ఎయిడెడ్ కళాశాలలు అన్నీ పక్కా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాయని అననుగాని... మా కళాశాల వ్యవహరించే అంత దారుణంగా మరే కళాశాల యాజమాన్యం వ్యవహరించదు అని మాత్రం చెప్పగలను. మా కళాశాల లోని అనేక విషయాలను రాష్ట్రంలోని ఇతర ఎయిడెడ్ కళాశాలలలొ పనిచేసే అధ్యాపక మిత్రులతో ముచ్చటించినపుడు వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు.
మొదటినుండి నా ప్రశ్నించే తీరు నచ్చని కళాశాల యాజమాన్యం:
కళాశాలలో నేను చేరిన నాటి నుండి యాజమాన్యం తీసుకునే నిర్ణయాలలో విభేదించేయి ఉంటే వివిధ సమావేశాలలో మాట్లాడిన సందర్భాలు అనేకం. మా కళాశాలలోని అధ్యాపకులకు తెలుసు. అందుకే ఆతర్వాత కాలంలో అధ్యాపకుల సంఘానికి ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆ బాధ్యతతో స్టాఫ్ సమస్యలపై యాజమాన్యం, ప్రిన్సిపాల్ వద్ద మాట్లాడేవాడిని. సర్క్యులర్స్ పంపమని, ప్రిన్సిపాల్ నియామకాల్లో సీనియారిటీని అనుసరించమని ఇలా అనేకం .
యాజమాన్యానికి అవకాశంగా బయట నాపై తప్పుడు ఆరోపణతో కేసు ఫైల్ -సస్పెండ్ :
కళాశాల యాజమాన్యానికి ఎప్పటినుండో మింగుడుపడని నాపై ఒక తప్పుడు కేసు నమోదు అయిందో లేదో ఎటువంటి విచారణ లేకుండా అదే గొప్ప అవకాశంగా భావించి నన్ను సస్పెండ్ చేశారు. నేను ఎప్పుడు రూల్స్ కు విరుద్ధం కాదు. నేను మా మేనేజ్మెంట్ తో విభేదించేదే రూల్స్ గూర్చి. ఒక ఉద్యోగిని ఏ ప్రాసెస్ లో సస్పెండ్ చేస్తారు. క్రిందిది సస్పెండ్ లెటర్ నమూనా ?
సస్పెండ్ విధానమే ప్రభుత్వ నిబంధనలు - మానవ హక్కులకు విరుద్ధం:
ప్రత్యేకించి ఎయిడెడ్ కళాశాలలలో ఒక అధ్యాపకుడిని సస్పెండ్ చేసేంత ఇష్యూస్ ఉండవు. ఆర్ధిక పరమైన విషయాలు వాళ్ళ పరిధిలో ఉండవు. ప్రభుత్వ నిధుల మంజూరు, వినియోగం-మళ్ళింపులు ఆఫీస్ వైపు ఉంటాయి . యాజమాన్యం వైపు ఉంటాయి. అధ్యాపకులకు వాళ్ళ క్లాసులు-పాఠాలు ఇలా ఈ పంథాలోనే సాగుతుంది. ఇదిగో ఖర్మగాలి ఇలాంటి బయటి ఇష్యూస్ తో తప్ప సస్పెండ్ చేసే బలమైన విషయాలు ఉండవు. నాకు తెలిసినంతలో ఎయిడెడ్ కళాశాలలలోని సస్పెన్షన్ కేసులు నూటికి 98 శాతం యాజమాన్యం కక్ష సాధింపులే! ఏ అధ్యాపకుడైన సస్పెండ్ అయ్యాడంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మేనేజ్మెంట్ కు ఇబ్బందికరంగా మాట్లాడుతున్న వ్యక్తిగా భావించ వచ్చు. వారు చేసే ఆర్థిక అవకా తవకలకు సంబంధించి అధికారులకు సమాచారం, ఫిర్యాదు ఇచ్చిన వాడై ఉండాలి. తప్పుల్ని ఎత్తిచూపే ఏలైన, తప్పుల్ని ప్రశ్నించే గొంతైనా అయి ఉండాలి. 2000 సంవత్సరం లో నేను కళాశాలలో అధ్యాపకునిగా చేరాను. పదేళ్ల ముందునుంచే ప్రశ్నించే తత్త్వం నాకు అలవడింది.
సస్పెండ్ చెయ్యడం లో యాజమాన్యం ముఖ్య ఉద్దేశం:
సస్పెండ్ చేసే విధానం ఇది కాదు అనే విషయం జీతాల బిల్లులపై సంతకాలు చేసే ఏ.ఓ కు తెలుసు , ఆర్ జె డి లకు తెలుసు, సస్పెండ్ రివోక్ చేసే ఆ పై అధికారులకు తెలుసు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సస్పెండ్ కాలంలో సస్పెండ్ అయిన ఉద్యోగి కుటుంబ పోషణకు సగజీతం ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది అనే విషయము అధికారులకు తెలుసు. కాని ఏ అధికారి యాజమాన్యాన్ని హెచ్చరించరు. చూసీ చూడనట్లు పోతారు. యాజమాన్యాలు ఇటువంటి తప్పులను పునారావృతం చేస్తూనే ఉంటారు. యాజమాన్యం ఉద్దేశం సదరు అధ్యాపకుని , ఉద్యోగిని ఆర్థికంగా ఇబ్బందికి గురిచేసి వారి కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడమే సస్పెన్షన్ ముఖ్య ఉద్దేశం. అందుకనే ఈ క్రింది విధంగా సస్పెండ్ ఆర్డర్ లు ఉంటాయి.
సస్పెండ్ విధానమే ప్రభుత్వ నిబంధనలు - మానవ హక్కులకు విరుద్ధం:
ప్రత్యేకించి ఎయిడెడ్ కళాశాలలలో ఒక అధ్యాపకుడిని సస్పెండ్ చేసేంత ఇష్యూస్ ఉండవు. ఆర్ధిక పరమైన విషయాలు వాళ్ళ పరిధిలో ఉండవు. ప్రభుత్వ నిధుల మంజూరు, వినియోగం-మళ్ళింపులు ఆఫీస్ వైపు ఉంటాయి . యాజమాన్యం వైపు ఉంటాయి. అధ్యాపకులకు వాళ్ళ క్లాసులు-పాఠాలు ఇలా ఈ పంథాలోనే సాగుతుంది. ఇదిగో ఖర్మగాలి ఇలాంటి బయటి ఇష్యూస్ తో తప్ప సస్పెండ్ చేసే బలమైన విషయాలు ఉండవు. నాకు తెలిసినంతలో ఎయిడెడ్ కళాశాలలలోని సస్పెన్షన్ కేసులు నూటికి 98 శాతం యాజమాన్యం కక్ష సాధింపులే! ఏ అధ్యాపకుడైన సస్పెండ్ అయ్యాడంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మేనేజ్మెంట్ కు ఇబ్బందికరంగా మాట్లాడుతున్న వ్యక్తిగా భావించ వచ్చు. వారు చేసే ఆర్థిక అవకా తవకలకు సంబంధించి అధికారులకు సమాచారం, ఫిర్యాదు ఇచ్చిన వాడై ఉండాలి. తప్పుల్ని ఎత్తిచూపే ఏలైన, తప్పుల్ని ప్రశ్నించే గొంతైనా అయి ఉండాలి. 2000 సంవత్సరం లో నేను కళాశాలలో అధ్యాపకునిగా చేరాను. పదేళ్ల ముందునుంచే ప్రశ్నించే తత్త్వం నాకు అలవడింది.
