-->

Thursday, September 30, 2021

శ్రీ శ్రీ కవిత 'నగరంలో వృషభం'


 
నగరంలో వృషభం నగరం నడివీధిలో వృషభం తీరుబాటుగా గత జన్మ సంస్కృతులు కాబోలు కనులరమోడ్చి నెమరేస్తూ కదలకుండా మెదలకుండా నగరం హృదయంలో వృషభం దారికి హక్కుదారు తానే అయినట్టు పరిత్యజించి కాలానికి బాధ్యత పరిహసించి నాగరికత పరుగు నిలబడింది నేనే రాజునని ఎవరు పొమ్మనగల రీ ఎద్దుని ఎలా చూస్తోందో చూడు ఏయ్ ఏయ్ మోటారు కారూ ఏఁవిటేఁవిటి నీ తొందర భాయ్ భాయ్ సైక్లిస్ట్ భద్రం సుమీ ఎద్దు నిన్ను తప్పుకోదు యంత్ర విరోధి అహింసావాది శాకాహారి మద్యనిషేధ ప్రజ్ఞాశాలి నగరం నడివీధిలో నాగరికత గమనాన్ని నిరోధిస్తూ ఇలా యెంత సేపయినా సరే ఈ యెద్దు నిలబడగలదు ఎద్దుకి లేకపోతే బుద్ధి మనిషి కేనా ఉండొద్దా? ~ శ్రీశ్రీ ======================= "Talathoti" అనే నా Youtube Channel ను Subscribe చేసుకోని వారైతే www.youtube.com/TALATHOTI పై లింక్ ను ఇప్పుడే Subscribe చేసుకొండి! నా Facebook page అయిన " Telugulitt" Page www.facebook.com/telugulitt ని పై లింక్ క్లిక్ చేసి ఇప్పుడే Follow కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే Like, Share , Comment చేయండి! ~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ www.talathoti.com www.litt.in WhatsApp:9963299452 ======================= బమ్మెర పోతన(స్తుతి )పద్యాలు-01: https://youtu.be/FQlNiP5Kpf0 బమ్మెర పోతన (గజేంద్ర మోక్షం) పద్యాలు-02: https://youtu.be/namITxBLR8w బమ్మెర పోతన (ప్రహ్లాదుడు) పద్యాలు-03: https://youtu.be/R7mZQl97Q4g బమ్మెర పోతన (వామనావతారం) పద్యాలు-04: https://youtu.be/nhJcaf34g1Q బమ్మెర పోతన (కృష్ణలీలలు) పద్యాలు-05: https://youtu.be/px32EhbqD3Y తిక్కన పద్యాలు శ్రీకృష్ణుడు రాయభార సందర్భం: https://youtu.be/XeAZ3o_Wq4g తిక్కన పద్యాలు : https://youtu.be/vzZTEYNfdM8 తిక్కన విదురుని నీతి పద్యాలు: https://youtu.be/seQt6V4-4Hg ఎర్రన పద్య సూక్తులు: https://youtu.be/SVBrAH6ifUI ఎర్రన స్ఫురదరుణాంశు పద్యం-01: https://youtu.be/2LNMSxTYr6g భాస్కర రామాయణం పద్యాలు: https://youtu.be/fdoF2KiB2G0 పోతన కంజాక్షు పద్యం: https://youtu.be/bqc534VeZ64 అల్లసాని పెద్దన పద్యాలు: https://youtu.be/ANwoXDTyvfo నన్నయ పద్యాలు: https://youtu.be/NVy-SmtX00Q నన్నయ నుతజలపూరితంబులగు పద్యం: https://youtu.be/Ai5qN2lgucw నంది తిమ్మన పద్యాలు: https://youtu.be/jw-M_aCDRi4 తెనాలి రామకృష్ణుని చాటు పద్యాలు: https://youtu.be/nB3qQu6DS08 ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోని కొన్ని పద్యాలు: https://youtu.be/9Vl7N9ddbHc భక్త కన్నప్ప కథ: https://youtu.be/rVdIzuC3Crc కవిసార్వభౌముడు శ్రీనాథుని పద్యాలు: https://youtu.be/dNTFV46hIac తిరుపతి వేంకట కవుల పద్యాలు: https://youtu.be/7R4f-PrBN0U దువ్వూరి రామిరెడ్డి రహస్య పద్యం: https://youtu.be/2rzaYc-H1fI భోజరాజీయంలోని గోవ్యాఘ్ర సంవాదం: https://youtu.be/5tBmtnadEiU గుర్రం జాషువా సాలీడు పద్యాలు: https://youtu.be/f9sAjaKX-x4 అమృతాంజనం పై జాషువా చమత్కార పద్యం: https://youtu.be/JYIk2Qlbiqs జాషువా "పిరదౌసి లేఖ": https://youtu.be/l_6zkAma0bg మాల దాసరి పూర్తి ఇతివృత్తం: https://youtu.be/wszLeAadxaQ విశ్వనాథ సత్యనారాయణ: https://youtu.be/CkldUQA7eMQ విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం పద్యాలు: https://youtu.be/hUmEIq82zrg కరుణశ్రీ పద్యాలు: https://youtu.be/dtHloTBd6Zc గురజాడ అప్పారావు: https://youtu.be/7QohobynXig గురజాడ"పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" గేయం: https://youtu.be/nVzEMGuRc_I శ్రీశ్రీ దేశ చరిత్రలు: https://youtu.be/akyvkqJwbKk ::సినీ సాహిత్యం:: ఆచార్య ఆత్రేయకు సంబంధించిన ఆసక్తికర విషయాలు: https://youtu.be/dZMHSI4UF1M జాలాది 'యాతమేసితోడినా ఏరు ఎండదు' పాట విశ్లేషణ: https://youtu.be/OjGAI1VZM1U మైలవరపు గోపి "చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు" పాట విశ్లేషణ: https://youtu.be/wMSiRH1YrEQ మైలవరపు గోపి "గాంధీ పుట్టిన దేశం"పాట విశ్లేషణ: https://youtu.be/hIrEnAdJ2KI సినారె గజల్స్ గూర్చి: https://youtu.be/5q_4J5hL3Cw ::కథా సాహిత్యం:: రావిశాస్త్రి"మాయ"కథ: https://youtu.be/CUJ3F0PgGMU మల్లాది రామకృష్ణ శాస్త్రి "గోరంత గొప్ప" కథ: https://youtu.be/ntLnrs2w9Ks ::గేయ కవిత్వం:: బోయి భీమన్న"ఏది హిందూ ఏది ముస్లిం" పాట: https://youtu.be/uVqckn_oVdI ::డాక్యుమెంట్స్:: మానవతా వాది దేవరకొండ బాలగంగాధర తిలక్: https://youtu.be/P4t2UZofyas చెట్టు కవి ఇస్మాయిల్ చిలకలు వాలిన చెట్టు కవిత, హైకూలు: https://youtu.be/tJe_QVg9e5I అద్దేపల్లి జయంతి: https://youtu.be/NEZWXvhttOU అద్దేపల్లి తూర్పునాహ్వానిస్తున్న సంజె గుమ్మం కవిత: https://youtu.be/6Hn3XMURaVI ఆరుద్ర శుద్ధ మధ్యాక్కరలు ప్రక్రియ: https://youtu.be/WY9LciDSMLg ఆరుద్ర జయంతి: https://youtu.be/gLgcv2RXciA వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు: https://youtu.be/kCpfqFnYIEs తెలుగు భాషపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వ విధానాలు: https://youtu.be/f-NEjNxGowY గిడుగు సవర వ్యావహారిక భాషల కృషి: https://youtu.be/kCpfqFnYIEs గిడుగు: https://youtu.be/Shy54pyQuw8 తెలుగు భాష పై ప్రభుత్వం చిత్తశుద్ధి: https://youtu.be/f-NEjNxGowY ::సాహిత్యోపన్యాసాలు:: పెద్దిభొట్ల సుబ్బరామయ్య "ఉత్తమ కథా లక్షణాలు" సాహిత్యోపన్యాసం: https://youtu.be/dzt8K42wcwk డాక్టర్ కడియాల రామ్మోహన్ రాయ్ సాహిత్యోపన్యాసం"విమర్శంటే: https://youtu.be/v0G5dMWNk4I


బోయ జంగయ్య కథ "చేపల చెరువు"

బోయ జంగయ్య కథ "చేపల చెరువు"
::వన్ లైన్ స్టోరీ ::
చేపలను ఇంకా చెర్లో ఉంచితే సగానికి సగం తరుగు వస్తాయని, అధికారులను డబ్బుతో కొనేస్తే ఈ దేశంలో ఈ పనైనా జరిగిపోతుందని బాగా తెలిసిన చేపల చెరువు కాంట్రాక్టర్ అధికారులకు డబ్బు మూట అందించి చెరువులో నీళ్ళు వదిలివేయాలని చూస్తాడు.

  పణలు పణలుగ పాలుపోసుకుని గింజలు పసుపు రంగు మారుతున్న దశ. నీరు వదిలితే కత్తెర పంట వెయలేమని మరోవైపు రైతులు పట్టు పట్టారు. ఈ విషయమై అధికారుల వద్ద అర్జీలతో రైతుల పోరాటం!!
ఈ దేశంలో దుర్మార్గాలు చేయాలంటే, చేయకుండా అడ్డుకోవాల్సిన వారు మౌనంగా ఉంటే చాలు మారణహోమాలుసైతం నిర్విఘ్నంగా జరిగిపోతాయని నిరూపించిన ఘటనలే  కారంచేడు , చుండూరు!  వాటిలాగే లంచాలు తిన్న అధికారులు మౌనం వహించడం ద్వారా ప్రశ్నించిన రైతుకు కాంట్రాక్టర్ అనునూయుల చేతుల్లో దెబ్బలు తినడం...చివరికి కాంట్రాక్టర్ నీళ్ళు వదిలి చేపలు పట్టుకొని సొమ్ము చేసుకోవడం జరిగిపోతాయి.

సంక్షిప్త కథ:
డాలర్లు పండించడం కోసం  ఏడాది పొడవునా పంటలు పండించుకోదగిన సారవంతమైన భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మారుస్తున్న వైనం తెలియనిది కాదు! చెరువంటే ఇలాంటివి కాదు. కొన్ని పల్లెల్లో ఉండే సహజ సిద్ధమైన చెరువుల్లాంటి చెరువే.
ఒకవైపు చెరువులో సమృద్ధిగా నీళ్ళు, వాటిలో బలిసిన చేపలు! ఆ చెరువు గట్టు క్రిందే మరోవైపు పాలు పోసుకుంటున్న దశలో వరి కంకులతో వరిపంట!! సగం కంటే ఎక్కువ నీటిని వదిలితే గాని చెరువులోని చేపలను పట్టడానికి కుదరదు గనుక, కాంట్రాక్టర్ బలిసిన ఆ చేపలను పట్టుకుని సొమ్ము చేసుకోవాలని అతని ఆరాటం!

కథా రచయిత బోయ జంగయ్య ఈ కథలో ఊరు తీరుని వర్ణిస్తున్నాడు. పార్టీ జెండాల దిమ్మెలు...వాటిపై ఆయా పార్టీలు గుర్తులు. 
కథకి కవిత్వానికున్న పరిధి కంటే ఎక్కువ విస్తృతి కథా వస్తువుబట్టే కాకుండా సందర్భానుసారంగా వర్తమాన, సామాజిక అంశాలను కథలు చెప్పే అవకాశం ఉంది. అటువంటి వర్ణనే ఇక్కడ.  కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనుషులు అనేక వర్గాల వారిగా విభజింపబడినట్లు, డబ్బుని బట్టి విభజించబడిన విధంగా, రాజకీయ పార్టీలను బట్టి కూడా పల్లెల్లోనూ మనుషులు విభజింపబడడే కాకుండా తాత్కాలిక తాయిలాలకు ఎన్నికల్లో ఎలా ఉంటారో చెబుతూ...
" చెరువు కట్ట మీద నుంచి ఊళ్లోకి పోతూ ఉంటే మొట్టమొదట ఓ ఓపెన్ గ్రౌండులో
వివిధ రాజకీయ పార్టీల జెండాల దిమ్మెలు. వాటిపై ఆయా పార్టీల గుర్తులు. ఆ గుర్తు కింద గుంపులుగా విడిపోయి ఉన్నారు. ఏ పండుగకు ఆ దేవున్ని కొలిచినట్టుగ ఏ పార్టీ మీటింగ్ కు ఆ పార్టీ వాళ్ళు గుమికూడి మీటింగ్ జరుపుకుంటారు. పండుగనాడు తాగినట్టె ఆ మీటింగ్ నాడు కూడా తాగి తందానలాడతారు. అందువల్ల ఉన్నా, లేకున్నా పండుగలన్నా పార్టీ మీటింగులన్నా ఆ ఊరి జనానికి ఎంతో ఇష్టం" అని నేటి పల్లెల్లో జరిగే తంతును కథకులు బోయ జంగయ్య చెబుతాడు. అలాగే... కులాల వారీగా ఉన్న వాడలను వర్ణిస్తూ యాదవ, కురుమ ఇళ్ళు. ఆ తర్వాత కాపుతనపు రైతుల ఇళ్ళు. అటు తర్వాత గౌండ్ల వాళ్ళ ఇళ్ళు. ఆ ప్రక్క రజకులు,క్షురకుల ఇళ్ళు,  కుమ్మరి ఇళ్ళు. చివర ఒక వైపు దళితుల ఇళ్ళు అని ఊరులోని వాడల తీరును, వారి వృత్తి బతుకుదెరువు సంబంధమైన వస్తు సామాగ్రి, పశు సంతతి గూర్చి ప్రస్తావిస్తాడు.

