ఏ ఎం ఏ ఎల్ కళాశాలలో అధ్యాపకులు విచిత్ర పరిస్థితి లో ఉన్నారు. మరి ముఖ్యంగా దళిత అధ్యాపకులు. ఒకప్పటి మేనేజ్మెంట్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టా రాజ్యంగా చేసుకుంటూ పోయే వారు.
06-12-2018 నాటి సమావేశంలోని అంశాలు:
అనేక సంవత్సరాలుగా వివక్షకు గురియైన దళిత అధ్యాపకులు ఇచ్చిన లెటర్ గూర్చి, సి ఏ ఎస్ గూర్చి., హాస్టల్ వార్డెన్, ఎన్ సి సి ఎవరికైనా తాము ఇచ్చుకోవచ్చని, అడిగే హక్కు ఎయిడెడ్ అధ్యాపకులకు లేదని ..మొదలగు విషయాలు.
10-4-2019 సాధారణ సమావేశం
16-04-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అధికారాల గూర్చి,లీవ్స్ ,ఆడారి నాగ భూషణం ప్రస్తావన ,మేనేజ్మెంట్ ను మీరేమి చెయ్యలేరు , మాకు పోయేది ఏమీలేదు ... మొదలగు ప్రధాన విషయాలు
06-07-2019 నాటి సమావేశంలోని అంశాలు:
వర్క్ లోడ్ , మినిమం 40 అవర్స్ ఇచ్చినా చెయ్యాల్సిందే, 30 అవర్స్ మినిమం
03-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
లీవ్స్ సూపరింటెన్ డెంట్ ద్వారా ,ఇ.పి.ఎఫ్. ఫైన్ ప్రస్తావన,సాలరీస్ , కొందరి అధ్యాపకుల వ్యక్తిగత విషయాల ప్రస్తావన, గోకితే పుండ్లు పడతాయి, మేనేజ్మెంట్ పవర్స్, లీవ్స్ పై పట్టు గోక్కోవ డాన్ని బట్టి అని చెబడం, ఆడారి నాగభూషణం ~చెరుకూరి నూకేశ్వర రావు లకు నిబందనలకు విరుద్ధంగా డబ్బులు ఇప్పించిన వైనం,పి జి అర్హత చాలట , హాఫ్ డే సి ఎల్, లీవ్ కావాలంటే సూపరింటెన్ డెంట్ వద్దకు వెళ్ళాల్సిందే అని చెబడం,లీవ్ ఫండమెంటల్ రైట్ కాదని చెపడం, మాకు రోకుంటే ఎవరికైన సెలవు ఇచ్చి అడ్జెస్ట్ చేసుకుంటా మనడం, సూపరింటెన్ డెంట్ ను కలవలేదు గనుక లీవ్ లెటర్ ఇచ్చినా అబ్సెంట్ మార్క్ రాసి అధ్యాపకుడు విక్టర్ ను బెదిరించుట , మమ్మల్ని కెలికితే ఇలానే ఉంటుందని చెబడం,07-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అడగమన్న ప్రకారం కాలేజీ పనిపైనే ఎ. ఒ. డి టి ఒ ఆఫీస్ లకు వెళ్లి నా ఎరియర్ గూర్చి అడుగుట
సాధారణ విషయాలు.
12-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కడుపులో నొప్పి అని ఎ ఒ వద్దకు వెళ్లి నా ఎరియర్స్ గూర్చి విచారించానని, డిసిప్లీనరీ యాక్షన్ గూర్చి,లీవ్స్ గూర్చి, మేనేజ్మెంట్ ను క్వశ్చన్ చెయ్యడానికి లేదని , అధ్యాపకులను బెదరించడం, అబ్సెంట్ మార్క్ నోట్ చేస్తామనడం, కెలికితే -గోకితే , సస్పెండ్ చేస్తే కాలేజీకి రాలేనని, ఆడారి నాగభూషణం గూర్చి. లీవ్స్ థ్రూ ప్రోపర్ ఛానెల్,అలా చెయ్యకుంటే అబ్సెంట్ మార్క్ చేస్తాననడం, నాకు మేమో ఇష్యూ చెయ్యమని ప్రిన్సిపాల్ కు చెబడం.