సస్పెండ్ చెయ్యడం లో యాజమాన్యం ముఖ్య ఉద్దేశం:
సస్పెండ్ చేసే విధానం ఇది కాదు అనే విషయం జీతాల బిల్లులపై సంతకాలు చేసే ఏ.ఓ కు తెలుసు , ఆర్ జె డి లకు తెలుసు, సస్పెండ్ రివోక్ చేసే ఆ పై అధికారులకు తెలుసు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సస్పెండ్ కాలంలో సస్పెండ్ అయిన ఉద్యోగి కుటుంబ పోషణకు సగజీతం ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది అనే విషయము అధికారులకు తెలుసు. కాని ఏ అధికారి యాజమాన్యాన్ని హెచ్చరించరు. చూసీ చూడనట్లు పోతారు. యాజమాన్యాలు ఇటువంటి తప్పులను పునారావృతం చేస్తూనే ఉంటారు. యాజమాన్యం ఉద్దేశం సదరు అధ్యాపకుని , ఉద్యోగిని ఆర్థికంగా ఇబ్బందికి గురిచేసి వారి కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడమే సస్పెన్షన్ ముఖ్య ఉద్దేశం. అందుకనే ఈ క్రింది విధంగా సస్పెండ్ ఆర్డర్ లు ఉంటాయి.
నాపై మోపిన కేసుగూర్చి సింపుల్ గా .... :
అనకాపల్లిలో నా మూడున్నర సెంట్ల భూమిలో ఇల్లు కట్టించుకుందామని తెలిసిన టీచర్ సలహామేరకు మెటీరియల్ కాంట్రాక్టర్ గా ఇల్లునిర్మించే వ్యక్తిని సంప్రదించగా ఎస్. ఎఫ్.టి. రూ.850 చొప్పున నిర్మించేందుకు ఒప్పందం కుదిరి 8 పేజీల అగ్రిమెంట్ రాసుకొని 21/3/2015 న నిర్మాణ పనులు ప్రారంభించాము. రెండు ఫ్లోర్ లు 2850 ఎస్ ఎఫ్ టి కి గాను 24,05,500 కు ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలి , మూడో ఫ్లోర్ స్లాబ్ వేసి ఇచ్చేందుకు 3 లక్షల మౌకిక ఒప్పందం. 21/11/2015 నాటికి నేను కాంట్రాక్టర్ ఇచ్చిన మొత్తం 29,74, 993 రూపాయలు. అంటే కాంట్రాక్టర్ కు నేను అదనంగా 2,69,493 రూపాయలు ఇచ్చాను. అయినా సుమారు ఏడు లక్షల పని మిగిలి ఉంది. టైల్స్, ఎలెక్ట్రిక్ వర్క్, ప్లంబింగ్, ఉడ్ వర్క్ ఇవన్నీ మిగిలి ఉండగా ఆ కాంట్రాక్టర్ ఆతని ఆర్ధిక ఇబ్బందుల వల్ల, ఇతరేతర కారణాలు ఏమున్నాయోగాని 26/11/2015 తెల్లవారు జామున వచ్చికొత్తగా తాను కట్టే నా ఇంటిలోనే ఉరిబోసుకొని చనిపోయాడు. నేను నాన్ లోకల్ కావడం వల్ల... , ఆనాటికి లక్ష రూపాయల పై జీతం కావడం వల్ల నావద్ద 12 లక్షల రూపాయలు డబ్బులు గుంజాలనే పథకంతో ఎస్ ఐ, మృతుని కుటుంబ సభ్యులు, వారి కుల నాయకులు జనాలను మోపుజేసి, హడావిడి చేసి 306 కేసు కట్టించారు.
నాటి మా కళాశాల కరస్పాండెంట్ శ్రీ మళ్ళ సత్యనారాయణ గారు వాస్తవ విషయము తెలుసుకొని ఈ క్రింది విధంగా సస్పెన్షన్ రివోక్ కొరకు ఈ విధంగా లెటర్ రాసి కమీషనర్ కు పంపించడం జరిగింది.
రెండేళ్ళ కొకమారు కళాశాలకు కరస్పాండెంట్, ప్రెసిడెంట్ మారే సంప్రదాయం ఉన్న కళాశాల మాది. నాటి మా కళాశాల కరస్పాండెంట్ శ్రీ మళ్ళ సత్యనారాయణ గారు సస్పెన్షన్ రివోక్ కొరకు పై విధంగా లెటర్ రాసి పంపించింది మొదలు క్రింద పేర్కొన్నట్లు కమీషనర్ 15/3/2016 సస్పెన్షన్ ఎత్తివేస్తూ రివోక్ లెటర్ పంపేలోపు కొత్త కరస్పాండెంట్ వచ్చాడు. స్టాఫ్ అందరిలో మేనేజ్మెంట్ ను కొన్ని విషయాలలో తప్పుపట్టే, గొంతు విప్పే నన్ను టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టారు. సస్పెన్షన్ ఎత్తివేస్తూ రివోక్ లెటర్ వచ్చినా, నేను యాజమాన్యానికి చూపినా నన్ను కళాశాలలో చేర్చుకోకుండా తిప్పడం మొదలు పెట్టారు. వాళ్ళల్లో మార్పులేదు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని దళిత అధ్యాపక సంఘం నాయకులతో ఒక నిర్ణయానికి వచ్చాను.
