-->

Thursday, November 18, 2021

ఆవంత్స సోమసుందర్ "వజ్రాయుధం"


ఖబడ్డార్ ఖబడ్దార్

నైజాం పాదుషా హే;

బానిసత్వ విముక్తికై.

రాక్షసత్వ నాశముకై.

హిందూ ముస్లిం పీడిత

శ్రమజీవులు ఏకమైరి.


తమపై స్వారీ చేసే

దేశముఖుల ప్రతిఘటించి

ప్రజాకోటి పోరుతోంది.

ఖబడ్దార్! ఖబడ్దార్!!


సూర్యపేట, బాలేముల,

వీరుల కాలే హృదయపు

ఆశలు కాంతించుతాయ్.


అమరుడు మా కొమరయ్య

అనంతయ్య అనంతుడే-

అజేయులై, ప్రకీర్తులై.

చిరస్తాయి నిలుస్తారు;

చరిత్రలో చరిత్రలో

చిరస్తాయి వసిస్తారు.


ఒక వీరుడు మరణిస్తే

వేలకొలది ప్రభవింతురు!

ఒక నెత్తుటి బొట్టులోనే

ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు!

ఖబడ్దార్! ఖబడ్దార్!!


నైజాం కీచకుడా!

నీ పీచమణచ ప్రజలంతా

ఒక పిడికిట, ఒక గొంతుక,

ఒక మ్రోతై, ధ్వనిస్తారు;

మృతవీరుల స్మరిస్తారు;

నవయోధుల సృజిస్తారు !

ఖబడ్దార్! ఖబడ్దార్!!


బానిస జన శల్యములను

ఏర్చి కూర్చి నిర్మించిన

నీ రాక్షస సింహాసన

మదిగదిగో కదులుతోంది !


మెషిన్ గన్లు, మరఫిరంగి,

తుపాకులూ, విషవాయువు,

ప్రజాశక్తి నాపలేవు;

ఖబడ్దార్! ఖబడ్దార్!!


నిరవధికం నిరంకుశం

సహింపనీ భరింపనీ

ధీర ప్రజాకోటికొరకు

త్రవ్వించే గోరీల్లో,

నీ అమానుషత్వాన్నే

నీ నిరంకుశత్వాన్నే

పాతేస్తాం ! పాతేస్తాం!

పాతేస్తాం ! ఖబడ్దార్!

విశాలాంధ్ర ప్రజాస్వామ్య

మమరుస్తాం ఖబడ్దార్!


IV

అతడెవరు? అతడెవరు ??

జనగామలో జమ్మి

కొమ్మపై ఎక్కాడు.

అతడెవరు? ఆతడెవరు??


గాండీవమును వెదకు

విజయుడలెనున్నాడు! 

అత డెవరు? అతడెవరు ?


అతడా? తెలంగాణ

గెరిల్లాల నాయకుడు;

అతడే ప్రజాసమర

ఉద్య మోత్సాహకుడు |

అతడే ప్రజాస్వామ్య

జగతి కధ్యాపకుడు;

అతడే తెలంగాణ

గెరిల్లాల నాయకుడు;


పాంచ జన్యమ్ము

పూరించుచున్నాడదే !-

సమరోత్సవమ్ము వలె,

భూమాత పిలుపువలె,


IV

కొమ్ము బూరాను

పూరించుచున్నా డదే :

"శత్రువులు శత్రువులు

శత్రువులు వస్తారు ;

ప్రజలు నడుములు కట్టి

నిలవండి, గెలువండి..."


పుడమి గర్జించింది ;

పుడమి గర్జించింది.


శత్రువులు శత్రువులు

శత్రువులు వచ్చారు !

శత్రువులు జనగామ

ముట్టడిస్తున్నారు!

పెట్రోలుతో ఇళ్ళు

తగలబెడుతున్నారు !

ఆధునిక ఆయుధాల్

దాడి చేస్తున్నాయి!


పుడమి గర్జించింది ;

పుచమి గర్జించింది :

ఇంటి కొక మానవుడు

వీరుడై పొంగాడు.


రాక్షసుల కంఠాలు ;

మానవుల ఖడ్గాలు,

మానవుల మానాలు !

దానవుల దాహాలు ;


లేళ్ళ నెత్తురు త్రాగి,

కైపెక్కు బెబ్బులులు :

స్వేచ్ఛామృతము గ్రోలి

మైమరచు దేవతలు.


నరమాంసము ఒలిచి

భక్షించు రాక్షసులు :

విప్లవాగ్నిని రగిలి

ఉడుకెత్తు దేహాలు.


ఘోరమై బీభత్స

రూపమై, జనగామ,

రక్తమై పైశాచ

భుక్తమై, జనగామ.

నరరూప రక్కసులు -

క్రకచాత్మ కర్కశులు


పసికందు గుండెలను

పిండి పీల్చేస్తారు;

మిసిమి యువతుల, ఉ

రోజముల చీల్చేస్తారు.


నరరూప రక్కసులు,

క్రకచాత్మ కర్కశులు.


పుడమి గర్జించింది ;

పుడమి గర్జించింది .

ఇంటికొక మానవుడు

యోధుడై నిలచాడు.


శ్రమిక జాతికి శిరో

మణులు దీపించారు :

పుడమితల్లికి తనువు

పులకరించింది.


వీరుల సమూహమై

కదిలింది జనగామ;

విప్లవ ప్రవాహమై

పొంగింది జనగామ.


రైతులూ కూలీలు

బాధితులు పీడితులు

రణయోధులై మహా

శక్తి చూపిస్తారు.


పుడమి గర్జించింది ;

పుడమి గర్జించింది;

పుడమివీరుల తల్లి

పులకరించింది.


అతడెవరు ? అతడెవరు ?

ప్రళయకాల మహా

రుద్రుడై అతడెవరు ??

తాండవ జటాజనిత

భద్రుడై అతడెవరు!?


అతడే తెలంగాణ

గెరిల్లాల నాయకుడు.


తిండితిప్పలు లేవు;

ఎంతటి మహాశక్తి

లేదసలె విశ్రాంతి;

ఎంతటి మహాశక్తి !!


