-->

Sunday, September 18, 2022

అనకాపల్లి, ఏ.ఎమ్.ఎ.ఎల్. కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ అక్రమ సర్వీస్ డిస్మిసల్ పై రిలే నిరాహారదీక్ష

 


అనకాపల్లి, ఎ.ఎమ్.ఎ.ఎల్. కాలేజీ మేనేజ్మెంట్ వారు తెలుగు అధ్యాపకుడైన డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అనుమతి లేకుండా సర్వీస్ డిస్మిసల్ చేసినదానికి నిరసనగా దళిత సంఘాల మద్దతుతో 16-09-2022 ఉదయం 10 గంటలకు అనకాపల్లి కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగా రిలే నిరాహారదీక్ష చేయడం జరిగింది. గతంలోనూ వివిధ నిరాధార ఆరోపణలతో అధికారుల అనుమతి లేకుండానే డాక్టర్ తలతోటి పృథ్విరాజ్ ను సరెండర్, సస్పెన్షన్ చేయడం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు కులం పేరు తో దూషించడమేగాక; వివిధ సమావేశాల్లో పృథ్విరాజ్ ను కించపరుస్తూ అతని పట్ల వేధింపులకు పాల్పడిన కారణంగా పృథ్విరాజ్ కరస్పాండెంట్ పై అట్రాసిటీ కేసు పెట్టాడు. మరోమారు కూడా దళిత అధ్యాపకులతో ఇతర కులాలవారు ఫోటోలు దిగగా దానిపై కూడా వాట్సాప్ గ్రూప్ లో కులాన్ని కించపరస్తూ కరస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు రాయడంతో రెండవ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ రెండింటి పై అరెస్టు కాకుండా ఆర్డర్ తెచ్చుకుని మరింత వేధించడం ప్రారంభించారు. ఈ రెండు అట్రాసిటీ కేసులు ఉపసంహరించుకోవాలని వత్తిడి చేస్తూ మేనేజ్మెంట్ ఈ రకమైన సర్వీస్ డిస్మిసల్ కు పూనుకున్నారు. దళిత సంఘాలు ఈ విషయంపై కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించగా సాకుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వారి హామీమేరకు దీక్ష విరమించడం జరిగింది.






















No comments:

Post a Comment