సస్పెన్షన్ ఎత్తివేస్తూ రివోక్ లెటర్ వచ్చినా మా కళాశాల యాజమాన్యం నన్ను కాలేజీలోకి చేర్చుకోవడం లేదని రాజమహేంద్రవరం ఆర్.జె .డి అధికారికి 26/4/2016 ఈ క్రింది లేఖ ద్వారా తెలియ జేశాను. విషయాన్ని క్షుణ్ణంగా వివరించాను. తప్పుడు కేసుకు సంబంధించిన పత్రాలను, సాక్ష్యాలను చూపాను. వాస్తవాలు గ్రహించారు.
.
అదేవిధంగా నాటి ఉమ్మడి రాష్ట్రాల ఎస్సీ ఎస్టీ కమీషనర్ ను కలిసి ఈ క్రింది విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది
అదేవిధంగా రాజ మహేంద్రవరం ఆర్ జె డి ఆఫీస్ లోనూ పి ఒ గారిని కలిసి ఈక్రింది విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది
రాజ మహేంద్రవరం ఆర్ జె డి ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇచ్చాక వెంటనే స్పందించి ఈ క్రింది విధంగా మరో ప్రొసీడింగ్ ను కళాశాల యాజమాన్యానికి జారీ చేసి వెంటనే స్పందించ మన్నారు.
రాజమహేంద్రవరం ఆర్.జె .డి అధికారికి 26/4/2016 న కలిసి పైవిధంగా లెటర్ ఇవ్వగా వారు వెంటనే స్పందించి ఈ క్రింది విధంగా మరో ప్రొసీడింగ్ ను కళాశాల యాజమాన్యానికి జారీ చేసి వెంటనే స్పందించ మన్నారు. కళాశాల వారు రివోక్ లెటర్ వచ్చినా చేర్చుకోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని పై విధంగా దళిత అధ్యాపక సంఘం నాయకులు కమీషనర్ ఆఫీస్ లోని జె డి మేడం గారికి తెలియజేయడం జరిగింది.
హైదరాబాద్, ఎడ్యుకేషన్ కమీషనర్ వారు 15/3/2016 న రివోక్ లెటర్ ప్రొసీడింగ్ పంపినా, రాజమహేంద్ర వరం ఆర్ జె డి వారు పై విధంగా 29/4/2016 మరో ప్రొసీడింగ్ పంపినా కళాశాల యాజమాన్యం స్పందించని ఈ గ్యాప్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఈ క్రింది విధంగా 27/4/2016 పేపర్ పంపించగా కళాశాల యాజమాన్యం ఈ విషయంలోని తీవ్రతను అప్పటికి గుర్తించారు.
ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి పై విధంగా పేపర్ రాగా కళాశాల యాజమాన్యం ఈ విషయంలోని తీవ్రతను అప్పటికి గ్రహించి విధిలేని పరిస్థితుల్లో నన్ను విధుల్లోకి చేర్చుకోడానికి అనుమతిస్తూ క్రింది విధంగా 4/5/2016న నేను చేరేందుకు కళాశాల కరెస్పాండంట్ 2/5/2016న ప్రొసీడింగ్ పంపించారు.
నన్ను విధుల్లోకి చేర్చుకోడానికి అనుమతిస్తూ 4/5/2016 నేను చేరేందుకు కళాశాల కరెస్పాండంట్ ప్రొసీడింగ్ ఇచ్చాక 4/5/2016న నేను సోదరుడు, దళిత నాయకుడు కొండబాబు మాస్టర్ తో కలిసి విధుల్లోకి చేరడం జరిగింది. అంటే హైదరాబాద్, ఎడ్యుకేషన్ కమీషనర్ వారు 15/3/2016 న రివోక్ లెటర్ ప్రొసీడింగ్ పంపించిన నెలా ఇరవై రోజులకు పైగా అధికారుల ఉత్తర్వులకు విలువివ్వకుండా, భయమనేది లేకుండా కళాశాల యాజమాన్యం వ్యవహరించారు. కారణం రాజకీయ పలుకుబడితో మనం ఏమైనా చెయ్యొచ్చు. అధికారులు వెంటనే స్పందించారు. డబ్బుతోనో, అధికార బలం తోనో అధికారుల నోళ్ళు మూపించ వచ్చు అనే బలమైన నమ్మకం.
4/5/2016న నేను సోదరుడు~దళిత నాయకుడు కొండబాబు మాస్టర్ తో కలిసి కళాశాల విధుల్లోకి చేరడం జరిగింది. సస్పెన్షన్ కాలంలో ఆర్ధిక పరమైన ప్రయోజనాలు కలిగించకుండా కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తే ఈ క్రిందివిధంగా నోటీసులు వస్తాయి . ఈ క్రిందిది సాలరీ కటింగ్స్ ద్వార కట్టిన ఎల్ ఐ సి పాలసీలు. నవంబర్ 20 15 వరకు కళాశాలనుండి ప్రీమియం అందినట్లు సమాచారం పంపించారు. ఈ సమయంలో సస్పెండ్ అయిన వ్యక్తికి జరగరానిది జరిగితే ఈ పాలసీలు ల్యాప్స్ అయిన కారణంగా ఆ పాలసీల ద్వారా రావాల్సిన జీవిత బీమా పరిహారం రాదు. అటువంటిది జరిగితే దీనికి కారకులుగా కళాశాల యాజమాన్యం బాధ్యత వహిస్తుందా? ఇటువంటివారి తప్పిదాలు చూస్తూ చర్యలు తీసుకోకుండా వ్యవహరించే అధికారులు బాధ్యత వహిస్తారా?
కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారనడానికి ఈ క్రింది విషయం ఒక ఉదాహరణ. అర్హతకలిగి బాధ్యతతో ఉత్సాహంగా పనిచెయ్యడానికి యువకులైన ఎయిడెడ్ అధ్యాపకులు అనేకులు ఉన్నా కళాశాలలోని ఎన్ సి సి ఆఫీసర్స్ పోస్టులను పార్ట్ టైం అధ్యాపకులకు ఇచ్చారు. కోతికి కొబ్బరికాయ చిప్ప దొరికితే ఉరకుండదు కదా. అలా ఎన్ సి సి ఆఫిసర్స్ అయిన పార్ట్ టైం అధ్యాపకులు ఎయిడెడ్ అధ్యాపకులను చిన్నచూపు చూడడం ప్రారంభించారు. ఎన్ సి సి ఆశించే అధ్యాపకులు దళితులు గనుక కళాశాల యాజమాన్యం వారి కులానికి సంబంధించిన పార్ట్ టైం అధ్యాపకుల పేర్లు పేర్కొంటూ తప్పుడు సమాచారంతో ఎన్ సి సి కమాండింగ్ ఆఫీస్ కు పంపించారు. ఇటువంటి ఆఫీస్ లలోకూడా అక్రమాలే. ఈ క్రమంలో నిబంధనలు విరుద్ధంగా వీరిని ఎలా నియమించారో తెలిసికోనగోరి నేను సమాచార హక్కు చట్టం ప్రకారం 13 ఆంధ్రా బెటాలియన్ వారిని అడగాగా ఈ క్రింది సమాచారాన్ని మరికొన్ని కాగితాలను పంపించారు. దేశ రహస్యాలను చేరవేసే కొందరు సైనికులు వలే నేను సమాచారం కోరిన విషయాన్ని ఎన్ సి సి ఆఫీసర్స్ గా నియమింపబడిన పార్ట్ టైం అధ్యాపకులకు 13 ఆంధ్రా బెటాలియన్ ఉద్యోగులు చేరవేశారు. నేను దేశద్రోహం చేశానన్నట్లు పార్ట్ టైం అధ్యాపకులు ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం వద్ద కొండంత చేసి చెప్పారు. ఇలా మౌనం గా ఉంటే ఇంకా ఏమేమి తవ్వుతానోనని నన్ను కట్టడి చెయ్యడానికి వ్యూహం పన్నారు.