హత్యను జయించాడు;

మృత్యువు జయించాడు;

అమర వీరుండతడు;

అమృతము త్రాగాడు.


ప్రజావాహిని ఎదురు

దాడులకు సిద్ధమై

సాయుధ తరంగాల

ఉరకలై పొంగింది.


ప్రజలందరూ ముందు

కురికారు విజయులై;

ఈటెలూ, బళ్లెములు,

నాటు బందూకులూ,

రోకళ్లు, కారాల

మూటలతో కదిలారు.

కూల్చారు రక్కసుల;

గెల్చారు శత్రువుల;

ఎంతటి మహాశక్తి -

మృత్యువు జయించారు :

హత్యను జయించారు:

జనగామలో విజయ

భేరి మ్రోగించారు!


Monday, November 1, 2021

జాలాది సందేశాత్మక గీతం

 ఓ మామ్మ! ఓ మామ!! ఓ తల్లీ!!!
ఓటంటే తెలుసుకోండమ్మా
మీ ఓటు విలువ తెల్చుకోండయ్యా!

ఓటంటే దగాకోర్లకి కత్తి పోటు
మీ ఓటంటే మండే కడుపుల తిరుగుబాటు

ఐదేళ్లకు ఒక్కసారే వచ్చేది 
అవును బాబు....
నోట్ల కట్లకైనా  సారానీరాలకైన అమ్ముకోరానిది
పదవికీ పలుకుబడికి భయపడి వేయకూడనిది 
కష్టాలు కన్నీళ్లు తుడిచి నీ ఆశలు పండించేది

చదువు రాని చవటలకైన
పనికిమాలిన ఎధవలుకైన 
మంత్రి పదవిని కట్టపెడతాది
లేని పరపతి పెంచుతాది
లంచగొండిగా మార్చుతుంది
నల్ల డబ్బును పేర్చుతాది
అంతేకాదు....
మీ బాగోగులు చూడకపోతే 
మంత్రికైన పదవికి నామం పెడతాది
మీ కాళ్ళ కాడకె నెడతాది

పగటి వేషాలతో మొసలి కన్నీళ్ళతో 
ఉపన్యాసాలు దంచి మాటల కోటలు దాటించి
ఓటు వేసిన తర్వాత మొహం చాటు చేస్తారు 
పార్టీలు మార్చి నమ్మినోళ్ళను ముంచేస్తారు

అందుకే ....
సొంత లాభమే మానుకోని 
తన తోటి వాడే సాటి వాడని 
పట్టెడు కూడే పెట్టే వాడికే 
మీ ఓటు వేసి గెలిపించాలి.
గెలిపిస్తే అది స్వర్గంరా 
లేకుంటే నీ ఖర్మంరా 
నీ పిల్లలు హాయిగ బ్రతకాలంటే 
నేటికైన ఏనాటికైన 
ఈ ఓటే హామీ ఇచ్చేది 
మన జాతి జాతకం మార్చేది!

