-->

Sunday, September 18, 2022

సిగ్గుపడకుండా ఒక్కడిపై ఒక వ్యవస్థకు చెందిన వందలమంది అనైతిక యుద్ధం.



స్ప్రైట్ యాడ్లోలా సూటిగా సుత్తి లేకుండా ఏ.ఎమ్.ఏ.ఎల్. కళాశాల మేనేజ్మెంట్ ను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. నాపై చర్యలు కోరుతూ డిస్మిసల్ అనుమతికై అడ్వొకేట్ ఎంక్వయిరీ రిపోర్ట్ ను ఆర్జేడీ ద్వారా కమీషనర్ కు సమర్పించి వారి ప్రొసీడింగ్స్ వచ్చాక నన్ను డిస్మిస్ చేయాలని ఎదురు చూసినవారు.... రిటైర్డ్ సీనియర్ జడ్జిచే చాలా శాస్త్ర బద్ధంగా, పారదర్శకంగా ఎంక్వయిరీ నిర్వహించామని గొప్పలు చెప్పుకున్న మేనేజ్మెంట్ వారు మొదటి లాగే మీ ఎంక్వయిరీ రిపోర్ట్ ను ఆర్జేడీ ద్వారా కమీషనర్ కు సమర్పించి వారి ప్రొసీడింగ్స్ కొరకు ఎందుకు ఎదురు చూడలేదు? మీకు డిస్మిస్ చేసే అధికారమే ఉంటే కమీషనర్ ను కోరకుండా మొదటి ఎంక్వయిరీ రిపోర్ట్ సబ్మిషనప్పుడే నన్ను డిస్మిస్ చేసేవారు కదా!

మీ సస్పెన్షన్ లు, సరెండర్ లు, డిస్మిసల్ తో నా నోరు మూయించలేరు. భయపడే రకాన్ని కాదు. నీతిగా రూల్స్ ప్రకారం పోరాటం చేయలేనివారు మాత్రమే ఎన్నిసార్లు భంగపడ్డా సిగ్గులేకుండా ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడి రాక్షస ఆనందాన్ని కొన్ని రోజులు అనుభవిస్తారు. ఊరూ-వాడ, అందరూ గమనిస్తున్నారు ఎవరిది నీతి వంతమైన పోరాటమో, ఎవరివి అనైతిక చర్యలో!

ఒక్కడిపై ఒక వ్యవస్థే...వందల మంది కలిసి కుట్రలుచేస్తూ నన్ను ఎదుర్కోవడానికి మీరు పడుతున్న పాట్లు జనం గమనిస్తూ నవ్వుకుంటున్నారు.

సరెండర్ తీర్మానంపై తెరవెనుక సూత్రధారులు సైతం ముందుకొచ్చి సంతకాలు చేశారుకదా. ఆ సంతకాలకు విలువుందా?చెల్లాయా? అధికారులు సరెండర్ ఆమోదించలేదు. మర్లా ఈ డిస్మిసల్. కాలం సమాధానం చెబుతుంది. కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఇది రేపటి చరిత్రగా చెప్పుకుంటారు.

No comments:

Post a Comment