కళాశాల యాజమాన్యం మౌనం గా ఉంటే నేను ఇంకా ఏమేమి తవ్వుతానోనని నన్ను కట్టడి చెయ్యడానికి బెదిరించే కార్యక్రమంలో భాగంగా మెమోలు,షో కాజ్ నోటీసుల జారీకి ఈ క్రింది విధంగా తెరలేపారు. సూటిగా విషయం రాయలేక డొంక తిరుగుడు మాటలతో ఈ క్రింది విధంగా పేర్కొంటూ మెమోలతో పనిలేకుండా డైరెక్ట్ గా షో కాజ్ నోటీస్ ను 21/3/2017న జారీ చేశారు.
21/3/2017న నాకు జారీ చేసిన షో కాజ్ నోటీస్ కు జవాబును ఈ క్రింది విధంగా 25/3/2017న ఇచ్చాను.
25/3/2017న కళాశాల వారు జారీ చేసిన షో కాజ్ నోటీస్ కు నేను ఇచ్చిన జవాబుతో అహం దెబ్బతిన్న కళాశాల యాజమాన్యం వారు ఏదో ఒక సాకును చూపి నన్ను డైరెక్ట్ గా షో కాజ్ నోటీసులతోనే బెదిరించే ప్రయత్నాలు మానుకోలేదు. ఈ క్రమం లోనే 11/7/2017న మరో సాకు తో నాకు జారీ చేసిన మరో షో కాజ్ నోటీస్ ఈ క్రిందిది.
11/7/2017న నాకు జారీ చేసిన మరో షో కాజ్ నోటీస్ కు 12/7/2018న నేను ఈ క్రింది విధంగా స్పందించాను.
మా కళాశాలలో వ్యక్తిగతంగా ప్రధానంగా నన్ను టార్గెట్ చెయ్యగా, కళాశాలలో పనిచేసే దళిత అధ్యాపకులందరి పట్ల మొదటినుండి వివక్ష చూపుతూ వ్యవహరించారు కళాశాల యాజమాన్యం. భరించినంత కాలం భరించాము. భరించలేని పరిస్థితికి వచ్చాక మేమందరమూ ఏవిధంగా వివక్షకు ఇన్నాళ్ళు గురియ్యమో ఏకరువు పెడుతూ పాయింట్ వారి సవివరంగా ప్రిన్సిపాల్ ద్వారా యాజమాన్యానికి రాసి 18/7/2018న అందించిన లేఖే ఈ క్రిందిది .
ఏవిధంగా వివక్షకు ఇన్నాళ్ళు గురియ్యమో ఏకరువు పెడుతూ పాయింట్ వారి సవివరంగా ప్రిన్సిపాల్ ద్వారా యాజమాన్యానికి 18/7/2018న లేఖ అందించిన తర్వాత సుమారు 6 నెలలు మా కెరీర్ అడ్వాన్స్ స్కీం (సి .ఏ .ఎస్) కాగితాలు College నుండి RJD కి ప్రపోసల్స్ తాయారు చేసి పంపలేదు.
కెరీర్ అడ్వాన్స్ స్కీం (సి .ఏ .ఎస్) గూర్చి ఎప్పటినుండో అధ్యాపకులు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి స్కేల్ ను ఇంప్లిమెంట్ చెయ్యకుండా అధ్యాపకులను కళాశాల సూపరిండేంట్ మొదలుకొని యాజమాన్యం వరకు ఇబ్బంది పెడుతూ వచ్చారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా బాధ్యత వహించాల్సినది మనమే అనే విషయాన్ని ప్రక్కకు పెట్టి ఏ సమస్యవచ్చినా మేనేజ్మెంట్ చూసుకుంటారులే అనే లెక్కలో కళాశాల సూపరింటెండెంట్ , ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్నారు. వీళ్ళని అడిగితే మేనేజ్మెంట్ పై, మేనేజ్మెంట్ ను అడిగితే ఆఫీస్ స్టాఫ్ పై వంకలు చెబుతూ ఇన్నాళ్ళూ మమ్మల్ని ఆర్థికంగా, ఆర్థికేతరంగా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఉదాహరణకు సి.ఎ.ఎస్. స్కేల్ ను ఎప్పుడు అమలు చెయ్యాలి. ఎప్పుడు అమలు చేశారో చూద్దాం.
1) 7000, 8000 AGP కి సంబంధించిన CCE ప్రొసీడింగ్స్ 10/1/2018 న వచ్చాయి.
2) 9000, 10000 AGP కి సంబంధించిన CCE ప్రొసీడింగ్స్ 14/5/2018 న వచ్చాయి.3) RC 361/A4/CAS/2018. నెంబర్ తో RJD ప్రొసీడింగ్ 14/6/2018 న వచ్చింది.
4) College నుండి RJD కి ప్రపోసల్స్ తాయారు చేసి పంపిన తేదీ 4/1/2019.
5) RJD pay fixation అయినా తేదీ 18/1/2019.
6) pay fixation కు RJD ప్రొసీడింగ్ ఇచ్చిన తేదీ 16/2/2019.
7) RJD to Audit letter అందిన తేదీ 19/2/2019.
8) Audit పూర్తి అయిన తేదీ 14/3/2019.
9) Flyleaf అయిన తేదీ 18/3/2019.
10) ఫిబ్రవరి జీతాలు 4/5/2019 వచ్చాయి
11) మార్చి జీతాలు పాత స్కెల్ పై పెట్టగా 1/7/2019 వచ్చాయి.
