో కాంతిపూలు
విరబూస్తూ మాయమౌతున్నాయి:
బాణసంచా   

(4)
అర్థరాత్రి పెళ్లి ముహుర్తం:
ఇళ్ళల్లోని గురకరాయుళ్ళనుసైతం
కలవరపెట్టే బాణసంచా!

(5)
లక్షల కట్నం తీసుకునికూడా 
గొడవపడుతున్నాడు వరుడితండ్రి-
పురోహితుడి సంభావనలో...

(6)
తెల్లారి పెళ్లి ముహుర్తం:
బంధు మిత్రులు కుర్చీలలో 
కునికిపాట్లు

(7)
పెళ్ళి పందిరిలో బుద్దిగా
పరీక్షలకు కూర్చున్నట్లు ఓ విద్యార్థి:
చదివింపులు

(8)
అమ్మాయితండ్రి పెళ్ళికి
చేసిన అప్పులు ఇంకా తీరకముందే -
పాపం... విడాకులు!

(9)
పూలతో అలంకరించిన
పెళ్ళి మండపం పరిమళిస్తోంది:
జీవితం పూదోట 

(10)
మబ్బులాకాశంలో అరుంధతి నక్షత్రం 
కనిపిస్తున్నట్లు చూపే పురోహితుడు, 
చూసినట్లే నూత్న వధూవరులు!

(11)
పెళ్ళి విందు ప్రారంభం.
మెల్లిగాపోగైన వీథికుక్కలు
కాట్లాట ప్రారంభించాయి

(12)
జంట ఈడూ జోడు కంటే 
పెళ్ళి విందుభోజనం గూర్చి 
మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle

Tuesday, January 21, 2025

#talathoti_prithviraj_haiku #Indian_Haiku_Club #Anakapalle. పృథ్వి "పున్నాగ పూలు" హైకూలు.

పృథ్వి "పున్నాగ పూలు" హైకూలు.
పున్నాగ పూలను ఇష్టపడనివారెవరు? అందునా బాల్యంలో మనకు బాగా పరిచితం!
(1)
తలెత్తి చూస్తుంటే -
మెల్లగా సుడులు తిరుగుతూ నాపై
రాలింది ఓ పొన్నాగ పూవు!

(2)
ఎలా వెళ్ళగలను
రాలిపడ్డ పున్నాగపూలను
కొన్నైనా ఏరుకోందే!

(3)
శరదృతువు:
తెలతెల్లగా జాబిలి, వెన్నెల
పున్నాగపూలు...

(4)
నేలతల్లి బోసిగా 
ఉండడం ఇష్టంలేక చెట్టు-
పున్నాగపూలుపరిచింది

(5)
పీ... పీ అంటూ 
పిల్లల సన్నాయి నొక్కులు :
పున్నాగపూలు

(6)
కోర్కెలు సిద్ధించినట్టే.
శివుడికి పున్నాగపూల లంచం
సమర్పించారుగా!

(7)
పున్నాగ పూలసుగంధం:
ఎవరో కుట్రచేసి మల్లెలకు
ప్రథమస్థానం కట్టబెట్టారు!
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle

Monday, January 20, 2025

#talathoti_prithviraj_haiku #కవితలతోటి #Indian_Haiku_Club #Anakapalle

తలతోటి పృథ్వి రాజ్ హైకూలు

(1)
ఓ దోమల్లారా
మా నాయకులే కాదు,
మీరు కూడనా!?

(2)
పక్షుల నాయకత్వ ఎంపిక 
ప్రజాస్వామ్యంలో ఏదీ?
- స్వలాభం, స్వార్థం

(3)
శ్రామికుల కళాకౌశలం:
ఈ పిరమిడ్ నిర్మాణాలకు
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?

(4)
పునర్జననం:
మేదరి వెదురికి ఎన్ని
రూపాల్నిచ్చాడు

(5)
రోడ్డుపై 
విసరబడ్డ దిష్టిగుమ్మడి :
ముసలి బిచ్చగాడు

(6)
ఏదో వెలితి-
నగర వీధుల్లో తోపుడుబండ్లు
తొలిగించాక!
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle

Sunday, January 19, 2025

#క్రిస్మస్ #హైకూలు #తలతోటి #పృథ్విరాజ్ | Dr Talathoti Prithvi Raj "Christmas Haiku"

Dr Talathoti Prithvi Raj "Christmas Haiku"
https://youtube.com/shorts/1iXGRAPui40?si=jy7q2c4keXMGbbcs

https://www.facebook.com/share/r/12J3LGhBJEY/
(1)
అదిగదిగో... అదేనేమో...
బాలయేసు జన్మస్థల సూచికైన
ఆనాటి నక్షత్రం!

