2016 నుండి అనకాపల్లి, ఏ.ఎమ్.ఏ.ఎల్ కాలేజీ మేనేజ్మెంట్, మరిముఖ్యంగా 2018 నుండి కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు గారు నాపై మూడురకాలైన ప్రయోగాలు చేసి తోటి మేనేజ్మెంట్ సభ్యులకు, వర్తకులకు, కళాశాలలోని సిబ్బందికి, కాలేజీ విషయాలను అనుసరించే బయటి వారికి ప్రయోగ ఫలితాలను చాటిచెప్పారు. ఆ ఫలితాలు ఏమిటంటే... సస్పెన్షన్, సరెండర్, డిస్మిసల్ కాంపిటెంట్ అథారిటీ అనుమతిలేకుండా చేయ్యకూడదని, అలా చేసినవి చెల్లవని రుజువు చేశారు. వీరి నిరాధార - కక్షపూరిత చర్యలపై ఉన్నతాధికారులు వీరు కోరుకునే రీతిగా చెయ్యరు కనుకనే వీరికి అధికారాలున్నాయని కాలేజీలో, ఊళ్ళో గొప్పలు చెప్పుకుని నా విషయంలో వారు చేసిన ప్రతిదీ రివర్స్ కావడం జరిగింది. ఒక మీటింగ్ లో సదరు కరస్పాండెంట్ చెప్పిన ఆ సస్పెన్షన్ పొడిగింపు...సరెండర్, డిస్మిసల్ అంశంపై ఎలా మాట్లాడారో వినండి! ఈ మూడూ నాపై ప్రయోగించి విఫలమయ్యారు. అధికారుల కాళ్ళావేళ్ళా పడి కొనసాగించుకోగలుగుతున్నారు. కాని చెల్లుబాటు కాని వారి తీర్మానం సంతకాల్లాంటివే వారి నిర్ణాయలన్నది నగ్న సత్యం. నిరూపితం! ఈవిధంగా ముచ్చటైన మూడు కోర్కెలు తీరిపొయాయి
Monday, October 3, 2022
"బొమ్మను చేసి...గారడి చేసి" అనే పాట పారడీ
ఎయిడెడ్ కాలేజీ మేనేజ్మెంట్ తో ఆర్జేడీ లాలూచీ| A.M.A.L.COLLEGE, ANAKAPALLE | TALATHOTI PRITHVI RAJ
రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ సి.కృష్ణగారు నా డిస్మిసల్ సమస్యను పరిష్కరించాలి|A.M.A.L.College,Anakapalle
01-09-2022వతేదీ అనకాపల్లి, ఏ.ఎం.ఏ.ఎల్.కళాశాల మేనేజ్మెంట్ చట్ట విరుద్ధంగా, అధికారుల అనుమతి లేకుండా చేసిన నా సర్వీస్ డిస్మిసల్ చెల్లదని, నన్ను విధుల్లోకి తీసుకోవాలని కళాశాల కరస్పాండెంట్ ను ఆదేశిస్తూ రాజమహేంద్రవరం ఆర్జేడీ 20-09-2022వతేదీ జారీచేసి నాకు పంపిన ఉత్తర్వులను బట్టి నా జాయినింగ్ రిపోర్ట్ తో అదేరోజు నేను నా విధుల్లో చేరుటకు కళాశాలకు వెళ్ళగా, కళాశాలవారు నన్ను చేర్చుకోలేదు. ఆర్జేడీ ఆదేశాలను మేనేజ్మెంట్ ధిక్కరిస్తూ నన్ను విధుల్లోకి చేర్చుకోకుండా జాప్యం చేయడానికే గవర్నింగ్ బాడీ సమావేశానికి సమయం కావాలని కోరుతూ కరస్పాండెంట్ 21-09-2022వతేదీ ఆర్జేడీ గారికి లెటరు రాసారు. మేనేజ్మెంట్ సమయం కోరడాన్ని అనుమతించవద్దని నేను ఆర్జేడీ గారికి 23-09-2022వతేదీ లేఖను రాయగా, కరస్పాండెంట్ ను రెండోమారు ఆర్జేడీ 24-09-2022వతేదీ అదే ఉత్తర్వును హెచ్చరిస్తూ పంపించారు. రెండవసారికూడా నేను నా జాయినింగ్ రిపోర్ట్ తో కళాశాలకు వెళ్ళగా నన్ను వారు విధుల్లో చేర్చుకోకుండా 26-09-2022తేదీ గవర్నింగ్ బాడీ సమావేశం అనంతరం నా జాయినింగ్ పై వారి అభిప్రాయం తెలియజేస్తారని ఆర్జేడీ గారికీ, నాకూ కరస్పాండెంట్ తన లేఖ ద్వారా తెలిపారు. కరస్పాండెంట్/ మేనేజ్మెంట్ వారు చెప్పినట్లే 26-09-2022న గవర్నింగ్ బాడీ సమావేశం ముగిసిన తర్వాత కూడా నాకు ఏ సమాచారం చెప్పకుండా, నా జాయినింగ్ కు అనుమతివ్వకుండా, ఈ విషయాన్ని మరికొంతకాలం పొడిగించడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ సాకుతో నాకు జీతాలు చెల్లించకుండా ఆర్థికంగా వేధిస్తున్నారు. ఇందుకు ఆర్జేడీ మున్నగువారి పూర్తి సహాయ - సహకారాలు మేనేజ్మెంట్ వారికి అందిస్తున్నారుగానీ..., నిబంధనలకు విరుద్ధమైన మేనేజ్మెంట్ చర్యలపై, అధికారుల ఆదేశాలను ధిక్కరించిన దానిపై కమీషనర్, ఆర్జేడీలు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