డా. రావూరి భరద్వాజ వర్ధంతి-పాకుడు రాళ్ళ
భరద్వాజ
గడ్డంతో
కరుణామయుడు!
(సాహిత్య నానీలు -డా|| ద్వా.నా. శాస్త్రి. )
అ) కరుణారుణోదయుడు
టెను. నిజంగా కరుణామయుడే!
కవితానిక ప్రలయ సృష్టికర్త
భరద్వాజ, అతని ప్రతిపదంలో, ప్రతి
డా॥ రావూరి భరద్వాజ
వాక్యంలో కరుణ్.. వారి రచనలు
చదివిన వారికే ఆ కరుణ కరుణ రసాత్మక హృదయం,
కనిపిస్తుంది. ఈ సమాలంలో తలదాచుకోడానికి ప్రయత్నించి "
అందరిచేత నిరారీరింపబడి టెక్కీతోచర తిరిగే జాలి, దయ,
ప్రేమ, మానవత్వాలకు తన మనసులో తావు ఇచ్చిన తాల్విక
సంపన్నుడు భరధ్వాజ అనిపిస్తుంది. ఎదురుదెబ్బలం ఉన్నవాడు
ఎదురీతను ఈదినవాడు - కాలం విసిరిన సవాళ్ళను
ఆ ఎదుర్కొంటూ నడుస్తున్నవాడు - గుప్పిడు గుండెనిండా
ఆకాశమంత ఆశయంతో సామాజిక స్పృహ ఒదిగించుకొని
మౌనంగా కొండలా నిలువెల్లా ప్రకృతిని తన చిరునవ్వు వెన్నెలతో
మెత్తగా తడిపే చందమామ భరద్వాజ. భరద్వాజగారి స్మృతి
సాహిత్యంపై విలువైన గ్రంథాన్ని రాసిన ప్రముఖ రచయిత పట్నాల
సుధాకర్ గారు అన్నట్లు 'భరద్వాజ జ్ఞాన యజ్ఞం చేసిన ఋషి'
భరద్వాజ గారి గూర్చి ఎంత రాసినా అది ఆరంభమే అని
నాకనిపిస్తుంది.
కరుణరసాత్మక దృష్టి ఉన్నవారుకనుకనే జీవ - నిర్జీవ, చలన
- అచలన ప్రాణుల్లోని, వస్తువుల్లోని మనసును చూడగలిగారు,
అక్షరాలలో మనకు చూపగలిగారు. ప్రకృతిలోని చెట్టుకి - పక్షికి,
పక్షికి - పశువుకి, పశువుకి - పచ్చికకు, పచ్చికకు - భూమికి,
భూమికి - నింగికి ఇలా ఎన్నిటి మధ్యా ఉన్న అనుబంధాన్ని,
అప్యాయతను వారిలా చూడగలిగే మానసిక వైఖరిని మనమూ
అలవర్చుకోవాలి. ప్రకృతిలోని ప్రతి
ఏటి నాది కాదు.
వస్తువును వాటి బాధను, భావాన్ని.
భాషను అర్ధం చేసుకొని అలా ప్రకృతి
నేర్పే పాఠాల్ని జీవితానికి
అన్వయించుకొని నడి చేసంద్వాజ
గారి బాటలో మనందరం నడవాలి,
అనుసరించాలి. అప్పుడే మనుషుల
మనసుల్లో, స్వార్ధ సమాజంలో
మానవత్వ సుమాలు విరబూస్తాయి.
మానవత్వంతో అందరి మనసులూ
-
తొణికిసలాడుతాయి. మూగ గుండేల మౌనం అర్ధమౌతుంది.
నూతన ప్రక్రియైన 'కవితానిక' మనం కూడా రాసి ప్రకృతిపట్ల,
సామాజిక స్థితి గతుల పట్ల మన అనురాగాన్ని, అప్రమత్తతను
ప్రకటించాలని ఉద్దేశించి కవితానికి' లక్షణాలేమిటి, ఎలా
చెప్పాలనే కొన్ని విషయాలను వ్యాస రూపంలో వివరించాను.
చదివి ఆనందించి ప్రయత్నించి మీరూ రాసి పంపించండి.
'ఆ) కవితానిక అంటే....
ఆ కవితానిక అంటే కవితామయంగా ఉన్న కథానిక (16-10-2003
నాకు రాసిన లేఖలో) అని ఈ ప్రక్రియకు ఆధ్యులైన డా॥ రావూరి భరద్వాజ
గారు అంటారు. అంటే ఒక సన్నివేశాన్ని, సంఘటనని, విషయాన్ని సూక్ష
M
కథారూపంలో కవితామయంగా చెప్పడం అని అర్థం. కవితానికలో
సున్నితమైన అనుభవాన్ని, ఒక సుందరమైన దృశ్య రూపంలో రచయిత
నకు సాక్షాత్కరింప చేస్తాడని వై. జితిన్ కుమార్‌గారి చినుకులు' అనే
తుప్పర పేరుతో రాసిన ముందు మాటలో డా|| ఉండేల
'మాలకొండారెడ్డిగారంటారు.
ప్రకృతిలోని మానవేతర ప్రాణులైన
పశు పక్ష్యాదులు, చెట్టూ చేమల మధ్య ఉన్న లు
ఐక్యత - అనురాగం మానవాళిలో కూడా
ఉదయించాలని, అలనాలని ఆకాంక్షిస్తూ
ఒక సూక్తి గానో, పండితంగానో
నీతిగానో, రీతిగానో, కవితానికలో
పాఠకునికి రచయత ఉపదేశిస్తాడు. అలా
ఉపదేశించడానికి అల్ప వస్తువులు
మొదలు అనల్ప వస్తువుల వరకు
రచయిత వాటిని ఆశ్రయిస్తాడు. కవితా
వస్తువుగా, వాటిలో ఏదో ఒక దానిని
స్వీకరిస్తాడు. వాటి మధ్య ఉన్న ప్రేమ భావాన్ని మనసుతో చూస్తాడు.
ఆలకిస్తాడు. ప్రకృతిలోని, సమాజంలోని పరమాణువుని సైతం, పరమ
దరిద్రుణ్ణి సైతం ప్రేమించే కరుణామూర్తిగా రచయిత కనిపిస్తాడు
కవితానికల్లో,
కవితానిక అభివ్యక్తిలో రచయిత ఒకోసారి ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్రను
వహిస్తాడు. మనమెవ్వరం చూడని, "వినని దృశ్యాల్ని, సంగతుల్ని,
విషయాల్ని కవి
మాత్రమే ఆయా సందర్భాలలో చూసిన,
వినిన విషయంగా పాడు. ఒకోసారి తాను కూడా మానవేతర ప్రాణులతో
మాట్లాడిన మాటలను - జరిగిన సంభాషణల్ని - తెలుసుకొన్న సత్యాల్ని
కవితాలికలో అక్షరీకరణ చేస్తాడు. అవల్ప సత్యాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనని
మనిషి మనసులో ఆవిష్కరించేందుకు - ఆసక్తితో పాఠకుడు చదివేందుకు
మానభేతర ప్రాణులు మాట్లాడుకుంటున్నట్లు కల్పనాత్మక రీతిలో రచన
చేసే పద్ధతిని రచయిత అనుసరిస్తాడు. ఉదా : ఓ పువ్వు - మరో పువ్వుతో
రావూరి
సీతాకోక చిలుక - పువ్వుతో, ఆకాశం
భూమితో, భూమి - మేఘాలతో, నదీ తీరం
మీనంతో, మొగ్గ -మనిషితో, పవనుడు
మేమంతో, గోరింక - చెట్టుతో,
మాట్లాడినట్టు, ఒకరినొకరు.
సంభాషించుకొన్నట్లు సరచయిత
కవితానికల్లో ఇలాంటి వాటి కొన్నింటినో
ప్రతీకలుగా వాడుకుంటాడు. ఛందో రీతిని - కవితానుక ప్రక్రియ వ్యవకంగా
అనుసరించకుండానే వచన రచనలో దాహం తరద్వాజ గారి కాలంలో
శ్రీవై. జితిన్ కుమార్
కూడా పాఠకుల్ని మెప్పించేలా అద్భుతంగా
రచన చేయవచ్చని వీరేశలింగం, కృష్ణశాస్త్రిలాంటి రచయితలు, కవులు
* ఎందరో నిరూపించారు. భరద్వాజగారి కవితానికల్ని చదివితే వచన
రచనలో వీరేశలింగం, కృష్ణశాస్త్రీగార్లతో పోల్చదగిన రచయితగా