ఊరి రైతుల అర్జీని తీసుకున్న ఎమ్మార్వో ఆర్.ఐ.ను చెరువు సమస్యను పరిష్కరించడానికి పంపిస్తాడు‌. రైతులు చెరువు దగ్గర ఆర్.ఐ. కోసం ఎదురుచూస్తుండగా కొంతసేపటికి ఆర్.ఐ. వచ్చి  రైతులు వ్రాసుకున్న అర్జీ లోని విషయాల్ని చదివి వినిపిస్తాడు. చెరువులోనే నీళ్లు కత్తెర పంట తర్వాత వదలాలని తుమ్మలగూడెం రైతుల విన్నపంగా చదువుతాడు. ఈలోపు అక్కడికి గ్రామాధికారి వస్తాడు. రైతులకు దూరంగా చెరువుగట్టు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆర్ .ఐ. గ్రామాధికారి చంకలో ఉన్న బ్యాగును చూస్తూ విషయం కనుక్కున్నాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ముడులను పుచ్చుకున్న గ్రామాధికారికి  ఆర్.ఐ.కు అర్థమయ్యేలా విషయం చెప్తాడు. అర్థం చేసుకున్న ఆతని ముఖం విప్పారింది‌. " నేను చూసుకుంటానులే" అని కాంట్రాక్టర్ డబ్బుకు అమ్ముడు పోయిన ఆర్.ఐ.  రైతులకు ఉత్తుత్తి భరోసా ఇచ్చి వెళ్తాడు.
ఊళ్లోకి వచ్చిన జీపు మైసమ్మ గుడి దగ్గర ఆగుతుంది. అందులోంచి లావుపాటి వ్యక్తి దిగుతాడు. మైసమ్మను పూజించిన తర్వాత ఆతని దృష్టి చెరువు, అందులోని చేపలపై పడుతుంది. అతనికి కదిలే చేపలు వందరూపాయల నోట్లు కదులుతున్నట్లు అనిపించాయి.
సగం కంటే ఎక్కువ నీటిని వదిలితే గాని చేపలు పట్టడానికి వీలుపడదు అని మాట్లాడుకుంటారు.
       నీరు వదిలితే కత్తెర పంట వేయలేమని రైతులు నీటిపారుదలశాఖ చుట్టూ, ఎమ్మార్వో చుట్టూ తిరుగుతూ అర్జీలతో విన్నవించుకున్నారు.
రైతులు నీళ్ళను వదలడానికి వీలుపడదని చెప్పిన విషయాన్ని కాంట్రాక్టర్ గుమాస్తా తన యజమాని ఫోన్లో చెప్పగా "డబ్బులకు ఆశపడని మనిషి, దెబ్బలకు భయపడని మనిషి ఉండర్రా బాబు"అని అవన్నీ నేను చూసుకుంటగా అని బదులిస్తాడు.
చెరువు గట్టు మీద ఉన్న కాంట్రాక్టర్ గుమస్తా చెరువులో కదిలే చేపలను చూసి "ఈసారి పైసలె పైసలు అనుకుంటూ కట్టకిందికి చూశాడు. వరిచేను చాలా ఒత్తుగా పెరిగి, పణలు పణలు పాలు పూసుకుని గింజలు పసుపు రంగులోకి మారుతున్న దశ. మరో పది రోజుల్లో తెరిపి లేకుండా నీరు అందితే గాని చేతికి రావు. అప్పుడు కాని పశువులకు గడ్డి, మనుషులకు తిండి రాదు. ఈ పరిస్థితి ఎట్లా గట్టెక్కుతుందో అనుకున్నాడు."

వారి పనికి అడ్డొచ్చే రైతులు పేర్లను చెరువు కాపలాదారుడ్ని తెలుసుకుని ఆ కాంట్రాక్టర్ గుమాస్తా ఒక నోటు బుక్ లో రెండు పేజీలలో రాసుకున్నాడు.

ఊళ్లో ముఖ్యమైన వాళ్ల ఇళ్లకు లీటర్ లీటర్ సారా, రెండు రెండు తెల్ల చేపలు చేరాయి. రెండు రోజులు పండగ చేసుకున్నారు. ఇవి అందిన తర్వాత నీళ్లు వదలడానికి వీల్లేదని పలికిన కొందరి రైతుల స్వరం మారింది.
ఒక పెద్ద రైతు గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. రైతులందరూ రాత్రి మిమ్మల్ని కలవడానికి వస్తానన్నారు అనే విషయాన్ని గ్రామాధికారికి తెలిజేస్తాడు.
అప్పుడే గ్రామాధికారి దగ్గరకు కొందరు రైతులు వస్తారు. మనుషులతో కాంట్రాక్టర్ కొట్టించడం గూర్చి ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించినట్లు చెబుతారు. దెబ్బలు తిన్న రైతులు ఆ దెబ్బలు గ్రామాధికారికి చూపుతారు. ఆర్. డి. ఓ. గారు వస్తున్నారని, చెరువు విషయం తేలిపోతుందని చెబుతారు. ఇదంతా గమనిస్తున్న పెద్ద రైతులు ఆర్డి.వొ. గారు రాకుండా చూసుకుని నీటిని వదిలిపెట్టేలా చేసేందుకు కండువాలు చుట్టి ఉంచిన డబ్బు మూటని గ్రామాధికారికి ఇస్తాడు. ఒకప్పుడు నీటిని వదలొద్దు అన్న రైతులే  లంచం ముట్టజెప్పి నీళ్లు వదిలేయండి అనేలా రైతులు అనడానికి గల కారణం.... కాంట్రాక్టర్ కొట్టించే దెబ్బలకు తట్టుకోలేక! ఆ తర్వాత ఆ ఊరికి ఆర్డీవో రానే రాలేదు.
ఆ తర్వాత ఏమైంది అనే విషయాన్ని చెప్పకుండానే ఇక్కడతో కథకుడు కథను ముగించారు.  ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో చెప్పకనే చెప్పారు.

ఎమ్మార్వో. , ఆర్ .ఐ., గ్రామాధికారి, సర్పంచ్, ఆర్డీవో... ఇంత వ్యవస్థ ఉన్నా జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి . ఈ వ్యవస్థ డొల్లతనాన్ని, అవినీతి అధికారుల తీరును ఈ కథలో చెప్పారు. బాధితుల ఫిర్యాదులు సమస్యల పరిష్కారానికి కాకుండా ,  అధికారులు డబ్బులు సంపాదించుకునేలా ఉపయోగపడుతున్నాయి. 

గురజాడ ఋషి వాక్కులు - డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ సాహిత్యోపన్యాసం

గురజాడ ఋషి వాక్కులు - డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ సాహిత్యోపన్యాసం 

గురజాడ తన గేయ కవితా పంక్తుల్లో కవిగానే కాకుండా; ఒక వ్యక్తిగా తన ఆకాంక్షను వెలిబుచ్చారు.  "ముత్యాల సరములు" అనే గేయంలో.....
“యెల్ల లోకము వొక్క యిల్లై
వర్ణ భేదము లెల్లకల్లై,
వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ." అని ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. భవిష్యత్తును గాంచిన గురజాడ ఋషితుల్యుడే! కనుకనే సర్వకాలలోనూ చెలామణి కాగలిగిన పలుకులు పలికారు.  అందుకే-
“మతము లన్నియు మాసిపోవును.
జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును; -
అంత స్వర్గ సుఖంబు లన్నవి
యవని విలసిల్లున్."  అని అంటాడు. జ్ఞానానికి విలువ ఇవ్వడం ద్వారా మతాలు సమసిపోతాయి అనడానికి గుర్తుగా నేడు మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు జరగడం చూస్తున్నాం. ఇంకా విరివిగా జరగాలి! కుల,మతాలు ఈ లోకంలో చెరిగి పోవాలి. గురజాడ ఈ కవితలో ఆశావాదాన్ని ప్రకటించారు.

కాసులు అనే గేయంలో..... గురజాడ రెండు సూక్తులు... లేదా సందేశాలను వ్యక్తీకరించారు.
"మరులు ప్రేమని మది దలంచకు;
మరులు మరలును వయసు తోడనె;
మాయ, మర్మములేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటె
బ్రతుకు సుకముకు రాజమార్గము ." అని అంటాడు గురజాడ. సుఖానికి రాజమార్గం మాయ మర్మం లేని స్నేహం ఒక్కటే అని మనం గ్రహించాలి!
అలాగే...
"ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును.
ప్రేమ సిలిపిన ప్రేమ నిలుచును.
ఇంతియె." అనే సార్వత్రిక సత్యాన్ని చాటారు గురజాడ.   ప్రేమిస్తే ప్రేమిస్తారు.  ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును" అనే సత్యాన్ని చాటారు. మానవ సంబంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు పలచబడడానికి ఈ ప్రేమ లేమి కారణం!

"డామన్, పితియన్" కవితలో...
"బ్రతికి, చచ్చియు ప్రజల కెవ్వడు
బ్రీతి గూర్చునో, వాడె ధన్యుడు;...” అని గురజాడ అంటారు.
ఈ లోకంలో బ్రతికి చావడం సహజ విషయమే. కాని చచ్చి బ్రతకడం అరుదు. అది కొందరికే సాధ్యం! ఎవరా కొందరు?
  ధనవంతుడిగా,అందగాడు-అందగత్తె గా; గౌరవ ప్రదమైన కులం ఉద్యోగం కలిగి ఉండడం జన్మ ధన్యమని కాదు. ప్రజలకు బ్రతికుండగా ఎవరు మేలు చేశారో వారే చచ్చీ బ్రతికున్నవారు. అలాంటి వారే ధన్యులు

చివరిగా ....1912 డిసెంబరు 14న నాటి కృష్ణా పత్రికలో ప్రచురింపబడిన గురజాడ అప్పారావు గారి కవితలను పరిశీలిద్దాం! 
::మనిషి::
"మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయి రప్పల
కన్న కనిష్టం
గాను చూస్తే వేల బేలా ?
దేవు డెకడో దాగెనంటూ
కొండ కోనల వెతుకులాడే
వేలా ?
కన్ను తెరిచిన కానబడడో ?
మనిషి మాత్రుడి యందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో
ముక్తి" అని అంటారు.

మనిషి చేసిన రాయిరప్పకు మహిమ ఉందని మనం సాగి మొక్కుతుంటాము. సాటి మనిషిని మాత్రం ఆ రాయి రప్పలకన్నా హీనంగా,  తక్కువగా చూస్తుంటాము. దేవునికోసం కొండా కోనల్లో తిరుగుతూ ఉంటాము. పూజలు పురస్కారాలు, ఉపవాసాలు చేస్తూ ఉంటాము. పరిశీలిస్తే.... నిజమైన దేవుడు మనిషిలోనే ఉన్నాడు. "మానవసేవే మాధవసేవ" అని గ్రహించి ఆచరిస్తే కోరిన  ముక్తి లభించదా అని అంటారు గురజాడ!