24-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
సంఘాలలో(యూనియన్స్)లో అధ్యాపకులు ఉండకూడదని, కులాన్ని ఉపయోగించుకుంటున్నానని, వీటిని బట్టి నాపై చర్యలు తీసుకోవచ్చని కరెస్పాండెంట్ నన్ను సస్పెండ్ చేస్తానని బెదిరింపులు.
16-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:
18-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:
అధ్యాపకులపై కళాశాల యాజమాన్యం రోకు (మోజు-ఇష్టం ) ఉంటే అన్నీ సాధ్యం !:
కళాశాలను నిర్వహించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక కరస్పాండెంట్ ప్రభుత్వ నిబంధనలతో మాకు పనిలేదు మా ఇష్టం వచ్చిన వారికి సెలవు మంజూరు చేస్తాము, ఇష్టం లేని వ్యక్తి అనుకో సెలవు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వం , మంజూరు చెయ్యం అని పబ్లిక్ గా స్టాఫ్ మీటింగ్ లో చెబుతున్నారంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరస్పాండెంట్ చెప్పిన దానిలో తప్పేలేదు. ఎందుకంటే ఏళ్ళ తరబడి వారు చేసుకొస్తుంది అదే. వారి దయతో లీన్ పేరిట విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, రకరకాల సెలవలతో విదేశీ పర్యటనలు, తీర్థ యాత్రలు చేసినవారు, విదేశాలకు పురుళ్ళకు వెళ్ళిన వాళ్ళు అనేకులున్నారు. కొన్ని సంవత్సరాలుగా కళాశాలలో జరుగుతున్న తంతు.
సెలవు చీటీ ఇచ్చినా అబ్సెంట్ రాస్తారు :
డి డబ్లూ.విక్టర్ అనే అధ్యాపకుడు సెలవుచీటి రాసి సంబంధిత క్లర్క్ కు ఇచ్చినా అటెండెన్స్ రిజిస్టర్ లో సి ఎల్ నోట్ చెయ్యక పోగా , సూపరింటెండెంట్ చేత సంతకం చేయించ లేదని సాకు చూపి ఒక క్లర్క్ కరస్పాండెంట్ సూచన మేరకు అబ్సెంట్ మార్క్ చేశాడంటే ఏమనాలి. ఆ క్లర్క్ చెయ్యాల్సిన డ్యూటీ ఏమిటి . పట్టించుకునే ప్రభుత్వ అధికార గణం లేకుంటే అధ్యాపకులను యాజమాన్యం ఇలానే వేధిస్తుంటారు . అ చర్యకు భయపడి, మనసు చంపుకొని ఆ అధ్యాపకుడు తన లీవ్ లెటర్ ను తానే స్వయంగా సూపరిండెంట్ వద్దకు వెళ్లి సంతకం చేయించాక వైట్ ఫ్లూయిడ్ తో అబ్సెంట్ చెరిపి సి ఎల్ నోట్ చేశారు.
కళాశాల యాజమాన్యం దయ ఉంటే ఉద్యోగం ఎగగొట్టినా లక్షలు లక్షణంగా పొందవచ్చు :
చేసిన ప్రభుత్వ వ్యతిరేకమైన పనులను ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు స్టాఫ్ సమావేశంలో నిర్భయంగా చెబుతున్నారు. అయన పరిభాషలోనే ...వారి రోకు ఎవరిపైనైతే ఉంటుందో మెడికల్ లీవ్ లు ఆ లీవ్ లు , ఈ లీవ్ లు మాత్రమే కాదు సంవత్సరాల పాటు ఎటువంటి లీవ్ లు పెట్టకుండానే కాలేజీ మానెయ్యొచ్చు. బుద్దిపుట్టిన కొన్నేళ్ళ తర్వాత యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని, రికార్డ్ లు తారుమారు చేయించుకొని, అధికారులను మేనేజ్ చేసుకొని రావాల్సిన అణా పైసాతో సహా పొందవచ్చు. అటువంటి వారికి ఉదాహరణే నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రీ చెరుకూరి నూకేశ్వర రావు, ఆడారి నాగభూషణంల ఉదంతం . కళాశాలకు కొన్నేళ్ళపాటు రాకున్నా కళాశాల యాజమాన్యంతో లౌక్యంగా వ్యవహరించి లక్షలాది రూపాయలను పొందినవాడు నూకేశ్వర రావు . కోర్టుకు వెళ్లి నేటికీ తిరుగుతున్నవాడు నాగ భూషణం.