12) ఏప్రిల్ , మే జీతాలు 2/8/2019 న వచ్చాయి.
13) జూన్ జీతాలు 2/8/2019 న వచ్చాయి.
14) జులై జీతాలు 4/9/2019న వచ్చాయి.
15) ఆగస్ట్ జీతాలు 13/9/2019న వచ్చాయి.
పి ఆర్.సి.
పి.ఆర్.సి. జి.ఒ. : 13-2-2019
ప్రొసీడింగ్ బై ఆర్.జె.డి.: 12-3-2019
టు ఆడిట్ : 28-8-2019 లేదా 30-8-2019
ఆడిట్ టు ఆర్.జె.డి ఫ్లై లీఫ్ కొరకు:30-8-2019
ఫ్లై లీఫ్ సంతకాలు అయినది: 18-9-2019
జీతాలు తయారుచేసి సకాలంలో వచ్చేలా చెయ్యడం లోగాని, ఉద్యోగులకు రావాల్సిన ఇతరేతర ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేలా చెయ్యడం ఈ కాలేజీలో జరగదు. అంతా వారి ఇష్టమే. చిత్రం చెప్పమంటారా. మార్చి జీతాలు పాత స్కెల్ పై పెట్టగా 1/7/2019 వచ్చాయి. నేటికి ఇది 10వ నెల. నేటివరకు మార్చి డిఫరెన్స్ సి .ఏ .ఎస్ కొత్త స్కెల్ ఎరియర్ పెట్టలేదంటే వీరి ధైర్యానికి కారణం నాలాంటివాడు సాహసించి విషయం చెప్పినా స్పందించని అధికార గణం.
ఇదిగో ఈ క్రింది లెటర్ ప్రిన్సిపాల్ గారికి ఏ పరిస్థితుల్లో ఇచ్చామో పరిశీలించండి . RC 361/A4/CAS/2018. నెంబర్ తో RJD ప్రొసీడింగ్ 14/6/2018 న వచ్చినా College సూపరిండెంట్, ప్రిన్సిపాల్ ఉద్యోగ భయం లేకుండా RJD కి ప్రపోసల్స్ తాయారు చేసి పంపకుండా అలా పెట్టుకొని కూర్చున్నారు. అటువంటి స్థితిలో అలాగైనా పనిచేస్తారేమోనని ఈ క్రింది లెటర్ ను 20/11/2018న ప్రిన్సిపాల్ ను ప్రాధేయ పడుతూ అందించాము.
RJD కి ప్రపోసల్స్ తాయారు చేసి పంపకుండా అలా పెట్టుకొని కూర్చున్న కారణంగా రాజమహేంద్రవరం నాటి RJD మేడం గారి అపాయింట్ మెంట్ తీసుకొని మేడం రమ్మని చెప్పగా28/11/2018న మధ్యాహ్నం మా సహా అధ్యాపకులకు లీవ్ లెటర్స్ అందించి మూమెంట్ రిజిస్టర్ లో సి ఎల్ అని రాసి వెళ్లి RJD మేడం గారికి మౌఖికంగా సి.ఎ. ఎస్. అమలులో మేము పడుతున్న ఇబ్బందులు తెలియజేశాము. మాపై RJD గారికి కంప్లైన్ట్ చేస్తారా అని మా తిరుగు ప్రయాణంలోనే మాకు కళాశాలనుండి , కరెస్పాండెంట్ నుండి హెచ్చరికతో కూడిన ఫోన్లు.
RJD మేడం గారి అపాయింట్ మెంట్ ఇవ్వగా 28/11/2018న మధ్యాహ్నం హాఫ్ డే సెలవు పెట్టుకొని వెళ్లి కలిసిన కారణంగా కళాశాల మేనేజ్మెంట్ ఆ మరుసటిరోజే అనగా 29/11/2018న, RJD గారిని కలిసిన మా నలుగురికి ఇచ్చిన బహుమానమే ఈక్రింది మెమో. ముందే చెప్పానుగా . అసలు విషయం రాయకుండా అడగకుండా డొంకతిరుగుడు విషయాలకు జవాబు చెప్పమనే మెమోలు, షో కాజ్ నోటీసులు ఇస్తారని. మా కళాశాల వారికి కరపత్రం అందించినంత మామూలు విషయం ఈ మెమోలు, షో కాజ్ నోటీసులు. ఇటువంటివి ఇవ్వడంలో ఎంత ఉత్సాహమంటే డేట్స్ కూడా సరిగా చూసుకోరు.
28/11/2018న RJD గారిని కలిసిన కారణంగా మెమో ఇవ్వాలనే తొందరపాటు, ఆతృతతో వారు నాకు జారీ చేసిన మెమోకు ఈ క్రింది విధంగా 30/11/2018న నేను సమాధానం రాసి ఇచ్చాను.
మొదటి మెమోలో 28/11/2018 కి బదులు 26/11/2018 అని రాస్తే ఆతరువాత ఇచ్చిన మెమో లో 30/11/2019 కు బదులు 29/11/2019 అనే పాత డేటే వేసి మరో మెమోను ఈక్రింది విధంగా నాకు జారీ చేశారు. వారి తొందరపాటు తప్పిదాలకు వారు పెట్టుకున్న ముద్దు పేరు" టైఫో గ్రఫిక్ మిస్టేక్ ".
30/11/2019 కు బదులు 29/11/2019 అనే పాత డేటే వేసి నాకు జారీ చేసిన మెమోకు 2/12/2018న నేను ఈక్రింది విధంగా సమాధానం రాసి ఇచ్చాను.
సి. సి. ఇ. కమిషనర్ గారికి, ఎస్సీ, ఎస్టీ సెల్ కు ఫిర్యాదు పత్రాలు పంపించిన రిజిస్టర్ పోస్ట్ రిసిప్ట్స్
కళాశాలవారు ఈవిధంగా నన్ను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వారు నన్ను ఏవిధంగానైనా సస్పెండ్ చేసే అవకాశం కోసం దారులు వెదుకు కుంటున్నారని విషయం గ్రహించి ఈ క్రిందివిధంగా 3/12/2018 న లెటర్ రాసి కమీషనర్ గారికి పోస్ట్ చేసాను. వారు స్పందించలేదు.
కళాశాలవారు నన్ను వేధించే విషయాన్నీ 3/12/2018 న లెటర్ రాసి కమీషనర్ గారికి పోస్ట్ చేయడమే గాకుండా, నాటి ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్ శ్రీ కారెం శివాజీ గారితో ఫోన్లో మాట్లాడి తెలియజేసి ఈ క్రింది విధంగా లెటర్ ను రాసి 3/12/2018వ తేదీనే పంపించాను.
కళాశాలవారు నన్ను వేధించే విషయాన్నీనాటి ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్ శ్రీ కారెం శివాజీ గారితో ఫోన్లో మాట్లాడి తెలియజేసి 3/12/2018న పై విధంగా రాసిన లెటర్ కు కమీషన్ స్పందించి ఈక్రింది విధంగా 10/12/2018వ తేదీన నాకు లెటర్ పంపించారు.
పైవిధంగా ఎస్సీ ఎస్టీ కమీషన్ స్పందించి ఈక్రింది విధంగా 8/1/2018వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి కళాశాల మేనేజ్మెంట్ వారు నన్ను వేధిస్తున్న విషయాన్ని తెలియ జేశారు.
అంతటితో వేధింపులు ఆగిపోయాయని భావించాను. కానీ యాజమాన్యంవారి ధోరణి మారలేదు. నన్ను నోరు మెదపకుండా చెయ్యడానికి ఎవరైతే నాపై తప్పుడు కేసు పెట్టారో వారిని కాలేజీకి పిలిపించి, వారున్న చోటుకి నన్ను పిలిపించి ఏదైనా ఘర్షణ జరిగితే పోలీస్ స్టేషన్ కు నన్ను తీసుకెళ్లడానికి సి ఐ వావాహనాన్ని సిద్ధం చేసి ఉంచారు. కళాశాలవారే రాసిన కంప్లైంట్ పై వారిచేత సంతకం చేయించి వారిచ్చిన ఫిర్యాదు కాగితం అన్నట్లుగా నటిస్తూ 3/12/2018న సదరు కళాశాల కరస్పాండెంట్ కోర్ట్ పరిధిలో ఉన్న విషయంపై మాట్లాడకూడదని లా చదివిన వ్యక్తిగా తెలిసికూడా నా సహా అధ్యాపకులైన వారిని తన జి.బి. రూమ్ లోకి పిలిపించి వారు రాసిన లెటర్ ఆ అధ్యాపకులకు ఇచ్చి చదివిచ్చి నా కేస్ ను సెటిల్ చేసుకోమని నాతో నా మిత్రులను చెప్పమని పంచాయితీ పెట్టాడు కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు. లెటర్ చదివిన మిత్రులద్వారా ఆవిషయం తెలుసుకొని ఆ లెటర్ ప్రతి నాకు కావాలని కోరుతూ 10/12/2018న ఈక్రింది విధంగా లెటర్ రాసి ప్రిన్సిపాల్ కు అందించాను. విషయం ఏమిటంటే ఆ ప్రతిని ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. ఎందుకంటే దాని రూపకర్తలు వారే. అదేవిధంగా 14/12/2018న ప్రిన్సిపాల్ డా జి జయబాబు నన్ను తన ఛాంబర్ కు పిలిచి కేసును సెటిల్ చేసుకోమని తన మాటగా కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) చెప్పమని నీతో మాట్లాడమని చెప్పినట్లు నాతో అన్నాడు.
ఇలా సాగుతున్న ఈ క్రమంలో నాకు రావాల్సిన CAS ఎరియర్స్ రాకుండా నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని తప్పు లెక్కలు గట్టి 1,11,250 కు బదులు 3,64,423 రూపాయలతో బిల్లు తయారు చేశారు. సర్వీస్ రిజిస్టర్ లో రాసి పంపించారు . క్లర్క్, సూపరిండెంట్, ప్రిన్సిపాల్ సంతకాలు చేసి కరెస్పాండెంట్ సంతకం చేసేటప్పుడు ఆ తప్పు ఉందని నాది పక్కన బెట్టి మిగతా వారిది పంపించారు. నిజంగా అనుకోకుండా తప్పే దొర్లింది అనుకుంటే ఆ తప్పును సరిచేసి అందరి బిల్లులు కలిపి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు పంపించవచ్చు. కానీ వారు అలా చెయ్యకుండా నాది తప్పించారు. నాతోటి వారందరికీ 1/7/2019 సి.ఎ.ఎస్. ఎరియర్స్ వస్తే నాకు నేటివరకు ఆ ఎరియర్స్ రాలేదు. ఈ క్రింద 1,11,250 కు బదులు 3,64,423 రూపాయలతో తప్పుడు బిల్లు తయారుచేసి నా సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేసిన సాక్ష్యం
నా సహా అధ్యాపకులు 1/7/2019నాటికే సి.ఎ.ఎస్. ఎరియర్స్ అందుకున్నారని సాక్ష్యం ఈ క్రింది బిల్
రకరకాల కారణాలు చెబుతూ నాకు రావాల్సిన 1,11,250 రూపాయలు రాకుండా కళాశాల కరెస్పాండెంట్ పరోక్షంగా అడ్డుకున్న దానికి ఈ క్రిందిది నిదర్శనం.
నాకు రావాల్సిన CAS ఎరియర్స్ గూర్చి జిల్లా కలెక్టర్ కు మరియు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు పత్రం రాసి పంపగా విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి శ్రీ కృష్ణా కాలేజీ ఎ. ఒ. కు వివరణ కోరగా, వారు మా కాలేజీ వారిని వివరణ కోరారు. ఆలా అడిగినందుకు, "దళిత అధ్యాపక సంఘానికి ఛైర్మన్ గా ఉన్నందుకు, అలా లెటర్ హెడ్ పై నేను ఫిర్యాదు చేసినందుకు, ఏ ఏం ఏ ఎల్ కాలేజీ పేరు ప్రస్తావించినందుకు, కులాన్ని వాడుకున్నట్లు అందుచేత నన్ను కరస్పాండెంట్ సస్పెండ్ చెయ్యగలిగే అధికారాలు ఉన్నాయని కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు నన్ను సస్పెండ్ చేస్తానని అందరిముందు బెదిరించారు.
కొన్ని నెలలుగా మా కళాశాల కరస్పాన్ డెంట్ నన్ను టార్గెట్ చేస్తూ , మీ గురించే మీటింగ్ పెట్టింది అంటూ నా వ్యక్తిగత విషయాలు అందరిముందు ప్రస్తావిస్తూ నన్ను అవమానిస్తున్నారు. 13/9/2019 మా కాలేజీ జి బి హాల్ ల్లో జరిగిన సమావేశంలో నా వ్యక్తిగత విషయాలను ఎలా ప్రస్తావించారో మీరు గమనించ వచ్చు.
"పృథ్వి రాజ్ గారు మీకు డైరెక్ట్ గా అడుగుతున్నాను . మీరు అన్ని రూల్స్ మాట్లాడుతూ అంతా కరెక్ట్ గా వెళుతున్నారు అన్నంత ఇదిగా వెళుతున్నారు . పోనీ యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా మీరేమైనా ఫాలో అవుతున్నారా ? ఒక విషయం. మీ పర్సనల్ విషయం కూడా నేను మాట్లాడుతున్నాను. మీ సెషన్స్ లోని ఆల్రడీగా షెడ్యూల్డ్ ఇచ్చారు . ఒక నెలరోజులు, నెలా పదిహేను రోజుల్లో గాని డెసిషన్ కూడా వచ్చేస్తది భగవంతుని దయవల్ల మీకు కోపరేటివ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ షెడ్యూల్డ్ లో మరుసగా మీకు వాయిదాలు పడుతుంటాయి . రెండు రోజులకు మూడు రోజులకు పడుతుంటాయి. అసలు మీరు ఏ బేస్ చేసుకొని అగెనెస్ట్ మేనేజ్మెంట్ వెళుతున్నారో నాకు అర్థం కావడం లేదు . పోనీ మీరు కరెక్ట్ గా వెళు తున్నారా అంటే మీరు చేసిన దానిలో ప్రతిదాంట్లో తప్పు వెతక వచ్చు. మొన్న ఏడవ తారీఖున లీవ్ ఇచ్చారు. కడుపునొప్పి వస్తుందని లీవ్ ఇచ్చారు . మీరు ఎం చేశారు. కృష్ణా కాలేజీకి దగ్గరకు వెళ్లి అతనితో ఎవరితో గొడవబడ్డారు. వాళ్ళేమో ఆఫీస్ కు ఫోన్ చేశారు. ఆ తర్వాత మొన్నేమో కోర్టు వాయిదా అని లీవ్ పెట్టారు. కోర్ట్ వాయిదా ఏమిటో నాకు ప్రూఫ్ కావాలి. ఎలాగా. మీరు ఏ వాయిదా వెళ్లారు, ఏ పనిమీద వెళుతున్నారు. మీరు విక్టిం గా వెళుతున్నారా, లేదా ఎక్యూజ్ డా. కాన్సర్న్ అడ్వొకేట్ దగ్గర లెటర్ తీసుకొని సబ్మిట్ చేస్తే దాని సపోర్ట్ చేసే డాక్యుమెంట్స్ ఇస్తే గాని నేను అల్లౌ చెయ్యను. ఎందుకు అల్లౌ చేస్తాము. అంటే ఇవన్ని ఏమిటంటే ....కెలికితే మేము కెలికే పద్దతులు. ఆవిధంగా అన్నమాట. ఇన్ని హెడ్దేక్ లు పెట్టుకుని అంత గోక్కోవడం అవసరమా అండి. ఇవ్వాళ్ళ ప్రత్యేకించి మీటింగ్ పెట్టడానికి కారణం మిమ్మల్ని ఉద్దేశించి పెట్టుకోవడమే ! " ఇదీ మా కళాశాల కరస్పాండెంట్ వైఖరి.
వ్యక్తిగతం అన్నప్పుడు నా ఒక్కడితోనే వ్యక్తిగత విషయాలు మాట్లాడ వచ్చుకదా ? ఆతని ఉద్దేశం అదికాదు. నన్ను అవమానించడమే ఆయన పరమార్థం. "కెలికితే మేము కెలికే పద్దతులు"అని కక్ష సాధింపు ,వేదింపు మాటలు మాట్లాడారు కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు. ఆయన మాటల్ని బట్టి నాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా, నన్ను టార్గెట్ చేసి వేదించినా నేను ఉన్నతాధికారులెవరికీ తెలియ జేయకూదదనేది కరస్పాండెంట్ మాట. అదే మేము వారిని కెలుక్కోవడం అంటా. దానికి ప్రతిగా వారు మా వ్యక్తిగత విషయాలను అందరిలో ప్రస్తావిస్తూ, అవమాన పరుస్తూ వ్యవహరించే శైలి వారు మమ్మల్ని కెలుక్కోవడమే.
16-10-2019న కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు , సూపరిండెంట్, ప్రిన్సిపాల్ డా జి జయబాబు బోటనీ అధ్యాపకుడు డా ఎమ్. హరిబాబును , కామర్స్ అధ్యాపకుడు శ్రీ ఎం. కొండల రావును పిలిపించి నాగూర్చి వారివద్ద మాట్లాడిన విషయాలను నాతో తెలియజేయమని చెప్పగా ఫోన్లో శ్రీ ఏం కొండల రావు కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు ఆ మీటింగ్ లో ఏవిధంగా హెచ్చరించి - బెదిరించారో తెలియ జేశాడు
~ ఫైన్స్ 2,000, 750, 250 హాజరు చాలని పిల్లలకు నిర్ణయించారు.
~ క్యాస్ట్ బెస్ పై లెటర్ పెట్టినందుకు మేనేజ్మెంట్ ఎంతవరకైనా వెళ్ళ వచ్చు అని బెదిరింపు.
~ కాలేజీ పేరును నేను ఉపయోగించినందుకు గాను ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చని బెదిరింపు
~ లీవ్ మెయిల్ ల్లో పెట్టకూడదట. దూరంగా ఉన్నప్పుడు మెయిల్
~ మమ్మల్ని గోకుతున్నాడు. నేను గోకేనంటే కాంక్రీటేను. మేమేదేసినా కాంక్రీట్లా ఉంటది .
~ అతని కేస్ హియరింగ్ కు వచ్చింది. ఇప్పటివరకు బుర్ర పెట్టలేదు. ఇక బుర్ర పెట్టానంటే ఏమైనా జరుగుతది అని బెదిరింపు.
~ మీ వర్షన్ ప్రకారం పృథ్వి రాజ్ మేనేజ్మెంట్ కు యాంటీగా ఉన్నాడంటున్నారు కదా. ఆయన్ని వేరే కాలేజికి పంపించ వచ్చు కదా అనిన అధ్యాపకుడు ఎం . కొండల రావు మాటలకు కరస్పాండెంట్ స్పందన :" నేను అలా ఎందుకు వదులుతాను మాస్టారు. భయపెట్టి వదులుతానని అనుకుంటున్నారా? మేము దిగామంటే కాంక్రీట్ సార్. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము సార్".
~ ఒకపేజీ అరపేజీ కాదట. రెండు మూడు పేజీల షో కాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారట. అది స్ట్రాంగ్. కాంక్రీట్ వేసినట్టే ఉంటది నేను తలుసుకుంటే. ఇక నేను దిగిపోతున్నాను అని బెదిరింపు.