మల్లాది రామకృష్ణ శాస్త్రి కథ "గోరంత గొప్ప"

మల్లాది రామకృష్ణ శాస్త్రి "గోరంత గొప్ప" కథ

"గోరంత గొప్ప" కథలోని పాత్రలు:

ప్రధాన పాత్రలు:

రామాంజయ్య: మిఠాయి కొట్టు ఆసామి,

రంగయ్య: రామాంజయ్య కొడుకు,

వెంకటప్పయ్య: హెడ్ కానిస్టేబుల్ ,

ఇస్మాయిల్: దూదేకుల సాయిబు

ముసలయ్య: కాపు కుర్రాడు,


"తెలుగులో ఆధునిక కథా సాహిత్యం కళ్ళు విప్పుకుంటున్న తొలిదశలో స్త్రీని బహుమతిగా బహు రూపిణిగా హృదయ వత్తిగా వెల్లడి గా చిత్రించిన రచయితలు ముగ్గురున్నారు చలం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మల్లాది రామకృష్ణశాస్త్రి కేంద్రం స్త్రీ స్త్రీ తిరగబడటం తిరిగి పడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే జ్వాలా ఆమెనూ ఆవిష్కరించిన మాత్రం ఈ రచయితల మార్గాలు శైలు వేరు శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి అని పేర్కొన్నారు

 మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథల్లో కులానికి గాక గుణానికి ప్రాధాన్యం కనిపిస్తుంది అంత గొప్ప కథలు రంగయ్య కి సుబ్బయ్య ఇందుకు ఉదాహరణ అని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పేర్కొంటారు చూద్దాం గీత నామంలో ఉండే మిఠాయి కొట్టు ఆసామి రామాంజనేయ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేవాడు దేవుని పైనే కాదు మనుషుల పైన కూడా భక్తి తొక్కుడు లడ్డు కు ప్రసిద్ధి రంగనాయక స్వామి భక్తుడు బసవన్న కూడా బసవన్న ను కూడా చక్కగా పోషించేవాడు అన్నయ్య అక్క అనే పిలుపు తో అందరినీ కలుపుకుపోయే తత్వం రామాంజనేయ కొడుకు రంగ ఇది

 కూరగాయలు అమ్ముకునే వారి నుంచి గంప కు కాడికి ఒక కూరగాయలు తీసుకోవడం మొదలు పెట్టి డిమాండ్ చేసే స్థాయికి వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చేసుకునే స్థాయికి పోలీసులు వచ్చారని తెలుసుకుని బుద్ధి చెప్తాడు రంగయ్య రంగయ్య చేసిన పనికి తండ్రికి తన తండ్రికి తెలిసి అంతా ఆ రంగనాయకస్వామి చూసుకుంటాడు నువ్వు ఎందుకు ఇస్తాడు దెబ్బలు తిన్న హెడ్ అహం దెబ్బతిన్న పోలీసులు వసూళ్లకు బంధాలకు అడ్డొచ్చే ఎలాగైనా జైల్లో అనుకుని కోసం చూస్తుంటారు రంగయ్య రంగనాయక స్వామి ఆలయానికి కూతురుగా ఓరోజు పోలీసులు ఏర్పాటు చేసుకున్న పథకం ప్రకారం ఒక ఆడ మనిషిని

 సహకారంతో పిల్ల చేతులకు ఉండే ఒత్తులు దొంగిలించాడని కదలి ఆరు మాసాలు శిక్షిస్తారు శిక్షించినా అనంతరం ఇంటికి వెళ్లకుండా నేరుగా రంగనాథ స్వామి గుడి రంగయ్య రామాంజనేయ రామాంజనేయ గుడికెళ్ళి ఊర్లో మొన్న చూపించుకో లేనని బస్సుతో పాటు తనకి సంధ్య ఉండే సంజు పూట ఎంత పడే మన్నాడు ఎంత పడింది అని చెబుతాడు ఇలాకా వారు పోలీసులు మరలా ఏదో కేసు రంగయ్య తన వేసి మళ్లీ జైలుకు పంపించారు ఇలా పదే పదే జరిగింది 30 ఏళ్లకే 60 ఏళ్ల వాడిగా రంగయ్య


 మల్లాది గారి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిది కథ వ్రాసే శైలి కాదు కథ చెప్పే శైలి ఇంకొక ఇంకొక లాగ చెప్పాలంటే ఆయన కథ వినిపించే కదా రాజశేఖర్ కథ కాదు ఆయన కబుర్లు చెప్పిన తేలిగ్గా కధ చెబుతారు శాస్త్రి గారు ఒక్కసారి తాను చెప్పదలుచుకున్న కథనంతా చెప్పకపోవచ్చు ఒకసారి దూరంగా చెప్పవచ్చు ఆయన తన శ్రోతలను తనతో పాటు పూర్వీకుడు గా పాలుపంచుకోవాలని ఆశిస్తాడు ఆయన నిత్యం మానవత్వం కోరుకునే మనిషి కులమతాలకు మించిన మానవ హృదయ స్పందనం జీవన వాస్తవాలను ఒడిదుడుకులను రాకుండా రాకుండా నడవడిక గలిగే నడవడి ఈయన కోరుకుంటాడు

 ఈ కథలో ప్రత్యేకించి పనిగట్టుకుని ఏదో ఒక సందేశాన్ని చెప్పాలని కథకులు ప్రయత్నించలేదు జీవితంలో ఎదురయ్యే సమస్యల కొరకు సమస్యల మలుపులకు బలి అయ్యే వారెందరో మంచితనం గల రంగయ్య జీవితాన్ని పోలీసులు బలి ఉంటారు మునిగిపోతాడు తండ్రి సాఫీగా సాగే జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య పాపఫలం అని గ్రహించి తన బిడ్డను మంచి మనసేనా రామాంజి చేతుల్లో పెట్టి తనకు పోతానని సిద్ధపడతాడు

గురజాడ అప్పారావు గారి"పూర్నమ్మ" గేయం

గురజాడ అప్పారావు గారి "పూర్నమ్మ" గేయం

మేలిమి బంగరు మేలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లుల కన్న పిల్లల్లారా
విన్నారమ్మా యీ కథను

ఆటల పాటల పేటికలారా
కమ్మని మాటల కొమ్మల్లారా
అమ్మలగన్న అమ్మల్లారా
వినరమ్మా మీరీ కథను

కొండల నడుమల కోనొకటున్నది
కోనకి నడుమా కొల నొకటుంది
కొలను గట్టునా కోవిల లోపల
వెల సెను బంగరు దుర్గమ్మ

పూజారింటను పుట్టిన చిన్నది
పుత్తడి బొమ్మా పూర్నమ్మ
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు పువ్వులు కోసేది

ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మ పూర్నమ్మ

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ

పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్నకు
సౌరులు మించెను నానాటన్

కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్నమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడివేస్త్రీ

ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గవనములో
కిలకిల పలికెను కీరములు

ముద్దు నగవులూ మురి వెములూ మరి
వెనిమిటి జూచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మును
కన్నుల గ్రమ్మెను కన్నీరు

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత అని కేలించ
ఆటల పాటల కలియక పూర్నమ
దుర్గను చేరి దుక్కించె

కొన్నాళ్ళకు పతి కొని పోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్నమను
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్న మకు

పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్నమ్మ
వదినెలు పూర్నకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ

పెద్దల కప్పుడు మొక్కెను పూర్నమ
తల్లి దండ్రీ దీవించ్రి,
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మ పూర్నమ్మ

చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ
అన్నల తమ్ముల కప్పుడు పలికెను
పుత్తడి బొమ్మ పూర్నమ్మ

“అన్నల్లారా తమ్ముల్లారా
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మ దుర్గమ్మ

ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మ దుర్గమ్మ

“నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి
మీ మీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి

బలబల కన్నుల కన్నీ రొలికెను
పుత్తడి బొమ్మకు పూర్న మకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మ పూర్నమ్మ

వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడి బెట్టన్
కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొక డె

యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వుల సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
నొంటిగ పోయెను పూర్నమ్మ

ఆవులు పెయ్యలు మందల జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
యింటికి పూర్నమ రాదాయె

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్నమ యింటికి రాదాయె

కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్నమ్మ

అద్దేపల్లి రామమోహనరావు గారి కవిత 'చీకటినాహ్వానిస్తున్న సంజె గుమ్మం'


ఈరోజు ప్రముఖ కవి, విమర్శకులు అద్దేపల్లి రామమోహనరావు గారి జయంతి. ఈ సందర్భంగా నేను వారిపై రూపొందించిన వీడియోలను తిలకించగలరు.
https://youtu.be/NEZWXvhttOU
=======================
అద్దేపల్లి రామమోహనరావు కవిత 'చీకటినాహ్వానిస్తున్న సంజె గుమ్మం'

