“ఎంగిలి మెతుకులేరుకొని ఎలక్ట్రిక్ తీగల మీదా
ఇళ్ళకప్పుల మీదా జంతు కళేబరాలమీదా
అలగాజనం పుళ్ళమీదా
పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే
మిథ్యగూర్చి కావు కావుమంటూ ప్రవచించగలవు" అని దివిసీమ ఉప్పెన విపత్తును "కొయ్య గుర్రం " దీర్ఘ కవితగా రాసిన నగ్నముని ప్రతీకాత్మక కవిత రాశాడు. కవితా సంపుటి పేరే ప్రతీకగా పెట్టారు.
గుర్రం వేగానికి గుర్తు. కొయ్య గుర్రం జడత్వానికి అధికారానికి, అసమర్ద పరిపాలనకి ప్రతీక. కొయ యంత్రాంగం వైఫల్యాన్ని. కొయ్య గుర్రం చలనం లేని వ్యవస్థ, ప్రభుత్వానికి ప్రతీక.
ఎంగిలి మెతుకులేరుకోవటం అంటే .... శ్రమించకుండా అవినీతి సొమ్ముతో బ్రతకడం అలవాటు చేసుకున్న అధికార గణం కాకులకు ప్రతీక. అలగా జనం పేదలకు ప్రతీక. పరిస్థితులు ఎలా ఉన్నా ఊరిపై...ఇళ్ళపై... జనంపై బడి దోచేయడమే కాకులకు ప్రతీక అయిన అధికారులు, నాయకుల తీరును కవి నగ్నముని నిరసించాడు.
========
"ముక్కులు పగల గొడుతున్న
దుర్గంధ రక్త స్రావంలో దూకి కేరింతలమునకలేస్తూ
దుర్గంధ రక్త స్రావాన్నే దోసిళ్ళతో తాగుతున్న
మనుషులనే మందల్ని చూశా
నాలుకలు చిమ్ముతూ
బ్రతుకును మురగబెడుతూ
సస్యశ్యామలాల్నీ మానవత్వపు పరిమళాల్నీ
ముంచేస్తున్న యీ ప్రవాహం ఎక్కడనుండోనని
పుండు ఎక్కడోనని కత్తుల్తో ప్రయాణంచేశా
ప్రపంచం ముట్టయింది
రాజకీయాలు రక్త స్రావం." అని "కంపు " అనే కవితలో నగ్నముని అంటాడు. దుర్గందపూరితమైనవి రాజకీయాలు. కుల,మత, ప్రాంతీయ బేధాలతోనే గాక, పార్టీలపరంగా కూడా మనుషులు విడిపోయారు. అధికార పార్టీ పాలనా నిర్ణయాలతో సగటు మనిషి చితికిపోతున్నా, ఆ పార్టీలకోసం గ్రూపులుగా ప్రజలు తన్నుకు ఛస్తారు. సిద్ధాంతాలు మరచి అపవిత్రపొత్తుల్తో రాజకీయం చేయడం, నమ్మి ఓటేసిన ఓటరు నడ్డివిరవడం, ఇచ్చిన హామీలను మర్చిపోవడం....పాలనా తీరును ప్రశ్నిస్తే విమర్శిస్తే ప్రజల్ని బెదిరించి నోరుమూయించడం....
ముట్టైతే జరిగే రక్తస్రావమే ఈ తంతంతా!
No comments:
Post a Comment