~ లాయర్ ని కూడా నేను కలిసి వచ్చాను. ఎలా ఇవ్వాలి ఏమిటనేది ? నేను తీసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతది. నేనొకసారి ముందు స్టెప్ వేస్తే మరలా బ్యాక్ స్టెప్ పడడం అనేది తెలియదు నాకు.
~ నేను షో కాజ నోటీసు ఇష్యూ చేస్తాను మాస్టారు . అతను ఒపీనియన్ రాస్తాడు. ఆ ఒపీనియన్ కు నేను సాటిస్ఫాక్షన్ అవను. నేను సాటిస్ఫాక్షన్ అవను గనుక మా జి.బి. లో పెట్టి సస్పెన్షన్ తయారుచేసి ఇష్యూ చేస్తాను
18-10-2019న కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు , సూపరిండెంట్, ప్రిన్సిపాల్ డా జి జయబాబు బోటనీ అధ్యాపకుడు డా ఎమ్. హరిబాబును , కామర్స్ అధ్యాపకుడు శ్రీ ఎం. కొండల రావును పిలిపించి నాగూర్చి వారివద్ద మాట్లాడిన విషయాలను నాతో తెలియజేయమని చెప్పగా ఫోన్లో శ్రీ ఏం కొండల రావు కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు ఆ మీటింగ్ లో ఏవిధంగా హెచ్చరించి - బెదిరించారో తెలియ జేశాడు .
~ కరస్పాండెంట్, సూపరిండెంట్ ఆర్ జె డి ఆఫీస్ కు వెళ్లి ఆర్ జె డి ని కలిసినట్టు.
~ ఫైన్స్ 2,000, 750, 250 హాజరు చాలని పిల్లలకు నిర్ణయించారు.
~ క్యాస్ట్ బెస్ పై లెటర్ పెట్టినందుకు మేనేజ్మెంట్ ఎంతవరకైనా వెళ్ళ వచ్చు అని బెదిరింపు.
~ కాలేజీ పేరును నేను ఉపయోగించినందుకు గాను ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చని బెదిరింపు
~ లీవ్ మెయిల్ ల్లో పెట్టకూడదట. దూరంగా ఉన్నప్పుడు మెయిల్
~ మమ్మల్ని గోకుతున్నాడు. నేను గోకేనంటే కాంక్రీటేను. మేమేదేసినా కాంక్రీట్లా ఉంటది .
~ అతని కేస్ హియరింగ్ కు వచ్చింది. ఇప్పటివరకు బుర్ర పెట్టలేదు. ఇక బుర్ర పెట్టానంటే ఏమైనా జరుగుతది అని బెదిరింపు.
~ మీ వర్షన్ ప్రకారం పృథ్వి రాజ్ మేనేజ్మెంట్ కు యాంటీగా ఉన్నాడంటున్నారు కదా. ఆయన్ని వేరే కాలేజికి పంపించ వచ్చు కదా అనిన అధ్యాపకుడు ఎం . కొండల రావు మాటలకు కరస్పాండెంట్ స్పందన :" నేను అలా ఎందుకు వదులుతాను మాస్టారు. భయపెట్టి వదులుతానని అనుకుంటున్నారా? మేము దిగామంటే కాంక్రీట్ సార్. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము సార్".
~ ఒకపేజీ అరపేజీ కాదట. రెండు మూడు పేజీల షో కాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారట. అది స్ట్రాంగ్. కాంక్రీట్ వేసినట్టే ఉంటది నేను తలుసుకుంటే. ఇక నేను దిగిపోతున్నాను అని బెదిరింపు.
~ లాయర్ ని కూడా నేను కలిసి వచ్చాను. ఎలా ఇవ్వాలి ఏమిటనేది ? నేను తీసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతది. నేనొకసారి ముందు స్టెప్ వేస్తే మరలా బ్యాక్ స్టెప్ పడడం అనేది తెలియదు నాకు.
~ నేను షో కాజ నోటీసు ఇష్యూ చేస్తాను మాస్టారు . అతను ఒపీనియన్ రాస్తాడు. ఆ ఒపీనియన్ కు నేను సాటిస్ఫాక్షన్ అవను. నేను సాటిస్ఫాక్షన్ అవను గనుక మా జి.బి. లో పెట్టి సస్పెన్షన్ తయారుచేసి ఇష్యూ చేస్తాను
18-10-2019న కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు , సూపరిండెంట్, ప్రిన్సిపాల్ డా జి జయబాబు బోటనీ అధ్యాపకుడు డా ఎమ్. హరిబాబును , కామర్స్ అధ్యాపకుడు శ్రీ ఎం. కొండల రావును పిలిపించి నాగూర్చి వారివద్ద మాట్లాడిన విషయాలను నాతో తెలియజేయమని చెప్పగా ఫోన్లో శ్రీ ఏం కొండల రావు కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు ఆ మీటింగ్ లో ఏవిధంగా హెచ్చరించి - బెదిరించారో తెలియ జేశాడు .
~ కరస్పాండెంట్, సూపరిండెంట్ ఆర్ జె డి ఆఫీస్ కు వెళ్లి ఆర్ జె డి ని కలిసినట్టు.
~ మెమో ,ఆతర్వాత షో కాజ్ నోటీస్, రెండు నెలలు సస్పెన్షన్, ఆర్ జె డి పర్మిషన్ తో మరో రెండు నెలలు సస్పెన్షన్ , ఆ తర్వాత టెర్మినేట్ చేసే పవర్ మీకే ఉంది అని ఆర్ జె డి చెప్పారట.
~ మేనేజ్మెంట్ జోలి రానని, ఏ విషయంలో ఇన్వాల్ కానని ఆన్ పేపర్ పై ఇచ్చేస్తే కామ్ గా ఉంటుంది. ఆయన ఉద్యోగం ఆయన చేసుకోమను. మా పనులు మేము చేసుకుంటాము అని కరస్పాండెంట్ అన్నారట.
~ రేపు రిటైర్మెంట్ అయినా సరే మనం మేనేజ్మెంట్ కు చెప్పాలి. ఈ రోజు నేను ఉండొచ్చో రేపు మరోకరుండా వచ్చు. కాని మేనేజ్మెంట్ మాదేకదా.
~ హాఫ్ డే సాలరీ కట్ చెయ్యాలట.
~ మెమో ~ రెడీ చేశారట.
23/10/2019 న సాయంత్రం ఎ ఏం ఏ ఎల్ కళాశాల స్టాఫ్ తో కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు సమావేశం కానున్నాడని సమాచారం
No comments:
Post a Comment