శ్రుతిలో అపశ్రుతిని దూర్చి పాడినట్లు
సాత్వికాభినయంలో బ్రేక్ డాన్సును ముంచి ఆడినట్లు
ఇంట్లో ఓ కాలూ, వాకిట్లో ఓ కాలూ పెట్టి
వంతెన కింది పచ్చని గుమ్మాన్ని మరిచిపోయినట్లు
సగం ఇంగ్లీషు, సగం తెలుగు
తెలుగువాడి నోట్లోంచి గట్లు తెగుతుంది
నాభిలోంచి వాయువు
గొంతులోంచి ధూమం
రెండూ కలిసి పెదవులదోవల్లోంచి
మాటలు సుడులు సుడులుగా బయటపడతై
రాజకీయ గ్రహాలనించి చలనచిత్ర నక్షత్రాలదాకా
రోజంతా నల్లని వెన్నెల కురుస్తూనే ఉంటుంది
తెలుగు మాట్లాడేటప్పుడు
మొగమంతా కళ్ళలోనే ఉంటుంది
ఇంగ్లీషు వచ్చేటప్పటికి
పెదవులు, కనుబొమ్మలు, బుజాలు
వంకర్లు పోతున్న చేతులు
ఎటుపడితే అటు గంతులేస్తుంటై
ఆ గంతుల్లో పడి
దూర దూర దేశాలన్నీ
ఒకదాన్నొకటి తలలు బాదుకుంటూ ఉంటై
పొద్దుణ్ణించి రాత్రి దాకా
మెదళ్ళ పొలాల మీద ట్రాక్టరులా మోగుతున్న టి.వి.
పసి మట్టిలో టెర్మినేటర్లను నాటుతుంది
వేల, లక్షల ఇంగ్లీషు మీడియమ్ స్కూళ్ళ
శబ్దాలతో బద్దలైపోతున్న ఆకాశం
పసి నెత్తురులో ఎక్కడి మేఘాల వాననీళ్ళనో కలిపేస్తుంది
తెలుగు వేషాలేసుకుని
మనని కౌగిలించుకుంటున్న
ఇంగ్లీషు సినిమాలు, బీభత్సం ప్రవహించినంతమేరా
పసి ఆత్మల్ని నీళ్ళ బొమ్మలుగా మార్చి
మోసుకుపోతూ ఉంటై
సంస్కృతి నా యిల్లైతే
భాష నా వీథి గుమ్మం
సంస్కృతి నా జీవితమైతే
భాష నా శ్వాస మార్గం
సంస్కృతి నా అమ్మైతే
భాష నా ఆరాధన గీతం
వీథి గుమ్మాన్ని మోత రాకుండా
వాడు పగలగొడుతుంటే
ఇల్లు కన్నీటి గోడలై పునాదుల్లోకి యింకిపోతుంది
శ్వాస మార్గాల్ని కొత్త యాసలు కోసేస్తుంటే
జీవితం చీలికలైన నాలుకల్లోకి వలస పోతుంది
ఆరాధన గీతానికి
పడమటి గాలి పుటం పెడితే
అమ్మ గుండెలోని సముద్రాలన్నీ
కెరటాల్ని ఒడ్డు మీదికి రాల్చేసుకుంటై
ప్రజల కళ్ళలోని పాపల్ని
లాగేసుకుని పారిపోయేవాణ్ణి
సింహాసనాలు వెనక్కి పిలిచి సత్కారాలు చేస్తై
బందిపోట్ల కళ్ళలోని ఖడ్గాలకి
అంజలిపట్టి ఆహ్వానాలు పలుకుతై
అధికార భాషాసంఘాలు
తెలుగుగూళ్ళు కట్టుకుంటుంటే
అమాతృభాషల వరదలొచ్చి
గూళ్ళ నీళ్ళలో విముక్తి పొందుతై
పసి ప్రశ్నల వెన్నెల చేతులు
ఆకాశ నక్షత్రాల్ని ఏరుకుంటున్నప్పుడు
ఆరుబయట మంచం మీద పడుకుని
నాన్న చెప్పే అద్భుత కథల వెలుగు లేదు
పసి కౌగిళ్ళ మనసు కదలికల్ని
తరతరాల పేగుల వాగుల్లో తేలుతూ వచ్చిన
పూలలోకి ఒంపుకుని
అమ్మ పాడే స్త్రీల పాటల,జానపదాల, వీరగాథల
ముద్రలు లేనే లేవు
చిన్నప్పుడే నైటింగేళ్ళు చెవుల్లోంచి లోపలికి పోయి
నెత్తురు తోటల్లోని కోయిలల్ని
నిశ్శబ్దారణ్యాల్లోకి తరిమేస్తున్నె
వేమన్నలు సుమతులు ఆంధ్ర నాయకులు
రైముల చిందులేసే కాళ్ళకింద నలిగిపోయి
గాయాలతో గత కాలాల్లోకి వలస పోతున్నారు
మెకాలే కలలకి యిప్పుడు కాళోచ్చి
జాతి చర్మం చించి లోపలికి నడిచి
అస్తిత్వపు రంగుని మార్చడం మొదలయింది
ఈ మొదలుకి బోదెలు తవ్వుతున్న తెలుగు చేతులు
అ ఆ ల్ని కలుపు మొక్కలుగా విసిరేసుకుంటే
ఒక సంస్కృతి
మట్టికేసి తల బాదుకుని మూర్ఛపోతుంది -
'మనతనం'
సగం అట్లాంటిక్ లో, సగం పసిఫిక్ లో
పడి కొట్టుకుపోతుంది-
ఆత్మాభిమాన భాషని
మన మట్టిలో పాతుకుంటే
చెట్టై లేచి నింగినంటేది
మాతృదేశమే!
=======================
"Talathoti" అనే నా Youtube Channel ను Subscribe చేసుకోని వారైతే 
www.youtube.com/TALATHOTI
 పై లింక్ ను ఇప్పుడే Subscribe చేసుకొండి! నా Facebook page అయిన " Telugulitt" Page 
www.facebook.com/telugulitt
ని పై లింక్ క్లిక్ చేసి ఇప్పుడే Follow కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే Like, Share , Comment చేయండి!
~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
www.talathoti.com
www.litt.in
WhatsApp:9963299452
=======================
బమ్మెర పోతన(స్తుతి )పద్యాలు-01:
https://youtu.be/FQlNiP5Kpf0
బమ్మెర పోతన (గజేంద్ర మోక్షం) పద్యాలు-02:
https://youtu.be/namITxBLR8w
బమ్మెర పోతన (ప్రహ్లాదుడు) పద్యాలు-03:
https://youtu.be/R7mZQl97Q4g
బమ్మెర పోతన (వామనావతారం) పద్యాలు-04:
https://youtu.be/nhJcaf34g1Q
బమ్మెర పోతన (కృష్ణలీలలు) పద్యాలు-05:
https://youtu.be/px32EhbqD3Y
ఎర్రన స్ఫురదరుణాంశు పద్యం-01:
https://youtu.be/2LNMSxTYr6g
భాస్కర రామాయణం పద్యాలు:
https://youtu.be/fdoF2KiB2G0
పోతన కంజాక్షు పద్యం:
https://youtu.be/bqc534VeZ64
అల్లసాని పెద్దన పద్యాలు:
https://youtu.be/ANwoXDTyvfo
నన్నయ పద్యాలు:
https://youtu.be/NVy-SmtX00Q
నన్నయ నుతజలపూరితంబులగు పద్యం:
https://youtu.be/Ai5qN2lgucw
నంది తిమ్మన పద్యాలు:
https://youtu.be/jw-M_aCDRi4
తెనాలి రామకృష్ణుని చాటు పద్యాలు:
https://youtu.be/nB3qQu6DS08
ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోని కొన్ని పద్యాలు:
https://youtu.be/9Vl7N9ddbHc
కవిసార్వభౌముడు శ్రీనాథుని పద్యాలు:
https://youtu.be/dNTFV46hIac
తిరుపతి వేంకట కవుల పద్యాలు:
https://youtu.be/7R4f-PrBN0U
భోజరాజీయంలోని గోవ్యాఘ్ర సంవాదం:
https://youtu.be/5tBmtnadEiU
గుర్రం జాషువా సాలీడు పద్యాలు:
https://youtu.be/f9sAjaKX-x4
అమృతాంజనం పై జాషువా చమత్కార పద్యం:
https://youtu.be/JYIk2Qlbiqs
జాషువా "పిరదౌసి లేఖ":
https://youtu.be/l_6zkAma0bg
మాల దాసరి పూర్తి ఇతివృత్తం:
https://youtu.be/wszLeAadxaQ
విశ్వనాథ సత్యనారాయణ:
https://youtu.be/CkldUQA7eMQ
కరుణశ్రీ పద్యాలు:
https://youtu.be/dtHloTBd6Zc
గురజాడ అప్పారావు:
https://youtu.be/7QohobynXig

జాషువా పద్యాలు (ముంటాజమహలు)సంజ కెంజాయలో జలకంబు సవరించిన
పఱతెంచు సూర్య బింబంబు లోన
పదునాఱు దినముల పరువు వచ్చిన నాఁటి
చంద్రుని ధవళ హాసముల లోన
పూలతోటలతోడ ముద్దుముచ్చట సెప్పి
చెఱలాడు మొలక తెమ్మెరల లోన
నీలమేఘంబుల నెటియలలోఁగుల్కి
పరువెత్తు మెఱపు గర్భముల లోన

హాయిగాఁ బవ్వళించి బ్రహ్మాండములను
బల్కరించుచు నున్న దివ్యస్వరూప!
హృదయమును జీల్చి పూజ లర్పించుకొందు
నందుకొనిపొమ్ము, వ్యవధి లేదనక రమ్ము.

రాణివిడచిపోయె రాజు నొంటరిఁజేసి
రాజు విడచిపోయె రాజ్య రమను
రాజ్యరమయు విడిచె రాజులఁ బెక్కండ్ర
తాజి విడువలేదు రాజసంబు.

అతివ చక్కదనము నభివర్ణనము సేయ
కలము సాగ దెట్టి కవివరులకు
చేయి యాడ దెట్టి చిత్రకారులకును
చెలువ చెలువమెల్ల జిలుకరింప.

అసమసౌందర్యవతి నూర్జహాను రాణి
కోడలి విలాసమునకు సిగ్గును వహించు
వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప
తురక రాయఁడు నిలువున గరిగిపోవు.

“ముద్దులరాణి మాటకు విభుం డెదురాడడు రేని యానక
మ్ముద్దియ మాఱుపల్క డదెపో: సహవాస” మటంచు నిత్యమున్
బెద్దలు ప్రస్తుతింప నతివేల సుధా ప్రణయైక రాజ్యపుం
గద్దె నలంకరింతురు మొగల్ మగ లమ్మహనీయ దంపతుల్.

ఆ సతీపతుల గాఢా శ్లేషములనుండి
జారి పోయిన నిమేషంబు లేదు
ఆ దంపతులకు నాహ్లాదంబు గూర్పక
తొలఁగిన వెన్నెల తునక లేదు.
ఆ ప్రేమజీవుల యనురాగ వృద్ధికై
రుత మొనర్పని పరభృతము లేదు
ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దులచేత
తీపి కెక్కని ద్రాక్షతీఁగ లేదు.

అవధి లేనివారి యానంద కేళికిఁ
దోడుపడని పూలదోఁట లేదు
వారి కూర్మి పెంపు వలచి వర్ణనజేసి
సుప్రసిద్ధి గనని సుకవి లేఁడు.

మొగలు దొరసాని లావణ్యభూషణంబు
కన్ను మాయదు సంతాన ఘర్షణమున
జీవితంబున నొక దుష్టచింత లేని
సత్యవంతుల ప్రాయంబు జాఱదండ్రు

తన సంతానము మాతృహీనమయి వంతం గుందుచున్నట్లుగా
తనరాయండు వియోగభారమునఁ జింతన్ మున్గుచున్నట్లుగా
తనకై దొడ్డ సమాధి నయ్యమున పొంతం గట్టుచున్నట్లుగా
ననుమానించుచునుండె సత్సతుల యూహల్ సత్య సామీప్యముల్,

భక్తి దైవార మానెడు వజ్రమణులు
భూతలేశ్వరుఁ డల్లాకు మ్రొక్కికొనియెఁ
గాని యిల్లాలు స్వస్థత గాంచదయ్యె
చండతరుఁడైన విధి లంచగొండి గాదు.

ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో
నీ సతినై ముగించితిని నేటికి నాదు ప్రవాసయాత్ర యో
ధీసముపేత! యిట్టి పరదేశుల చెల్మి తిరంబు గాదు క్ష్మా
వాసకథా విశేషములు స్వాప్నికముల్ జపలావిలాసముల్

ఈ తనువుండునంతవఱ కింతయు నెమ్మది లేదు ప్రాణి కీ
భూతలమందు గష్టసుఖముల్ జెలికత్తెయలై భజింప నా
శాతరళాక్షి తాండవము సల్పుచునుండును మృత్యుదేవతా
ద్యూత వినోదరంగ మిది తోరపు సంపదలెల్లఁ బాచికల్,

ఆవిరియోడలో జలధియాన మొనర్చెడు బాటసారు లో
భూవర రేవులందు దిగివోయెద రించుక వెన్క ముందుగా
నీ వసుధాపణంబు పనియెల్ల ముగించి స్వదేశగాములై
పోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మ వర్తకుల్,

ఏ పుష్పంబును జేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవమో
భూపశ్రేష్ఠ! విచార మందకుము మామూలేకదా ఈ మృతి
వ్యాపారంబు సమస్త జీవులకు విశ్వవ్యాఘ్రి గర్భంబునన్
మాపుల్ రేపులు నెందఱో యిముడుచున్నారందు నేనొక్కతెన్,

సమతా చిహ్నితమైన యీ మరణ మీ సర్వంసహా వేదనా
సమర శ్రాంతుల గౌఁగిలించుకొని విశ్రాంతిన్ బ్రసాదించెడిన్
హుమయూనాదుల మీపితామహుల బోలుర్వీధవుల్ పెక్కురీ
సుమశయ్యంబవళించి మేల్కొన రహస్సుల్ పెక్కులిట్లేగినన్.

కలుషం బింతయులేని నీ మధుర ముగ్ధంబైన చిత్తంబు లో
పల నిద్రింతు ననారతంబు నదె యాహ్వానించుచున్నారు వే
ల్పులు నాకై చనుదెంచె మిఁచులరథంబుల్ ఱెక్కఁలల్లార్చు చున్
సెలవిప్పింపు మటంచు నేత్రములు మోడ్చెన్ భర్తృ వక్షస్థలిన్.

కుతలం బంతయు భస్మరాశియయి నాకుందోచె నాశాపరా
జితమై జీవిత మంధకారమునఁ  జొచ్చెన్ నీ సమావేశముల్
కతలై పోయె సహింపఁజాలని వియోగజ్వాల కావింప ను
ద్గత దుఃఖాంకితమైన యీ శిథిల కంకాళంబు నెట్లీడ్చెదన్

జీవన తారవై యమరసీమల నీవు సముజ్జ్వలింప మా
యావృతమైన విశ్వవలయంబుల శాశ్వత శోకమూర్తి నై
జీవిత మూని యీ చరమజీవిత నాటకరంగ మెక్కి వా
పోవుచునుంటి నీ విధురభూమికతోడ కిరీటధారినై.

పయనంబు సాగించు మెయిలు తిన్నెల మీఁద
కనుపింపలేదు నీ కాలి జాడ
అరవిచ్చి మురిపించి మెరుపుల తోఁటలో
మిట్టాడలేదు నీ మేని కాంతి
కొమరారు నిండుపున్నమ చందమామలో
భాసిల్ల లేదు నీ హాసలవము
సచరాచరంబైన సర్వ సర్వం సహా
వినిపింపలేదు నీ విమలవాక్కు

ఏ రహస్య సరణి యే హరిత్తుల జాడ
నీ నిలింప రథము నిర్గమించె
నాదు నేత్రయుగళి నాట్యమాడెడు నిన్ను
నెట్లు దొంగిలించె నీశ్వరుండు.