(2)
పశువుల పాక:
ఎంత ధన్యతో కదూ వాటిది
- యేసు జననం

(3)
కళ్ళు చెమ్మగిల్లాయి:
నాన్నతో కలిసి చేసుకున్న 
క్రిస్మస్ వేడుకలు గుర్తుకు!

(4)
క్రిస్మస్ దీపకాంతులు: 
చర్చీమెట్లపై బిక్షగాళ్ళ ముఖాలూ
ప్రకాశిస్తున్నాయి

(5)
తెల్లారినా నిద్రలోనే:
అర్ధరాత్రిదాక పిల్లలు క్రిస్మస్ ట్రీని
అలంకరించారు.

(6)
నక్షత్రాలు వెలిసిన 
ఇళ్ళపై నేటికీ ప్రసరిస్తోంది- నేటి
హేరోదుల విద్వేషచూపు

(7)
శూద్రులకు ప్రవేశం లేదని 
చర్చీలో ఎవరూ ఆడ్డుకోలేదు:
 దేవునికి చేరువుగా పావురాలు

#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle

Saturday, January 18, 2025

బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని 90 వ పద్యం_లావొక్కింతయు లేదు, ధైర్యంబ విలోలంబయ్యెఁ

https://www.facebook.com/share/r/15XBfbHJtY/
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#HighCourt #lawyer #advocate #judiciary #justice #adjournment  
#bammerapotana #mahabhagavatha 
"లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛవచ్చెఁ; తనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్,
నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్,
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!"
(బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని 90 వ పద్యం. )

మొసలి చేత చిక్కబడి, తననుతాను విడిపించుకునే ప్రయత్నంలో అలసి సొలసి చివరికి నీవే నన్ను రక్షించాలి స్వామి అని గజరాజు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నట్లు పోతన రాసిన ఈ పద్యంలోని గజరాజును పిటీషనర్ గా, మొసలిని రెస్పాండెంట్ లాయర్ గా, విష్ణుమూర్తిని న్యాయమూర్తిగా, మడుగును న్యాయస్థానానికి ప్రతీకగా భావిస్తూ నేటి న్యాయవ్యవస్థకు అన్వయించి చెబితే ఇలా ఉంటుంది:

'లావొక్కింతయు లేదు' అన్వయింపు: లావు అంటే బలం, శక్తి దీన్ని న్యాయ పరిభాషకై విరిచితే- లా (Law) 'న్యాయం' కాస్తంత కూడ లభించడంలేదు. (ఆలస్యంగా లభించిన న్యాయం అన్యాయంతో సమానం)

'ధైర్యము విలోలంబయ్యెఁ;' అన్వయింపు: న్యాయంకోసం కోర్టు మెట్లెక్కి నాకు, విలోలంబయ్యెన్ అంటే ధైర్యం పూర్తిగా చెదిరిపోయింది... న్యాయం పొందేందుకు ఎన్ని 
సంవత్సరాలు కోర్టుకు వెచ్చించాల్సి ఉంటుందోనని!

'బ్రాణంబులున్ ఠావుల్ దప్పెన్'అన్వయింపు:  న్యాయంకోసం కోర్టు మెట్లెక్కిన నాకు వాయిదాలతో పంచప్రాణాలు తమతమ స్థానాలను కోల్పోయాయి.

'మూర్ఛవచ్చెఁ; తనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్' అనచవయింపు: న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన నాకు మూర్ఛవచ్చెన్ అంటే స్పృహకోల్పోయే స్థితి వచ్చింది. తనువున్ అంటే శరీరం కూడా డస్సెన్ అంటే అలసిపోయింది. శ్రమంబు + అయ్యెడిన్ అంటే కష్టం కూడా కలిగింది.

'నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్' అన్యయింపు: న్యాయస్థానంతప్ప అంటే న్యాయమూర్తికాకుండా, ఇతఃపరంబెరుగ అంటే వేరొకరిని ఎరుగను. దీనునిన్ అంటే దైన్యము పొందిన నన్ను, మన్నింపందగున్ అంటే ఆదరించు.

'రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా' అన్వయింపు: ఈశ్వర అంటే న్యాయమనే ప్రపంచాన్ని పాలించే న్యాయాధిపతీ, రావే అంటే రమ్ము. వరద అంటే తీర్పు అనే దానం చేసేవాడా. కావవే అంటే కాపాడు. భద్రాత్మకా అంటే తీర్పుతో మంచిని కలిగించే మనసుగల ఓ న్యాయాధిపతి! సంరక్షించు అంటే... నన్ను ఈ కోర్టు బంధకాలనుండి రక్షించు అని తాత్పర్య భావం
~అన్వయింపు భావం: డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
ఏదో ఒక విషయంలో కోర్టును ఆశ్రయించిన వారు ఈ పద్యంతో కనెక్ట్ అవుతారు. నేటి భారతదేశ న్యాయవ్యవస్థలో కోర్టును ఆశ్రయించిన వారి మనో దర్పణం ఈ పద్య భావం అన్వయింపుతో! మహాభారతలో18 పర్వాలే! న్యాయభారతంలో వగతెగని వాయిదా పర్వాలు!! ఒక్కో పిటీషనర్ ది ఒక్కో వ్యధ, ఒకో కథ! సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేవారు కొందరైతె, న్యాయం పొందేలోపు పరమపదించేవారు మరికొందరు. అక్రమార్కులు , దుర్మార్గుల దురాగతాలను నిరూపించి సమాజం ముందు తీర్పు కాపీ అనే చరిత్రపుటల్లో చరిత్రహీనులుగా నిలబెట్టేందుకు ఎంత సమయం పట్టినా పోరాడేవారు మరికొందరు. నేను మూడో రకం.
   న్యాయస్థానం మెట్లెక్కిన పిటీషనర్సు పరిశీలనలో 
ప్రత్యర్ధి లాయర్ తో కుమ్మక్కై పోయిన పిటీషనర్ లాయర్. ప్రత్యర్థి లాయర్ ఉద్దేశపూర్వకంగా కేసును సాగదీసేందుకు, కేసును వాదించి గెలిచే సత్తాలేక, ఆ కేసులో విషయంలేక పదేపదే వాయిదాలు అడుగుతుంటే నియంత్రించకుండా ఇస్తూపోయే న్యాయమూర్తులు. కేసు స్వీకరిస్తూ ఫీజు తీసుకునేటప్పుడు ఉండే లాయర్ పలకరింపు కేసు పురోగతి గూర్చి పిటీషనర్ తన లాయర్ కు ఫోన్ చేసినప్పుడు స్పందించకపోవడం. వీరి తలలోదూరినట్లు వీరి జూనియర్స్. క్లైంట్ లు వ్యక్తీకరించక పోవచ్చు. కాని ఇతరులవద్ద సదరు లాయర్ తీరును ఎండగడతాడనేది న్యాయవాదులు గ్రహించాలి. 

::న్యాయస్థానాల్లో సంస్కరించదగినవి ఎన్నో::

*కొందరుకారణంగా న్యాయవాదులపై ఆశ్రితులకు సదాభిప్రాయం లేదనడం సత్యదూరం కానేకాదు!

*ప్రత్యర్ధి లాయర్ తో కుమ్మక్కు కాని లాయర్లు మన న్యాయస్థానాల్లో లేరంటారా?

*ఒక పిటీషనర్ కేసు మధ్యలో తన ఫైల్ తీసుకున్నాడంటే ఆ లాయర్ సబ్జెక్ట్ లేనివాడైన, అమ్ముడుపోయినోడైనా ఉండాలి!

*కేసుల జాప్యానికి న్యాయవాదులకంటే వాయిదాలిచ్చే న్యాయమూర్తులే కారణం!

*కోర్టులు వాయిదాల పరిమితిని నిర్ణయించాలి

*విఐపిలు, సెలబ్రెటీల కేసులకు ఇచ్చే ప్రాధాన్యతే  సామాన్యుల కేసుల పరిష్కారానికీ  ఇవ్వాలి !

*దైవసమానంగా భావించే న్యాయమూర్తులపై న్యాయస్థానాల పనితీరు ఆధారపడి ఉంది!

*ఆన్ లైన్ విధానంవల్ల లాయర్లు, న్యాయమూర్తులు... వెరసి న్యాయవ్యవస్థ పనితీరును ప్రజలు గమనిస్తున్నారు!

*సత్యమేవ జయతే... ధర్మో రక్షతి రక్షితః
~ Dr Talathoti Prithvi Raj

Tuesday, January 14, 2025

భోగి, సంక్రాంతి, కనుమ హైకూలు - తలతోటి పృథ్విరాజ్

అందరికీ 'భోగి' పండుగ శుభాకాంక్షలు 💐 Bhogi Festival _ Talathoti Prithvi Raj Haiku 
https://youtube.com/shorts/1YIFW0aYiXU?si=-tKT2c7zQcPs4Suh
(1)
భోగిమంటల్లో
పాడైన పడకకుర్చీని వేయలేదు-
అది నాన్నజ్ఞాపకం!

(2)
శీతాకాలమంతా
రోజూ భోగిమంట పక్షులకు-
ఉదయభానుడు

(3)
పిల్లల శిరస్సుపై 
పెద్దల దీవెనల అభిషేకం -
పూలు,శనగలు, భోగి పండ్లు

(4)
బొమ్మల్లో కలిసిపోయి
కొన్ని సజీవ బొమ్మలూ:
బొమ్మల కొలువు

(5)
ఇచ్చిపుచ్చుకునే 
పేరంటం వాయనం -
మానవతలో తప్ప!

