"ఎవడో కులంపేరెత్తి తిట్టినట్టు
కందగడ్డయిపోయిన మాటీడి సూర్యుడు
రాత్రి నిరాహారా దీక్షకోసం
పచ్చిక బయళ్లనుండి అయిష్టంగా కొట్టాలకు వస్తున్న గొడ్లు
ఏ చిన్నదేశంమీదో అమెరికావిమానాలవాన కురిపించినట్టు
వరసగా వెళ్లిపోతున్న ఏటికొంగలబారు
బడి నుండి ఇంటికొస్తే
కల్లాల దగర్నుండి అమ్మ ఇంకా రాలేదు..." అని "మాటిపూట " అనే కవితలో మద్దూరి నగేష్ బాబు అంటాడు.
సాయంకాలం పడమర గూటికిచేరే సూర్యుడు...గూటికి చేరే కొంగలు, కొట్టాలకు చేరుకునే గొడ్లు, స్కూల్ నుండి ఇంటికి చేరుకునే పిల్లలు. ఒకే సమయంలో కనిపించే ఈ దృశ్యాల్ని దళిత స్పృహతో సమర్ధవంతంగా కవిత్వీకరించాడు.
ఎర్రటి అస్తమయ సూర్యుడ్ని దళిత స్పృహతో వ్యక్తీకరించాడు. పల్లేల్లో గొడ్లుకాచే దళితుల దుస్థితి గుర్తుచేశాడు. నాయకుల దొంగ నిరాహార దీక్షను ఎత్తిపొడిచాడు.
చిన్నదేశాలమీదే కాదు; చిన్నకులాలుగా చిత్రించే సాగించే దౌర్జన్యాలు, మారణకాండను ఎగిరెళ్ళే కొంగల బారును సామాజిక దృష్టితో చూశాడు కవి.
బడినుండి ఇంటికి వచ్చినా కల్లంనుండి ఇంటికి రాని తల్లిగూర్చి ఆలోచించే పిల్లవాడి ద్వారా దళితుల్లోని అభద్రతా భావాన్ని కవి వ్యక్తీకరించాడు.
No comments:
Post a Comment