భరద్వాజని అందరూ అంగీకరిస్తారు..
'కవితానికి ప్రక్రియకు ఆద్యుడు డా॥ రావూరి భరదాజుగారు. 1996లో
ఆంధ్రభూమిలో వెలుతురు చినుకులు' అనే శీర్షికతో పైలక్షణాలతో కూడిన
రచనలు ప్రచురింపబడుతున్నప్పటికీ భరద్వాజ గారి ప్రభావంతో వై జితిన్
కుమారు 1999, సెప్టెంబర్ లో
రవ్వలు
చినుకులు' అనే పుస్తకం పేరుతో ఈ
డాక్టర్ పూరి భరద్వాజ
విధమైన కవిత్వాన్ని పుస్తక రూపంలోకి
తొలిసారిగా తీసుకువచ్చారు. మిసమిసలు
పేరుతో మలి పుస్తకంగా వచ్చిన దానిలో
వై. జితిన్ కుమార్ గారు పై లక్షణాలతో
కూడిన కవిత్వానికి వ్చాత్రాలు' అనే
ప్రక్రియ పేరుగా నూచించారు.
భరద్వాజగారు వెలుతురు చినుకులు,
రవ్వలు, ఏదీనాది కాదు. తెలుసుకొంటూ,
తెలుసుకొంటూ..., ధన్యవాదాలు అవి ఇదు పుస్తకాలు తెచ్చినప్పటికీ ఏ.
పుస్తకంలోనూ ఈ రకమైన కవిత్వానికి ప్రక్రియ పేరును సూచించలేదు.
నిజానికి భరద్వాజగారి కవితా లక్షణాలను అనుసరించి చేసిన రచనకు
వై. జితిన్ కుమార్ గారు వాక్చిత్రాలు (అంటే వాక్కులనే చిత్రాలు) అని
పెట్టిన పేరుకూడా బాగానే వుంది. ఎందుచేతనంటే ఈ రకమైన రచనని
చదువుతుంటే వాక రూపంలో మనకు చిత్రాలు ఇందులో దర్శనమిస్తాయి.
ఉదా: "పూవునయిపోదామన్న ఉత్సాహంతో తీగ మీద వాలాను.
నేనంటే గిట్టని ఛివురాకు నన్ను కిందకి తోసేసింది అన్నదా వాన చినుకు.
‘దెబ్బ తగిలిందా చిన్నా!” అంటూ ఆ చినుకును మెత్తగా హత్తుకున్నదో
మట్టిబెడ్డ. (ఏదీ నాది కాదు - డా॥ రావూరి భరద్వాజ. పేజీ 13)
పై ఉదాహరణలో ఓ చినుకు పూల తీగపై పడడం, అదికాస్త చివురాకు
మీదకి జారి అక్కణ్ణుంచి మట్టి పెద్ద మీదకు జారిపడటం, చినుకు
ముద్దాడినందుకు మట్టి పెద్ద.తన్మయత్వంతో కరిగిపోవడం అనే ఒకానొక
దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇలా ఒక వాక్ రూపంలో (అక్షరాలలో-
సంభాషణలో) ఒక చిత్రాన్ని (ఒక దృశ్యాన్ని) చూపించే లక్షణం ఈరకమైన కవిత్వానికి ఉన్నది కనుకనే వై. జితిన్ కుమార్ 'వాక్చిత్రాలు'
అని పేరు పెట్టి ఉండవచ్చు. అయితే ఈ రకమైన రచనకు ఆధ్యుడు
मा | రావూరి భరద్వాజ గారు కనుక వారు పెట్టిన పేరునే అనుసరించి
మనం రాయడం, వారిని గౌరవించడమేనని నాకు అనిపిస్తుంది.
ఇ) కవిత్రానికి ఇలా రాయవచ్చు.
1) కథానిక శైలిక నాటకీయ శైలి కలగలుపుకొని ఏర్పడిన
ప్రక్రియ కవితానిక. నాటకములోని సంభాషణలా రెండు
క్కోసారి మూడు పాత్రల మధ్య సంభాషణతో
నడిచే కథే కవితానిక: కవితానికను రాసే విధానంలో అతి
పైన రచనా విధానం ఇది. ఉదా :
ఎక్కడికల్లా పరుగెత్తుతున్నావ్?” అన్నాను ఆదరా బాదరాగా పోతోన్న,
ఆ చీమ వేపు చూస్తూ,
ఈ అమూలకు -” అన్నదా చీమ, నావేపు చూడకుండానే!
“అక్కడ సాలెగూడు ఉంది.
జాగ్రత్త ” అన్నాను, చీమను హెచ్చరిస్తూ.
"నేనక్కడికే వెడుతున్నాను” అన్నదా చీమ, నడక వేగాన్ని పెంచుతూ.
"అందులో ఇరుక్కుపోయావంటే, ఇక బయటికి రావు. జాగ్రత్త"
అని హెచ్చరించాను.
“నా వొక్కగానొక్క బిడ్డా, ఆ సాలెగూట్లో చిక్కుకొంది. నా బిడ్డను
దక్కించుకోవడానికి వెడుతున్నాను” అన్నదా చీమ నీళ్ళు నిండిన కళ్ళతో.
“నువ్వూ అందులో ఇరుక్కుపోతావేమో?” అన్నాను.
“నామీద ఆశతో, ఆ సాలెపురుగు నా బిడ్డను వొదలవచ్చు. నే
నేమయిపోయినా, నాభిడ్డ బతుకుతుంది. లేదా - నేనూ, అందులో
ఇరుక్కుని చనిపోనూ వచ్చు. కన్నబిడ్డను పోగొట్టుకొన్న కడుపు శోకంతో
కలకాలం బతకడం కన్నా, బిడ్డతో బాటే, నేనూ తనువు చాలించడం
సుఖంగా ఉంటుందనుకొంటున్నాను!” అన్నదా చీమ, వెక్కెక్కి పడుతూ.
ఆ సాలెపురుగు - కాస్సేపు - నన్ను చీమను పరిశీలనగా చూసింది.
చూశాక, బిడ్డ చీమను గూటి అంచుకు చేర్చింది. చేర్చాక గూటిని
వదిలి, పయికెళ్లిపోయింది. (మిసమిసలు- వై. జితిన్ కుమార్.
పేజీ9 &10). మరో ఉదా:
“తడి తడిగా ఉన్న ఈ మూలుగు ఎవరిది?" అన్నాను.
“చెరువు గారిది!" అన్నదో తుంగ
మొక్క
మిసమిసలు
“ఎందుకు మూలిగినట్లు?” అన్నాను
వై. జతిన్ కుమార్
మళ్ళీ,
మిమ్మల్ని చూసి, ప్రాణభయంతో
పరుగెత్తిన
పిల్లచేప ఉరవడికి తట్టుకోలేక
కావచ్చు. అయినా - ఎందుకయినా
మంచిది; అందుకో, ఇంకెందుకో,
చెరువుగారి నడిగి, మీరే తెలుసుకోండి!”
అన్నదా తుంగపోచ, నావేపూ చెరువు వేపూ
-మార్చి మార్చి చూస్తూ. (వెలుతురు చినుకులు - డా|| రావూరి భరద్వాజ.
పేజీ 23.24).
2) ఓ ప్రకృతి సంబంధమైన వస్తువుతో ఓ సామాజిక
విషయాన్ని వర్తమాన సమస్యని సందేశంగానో - సూచనగానో
చెప్పే శైలి. ధ్వని పూర్వకమైన పద్ధతి.
“హాయిగా గడపవలసిన చిన్నతనంమీద బరువులు
మోపడం అన్యాయమనీ, చట్టవిరుద్ధమనీ, మైదానం దద్దరిల్లేలా,
మహా నాయకులందరూ, మహోపన్యాసాలు చేపోరు, కానీ
మా గురించి పట్టించుకొన్నవారే లేరు. నా పసితనం మీద
మోపిన ఇన్ని రంగులనూ, ఇన్ని సుగంధాలను మోయలేక,
నేనెంతగా అలసిపోతున్నానో, మీరెప్పుడన్నా ఆలోచించారా?
అన్నదా చిన్నమొగ్గ (ధన్యవాదాలు - డా|| రామారి భరద్వాజ.,
పేజీ 26). అని నేటి బాల కార్మికుల చట్టానికి వ్యతిరేకంగా
పనివాళ్ళ చేత పనిచేయించుకొనే పాజమానుల్ని
ఆలోచించమని గుర్తుచేస్తున్నారు రచయిత.
మరో ఉదా:
“నిజమే ! అధిక సంతానం వల్ల, చాలా ఇబ్బందులున్నాయి. ఆ