(6)
దక్షిణాయనం:
దూరమైతే చలి, దగ్గరైతే వేడి
సూర్యుడి ఇంద్రజాలం
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle 
#bhogi

అందరికీ 'సంక్రాంతి' పండుగ శుభాకాంక్షలు 💐 Sankranti Festival _ Talathoti Prithvi Raj Haiku 
https://youtube.com/shorts/If6KkRTixb4?si=KJxQy4gs0hwj4c6g
(01)
సంక్రాంతి సెలవులు
స్కూల్ పిల్లలకే కాదు-
రైతు నేస్తాలకూ!

(02)
కళ్ళాపి, ముగ్గులు 
గొబ్బెమ్మలతో పల్లె వీథులు:
ఆ కొస ఇంటికెలా వెళ్ళను?

(03)
హరినామ సంకీర్తనలు:
వేకువ చీకటి మంచులో
ఇంటింటికి హరిదాసు 

(04)
అక్షయ పాత్రలోని
వివిధ వంగడాల బియ్యంలా-
ఒకటిగా ఉందా దేశజనాభా!?

(05)
గంగిరెద్దులోడి 
సన్నాయిలోంచి కొత్త సినిమాపాట-
చెవులు రిక్కించి జనం 

(06)
డూడూ బసవన్న:
అధిష్టానంకు తలాడించే 
అధికారి గుర్తుకు...

(07)
కత్తుల్తో కోడిపందాలు:
విధిఆట ఆడే దేవుడ్నిమాత్రం 
నిందిస్తూ మనుషులు 

(08)
రోమ్ గ్లాడియేటర్ నుండి
కోడిపందేల శిబిరాల వరకు:
మనిషిలో చావని క్రూరత్వం

(09)
రైతుల పండుగరోజూ
అదేదోచోట అప్పులతో -
ఓ రైతు ఆత్మహత్య!

(10)
అస్పృశ్యతాపోషకులూ-
హరిదాసులు మాలదాసరులని
తెలిసేనా స్పర్శకు దూరం?

(11)
పండుగ పిండివంటల రుచి
ఆత్మీయ బంధువులరాక,
ప్రేమ ఆప్యాయతలే కదూ!

(12)
కోడిపందాల శిబిరంలో
సంస్కృతి చట్టం ముసుగుతో
జూదలన్నీ జొరబడ్డాయి!
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle 
#sankranthi

అందరికీ 'కనుమ' పండుగ శుభాకాంక్షలు 💐 Kanuma Festival _ Talathoti Prithvi Raj Haiku 
(1)
పూజలందుకుంటూ
రైతులచే పశువులు-నాయకుల 
ఛీత్కారాలతో రైతులు!

(2)
ఇత్తడి కుప్పెలు, కొత్త పగ్గాలు
మువ్వల పట్టీలు, మూజంబరాలు :
పశువుల అలంకరణ కనుమ

(3)
వరికంకుల తోరణం.
రైతు భాగస్వామి పక్షులకు
కనుమ స్వాగతం!

(4)
కోడెద్దులు
యజమాని గౌరవం పెంచాయి
ఎడ్లపందెం గెలుపుతో!

(5)
పతంగాలతో ఆకాశం
బాల్యం కేరింతలతో మైదానాలు-
సంక్రాంతి అందాలు 

(6)
కనుమ:
మూగజీవాల వ్యధనూ,
వధనూ కనుము
#talathoti_prithviraj_haiku 
#Indian_Haiku_Club 
#Anakapalle 
#kanuma

నూతన సంవత్సర హైకూలు - తలతోటి పృథ్విరాజ్

New Year Haiku by Talathoti Prithvi Raj 
పూరిగుడిసె వాకిట్లో 
రంగుల న్యూ ఇయర్ ముగ్గు-
మంచుపోతలో మరింత అందంగా!

(2)
పాత - కొత్త సంవత్సరాల
వీడ్కోలు - ఆహ్వాన వేళల -
వొంపుసొంపుల జాబిలి

(3)
పక్షులకేంతెలుసు 
కొత్త సంవత్సరంరోజని-
ఎప్పట్లాగే గడిపాయి!

(4)
పట్టరాని సంతోషం:  
మరో సంవత్సరంలోకి
వయోవృద్ధుడు

(5)
నిర్లక్ష్య కారణమేకదూ
మునుపు విత్తినవి మొలకెత్తలేదు:
మళ్ళీ నూత్నతీర్మానాలు

(6)
సంవత్సరాంతపు అర్ధరాత్రి:
ఫుట్ పాత్ పై గాఢనిద్రలో నిరాశ్రయులు
రోడ్లపై కేరింతల్లో యువత!