20-11-2019వ తేదీ కూడా ఇదే మేనేజ్మెంట్ ఆర్జేడీ అనుమతిలేకుండా నాడు సరెండర్ సాకుతో నన్ను విధుల్లోకి రాకుండా, 73రోజులు జీతాలు ఇవ్వకుండా ఆర్థికంగా వేధించారు. సరెండర్ చెల్లదని, నన్ను విధుల్లోకి తీసుకోమని కమీషనర్ Memo No.45/Admn.I/2019 అనే లేఖ ద్వారా 28-11-2019వతేదీన ఆదేశించినా 31-01-2020వరకు నన్ను ఇప్పటిలాగే విధుల్లోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ వేధించి చివరికి అధికారుల సహకారంతో పెరుమాళ్ళపురం ప్రభుత్వ డిగ్రీకళాశాలకు అక్రమంగా నన్ను బదిలీ చేయించారు.
ఎయిడెడ్ కాలేజీ మేనేజ్మెంట్ చట్టవ్యతిరేకమైన చర్యల్ని కమీషనర్ నియంత్రించాలి! ఆర్జేడీ జవాబుదారి
(1)ఎయిడెడ్ వ్యవస్థలో కాంపిటెంట్ అథారిటీ గూర్చి చట్టం ఇంత స్పష్టంగా చెబుతుంటే
కమీషనర్ ఆర్డర్స్ బేఖాతరు చేసిన కరస్పాండెంట్
అయ్యా ప్రిన్సిపాల్ Dr H.Jayababu గారు!
డాక్టర్ డేవిడ్ కుమార్ స్వామి ఎంక్వయిరీ రిపోర్ట్ లోని 8,9 పేజీలలో పేర్కొన్నది చదువుకొండి!
దళితులతో దళితేతరులు ఫోటో దిగితే చాలు కులంమారినట్లే! కులదూషణకు దాడి శ్రీనివాసరావు గారి కొత్త రూపం!!
ఈరోజుల్లో అస్పృశ్యత, అంటరానితనం ఎక్కడుందని చాలామంది అంటూ ఉంటారు. నాటి అనాగరిక సమాజంలో దళితుల్ని ముట్టుకుంటే మైలపడిపోతారన్నట్లు... వారి అడుగుల్లో అడుగులు వేసినా మైలపడిపోతారని మా దళితులపట్ల రాక్షసంగా ఈ సమాజం చాలానే చేసింది. వాళ్ళు అంటరానివారన్నట్లు కొన్ని శతాబ్ధాలపాటు దళిత జాతిని వేధించారు. అవమానపరిచారు. హక్కుల్ని హరించారు. అస్పృశ్యత, అంటరానితనం కాలానికి తగినట్లుగానే కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అటువంటి భావజాలం కలిగిన వాళ్లు కూడా ఈ ఆధునిక కాలంలో ఇదే అంటరానితనానికి కొత్త రూపాన్ని తొడుగుతారు అంటరానితనాన్ని ప్రదర్శించే వైతిళికుల్లా!. అలా అస్పృశ్యత కు, కుల దూషణకు కొత్త రూపాన్ని తొడిగినటువంటి వైతాళికులే ఏ.ఎమ్.ఎ.ఎల్. కళాశాల కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు. ఇప్పటిది రాకెట్ యుగమే అయినా దళితులు అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి కొందరు ఓర్చుకోలేక వారి అసూయ, ద్వేషాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ల చేష్టలు, హావభావాలు, రాతలతో వాళ్ళ అక్కసును వెళ్లగక్కుతుంటారు. అందుకే ఇవన్నీ ఎస్సీ- ఎస్టీ అట్రాసిటీ చట్టంలో పొందుపరిచి ఈ రకంగా ఎలా ఎవరు దళితుల పట్ల వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. విద్యాలయంలో అర్హత లేనివారిని ఉన్నత స్థానంలో కూర్చోబెడితే వాళ్ళ కులతత్త్వాన్ని ఇలాగే ప్రదర్శిస్తారు. మనుషులు మారాలి! మనసులు మారాలి!!