బిడ్డలందర్నీ పోషించడానికే ఎన్నో నరకయాతనలు పడాలి. వారిని
కాపాడడానికి ఇంకా అవస్థలు పడాలి. రోగాలు రొష్టులు వస్తే - ఇక
చెప్పనే అక్కర్లేదు. ఇద్దరు లేక ముగ్గురు' అన్న.మీ నినాదం నాకు బాగా
నచ్చింది. అందుకే ఈ సంవత్సరం నేనూ ఇద్దరు బిడ్డర్నే కన్నాను.” అన్నదా
పూల చెట్టు, తనకున్న రెండు పూల వేపూ ప్రేమగా చూస్తూ!. (ధన్యవాదాలు
- డా॥ రావూరి భరద్వాజ. పేజీ.28.) ఇందులో కుటుంబ నియంత్రణ
ఆవశ్యకతను, అధిక సంతానం వల్ల కలిగే ఇబ్బందులని తెలియజేసారు.
3... ఒకోసారి రచయిత స్వీయానుభవాన్ని, అనుభూతిని
ప్రత్యక్షంగా పాఠకులతో కవితానికలో పంచుకుంటాడు.
ద్మారావు
ఉదా:
"నేను - మరీ ఆశాపాతకుణ్ని కాదు గానీ, కాస్త మొండివాణ్ని.
మెడలోతు ఊబిలో కూరుకుపోయినప్పుడు, వొడ్డెక్క గలిగితే
.
చాలుననుకున్నాను. "వొడ్డుమీద కొచ్చాక ఉన్న చోటనే తెలుసు
తెలుసు
ఉండిపోకుండా కాస్త ముందుకు జరగగలిగితే బావుండు
ననుకొన్నాను. అలా జరుగుతూ, జరుగుతూ మిట్టల మీదుగా,
గుట్టల మీదుగా, కొంచెం ఎత్తు దాకా చేరగలిగాను. ఊబి
నుండి ఇక్కడి దాకా ప్రయాణించడంలోని అనుభవాలను,
పాత్రల పరం చేసి, చిన్నవీ, పెద్దవీ కథలు రాశాను. ఊబిలో
ఉన్నప్పుడు నేను చూసింది. కొంచెం...ఒడ్డు కొచ్చాక
నాక్కనిపించింది ఇంకొంచెం. గట్టుమీంచీ, మిట్టమీంచీ నేను
చూడగలుగుతున్నది మరి కొంచెం. ఇంకాస్త ఎత్తుకెళ్ళి, అక్కడ
నించి కనిపించే ప్రపంచాన్ని కూడా అక్షరబద్ధం చేయాలని
ఆశపడుతున్నాను.
(ఏదీ నాదికాదు -15వ పేజీ)
వి.రావూరి భరదా
ని
జ.
మరో ఉదా :
“ఎవరు నమ్మినా, నమ్మకపోయినా, కొన్ని నిజాలను మీ
ముందుంచుతున్నాను. ఎంత వొదిగొదిగి బతుకుతున్నా నాకింకా
తో శత్రువులున్నారు. అప్పుడప్పుడు వీరి దర్శనమవుతూ ఉంటుంది. ఎంత
జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు సుస్తీ చేస్తుంటుంది.
నా శత్రువుగారి పేరు అసూయ.
వాదాలు నా సుస్తీ గారి పేరు నిరాశ..
నా .
(ఏదీ నాది కాదు. - డా|రావూరి భరద్వాజ. పేజీ 29).
ii. ఒక పాత్ర సంభాషణతోనే కవి తన్న
భావుకతను కవితానికగా కూర్చే పద్దతి.
ఉదా:
“మీకు చిటికెడంత ఓర్పు నిద్దామనీ, పిడికెడంత
ధైర్యమిద్దామనీ, వెలుగుతున్నాను గానీ, సరదా కోసమూ:
గాధు, నా గొప్ప చెప్పుకోవడం కోసమూ, కాదు” అన్నదా
చిరుదీపం, తన చుట్టూ, చిక్కగా ముసిరిని ముదురు
చీకట్లతో,
(వెలుతురు చినుకులు - చాలు రావూరి భరద్వాజ, పేజీ 21.)
4.1. ఒకోసారి కవి ఏ సామాజిక సందేశంగాని,
క స్వీయానుభవాన్ని గానీ చెప్పకుండా ప్రకృతిని కవితాత్మకంగా,
వర్ణనాత్మకంగా చెప్పే వద్ద తికూడా కవితానికలలో
అనుసరించవచ్చు.
ఉదా:
“తమనిండా ఉన్న తువ్వర మొగ్గలను, చినుకు పూలను వొంపేశాక,
. మబ్బు గంపలు మాయమయిపోయాయి. ఆ
* (రవ్వలు - డా|| రావూరి భరద్వాజ. పేజీ 11)
మరో ఉదా : “మీరు గమనించారో లేదో - వెన్నెల రాత్రులలో,
ఏవూరి చెరువులో నయినా, వెండి కత్తులు తేలుతూ ములుగుతూ
-
ఉంటాయి.” (వెలుతురు చినుకులు - డా|| రావూరి భరద్వాజ. పేజీ 3.)
ii. కవితానికలలో హైకూ దృశ్యాలు ఎన్నో
సుకొంటూ,
ముకొంట.....
కనిపిస్తాయి.
* వెన్నెల వరదలతో, ఆకాశమంతా తెల్లగా
ఎండిపోయిందీ రాత్రి!
(తెలుసుకొంటూ, తెలుసుకొంటూ... - డా||రావూరి
ఆభరద్వాజ, , పేజీ 78.)
ను మరో ఉదా: "ఇక్కడున్న నేనూ, అక్కడున్న నెలవంకా,
హాయిగా కబుర్లాడుకొంటున్నాం. మా కమ్మని కబుర్లు విని,
డా. రావూరి భరద్వాల, కడుపు మండిన గోండ్రు కప్ప చెరువులోకి కాలుమోపింది.
* అలలు లేచాయి. నెలబాలుడు విరిగిపోయాడు.”
(ఏదీనాదికాదు- డా||
రావూరి భరద్వాజ. పేజీ 26.)
ఉదా
6. ఒకోసారి మహనీయులు చెప్పిన జీవిత
సత్యాల్ని అర్ధవంతంగా, సవివరంగా కవితానికి
రూపంలో చెప్పే విధానాన్ని అనుసరించవచ్చు.
A
"'చావు' అంటే, నాకెంత మాత్రం భయం లేదు. కానీ
చనిపోవాలని కూడా లేదు. చాలాకాలం బతకాలని ఉంది.
చాలా చాలా కాలాలపాటు బతకాలని ఉంది.. అలా
జీవించడానికి మార్గమేమన్నా ఉన్నదా?" అన్నారాకరు,
“ఉన్నది పదీ పదుల సదుల పదుల కాలాలపాటు,
కనీసం - పదికాలాల పాటు, నిలిచి పోగల సత్కార్యాలు
చేయండి, ఒక దుఃఖితుని కన్నీరు తుడవండి. ఒక బాధితుని ఓదార్చండి.
ఒక అనాధను అక్కున చేర్చుకోండి. ఒక అభాగ్యునికి అండగా నిలవంది.
ఒక ఆర్తుని ఆవేదనలో భాగం పంచుకోండి. వారి జ్ఞాపకాల్లో మీరు జీవిస్తారు,
మరణాన్ని జయించడానికి, నాకు తెలిసిన వొకేవొక మార్గం, షధమందికి
పనికివచ్చే, మంచి పనులు చేయడం, చేస్తూ చేస్తూ చేస్తూ ఉండడం”
అంటారు స్వామి పరమానంద!.
(ధన్యవాదాలు - డా॥ రావూరి భరద్వాజ, పేజీ 30)
మరో ఉదా: "భగవంతునికి బొత్తిగా బుద్ధిలేదనడానికి, "ఈ
వొక్కటదాహరణ చాలాదా? ఇంకేమీ పనిలేనట్టు ఇక్కడున్న
చెట్లన్నింటికీ, అంతేసి ముళ్ళను మొలిపించకపోతే మాత్రమేం?” అన్నాడొక
బాటసారి.
“కర్కశ కంటకాలలో, చూడడానికే భయం కలిగించే, ఈ చెట్లను
కూడా, రంగురంగుల వాసనల్ని విరజిమ్మే పూలతో అలంకరించిన ప్రభువు
దయాహృదయాన్ని, ఎలా వర్ణించడం?”
అన్నాడు రెండవ ప్రయాణీకుడు,
ఈ ఇద్దరి మాటలు విన్న స్వామి దయానంద, చిన్నగా నవ్వుకొన్నారు.
(చినుకులు- వై. జితిన్ కుమార్. పేజీ 21)
గాయకంగా సాగే
.
--