ఈ కథలో కరస్పాండెంట్ ఎయిడెడ్ స్టాఫ్ కు చెప్పిన నీతి , హెచ్చరిక ఏమిటంటే ...మమ్మల్ని ధిక్కరించి మీరు కోర్టుకు వెళ్ళినా సదరు కోర్టువారు తిరిగి కళాశాల యజమాన్యానికే పరిష్కరించమని సూచిస్తారు. ఆవిధంగా మేము మిమ్మల్ని సాధిస్తాము, వేధిస్తాము. జాగ్రత్త అని బెదిరించడం. యాజమాన్యం వారు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడినా మనం నోరుమేదప కూడదు. అనేక సమావేశాలలో వీరి విషయాన్ని కరస్పాండెంట్ ప్రస్తావించాడు.
ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు?
పృథ్వి రాజ్ అనే అధ్యాపకుణ్ణి వేధింపులు, బెదిరింపులతో కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు:
ఎయిడెడ్ కళాశాలలలొ మేనేజ్మెంట్ ఏమిచెబితే అది చేయాలనే తత్వం. బానిసలుగా చూసినా అధ్యాపకులు పడియుండాలి. మన వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ సహ ఆధ్యాపకుల ముందు బెదిరించినా మనం పడాలి అనే వారి వైఖరి. ఉద్దేశపూర్వకంగా మన ఆర్ధిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా ఉన్నతాధికారులకు తెలియజేయకూడదు. దీనిని వేధించడం అనిగాక మరేమి అంటారు. రాష్ట్రంలో ఇన్ని ఎయిడెడ్ కళాశాలలు ఉంటే మరే కళాశాలలో లేని రీతిగా అధ్యాపకులైన మేము ప్రిన్సిపాల్ గారికి కాకుండా మా సెలవు చీటీని మేమే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ కి ఇవ్వాలనే కరెస్పాండెంట్ శాసనం. అలా గాకుండా సెలవు చీటీ సంబంధిత లీవ్స్ క్లర్క్ కు ఇచ్చినా , ప్రిన్సిపాల్ గారికి అందించినా అటెండెన్స్ రిజిస్టర్ లో ఆబ్సెంట్ మార్క్ నోట్ చేసి బెదిరించడం. అలా ఆబ్సెంట్ మార్క్ నోట్ చేయబడినవాళ్లు భయపడిపోయి హోదాను మరచి తామే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ చేత సంతకం చేయించుకోగా ఆబ్సెంట్ గా రాసిన స్థానంలో వైట్ ఫ్లూయిడ్ పెట్టి సి. ఎల్. మార్క్ చెయ్యడం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే తీరిక లేదు. కళాశాల యాజమాన్యం అందించే ముడుపులకు ఆర్ జెడి రాజమండ్రిలో, విజయవాడ లోని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ లోను క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకటి కాదు మా ఎయిడెడ్ కళాశాల లీలలు.
01A: " మీరు కెలుక్కోవడం వల్ల మేము సబ్జెక్ట్ లోకి వెళ్లి పోయి మేము డెప్త్ కు వెళుతున్నాము. మేము ఏది చెప్పినా సరే ఆన్ రికార్డ్, ఆన్ గవర్నమెంట్ జి వొ ప్రకారంగా మాట్లాడుతున్నాను"
01A:"కాజ్వల్ లీవ్స్ 8 ఉన్నాయి. స్పెషల్ కజ్వల్ లీవ్స్ రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లై చెయ్యడానికి లేదు."