నీవు వసించుచోట వసియింతును నేనును దాచి యుంపుమో
దేవి! యొకింత నేల చను దెంచెద రేపట మాపటన్ నిరా
శావిషదహ్యమానమయి సౌఖ్య పరాజ్ముఖమైనయట్టి నా
జీవిత శేష మంకితముఁ జేసెద నీ కవివాహితుండనై.

గురుతర సత్యలోకమునకుం బయనించి సుఖించుచుంటివో
కరిగి యనంతమౌ ప్రకృతి గర్భమునందున లీనమైతివో
యెఱిఁగినవాడు లేడు హృదయేశ్వరి దుర్ఘటమైన మృత్యనం
తర విషయం బయోమయ మనన్వయ కావ్యము మానవాళికిన్

ఎల్ల జీవులకు నత్యుల్లాస మొలికించి
ప్రభవించె నీ సుప్రభాత సంధ్య
వలచు కమ్మని పరీమళము గుప్పిటఁ బట్టి
పూచె నీ సంపంగి పూలతోఁట.
నిలువుటద్దమువద్ద నిలిచి జారిన కొప్పు
సవరించె నీ వయస్యాజనంబు
తొలి నమాజుల మేలుకొలిపి లోకాధీశు
మన్నించె బెడఁగు జుమ్మా మసీదు

మదన గోర్వంక నిద్దురమత్తు వోవఁ
దనువు విదళించి యీశ్వరస్తవ మొనర్చెఁ
బ్రాతరానందమున సృష్టి పరిఢవిల్లె
నీవు మాత్రము నిద్దుర లేవ లేదు.

నివసించుటకు చిన్న నిలయ మొక్కటి దక్క
గడన సేయుట కాసపడను నేను
ఆలుబిడ్డలకునై యాస్తిపాస్తులు గూర్ప
పెడత్రోవలో పాద మిడను నేను
నే నాచరించని నీతులు బోధించి
రానిరాగము తీయలేను నేను
సంసారయాత్రకు చాలినంతకుమించి
గ్రుడ్డిగవ్వయు గోరుకొనను నేను

కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన, నాకు
తరుగులేదు, విశ్వనరుడ నేను!

https://youtu.be/1hfTjcvfzC8
సెప్టెంబర్ 28, కవితా విశారద, కళాప్రపూర్ణ గుర్రం జాషువా గారి జయంతి. ఈ సందర్భంగా జాషువా గారు రచించిన "ముంటాజమహలు" అనే కావ్యం లోని కరుణ రసాత్మకమైన, ప్రేమైక పద్యాలను విశ్రాంత తెలుగు అధ్యాపకులు, ఆంధ్ర పద్యకవితా సదస్సు నర్సీపట్నం ప్రాంతీయ కార్యదర్శి శ్రీ జెట్టి యల్లమంద గారు తన మధురమైన గొంతుకతో రాగయుక్తంగా ఆలపిస్తూ చేసిన సాహిత్యోపన్యాసమే " ముంటాజమహలు కావ్య సౌందర్యము". మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ధన్యవాదాలు 🙏~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్. శ్రీ జెట్టి యల్లమంద (9849860962)

చాసో (చాగంటి సోమయాజులు) వాయులీనం కథ

చాసో వాయులీనం కథ

చాగంటి సోమయాజులు (1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితులు. ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధ్నస్వామ్య వ్యవస్థ ప్రధానంగా ఉంటాయి. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.
జీవిత చిత్రం
1915 జనవరి 17 న శ్రీకాకుళంలో జన్మించిన ‘చాసో’ అనబడే చాగంటి సోమయాజులు తల్లితండ్రులు కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ. తర్వాత పెదతల్లికి దత్తుడిగా విజయనగరం వెళ్ళారు. పెత్తల్లిగారి పేరు కూడా తులసమ్మే.
చదువు
నాగావళీ తీరంలో పైరుపచ్చల మధ్య బాల్యం గడిచింది. చాసో అయిదోఫారం వరకు శ్రీకాకుళంలో చదివారు. విజయనగరం ఉన్నత పాఠశాలలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పూర్తి చేసి మహారాజా కళాశాల విజయనగరంలో పైచదువులు చదివారు.

చాసో కథలలో వస్తువూ, శిల్పమూ పోటా kపోటీగా సాగుతాయి. అది మధ్యతరగతి మనిషి ‘అస్ధిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాల’ కథ అయినా అట్టడుగు శ్రామికవర్గం ‘అగాధగాథా బాధాపాథ: పతంగాల’ కూడులేని లోకం కథ అయినా అందులో పాత్రలన్నీ రక్తమాంసాలతో, అభినయ విన్యాసంతో మనలని పలుకరిస్తాయి. ఉత్తేజితులను చేస్తాయి, మనలని తమతో పాటు తీసుకెళ్తాయి. తెలుగు కథాశిల్ప పికాసో చాసో. ఆయన రాసిన కథ 'కుంకుడాకు' లో కథానాయిక ‘గవిరి’ ఎనిమిదేళ్ళ బాలిక. 1943 ఫిబ్రవరిలో ఈమె పుట్టుక. ఒక కూలివాడి కూతురు. తల్లిదండ్రులు కూలికెడితే కర్రా, కంపా ఏరి ఇంటికి ఒకపూట వంట చెరకు తేవాల్సిన బాధ్యత ఆమె నెత్తిమీదుంది. అందుకే ఊళ్లోంచి పొలానికి బయల్దేరింది. వెంట మోతుబరి రైతు కూతురు పారమ్మ కూడా ఉంది.

‘‘ఊళ్ళో బడిపిల్లలు ప్రార్థన మొదలుపెట్టేరు.‘తల్లీ నిన్ను దలంచి...’ అని మేష్టారందిస్తున్నారు. ‘తల్లీ నిన్ను దలంచి’ అని పిల్లలంతా ఒక్కమాటు వూరెగర గొడుతున్నారు.’’ ఆకులూ, కంపలూ ఏరుకుంటున్న ‘గవిరి’ని చెయ్యని నేరానికి భుక్తగారు పాంకోడు తీసి విసురుతాడు. అది గవిరి పిక్కమీద ఎముకకి తగిలి- ‘పీక తెగ్గోసిన కోడిలాగ గిలగిల కొట్టుకొని చుట్టుకుపోయింది’. ఏడ్చి ఏడ్చి కళ్ళు తెరిస్తే- పొద్దు లేచిపోవటం- బడిలో పిల్లలు ఎక్కాలు వల్లె వేయటం వినబడుతోంది. లేచి కళ్ళంలోని కుంకుడాకుని పోగుచేసి తట్టలోకి ఎత్తింది. ఎమికమీద పాంకోడు దెబ్బ బాధ ‘ఓలమ్మో’ అంటూ మర్లా ఉక్కిరి బిక్కిరిగా ఏడ్చుకుంటూ గోర్జిలోకి వెళ్ళింది. బడి పిల్లలింకా ఎక్కాలు చదువుతున్నారు. ‘పదహారార్లు తొంభైయారు’ అని ఒకరు అరుస్తున్నారు. ‘పదాహారార్లు తొంభైయారు’ అని అంతా కలిసి పాడుతున్నారు. కథ ముగిసింది. మనలని ఆ దృశ్యాలు వెంటాడతాయి. గోచీపాత పెట్టుకున్న ఎనిమిదేళ్ళ గవిరి రోషంతో, ఆత్మాభిమానంతో భుక్తకి చెప్పిన సమాధానం మనకు వినిపిస్తోంది. వ్యవస్థ వికృత స్వరూపం మనకు దృశ్యమానమౌతోంది. ఇంతకూ చాసో ఈ కథ ద్వారా ఏం చెబుతున్నారు? ఆయన ఏదీ వాచ్యంగా చెప్పరు! అదే చాసో కథా నిర్మాణంలో వైశిష్ట్యం!

"ఎందుకు పారేస్తాను నాన్నా" దిగువ తరగతి ప్రజల స్థితిగతులకు అద్దం పడుతూ ఒక చిన్నారి హృదయాన్ని హృద్యంగా చిత్రీకరించిన కథ. ఇప్పటికీ ఎంతోమంది తల్లిదండ్రులు తప్పనిసరిగా చదివి ఆచరణలో పెట్టితీరాలనే నీతి చెప్పిన కథ.

కళాశాల విద్యార్థిగానే ఆయన కవితారచనకి శుభారంభం పలికారు. తొరుదత్‌, సరోజినీ నాయుడు ల కవిత్వం, లియో టాల్‌స్టాయ్, మాక్సిం గోర్కీ ల కళాత్మక వ్యక్తీకరణ, ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేశాయి. సృజనాత్మక ప్రక్రియలైన కథ, కవిత్వం, రెండింటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చినా తర్వాతి కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్యమిచ్చారు.అచ్చులో చాసో తొలికవిత : ‘ధర్మక్షేత్రము’ (భారతి : 1941 జూన్‌), తొలి కథ : చిన్నాజీ (భారతి: 1942). వర్తమాన సమాజంలో వైరుద్ధ్యాలు, ఆర్థిక సూత్రాలే మానవ సంబంధాలలో, మనిషి మనుగడలో కీలకపాత్ర నిర్వహిస్తాయనే సత్యాన్ని అలవోకగా ‘కాందిశీకుడు’ కవిత- రచనాకాలం: (1937-40) ఆవిష్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బర్మాపై జపాన్‌ బాంబు దాడులు జరిపాక, బర్మా నుండి అనేక తెలుగు కుటుంబాలు కట్టుబట్టలతో కాలినడకతో స్వగ్రామాలు చేరినప్పుడు ఇక్కడి దుర్భరస్థితిని ఒక తల్లి హృదయావేదనగా చాసో అక్షరీకరించారు. ‘నమ్ముకున్న పుడమితల్లి, కట్టుకున్న భార్య రెండూ అతడికి కాకుండా పోయాయని’, చివరికి ‘పొయి లో నిప్పులేదు, నీకేం పెట్టేది నా నాయనా’ అనే తల్లి విలాపం పఠితను కన్నీళ్ళు పెట్టిస్తుంది. ‘పదండి భడవల్లారా... నేనే దొంగ మార్కెట్‌లో అమ్ముకొని మేడలు కడుతున్నా ను. నాకు ఉరిశిక్ష తక్కువ వెయ్యకండి... నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్యండి’ అంటూ బియ్యపుమూటని భుజాన కెత్తుకొని రైల్వే ఉద్యోగుల వెంట వెళ్తున్న ముసలమ్మ (కుక్కుటేశ్వరం), ‘తల్లి వెళ్ళిపోయింది... వెళ్ళిపోతూ తల్లి గుణాన్ని చూపించుకుంది’ అంటూ ఇంటి ఖర్చులకుగాను తన ఫిడేలు అమ్మి తనకి చీరకూడా తెచ్చిన భర్త వంక అనారోగ్యంతో బాధపడుతూ గుడ్లనిండా నీళ్ళు నింపుకుని చూస్తున్న రాజ్యమూ (వాయులీనం), ‘వెన్నెట్లో రేరాణి వాసనలా నీ మువ్వలమాటలు వింటాడే’ అంటూ పాడుతూ వచ్చే చిన్నాజీ (చిన్నాజీ) కొన్ని సజీవ పాత్రలు. చాసో కథల రెండో కూర్పు విశాలాంధ్ర ప్రచురణాలయం 1983లో ముద్రించింది. ఇందులో మొత్తం 40 కథలున్నాయి.

అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో 1943లో జరిగాయి. ఆనాటి నుంచి కన్నుమూసే వరకూ ఆయన ‘అరసం’లోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు.

చాసోగారి అర్ధాంగి అన్నపూర్ణమ్మ. చాసో ‘చిన్నాజీ’ కథలో చిన్నాజీ, చాసో పెద్ద కుమార్తె చాగంటి తులసి. 1995 నుంచి చాసో కుటుంబ సభ్యులు ‘చాసో స్ఫూర్తి’ పేరు ఒక ట్రస్ట్‌ నెలకొల్పి, ప్రతి ఏటా చాసో జన్మదినం జనవరి 17న సృజనాత్మక సాహిత్య వికాసానికి, నిబద్ధతతో కృషి చేస్తున్న అభ్యుదయ రచయితలలో ఒకరికి ‘చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం’ అందిస్తున్నారు. ఆధునిక తెలుగు కథను ప్రగతిశీల భావాలతో తీర్చిదిద్దటంలో ఆయనదొక ప్రత్యేకమైన బాణీ, ఒక ప్రత్యేకమైన వాణి!
పురస్కారాలుసవరించు

1987లో ఆంధ్రపదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారాన్ని అందుకున్నాడు[1].
చాసో 1994 జనవరి 1 న మరణించారు. మరణానంతరం తన భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇమ్మని కోరటం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం.