గాంధీ జయంతి సందర్భంగా..‌‌.


భరతవర్షంబీను వజ్రాల ధనరాశి
తూకంబునకు పెచ్చుదూగువాడు
మూడుమూర్తుల దయాభూతి ప్రత్యంగాన
తాండవించెడు పవిత్రస్వరూపి
పదివేలయేండ్ల లోపల ధరాదేవత,
కనియెఱుంగని జగన్మునివరుండు
అనుగు దమ్ములు కోరుకొను స్వరాజ్యార్ధమై
పస్తుండి శుష్కించు పండుముసలి

గోచిపాత గట్టుకొని జాతి మానంబు
నిలిపినట్టి ఖదరు నేతగాడు
విశ్వసామరస్య విజ్ఞాన సంధాత
కామిత ప్రదాత, గాంధితాత!

తాత్పర్యము : భారతదేశమునందలి సంపదలకన్న మిన్నయైనవాడు; దయాగుణము రాశిబోసినట్లున్నవాడు; పదివేల ఏండ్లుగా భూదేవి ఇటువంటి వానిని కనలేదు. తన వారికై, వారి స్వేచ్ఛకై పస్తులుండి దేహమును శుష్కింపజేసిన పండుముసలి. అంగవస్త్రమే కట్టుకొని జాతి అభిమానము కాపాడిన ఇద్దరు నేతగాడు; విశ్వమంతటా సామరస్య బీజములు నాటి కోరికలు తీర్చునట్టి మహావ్యక్తి గాంధీ తాత!

