-->

Tuesday, June 28, 2011

Talathoti Prithvi Raj as Speaker

చదువుకునేటప్పటినుండి నలుగురిలో నుల్చోని మాట్లాడాలంటే భయం, కాళ్ళూ చేతులు వణికి పోయేవి. అధ్యాపకునిగా ఉద్యోగం వచ్చాక, ఇండియన్ హైకూ క్లబ్ స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా క్రమక్రమంగా బెరుకు పోయింది. వందలమంది ముందర ధైర్యంగా మాట్లాడ గలిగేలా వక్తగా నిలిచాను.  ఒక అంశంపై నా సంస్థలో గాని లేదా వేరే సంస్థ వారు ఆహ్వానించినా చక్కగా ప్రసంగ పాఠాన్ని రూపొందించుకొని మాట్లాడేవాడిని.        



















































Monday, June 27, 2011

Prithvi as Book reviewer


Prithvi as Book reviewer:


పృథ్వి రాజ్ వివిధ కవుల కవితా సంపుటులకు రాసిన సమీక్షా వ్యాసాలు:
బలమైనది మౌనం - (ఎన్ అరుణ రచించిన "మౌనం మాట్లాడుతుంది" కవితా సంపుటిపై చేసిన సమీక్ష)  సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - జనవరి & ఫిబ్రవరి .
రెప్పల చప్పుడు 'లో గుండెల చప్పుళ్ళు -( సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన 'రెప్పల చప్పుడు ' నానీ సంపుటికి రాసిన సమీక్ష ) . సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - జనవరి & ఫిబ్రవరి .

అశోక్ కుమార్ చెప్పిన "ఆధ్యాత్మిక ర'హా'స్యాలు" - (శింగం పల్లి అశోక్ కుమార్ రచించిన "ఆధ్యాత్మిక రహస్యాలు"మినీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -  సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక -మార్చి -ఏప్రిల్.
'నా నీ 'లో వెలుగు వెదజల్లుతూ "గోరంతా దీపాలు" (అనిశెట్టి రజిత రచించిన "గోరంత దీపాలు " నానీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) - సంవీక్షణ పుస్తక సమీక్ష పత్రిక - మార్చి -ఏప్రిల్.
అందిన ఆకాశం (లంకా వెంకటేశ్వర్లు రచించిన "ఆకాశం నేలపాలైంది " హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష) - హైకూ సాహిత్య మాసపత్రిక , మే 2003.
హైకూ చినుకులు (బొబ్బిలి జోసెఫ్ రచించిన "పూల చినుకులు" హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -హైకూ సాహిత్య మాస పత్రిక
సామాజిక గీతం ఆలపించిన పిట్ట (రౌతు రవి రచించిన "వేకువ పిట్ట" హైకూ కవితా సంపుటిపై చేసిన సమీక్ష ) -హైకూ సాహిత్య మాస పత్రిక
నానీ మురిపాల "పాలకంకి " (నేతల ప్రతాప్ కుమార్ రచించిన "పాలకంకి" నానీ కవితా సంపుటిపై చేసిన సమీక్ష) - -హైకూ సాహిత్య మాస పత్రిక ఆగస్ట్ 2003.

Talathoti Prithvi Raj as a Poet

నన్ను కవిగా మార్చింది గ్రందాలయమే. అద్దంకిలోని ప్రభుత్వ గ్రంధాలయానికి క్రమం తప్పకుండా వెళుతూ దిన పత్రికలు, వార పత్రికలు చదివే అలవాటు ఉంది. ఆ అలవాటే నన్ను కవిగా మార్చింది. నా మొదటి కవిత బహుశా 10 వ తరగతిలో ప్రచురింపబడింది.