01A:"లీవ్ మీకు ఫండమెంటల్ రైట్ కాదు"
01A:"మీరు లీవ్ అప్లై చేస్తే ఇవ్వాలని రైటేమి లేదు. నాకు నచ్చలేదనుకోండి నేను కంపిటి టీవ్ అథారిటీ కాబట్టి ఏ ఎం ఏ ఎల్ కాలేజీకి నేను లీవ్ సంక్షన్ చెయ్యక్కర లేదు. అది అబ్సెంట్ క్రిందే పడుతుంది. "
సస్పెండ్ విధానమే ప్రభుత్వ నిబంధనలు - మానవ హక్కులకు విరుద్ధం:
15-5-1984 commissioner order no:5030 commissioner MEDAM SATISH NAYAR. REPORT
SOWCAUSE NOTICE. 1st
S.O. Ronanki Anandarao . 15-5-1984 TO 6/11/1997 so to management.
బహుశా ....ఇప్పుడు మీరు చదవబోయే విషయాలు ఎయిడెడ్ అధ్యాపకులైన
వారిని విస్మయానికి గురిచేస్తాయి. ఏ ఎం ఏ ఎల్ కళాశాల, అనకాపల్లి అధ్యాపకుల పట్ల
కళాశాల యాజమాన్యం ఎంత అరాచకంగా వ్యవహరిస్తుందో, అధ్యాపకులను ఎంత బానిసలుగా
చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ
నిబంధనలను తుంగలో తొక్కి కళాశాల యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో....అనేక మార్లు
స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్ లో ఎలా
అధ్యాపకులను భయపెడుతూ, హెచ్చరిస్తూ మాట్లాడారో గ్రహించవచ్చు.
ఏ ఎం ఏ ఎల్ కళాశాల సుమారు పదమూడేళ్ళ పాటు స్పెషల్ ఆఫీసర్
పాలనలో సాగింది. కారణం....యాజమాన్యంలోని అంతర్గత కారణాలచేత ఒక వ్యక్తి కళాశాలలో
జరిగిన అవకతవకలు, యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించిన తీరుమీద
ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నాటి కమీషనర్ స్పందించి రికార్డ్స్ పరిశీలించి నాటి
కళాశాల యాజమాన్యాన్ని తొలగించి స్పెషల్ ఆఫీసర్ (ఎస్.ఒ )ను నియమించింది. ఎటువంటి అవకతవకలకు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైన రీతిలో వ్యవహరించమని
అండర్ టేకింగ్ లెటర్ కళాశాలవారు ఇచ్చాకే ప్రభుత్వం ఎస్ .ఒ తీసి కళాశాలను
యాజమాన్యానికి అప్పజెప్పింది. యాజమాన్యాన్ని డిస్మిస్ చెయ్యడానికి నాడు కారణాలు
కొన్నే. కాని నేడు పరిశీలిస్తే లెక్కలేనన్ని. అయినా అనేక మార్లు స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల
కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు
మీటింగ్స్ పెట్టి నిర్భయంగా, నిసిగ్గుగా వారి చట్టవిరుద్ధమైన పనులను
ప్రస్తావిస్తూ
6/12/2018
సి ఎల్స్ విషయంలో కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి
శాసనం:
".....ఎస్పెషల్లీ....యూ జి సి స్కేల్ ఎయిడెడ్ ఫ్యాకల్టీ విషయంలో
చెబుతున్నాను... మీ క్యాజువల్ లీవ్స్ 8 ఉన్నాయి. ప్లస్ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ విషయంలో రాబోయేసరికి
మా పర్మిషన్ లేకుండా మీరు అప్లయి చెయ్యడానికి లేదు. ఇప్పుడు చెబుతున్నాను. ఇప్పుడు