విమత భూపతుల దోపిడి గుందు జాతిలో
దీపంబు బెట్టిన దినకరుండు
మానవత్వమును భూమండలంబున నెల్ల
చాటిన యాచార్య చక్రవర్తి
సత్యాగ్రహంబను శస్త్రచాలన విద్య
భువికి దెచ్చిన మహాపురుషమౌళి
నిమ్న జాతుల కంటి నీరంబు దుడిచి యా
శ్వాసించు నిఱు పేద బాంధవుండు

పండ్లు నూరుచున్న బహుమతంబులలోన
సహనవిద్య నేర్పు సాధకుండు
భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవంబు
కామిత ప్రదాత, గాంధి తాత

తాత్పర్యము : ఆంగ్లేయుల దోపిడీకి బాధపడు జాతి, అంధకారములో దీపము
పెట్టిన సూర్యుడు గాంధీ. భూమండలమంతా మానవత్వపు గొప్పదనము చాటిచెప్పిన
ఆచార్యుడు. సత్యాగ్రహమనెడి అస్త్ర శస్త్రవిద్యను భూమి పైకి తీసుకువచ్చిన మహామనీషి,
దళితుల కంటి నీరుతుడిచి, నిరు పేదలను ఆదరించు బంధువు. అనేక మతములు
పగలతో రగులుచున్నవేళ వాటికి సహనమును నేర్పినట్టి సాధకుండు. భార్య, పిల్లలున్న
ప్రత్యక్ష దైవము కామితార్థము తీర్చునట్టి గాంధీ తాత.

అనిసెట్టి సుబ్బారావు జయంతిభయం భయం బ్రతుకు భయం
భయం బ్రతుకు భయం భయం
అన్నా మనకీలోకం
పన్నిన పద్మవ్యూహం
ఆకలితో హతమయ్యే
ఆస్థి పంజరాలు మనం
పసిపాపల కెడబాటై
బ్రతుకీడ్చే ఆనాధులం

అన్నా మనకి లోకం
పన్నిన పద్మవ్యూహం

గతమంటే కారు వెగటు
రేపంటే తగనిభయం
ప్రళయం -- ప్రళయం
ప్రళయం యీ ప్రస్తుతం
క్షణక్షణం దుర్మరణం

అన్నా మనకీ లోకం
పన్నిన పద్మవ్యూహం

గతిలేని మానవులకు
చితికిన సంసారాలకు
కష్టాలే బంధువులా?
కన్నీళ్లే కానుకలా?

ఈకఠోర నరకం. ఈకఠోర నరకం
ఈకఠోర నరకం - ఇక
ఏనాటికి మారదా?
ఇంకేనాటికి మారదా?
ఇంకేనాటికి మారదా?||
(అని పెట్టి) పెంపుడు కొడుకు  1953
./////////////////

ఇంతేలే, యీ బ్రతుకింతేలే
ఇంతే, యీ బ్రతుకింతేలే

కలత చెందినా సుఖమేలేదులే
యింతేలే యీ బ్రతుకింతేలే

వికసించకయే రాలినవూలూ
పేదల బ్రతుకులు కూలిన గోడలు !

ఏమాసించిన ఎంత శ్రమించిన
బతుకింతేలే చింతలపాలే
లోక పురీతీ యింతేలే!

ఇంతేలే యీ బ్రతుకింతేలే !

తనువులు కృంగే బాధల మోపులు
పేదల బతుకులు ఎండిన పొదుగులు !

చితికినగుండెలో - చీకటినిండీ
జీవితమే చెరసాలోయీ
నిరు పేదలకూ గతియింతేలే
లోపుతీరు యింతేలే
ఇంతేలే యీ బ్రతుకింతేలే
కలత చెందినా సుఖమే లేదులే!
ఇంతేలే యీ బ్రతుకింతేలే
~ అనిసెట్టి సుబ్బారావు.
(నిరుపేదలు-1954)
//////////
పేదలు -శ్రీశ్రీ కవిత

అంతేలే, పేదల గుండెలు!
ఆశ్రువులే నిండిన కుండలు!
శ్మశానమున శశికాంతులలో
చలిబారిన వెలిరాబండలు!

అంతేలే, పేదల మూపులు!
అణగార్చగ విధి త్రోద్రోపులు!
పయోధితట కుటీరములవలె
భరియించవు బాధల మోపులు!

అంతేలే, పేదల చేతులు!
శ్లథ శైశిర పలాశ రీతులు!
విశుష్కములు, పరిపాండురములు!
విచలించెడి విషాద హేతులు!

అంతేలే, పేదల కన్నులు!
వినమ్రములు, వెతల వ్రణమ్ములు!
తుపానులో తడిసిన జడిసిన
గోమాతల కన్నుల తమ్ములు

అంతేలే పేదల బ్రతుకులు!
తిరిపెమునకు పిడికెడు మెతుకులు!
తెరు వెరుగని దీర్ఘరాత్రిలో
ఉందండి ఆపాద
తల పగిలెడి తలపుల గతుకులు!

(ఎమైల్ వెర్ హ్రేరెన్ వ్రాసిన లెస్ పావ్ రెస్ అనే
గీతానికి అనువాదం)1939
////////
జన్మ మొత్తితిరా 
అనుభవించితిరా
బ్రతుకు సమరంలో
పండిపోయితిరా

-అనుపల్లవి
మంచి గెలిచి మానవుడుగ మారినానురా

చరణం 1:
స్వార్ధ మను పిశాచి మదివి
స్వారి చేసెరా |
బ్రతుకంతా చెలరేగిన
ప్రళయ మాయెరా!
దైవ శకై మృగత్వమునె
సంహరించెరా
సమర భూమి నా హృదయం
శాంతి పొందగా

చరణం 2
క్రోథ లోభ మోహములే
పడగలె తెరా!
బుసలు కొట్టి గుండెలోన
విషము గ్రక్కెరా
ధర్మజ్యోతి తల్లి వోలె
ఆదరించెరా ! -నా
మనసె దివ్య మందిరముగ
మారిపోయెరా

చరణం 3-
మట్టి యందే మాణిక్యము
దాగి యుండురా
మనిషి యందె మహాత్మునీ
కాంచ గలవురా
ప్రతి గుండెలొ గుడి గంటలు
ప్రతిధ్వనించురా : ... ఆ...
దివ్య స్వరం .... న్యాయ పథం
చూపగలుగురా!

జన్మ మెత్తితిరా
అనుభవించితిరా
బ్రతుకు సమరములో
వండిపోయితిరా !
మంచి గెలిచి మానవుడుగ
మారినానురా

కొసరాజు


తెలుగు జానపదాలకు సినిమా సొగసులను అద్దినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. రైతు కుటుంబంలో జన్మించినవాడు కొసరాజు. గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామంలో కొసరాజు జన్మించారు. తెలుగు సాహిత్యం, వురణ, ఇతిహాసాలను చదువుకున్నారు. రైతుబిడ్డ (1939) చిత్రంలో కథానాయకునిగా కొసరాజు నటించాడు. కె.వి.రెడ్డి నిర్మించిన పెద్ద మనుషులు(1951) చిత్రంతో కొసరాజు గేయ రచయితగా మారారు. కొసరాజు సుమారు 350 చిత్రాలకుగాను 3,000 పాటలవరకు రచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 1984లో రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. జానపద కవి సార్వభౌమ, కవిరత్న బిరుదులుతో గౌరవింపబడ్డారు. ఏరువాక సాగారో..., ఇల్లరికంలో ఉన్నమజా.‌.‌., అయ్యాయ్యో చేతిలో డబ్బులు పోయనే పాటలు.

1వ పాట:
అనుకున్నదొక్కటి అయినది ఒకటి
బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట
గుట్టు నిముషములో తెలిసిందిలే
గుండె దిగజారి నిలిచిందిలే
(మంచి మనసుకి మంచి రోజులు,-1958)

2వ పాట:
అపాయమ్ము దాటడాని కుపాయమ్ము కావాలి!
అంధకార మలమినపుడు వెలుతురుకై వెతకాలి!
ముందు చూపులేనివాడు- ఎందునకూ కొరగాడు.
సోమరియై తిరుగువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు !

మత్తువదలరా - నిద్దుర మత్తువదలరా !
ఆ మత్తులోనపడితే - గమ్మత్తుగ చిత్తౌదువురా
జీవితమున సగభాగం - నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం - చిత్తశుద్ధి లేకపోవు
అతి నిద్రాలోలుడు - తెలివిలేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక - వ్యర్థంగా చెడతాడు

సాగినంతకాలం - నా అంతవాడు లేరందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు
బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరించగలరు

చుట్టు ముట్టు ఆపదలను - మట్టుబెట్ట బూనుమురా !
పిరికి తనము కట్టి పెట్టి - ధైర్యము చేపట్టుమురా !
కర్తవ్యము నీ వంతు - కాపాడుట నా వంతు !
చెప్పడమే నా ధర్మం - వినకపోతే నీ ఖర్మం !
(శ్రీకృష్ణ పాండవీయం-1966)

3వ పాట:
ఏ నిమిషానికి ఏమి జరుగునో
ఎవ రూహించెదరూ
విధివిధానమును తప్పించుటకై
ఏవరు సాహసించెదరూ

కంచెయె నిజముగ చేను మేసినా
కాదను వారెవరూ
రాజే యిది శాసనమని పల్కిన
ప్రతిఘటించు వారెవరు

కరుణమయులిది కాదనలేరా
కఠిన కార్య మనబోరా
సాధ్యులకెపుడూ వెతలేనా
తీరని దుఃఖపు కథలేనా

ఇనకులమున జనియించిన నృపతులు
యీ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిలిచి
విడ్డూరముగా చూచెదరా

ఎండకన్ను ఎరుగని యిల్లాలికి
ఎందుకో యీ వనవాసాలూ
తరచి చూచినా బోధపడవులే
దైవ చిద్విలాసాలూ

అగ్ని పరీక్షకె నిల్చిన సాధ్విని
అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయె జనవాక్యమ్మని
అనుసరించుటే ధర్మమా
(లవకుశ-1963)

4వ పాట:
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే
అవునూ సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయిగలిపితే
ఎదురేమున్నదీ మనకూ కొదవేమున్నది
(తోడికోడళ్ళు-1957)

5వ పాట:
రమణయ్య : అయ్యయ్యో చేతులొ డబ్బులు పోయె నే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా వూడింది,
సర్వమంగళం పాడింది.
పెళ్ళాం మెడలో నగలతో సహా
తిరుక్షవరమైపోయింది.
:అయ్యయ్యో:

సదానందం : ఆ మహాఁ మహాఁ నలమహా రాజుకే తప్ప లేదు
భాయి ఓటమి తప్పలేదు భాయి
రమణయ్య : మరి నువ్ చెప్ప లేదు భాయి
సదానందం : అది నా తప్పుగాదు భాయి
తెలివి తక్కువగ చీట్లు పేకలో దెబ్బతింటివోయి
బాబూ నిబ్బరించవోయి || అయ్యయ్యో

రమణయ్య : నిలువు దోపిడీ దేవుడి కిచ్చిన ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది - గోవిందా గోవింద
రామకోటి : చక్కెర పొంగలి చిక్కేది
రమణయ్య - ఎలెకన్లలో ఖర్చు పెడితే ఎం. ఎల్. ఏ. దక్కేది
సదానందం : మనకు అంతటి లక్కేది. " అయ్యయ్యో

సదానందం : గెల్పూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు
రమణయ్య: ఇంకా పెట్టుబ డెవడిచ్చు
బొడ్డపాటి : ఇల్లు కుదువ బెట్టవచ్చు
సదానందం : ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువుతీరవచ్చు
రమణయ్య: పోతే.
సదానందం : అనుభవమ్మువచ్చు
రమణయ్య : చివరకు జోలె కట్టవచ్చు || అయ్యయ్యో
(కులగోత్రాలు-1962)