చాగంటి సోమయాజులు

వన్ లైన్ స్టోరీ:
------------
డబ్బులు లేని పరిస్థితుల్లో మరలా టైఫాయిడ్ వ్యాధి తిరగబెట్టే సరికి తన భార్యను దక్కించుకోవడం కోసం, స్నేహితుడి సలహా మేరకు తన భార్య రాజ్యానికి ప్రాణప్రదమైన ఆమె ఫిడేలును అమ్మగా 250 రూపాయలు వస్తాయి. ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. భార్యకు ప్రేమతో జారీ అంచు చీర, పట్టు రవిక గుడ్డ తీసుకురాగ

---------
సంక్షిప్త కథ:

స్పృహ కోల్పోయి పడి ఉన్న భార్యను చూసి ఉందా పోయిందా అని రాజ్యం భర్త వెంకటప్పకు అనుమానం వస్తుంది. ఆమె కడుపు కిందికి మీదికి ఊపిరికి ఎగురుతూ ఉంటే బతికే ఉన్నదని నిర్ధారణ చేసుకుంటూ ధైర్య పడటం అతనికి పరిపాటి అయిపోయింది. వసారాలో గొడవ చేసే పిల్లలను కసిరేసరికి రాజ్యం తిరిగి స్పృహలోకి వస్తుంది.
   72 రూపాయలకు ఎల్.డి. గుమస్తాగా పని చేసే వెంకటప్పయ్యతో రాజ్యానికి ఆరేళ్ల క్రితం పెళ్ళవుతుంది. పెళ్ళికి ముందు నాలుగేళ్ళు కష్టపడి సంగీతంలో శిక్షణ తీసుకుంటుంది. భర్తకు సంగీతంపై ఆసక్తి లేకపోయినా, రాజ్యాన్ని సంగీతం అంటే ఇష్టం. కాని పాడే సందర్భాలు, పాడమని అడిగేవారు లేక ఆమె నోరు ఎప్పుడో నొక్కుకు పోయింది. ఒకవిధంగా రాజ్యాన్ని చావునుండి రక్షించింది సంగీతమే. తన భార్య రాజ్యం టైఫాయిడ్ జ్వరంతో బతికి బట్టకట్టదనుకున్న భార్య టైఫాయిడ్ మళ్ళీ తిరగబెట్టింది. ఎముకల మీద మాత్రమే మిగిలి ఉన్నట్లు భార్య ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు
అందుకే-
"రాజ్యానికి ఏనుగంత సత్తువ వచ్చింది. నిత్యజీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసరమే. తాను పాడలేకపోయినా అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం
మంచిని చేస్తుంది." అంటాడు కథకుడు చాసో.

ఎదురింటి అమ్మాయి సంగీత స్వరకల్పన ప్రారంభించే సరికి స్వరాజ్యం శ్రద్ధగా వినడమే కాదు;"ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నాది. కూచుని చక్కగా వినండి" అనివాళ్ళను ప్రోత్సహిస్తుంది. ముగ్గురు మగ పిల్లలు. తల్లినికూడా పాడమని పిల్లలు కోరగా, ఆ అమ్మాయి పాడిన విధానంతో పోల్చి తల్లి సరిగ్గా పాడలేదంటారు పిల్లలు.
"డబ్బెక్కడిది?" అని భార్య ప్రశ్నకు
..."పాతదనుకున్నాను. పాతదానికే విలువ ఎక్కువట!" అనిన భర్త సమాధానానికి రాజ్యానికి అర్థమైంది. గది నాలుగుపక్కలా కలియజూసింది.
“ఇహ నువ్వు చూడనక్కర్లేదు”.
“నీకు కష్టంగా ఉంటుందని తెలుసు. నేను చేసింది తప్పే!" అని నేరస్తుడిలాగ మొహం పెట్టుకున్నాడు. మొగుడి మనస్సు బాధపడుతున్నాదని గ్రహించి తన విచారాన్ని
క్షణంలో దిగమింగుకుంది.
"ఏ తప్పూ చెయ్యలేదు. ఏ సంసారైనా అదే చేస్తాడు. చెయ్యవలసి వచ్చి చేశారు , మీరేం తినేశారా?”
“మనకంతా మొగపిల్లలే కదా అని ధైర్యం చేశాను”.
"పోనియ్యండి, నానోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా? సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది. తల్లి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ
తల్లి తల్లిగుణాన్ని చూపించుకొంది. నాకు ప్రాణం పోసింది. వెళ్ళిపోతూ నాకో చీరా రవికలగుడ్డా పెట్టింది”. అని గుడ్లనిండా నీళ్ళు నింపుకొంది. ఎదురుగుండా ఉన్న చీరని
రాజ్యం విప్పయినా చూడలేదు.
“నాలుగు కాలాలపాటు ఉంటుందికదా అని కొనేశాను”. అని చీర సగం విప్పేసి రాజ్యం భుజంమీద కప్పేశాడు వెంకటప్పయ్య."
జ్ఞాపకంగా ఉంటుంది లెండి!” అన్నాది రాజ్యం.
_-------------
నీతి చెప్పేదే కథ అనాలా?
సందేశం డైరెక్ట్ గా చెప్పాలా?
కొన్ని పాత్రల మధ్య... కొన్ని సంఘటనల ప్రస్తవనతో సమాజం ప్రతిఫలిస్తుంది.

ఈ కథలో....

పెళ్లి చూపుల్లో పాట పాడించడం; అందుకోసం ఆడపిల్లలకు ఒకప్పుడు సంగీతంలో శిక్షణ పెంచడం ఒక ఆనవాయితీగా జరిగే వ్యవహారం!
మూఢ విశ్వాసాలలో ఒకటి: ఇళ్ళు  కలిసి రావడం, కలిసి రాకపోవడం అనేది.
ఒకప్పుడు ఉన్న ఇంట్లో ఇంటిల్లిపాదికీ రోగాలని
ఆ తర్వాత సిమెంటు డాబాలో రెండు చిన్న గదులూ, వసారా అద్దెకు తీసుకున్నాక అద్దె ఎక్కువైనా తన భార్య రాజ్యం బతికిందని వెంకటప్పయ్య అందరిలాగే నమ్ముతాడు. భార్యపై ఉన్న ప్రేమను బట్టి...
“వెధవ డబ్బు. ఏదో కూడిక చేసుకొంటాము. నువ్వు బతికావు. అంతేచాలు.” అన్నాడు.
“అదేమన్న మాటలెండి. నా జబ్బుకి ఎక్కణ్ణుంచి తెచ్చారో, ఎంత అయిందో ఇప్పటికి నాకు చెప్పకుండా ఉన్నారు. అదీ ఆలోచించుకోవాలి”. అన్నాది.
“ఆ వూసు నిన్నెతోద్దన్నానా? ముందు నీ ఆరోగ్యం చూసుకో. నువ్వేమీ లోభపడకు.కావలసినంత ఓవల్టిన్ను తాగు. తెచ్చిన పళ్ళన్నీ తినెయ్యి, పిల్లలకి కూడా పెట్టకు.”
“తినకేం చేస్తున్నాను? కాళ్ళు జాపుకొని మీ చేత వండించుకొని మరీ తింటున్నాను.
ఏదైనా అప్పు అప్పేకదా? మనకింకో విధం ఉంది కనకనా? "

అలాగే ....
ముచ్చట పడి భార్యకు జరీ అంచు చీరను కొనుక్కోనొస్తాడు.

శ్రీశ్రీ ఋక్కులు

ఋక్కులు


కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా -

హీనంగా చూడకు దేన్నీ!

కవితామయమేనోయ్ అన్నీ!


రొట్టెముక్కా, అరటి తొక్కా, బల్లచెక్కా

నీవేపే చూస్తూ ఉంటాయ్!

తమ లోతు కనుక్కోమంటాయ్!


తలుపు గొళ్లెం, హారతిపళ్లెం, గుర్రపుకళ్లెం

కాదేదీ కవిత కనర్హం!

ఔనౌను శిల్ప మనర్ఘం!


ఉండాలోయ్ కవితావేశం!

కానీవోయ్ రసనిర్దేశం!

దొరకదబోయ్ శోభాలేశం?


కళ్ళంటూ ఉంటే చూసి,

వాక్కుంటే వ్రాసీ!


ప్రపంచమొక పద్మవ్యూహం!

కవిత్వ మొక తీరనిదాహం!

జాషువా విషయంలో జవాబు దొరకని ప్రశ్నలు!


జాషువా విషయంలో జవాబు దొరకని ప్రశ్నలు!

1895 జాషువా ఆనాటి సమాజం జాషువాని శూద్రుడు గా చూసిందా? పంచముడిగా చూసిందా?
శూద్రునిగా చూస్తే మిగతా శూద్ర కులాలకి చెందిన వారికి లేని అంటూ, అస్పృశ్యత జాషువా పట్ల ఎందుకు ప్రదర్శించారు?

పితృ స్వామ్య వ్యవస్థలో తండ్రి వారసత్వాన్ని పరిగణిస్తారు, ప్రాధాన్యత ఇస్తారు.

చట్టాన్ని అనుసరించి చూసినా తండ్రి కులము సంతానానికి వర్తిస్తుంది. తండ్రి యాదవ. తల్లి ఎస్సీ కులానికి చెందిన స్త్రీ అయినప్పటికీ జాషువా యాదవ కులానికి చెందిన వాడిగా నాటి సమాజం ఎందుకు పరిగణించలేదు?
తల్లిదండ్రులు క్రైస్తవులుగా మారినా క్రైస్తవ్యాన్ని అనుసరించే బిట్రీష్ వారికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి కదా? ఎందుకివ్వలేదు?

జాషువాని అస్పృశ్యుడిగా చూసేందుకు తండ్రి కులాన్ని కూడా పక్కన బెట్టి తల్లి కులాన్ని మాత్రమే చూసి శూద్రునిగా లేదా పంచమునిగా నాటి సమాజం పరిగణించింది.

ఈ దేశంలో కులతత్వం మతతత్వం పోలేదు.
పోయిందనే వారు... పోతుందని వారు... సంఘ సంస్కర్తల వేషాలు వేసుకొని వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు ఆదర్శ వ్యక్తులగా  తరతరాలనుంచి హిందుత్వాన్ని అనుసరిస్తున్న మాల మాదిగలకు ఎందరు తమ కుమారులను, కుమార్తెలను ఇచ్చి పెళ్ళి చేయడం లేదు?

అంటరానితనం, అస్పృశ్యత ఇలాంటి అనేక కారణాలు చూపి లేదా వృత్తి ధర్మాన్ని బట్టి వారి సామాజిక స్థితిగతులను బట్టి దళితుల్ని దూరం పెడుతున్నటువంటి సమాజం!

కుల వివక్షత కారణంగా జాషువా ఎదుర్కున్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నతనంలో బడిలో, ఆటల్లో వివక్ష, కవిగా కులవివక్షను  రూపంలో ... వినుకొండలో ఒక రోజు కొప్పరపు కవుల కవిసమ్మేళనం జరుగుతుంది. అది తెలిసి కొన్ని పద్యాలు రాసుకుని జాషువా ఆ సభలోకి వెళ్ళగా అక్కడి వారు 'అంటరానివాడు సభలోకి రావడమేంటని' అవమానించారు. 

       తన కవిత్వాన్ని చూడకుండా తన కులాన్ని బట్టి కవిత్వాన్ని చులకనజేసి మాట్లాడేవారిని -
“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల సూయచేతన
న్నె విధిదూరినన్ ననువరించిన శారద లేచిపోవునే?
యివ్వసుధా స్థలింబొడమరే రసలుబ్దులు? గంటమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్రవాణికిన్"అని సౌమ్యంగానే సవాలు విసిరాడు జాషువా. వ్యక్తిగతంగాగాని,
కవితా రూపంలోగాని జాషువా ఎక్కడా పరుషంగా మాట్లాడిన సందర్భం కనిపించదు.

       జాషువా ప్రయాణిస్తుండగా తన ప్రక్కకూర్చున్న పండితుల కోరిక మేరకు తాను రాసిన పద్యాలను వినిపించగా ఆహా ఓహో అంటూ జాషువాను ఆకాశానికి ఎత్తి మీది ఏకుమని అడిగి తెలుసుకుని దూరంగా జరిగారట. ఈ బాధలోంచి వచ్చినదే ఈ క్రింది పద్యం .

“నా కవితావధూటి వదనంబు నెగా దిగజూచి రూపురే
ఖా కమనీయ వైఖరులుగాంచి భళీ భళి; యన్నవాడే “మీ
దేకుల” మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగున్ పార్థివచంద్ర; వచింప సిగ్గగున్”

మనుస్మృతి, ఋగ్వేదంలో చెప్పినట్లు...

1. " బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారు. " ( ఋగ్వేదం 10 - 90 - 12 )

2. " భూలోక విస్తారము కోరినవాడై బ్రహ్మ తన ముఖము, బాహువులు, తొడలు, పాదాల నుండి వరుసగా బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సృష్టించెను. " ( మనుస్మృతి 1 - 31 )

3. " బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి ధర్మాలను ఇహపర సుఖములకై బ్రహ్మ వేరువేరుగా ఏర్పరచెను. " ( మను 1 - 87 ).

“ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు
నలుగురు కుమారులనుట విన్నాముగాని
పసరముకన్న హీనుడభాగ్యుడైన
యైదవకులస్థు డెవరమ్మా, సవిత్రి?” ఈ  విధమైన ప్రశ్నమరే దళిత కవి వెయ్యలేదు.  

ఒకే కులంలో ఉన్న విబేధాలను గూర్చి-

" దేవుడొకడు మాకు దేవళంబులు రెండు
దేశమొకటి, మాకు తెగలు రెండు
మాటవరుస కొక్క మతమందుమే కాని
కుల సమస్య వద్ద కుమ్ముదుమ్ము

మాలక్రీస్తు కన్న మాదిగ క్రీస్తుడే
యరవీస గొప్ప వాడనియెనొకడు
మాయభక్తియె కాని మనసులోపల భక్తి
బూటకంబని లేచిపోయెనొకడు

మాలయేసు క్రీస్తు మాదిగలకు గాడు
మాదిగేసు క్రీస్తు మాకు గాడు
ఒకడు చిలువరించు నొకడు స్నానంబిచ్చు
నిరువురేకమగుట కేది దారి...?” అని ప్రస్తావించాడు.

కులమతాల తత్వానికి అతీతంగా
జాషువా కవితారచన సాగింది.
కులాధిక్యతను ప్రదర్శించినవారిని
నిరసించినా, ఒక కులంలోనివారి
మధ్యనున్న వైరుధ్యాన్ని ప్రశ్నించినా
కులతత్వం ఛాయలేని కవిత్వం జాషువాది. అందుకే-

“కులమతాల గీచుకొన్న గీతలజొచ్చి
పంజరాల గట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగులేదు, విశ్వనరుడనేను” అని అంటాడు.
అంతేకాదు-
“మతపిచ్చిగాని వర్ణో
న్నతిగానీ, స్వార్థచింతనముగానీ నా
కృతులందుండదు, శబ్దా
కృతి బ్రహ్మానంద లక్ష్మి నృతమ్మొనర్చున్” అని స్పష్టం చేస్తాడు జాషువా.

'నిన్న జాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చి వేయును'
'వేద చతుష్టయంబు ప్రభవించిన వ్యాసుని దివ్యవాణిలో
మాదిగలుందురా?
రుధిర మాంసములున్
గల అంటరానివారాదిమవాసులు
అక్కట కదా! తలపోసిన
గుండెలో సూదులు మోసులెత్తును
కృణోదరి! ఎట్లు సహించుకొందువో?'
'ఏ జాతికెంత వచ్చునో
రాజస్వంబంత నాకు రావచ్చు గదా!
నా జాతి ఎత్తు కేతన
రాజంబున నీదు మూర్తి వ్రాయింతు చెలీ!'

బోయి భీమన్న "పాలేరు" నాటకం


బోయి భీమన్న "పాలేరు" నాటకం

ఏ వ్యక్తైనా ఒక మహోన్నతమైన వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఎదగడానికి అతని కులం, మతంతో పనిలేదు. అలా స్ఫూర్తిగా తీసుకోవడానికి చరిత్రలో ఎందరో ఉన్నారు. ఒక అంబేద్కర్, నెల్సన్ మండేలా దేశవ్యాప్తంగా... ప్రపంచవ్యాప్తంగా... మీరు వారి వారి జాతి జనులకు మరింత దగ్గర కావడానికి కారణం వీరూ ఈ అసమానతల సమాజాన్ని ఎదుర్కొని స్ఫూర్తివంతులుగా నిలిచినవారు కావడమే!

పాలేరు నాటక రచయిత బోయి భీమన్న:
ఆ కాలంనాటి దళిత స్థితిగతులు:
పాలేరు విధులు:

నాటకమే కాదు; రచయిత ఈ నాటకంలో కథానాయకుని ద్వారా... వివిధ పాత్రల ద్వారా సందర్భానుగుణంగా, సందేశాత్మక గీతాలను, పద్యాలను రచించారు.  వివిధ పాత్రల ద్వారా ద్వారా కూడా సామాజిక సందేశాన్ని తెలియజేస్తాడు.

బానిసత్వం మును పోగొట్టి భారతదేశానికి భాగ్యమ్ము తెమ్ము.  అన్ని దేశాలలోని మానవులందరిలోనూ సమానత్వము సాధించు. ఒకడు తింటుండగా మరొకడు పస్తు పడియుండడం ధర్మం కాదు. అందరికీ కూడు,గుడ్డ, కొంప సమానముగా చేకూర్చు. ఒకడు ప్రభువుగా మరొకడు సేవకుడు గా లేని సంఘాన్ని నిర్మించు. మానవులకు సౌఖ్యసంతోషాలు కలిగించు."

పాలేరు వెంకన్న పట్ల దుర్భాషలాడే కుబేర్రావులాంటి వారి మాటల్ని, తిట్టుల్ని  ఆనాడు దళిత జాతి పడటం, సహించడం సర్వ సాధారణం. అట్రాసిటీస్ చట్టాలు అనాడు లేవు. ఆధునిక కాలమైనా ఆ కామందుల... భూస్వాముల ఘనకార్యాలే కారంచేడు, చుండూరు హత్యలు.  స్వాతంత్ర్యానికి పూర్వం దళితులను కొట్టడం సర్వ సాధారణ విషయం. ఈ నాటకంలో కుబేర్రావు చేత వెంకన్న అలాగే దెబ్బతిన్నాడు.
కులమతాలకు అతీతంగా దళితులనూ విద్యావంతులను చేసే ఉపకారి మాష్టారు లాంటి వారు కొందరే ఉంటారు. ఉపకారిలాంటి వారు భూస్వాములకు నచ్చరు. చదువు చైతన్యం, విజ్ఞానం, విచక్షణ కలిగిస్తుంది గనుక దళితుల్ని విద్యకు దూరం చేసే కుట్రలు కుబేర్రావు వంటివారు చేస్తుంటారు.

వన బాల ఇందులో కథానాయిక. ఒకనాడు గిత్త దూడ నుండి వనబాలను వెంకన్న  కాపాడుతాడు. వనబాల  అన్న సుందరం. అభ్యుదయ భావాలు కలవాడు. పల్లెల గురించి కర్షక, కార్మికుల గూర్చి పాడతాడు. కులాల పట్టింపులు లేకుండా సుందరం అందరితో తిరుగుతాడని కుబేర్రావుకి కోపం.

నడక రావడంతోనే పాలిచ్చి బడికి పంపాల్సిన వాళ్ళను కర్ర ఇచ్చి గొడ్లు కాచేందుకు, పాలేర్లుగా పంపేందుకు నాటి దళిత తండ్రుల తరం విజయవంతంగా ప్రయత్నించారు. చదువు గొప్పతనాన్ని చెప్తాడు ఉపకారి మాస్టారు, సుందరం పేద రైతులకు కూలీలకు విద్య చైతన్యం కల్పించాలని మాట్లాడుకుంటారు.

పాలేరు పనివేళలు విధులు:
తాను లేటుగా పొలానికి రావడానికి గల కారణాన్ని వెంకన్న వనబాలతో  చెబుతూ....
కోడికూతతో లేచి కామందు ఇంటికి వెళ్లి, దూడల్ని మార్చి, దొడ్డి ఊడ్చి, పేడచిమ్మి, పాచి పనులన్నీ చేయాలని.... దూడలని పొలంలో మేపడానికి తీసుకురావాలని వెంకన్న అంటాడు.
మా తండ్రి కంటే మా కామందే నయమని వెంకన్న పలుకుల్లో నాటి అజ్ఞానపు ఆలోచనలో ఒకరి తర్వాత ఒకరిని కామందు తరాలవారికి వారి వారసులకు పాలేరులుగా, బానిసత్వానికి అప్పజెప్పే అజ్ఞానయుగం.
వనబాల తనపట్ల జాలి గుణాన్ని కరుణను చూపుతుందని వెంకన్న గ్రహిస్తాడు. అంటే శ్రమదోపిడి వీరేశం నేపాల్ కు జీతం 464 త్వరలో ఒక కిచెన్ రూమ్ కి ఒకసారి అందులో పడ్డాక బయటపడడం కష్టం వెంకన్న తండ్రి పుల్లయ్య వెంకన్న కూడా చదువు చదువుకోవాలని కష్టపడతాడు కానీ చదువు గురించి మాట్లాడితే తండ్రీ అని భయం దారి తప్పుతున్న తన జీవితం గూర్చి గ్రహించి వాడుకుంటాడు వెంకన్న ఉపకారి ప్రోద్బలంతో చదువు పట్ల ఆసక్తి చూపుతున్న వెంకన్న గురించి తెలుసుకున్న యజమాని వెంకన్న తండ్రి అతని కుమారుడు తప్పు చేసినట్లు చదువుకోకుండా బుద్ధి చెబుతాం అని హెచ్చరిస్తాడు
తండ్రి పుల్లయ్య చేత వెంకన్న కొట్టిస్తాడు ఉపకారం భాష అడ్డుకుంటాడు స్థానంలో ఉన్నాడని అతని తండ్రి మార్చారు చెబుతాడు అక్కడినుంచి పారిపోయాడు దళితుల బాల్యదశ కు పట్టిన చీడ పాదం పసిబిడ్డని పశువుల్ని చేసేది స్థానం దళితుల బానిసత్వానికి కారణం పేదరికము కులము కాదు మూర్ఖత్వమే అని రచయిత అంటారు పాలేరు కథలోని వెంకన్న లాగా ప్రతి దళితుడు కోల్పోయిన కోల్పోతున్నారు ఆలోచన చేయాలి నుండి రక్షించమని దేవుని ప్రార్థించే అడ్డుకుని రక్షిస్తుంది వెంకన్న
కుబేర్ అయ్యా వెంకట్ ను మరోమారు ఎందుకు చదువుకున్నామని వెంకట పోతుండగా మార్చారు అడ్డుకొని హితబోధ చేస్తాడు వెంకన్న పినతల్లి సీత పినతండ్రి వీరేశం సరససల్లాపాలు ఆడుకుంటూ కుబేర చేలో పని చేస్తున్నారు ఇది గమనించిన కుబేర్ అయ్యా మందలించాడు పాలేరు వ్యవస్థలో కామాంధుల విషయంలో గమనించదగిన మరో విషయం విద్యాబుద్ధులు దూరంచేసి అజ్ఞానంలో బ్రతకాలని వారు వారి పొలాల్లో పని చేసే పాలేరుగా పని చేసే వారి ఆడవాళ్లపై కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కామందుల అయినా కామాంధులకు అలా సీతపై కనబడేందుకు మేరకు
పుకార్లను పంతులు వచ్చినప్పటినుండి పాలెం గ్రామంలో కరువైందని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని భూస్వాముల అందరూ అనుకుంటారు నాటి సమాజంలో బానిసతనం కంటే చావు మేలు నా వంటి కుర్రాళ్ళు హాయిగా చదువుకో చదువుకుంటున్నారు నేను పాలేరుని పశువుగా బ్రతకలేను అని వెంకన్న మాటలు అందరూ మాట్లాడుతారు పాలేరు పులి తన వృత్తి రెడ్డి తండ్రి పుల్లయ్య వెంకటరమణ బయటపడకుండా చేస్తున్నారని గ్రహించిన మార్చారు కాకినాడలోని అనాధ శరణాలయానికి పంపించడం మంచిదని నిశ్చయించుకుంటాడు
పాలేరు కుటుంబాలలోని స్త్రీల పట్ల కామాంధులు ఉన్నా కామపు చూపు ఇది ఉదాహరణ వెంకన్న పిన్ని ని ఎలాగైనా లొంగదీసుకోవాలని పుల్లయ్య శీను కుబేర రావు సీత సీత లింగంపల్లి కాకినాడ పారిపోతారు ఉపకార మాస్టారు ఆలోచనతో వెంకన్న ఊరు వదిలి పారిపోతాడు సీత వీరేశలింగం పట్నం పారిపోతారు అందరికీ వీలు కనిపించకపోయేసరికి పోలీసులకు చెప్పినా వినడు దొంగ పనులు పెట్టుకుంటాడు కుబేర రావు

దొంగరాముడు వచ్చే పంతులు గారు ఇచ్చిన పది  రూపాయలు ఇచ్చిన చీటీ పోగొట్టుకుంటాడు వెంకన్న రామన్ అనాధ శరణాలయం మేనేజర్ గారి అబ్బాయి సుందరం రామన్ గౌడ్ దారితప్పిన వెంకన్న కోసం కాకినాడలో వెదకడం ప్రారంభిస్తారు ఎట్టకేలకు వెంకన్న అనాధ శరణాలయానికి చేరుకుంటాడు వెంకన్నను చదివించడానికి అందరూ సహాయపడటానికి నిశ్చయించుకున్నారు పుల్లయ్య మొగుడుతో ముష్టికి బయలుదేరడం గుర్తించిన వనమాల తాను అక్కడ ఉండదు అన్నట్లు చెబుతాడు వెంకన్నను మార్చారు అని అనుకుంటారు

వెంకన్న వెంకటేశ్వరరావు పేరుతో బిఎ చదువుతాడు చదువుతున్న చదువుతున్నట్లు ఉత్తరం ద్వారా ఉపకార తెలుసుకుంటాడో వనమాల వెంకన్న గా పరిచయమైన వెంకటేశ్వర్లు పై చదువులకు తన నగలన్నీ అమ్మి సహాయపడడానికి పూనుకుని ఉపకారికి ఇచ్చింది ఒకప్పుడు పాలేరు తనాన్ని విడనాడండి అని మాటలు పెడచెవిన పెట్టిన వాస్తవాన్ని గ్రహించి జరిగిన నష్టాన్ని గుర్తించి పాలేరు తనలో ఏమీ లేదని స్వేచ్ఛగా తలెత్తుకొని సొంతంగా అని ప్రచారం చేస్తాడు ఉపకారి మాస్టారు చేతిలోని నగరం గురించి వీరేశం మాస్టర్ ని కేసులో వినిపిస్తాడు రావు తన అనుచరులతో
పూరిపాక లో ఉండే తాను జీవితంలో ఎలా ఎదిగాడో ఆలోచించు ఉంటాడు వెంకటేశ్వర్లు పూరి పాక లో ఉండి నేను ఇప్పుడు మంచి రాజభవనంలో ఉన్నాను లక్షాధికారులను పిల్లలతో స్నేహంగా ఉన్నాను నా అదృష్టానికి కార్మికుడు తన ఊరు పంతులుగారు స్థానం నుండి నన్ను ఆదరించిన వారందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను హనీ వెంకటేశ్వర్లు అనుకుంటాడు బి ఏ పరీక్షల్లో ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాడు వెంకటేశ్వర్లు రామ్ సలహాతో అధికారి గా రావడానికి ఫీడ్ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తాడు పాలేరుగా బాలకార్మికులుగా కట్టు బానిసలుగా నలిగిపోతున్న తన జాతి జనాన్ని రక్షించాలని ఆశిస్తాడు వెంకటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ అవుతాడు గ్రామానికి మన భారత తో వివాహం కుదుర్చుకుని తెలిసి వెంకటేశ్వర్లు బాధపడతాడు పట్ల తనకున్న ప్రేమను గుర్తిస్తాడు వారు కూడా రావడంతో తాను ఊహించిన విధంగా తన పెళ్లి జరిపించడం బాధపడుతుంది తన మనసులోని మాట సీతో చెబుతుంది తన భర్త వీరేశం ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది తన మనసుకు ఇష్టం లేని పెళ్లి జరగబోతుందని గ్రహించిన వర్ణమాల బావిలో దూకి చనిపోవడానికి సిద్ధపడుతుంది అది మనిషి ఎవరో ముసుగు ధరించిన మనిషి ఎవరో తనని తన
బట్టలు తన పరిశీలించి అంటాడు వానపాల బావిలో దూకి ఇచ్చాను పాల్పడుతోంది వెంటనే వెంకటేశ్వర్లు బావిలో దూకి ఆమెను రక్షిస్తాడు ఆ తర్వాత విషయం తెలుసుకున్న అదేవిధంగా సుందరం విషయాన్ని చెప్తారు వారిరువురికి వివాహం చేస్తారు జాతి ఏకమై దాస్యపు సంకెళ్ళు బద్దలయ్యాయి అని కుల భేదాలు గోడను పగులగొట్టి పూర్వపు ఔన్నత్యమును బూజు దులిపి విద్యార్థిని నిద్రలేపి వెంకటేశ్వరరావు నిండిందని ఆ పిండిని జరిపించిన రామసుందరం ఆదర్శ వివాహం ద్వారా కాల్షియం పోయిందని హైందవ జాతి దళితుల బ్రతుకులు విద్యా సూర్యుడు ఉదయించడం తో దేశాభ్యుదయం వెల్లి విరుస్తుందని ఆ సమయంలో తన ప్రమేయం ఉండడం తన అదృష్టమని మాస్టారు ఆనందించాడుడ

Monday, September 27, 2021

పైడి తెరేష్ బాబు "అల్పపీడనం" కవిత

పైడి తెరేష్ బాబు 

పైడి తెరేష్ బాబు  ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని గద్దల కుంటలో సుబ్బమ్మ, శాంతయ్య దంపతులకు 1963 నవంబర్ 3 న జన్మించాడు. శాంతయ్య పద్యాలు రాయడం, పాడడం చేయడంతో తెరేశ్‌బాబు కవిత్వంపై మక్కువ పెంచుకున్నారు. మొదటిసారిగా కొత్తగూడెం లోని ఆలిండియా రేడియోలో వ్యాఖ్యాతగా ఉద్యోగ జీవితం ప్రారంభించి  హైదరాబాద్‌ లోని ఆలిండియా రేడియోలో ఉద్యోగిగా సేవలందించారుపైడి తెరేష్ బాబు గారి భార్య తాహెర సుల్తానా, ప్రణయ్‌ చంద్ర, సాయి రితిక కుమారుడు , కుమార్తెలు.  
 గజల్స్‌ రాసి స్వరకల్పన జేసి పాడడం ప్రతిభావంతుడు. పైడి తెరేష్ బాబు కవిగా అల్పపీడనం, 'హిందు మహాసముద్రంనేను నా వింతల మారి ప్రపంచం వంటి ఎన్నో రచనలు చేశారు.
తనదైన శైలితో అద్భుతమైన దళిత కవిత్వాన్ని రచిస్తూ దళితుల రక్తంలో వేడిని పుట్టించిన  కవి. దళిత జీవిత చిత్రాలనెన్నింటినో తన కవిత్వంలో ప్రదర్శించిన కవి. దళితులపట్ల సమాజం ప్రదర్శించే వివక్ష,  దోపిడీ,దౌర్జన్యాలను, అసూయను కవిత్వంలో ఎండగట్టిన కవి. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 29, 2014 సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు.

 అల్పపీడనం -

మట్టి మూకూళ్లూ మడ్డి తపేళాలు ఎంత దగా చేశాయి !

పందుల గుడిసెలు బందెల దొడ్లూ ఎంతకుట్ర పన్నాయీ !


ఎముకల గూళ్ళకింత కొవ్వా !

కాలికింద చెప్పులకింత మిడిసిపాటా !

ఎంగిలి మెతుకులకీ , కాపల కుక్కలకీ

కల్లు ముంతలకీ , కావిడి బద్దలకీ , గానుగెద్దులకీ

చెమట కాలవలకీ , చింపిరి చర్మాలకీ 

కత్తులకీ, అరెలకీ , పుసికల్లకీ , ఆనెలకీ

అరెరెరెరె . . . . . . . 

" బాంచన్దొరా నీ కాల్మొక్తా" లకి ఎంత ఒళ్ళు బలిసింది !

ఎంత గడి మీరకపోతే వీళ్ళ చర్మాలు జెండాలౌతాయి

ఎంత బరితెగించకపోతే వీళ్ళ చేతులు గొంతుకలౌతాయి

దుక్కుల్లో,దున్నకాలలో గొడ్లకొష్టాల్లో గాడిద చాకిరీల్లో

వీళ్ళసత్తవలు బుగ్గి కాలేదన్నమాట

చష్టాతూములకింద,గడ్డివాములవెనుక ,నాగేటి చాళ్లమధ్య

వీళ్లమానాలు మట్టి కాలేదన్న మాట

ఎండుమాంసాలు ఏరువాక మామూళ్లు వీళ్ళనోళ్లని నొక్కలేదనమాట

న్యూనతాభావాల నిప్పుకోళ్లు వీళ్ళని పొడిచి చంపడం లేదన్నమాట

ఈ సమీకరణ లేమిటి ఈ సమూహాలేమిటి

ఈ సంబంధాలేమిటి ఈ రణన్నినాదాలేమిటి

జఠరాగ్ని బడబాగ్ని తోబుట్టువులేననీ

అసంతృప్తుల్నీ పొగేస్తే అల్పపీడనమవుతుందనీ

వాయుగుండమై వామనపాదమై

కొత్త నింగి కొత్త నేల పుట్టుకొస్తాయని నూరిపోసి

వీళ్ళకిలా విరుచుకుపడే విద్య నేర్పిందెవరసలు

ఈ మబ్బులేమిటి ? ఈ ఝుంఝుంలేమిటి ?

ఈ వార్తవరణ హెచ్చరికలు , ఈ మేనిఫెస్టోలేమిటి

ఛీ నీయవ్వ -

నోటు ముద్ద‌ర్లకీ ఓటు ముద్దర్లకీ కక్కుర్తిపడ్డాగానీ

వీళ్ళ బొటనువేళ్లను నరికినప్పుడే

చూపుడువేళ్ల చర్మం సైతం వొలవ్వలసింది గాదూ !

ఈ హోరెత్తే కెరటాలేమిటి ? ఈ పోటెత్తే సముద్రాలేమిటి ?

ఈ ఉరవడీ ఈ అలజడీ ఓరిదేవుడా ఈ అదాటు ఉప్పెనలేమిటి ?

నా ఓట్లేంగాను నా సీట్లేంగాను నా గుత్తాధిపత్యం నా విత్తాధిపత్యం

నా దాపుడు చీరలూ , నా నియోజకవర్గాలు ఏమైపోను ?

నా మడీ మగాళ్లూ , నా వడ్డీ వసూళ్లూ నా పెత్తందారీతనాలు

నా బుర్రమీసాలు కాణ్ణించి కిర్రుచెప్పులదాకా

అడ్డంగా నిలువునా అష్టదిక్కులా బలిసిన నా " అహంకారం " ఏమైపోను ?

పిచ్చితుమ్మల మధ్యనో పీతిరిగుంటల పక్కనో

నాలుగ్గుడిసెలేసుకున్నారంటే సరే

ఉంటానిక్కావాలి - ఒప్పుకుంటా

ఈ ఉద్యోగాలేమిటి ? ఈ ఊళ్ళేలడాలేమిటి ?

మళ్ళీ వీళ్ల బొడ్లు కోసి కొత్తపేర్లు పెడుతున్న దెవరర్రా

నా ఇనప సింహాసనపు నాలుగోకాలు విరగ్గొట్టేది ఎవరర్రా


చ్చొచ్చొచ్చొచ్చొచ్చొ

మట్టిమూకుళ్లూ మడ్డి తపేళాలు ఎంత దగా చేశాయి !

పందుల గుడిసెలు బందెల దొడ్లూ ఎంత కుట్రపన్నాయీ !

   ---- మహా కవి ---- పైడి తెరేష్ బాబు ---