సుపరిండేంట్ కూడా కాదు ......నా పర్మిషన్
లేకుండా లీవ్ అలౌ చెయ్యడానికి అవదు"
02B- మా దయ మీమీద ఉంటేనే నిబంధనలకు విరుద్ధమైనా మీకు సెలవులు
మంజూరు చేస్తామనే కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి మాటలు:
"సార్ మాకు రోకు(మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు
వెళ్ళండి ఫారెన్ టూర్. మేము పంపించుకుంటాము. నా చేతిలో పవర్ ఉంది. నేనేదో అడ్జస్ట్
చేసుకుంటాను. నాకు రోక్ లేదనుకోండి ఒక్క రోజుకూడా నేను ఎలో చెయ్యను. అది నా డిస్కషన్
పవర్. మీకది పాయిన్టౌట్ చెయ్యడానికి లేదు. ఆవిషయంలో మీరు నన్ను పాయింట్ అవుట్
చెయ్యడానికి లేదు. నా ఇష్టం. నాకు రోకుంటే
6 నెలలు ఇస్తాను. నాకు రోకు లేదనుకో ఒకరోజుకూడా ఇవ్వను. నా పవర్ అది. నా పవర్ ను మీరు క్వచన్ చెయ్యడానికి మీకు రైట్ లేదు."
03C:
"సార్ ఇంకో విషయం సార్. పక్కా రూల్స్ పాటించేసి మీరేదో
చేస్తే ఆ మోటో కాదు సార్. మీరు కెలుకుతున్నారు కాబట్టే మేము కెలికితే మీకు ఈవిధంగా
ఉంటుందని చెప్పడానికే"
మేము తలుచుకుంటే కులం పనిచెయ్యదు, ఎం పనిచేయదు.
01A: " మీరు కెలుక్కోవడం వల్ల మేము సబ్జెక్ట్ లోకి వెళ్లి పోయి మేము డెప్త్ కు వెళుతున్నాము. మేము ఏది చెప్పినా సరే ఆన్ రికార్డ్, ఆన్ గవర్నమెంట్ జి వొ ప్రకారంగా మాట్లాడుతున్నాను"
01A:"కాజ్వల్ లీవ్స్ 8 ఉన్నాయి. స్పెషల్ కజ్వల్ లీవ్స్ రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లై చెయ్యడానికి లేదు."
01A:"లీవ్ మీకు ఫండమెంటల్ రైట్ కాదు"
01A:"మీరు లీవ్ అప్లై చేస్తే ఇవ్వాలని రైటేమి లేదు. నాకు నచ్చలేదనుకోండి నేను కంపిటి టీవ్ అథారిటీ కాబట్టి ఏ ఎం ఏ ఎల్ కాలేజీకి నేను లీవ్ సంక్షన్ చెయ్యక్కర లేదు. అది అబ్సెంట్ క్రిందే పడుతుంది. "
అధికారులు నా సస్పెండ్ ను రివోక్ చేసినా కళాశాల యాజమాన్యం నన్ను విధులలోకి తీసుకోకుండా నన్ను వేధించిన వైనం:
అధికారులు, మంత్రి , ఎస్సీ కమీషన్ దృష్టికి తీసుకు వెళ్ళగా జరిగిన న్యాయం :
కళాశాల యాజమాన్యం మొదలు పెట్టిన వేధింపులు:
నిష్కారణంగా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
మా ఇబ్బందులను అధికారులకు తెలియ జేసినా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
జీతాలు యాజమాన్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాల్సిందే :
వ్యక్తిగతంగా మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసినా మనం ఏ అధికారి దృష్టికి తీసుకు వెళ్ళకూడదు:
నిద్రబోతున్న ప్రభుత్వ యంత్రాంగం:
అవినీతికి మరిగిన స్పందించి న్యాయం చెయ్యాల్సిన అధికారులు:
వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని చస్తేనే స్పందించే వ్యవస్థ: