రికార్డ్స్ వాస్తవ విషయాలను వెల్లడించే రిజిస్టర్ లు ఫోటో తీస్తే అది టాంపరింగ్ అట !
3వ పాయింట్:
"నీ కేసు క్లియర్ అయితే సస్పెన్షన్ పిరియడ్ ను మేమే ర్యాటీఫై చేయాలి జాగ్రత్త "అంటూ మీటింగ్ లలో కరస్పాండెంట్ నన్ను బెదిరించడం చేశారు. అంటే యాజమాన్యం ఏ విషయాలపై నన్ను ప్రశ్నించకుండా చెయ్యడానికి నా నోరు నొక్కేందుకు ప్రయత్నం చెయ్యడం కాదా!
4 పాయింట్:
వల్గర్ లాంగ్వేజ్ లో యాజమాన్యంపై నేను పోస్టులు పెట్టాను అని రాశారు. కవిగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా నేను సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టినవి వారికి ఆపాదించుకుంటున్నారు. ఎవరి పేర్లు పెట్టి , ఏ వల్గర్ లాంగ్వేజ్ లో నేను పోస్ట్ లు పెట్టానో యాజమాన్యం నిరూపించాల్సి ఉంటుంది.
5వ పాయింట్ :
కళాశాల రికార్డులలో పార్ట్ టైం అధ్యాపకులని రాసి ఎన్.సి.సి. పేర్లు ప్రపోజ్ చేస్తూ పంపే డాక్యుమెంట్లలో పార్ట్ టైం లెక్చరర్స్ అని రాయకుండా లెక్చరర్స్ (పర్మినెంట్ లెక్చరర్ అని అధికారులు అనుకునేలాగా) మరియు " ఫుల్ టైం అన్ ఎయిడెడ్ లెక్చరర్" అని కళాశాల ప్రిన్సిపాల్ ~ కళాశాల యాజమాన్యం రాసి పంపించడం తప్పు కదా? వారు ఎయిడెడ్ లెక్టరర్స్ కాదు ; టైం లెక్చరర్స్ మాత్రమే అని నిరూపించే అటెండెన్స్ రిజిస్టర్ లోని వారి సంతకాలతో కూడిన పేజీని ఫోటో తీయడం ట్యాంపరింగ్ ఎలా అవుతుంది?
వైట్ ఫ్లూయిడ్ పెట్టి అటెండెన్స్ రిజిస్టర్ లను, రికార్డులను ఎవరు ట్యాంపరింగ్ చేస్తున్నారో అధికారులు పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు.
6వ పాయింట్:
మేనేజ్మెంట్ అండర్ టేకింగ్ లెటర్లు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ తేదీల్లో కళాశాల అధ్యాపకులనుండి తీసుకున్నారో వివరిస్తాను. అధికారులను తప్పు దోవ పట్టించడానికి వీటిని ఎలా ఉపయోగించుకుంటారో అందరూ గ్రహించాలి. ఆన్ లైన్ లో సి.ఏ.ఎస్. వివరాలను అప్లోడ్ చేస్తున్న సందర్భంలో అధ్యాపకులందరిచేత బలవంతంగా ఒక అండర్ టేకింగ్ లెటర్ రాయించుకున్నారు. అది ఇస్తేనే సి.ఏ.ఎస్. వివరాలను అప్లోడ్ చేస్తామని విడివిడిగా కళాశాలలోని అధ్యాపకుల అందరిచేత అండర్ టేకింగ్ లెటర్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. 11/05/2017న అటువంటి అండర్ టేకింగ్ లెటర్ పై సంతకం పెట్టించుకున్నాకేసి.ఏ.ఎస్. వివరాలు అప్లోడ్ చేశారు. నేను ఏదో తప్పు చేస్తే నేను మాత్రమే వారికి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చినట్లు అధికారులను తప్పుదోవపట్టించే ఉద్దేశంతో యాజమాన్యం ఈ విషయాన్ని నా సరెండర్ రిపోర్టులో పేర్కొని దానిని ఈక్రింది విధంగా జతపరిచారు.
సి.ఏ.ఎస్. ఇంటర్వ్యూలు పూర్తి అయిపోయి ప్రొసీడింగ్స్ వస్తున్న సమయంలో అనగా 4/4/2018 న ఒక పేపర్ పై మరో అండర్ టేకింగ్ గా అధ్యాపకులందరి సంతకాలు క్రింది విధంగా తీసుకున్నారు.
10,14 వరుస తేదీలలో 7,000 8,000 9,000 10,000 ప్రొసీడింగ్స్ వచ్చాయి
7వ పాయింట్ :
ఏడవ పాయింట్ గత విద్యా సంవత్సరం అంటే 2018-2019లో దళిత అధ్యాపకులు అందరిని ప్రేరేపిస్తూ కులతత్వాన్ని సృష్టించానట! నా నోట ప్రతి పదం దళిత అనే పదంతో కూడుకుని ఉంటుందట. కులతత్వం యాజమాన్యానికి ఉన్నది కనుకనే ఎన్ .సి.సి., హాస్టల్ వార్డెన్, ఎన్.ఎస్.ఎస్. వంటి బాధ్యతలు ఎయిడెడ్ అధ్యాపకులకు ఇవ్వాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్ధం గా పార్ట్ టైం అధ్యాపకులను నియమించారు. అందునా యాజమాన్యం కులానికి సంబంధించిన అధ్యాపకులకు అధ్యాపకులకే బాధ్యతలు అప్పజెప్పారు .
9వ పాయింట్ :
యాజమాన్యానికి క్యాస్ట్ ఫీలింగ్ లేదన్నట్టు రాసుకొచ్చారు నా సరెండర్ రిపోర్టులో. నేటికి ఉన్న 15 మంది ఎయిడెడ్ అధ్యాపకులలో నలుగురు మినహాయించి అందరూ ఎస్సీ అధ్యాపకులే! విధిలేని పరిస్థితుల్లో ఈ బాధ్యతలు అప్పచెప్పారు. అందరూ సక్రమంగానే చేశారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా సీనియర్ అయిన దళిత అధ్యాపకుడైన శ్రీ రవీంద్ర ప్రసాద్ గారికి ఆనాడు ప్రిన్సిపాల్ షిప్ ఇచ్చారా?
10వ పాయింట్ :
కళాశాలకు వచ్చే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులు అంటున్నారు. అటువంటి వారి వద్ద నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాండోనేషన్ పేరుతో యాజమాన్యం కాలేజీ డెవలప్మెంట్ రసీదు ఇస్తూ 500 రూపాయల 20% , 30% హాజరు ఉన్న విద్యార్థులనుండి బలవంతంగా వసూలు చేస్తున్నది నిజం కాదా?
11వ పాయింట్ :
15/10/2019వ తారీకు సాయంత్రం ఆపరేషన్ చేయించుకున్నాను. 16న సెలవు పెట్టి ఇంటివద్ద విశ్రాంతి తీసుకున్నాను. 17న కళాశాలకు రైలు ప్రయాణం చేసి వెళ్లి వాంతులు, తలనొప్పితో ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇబ్బంది పడ్డాను. డాక్టర్ సూచన మేరకు విశ్రాంతి కొరకు 16 అక్టోబర్ 2019 నుంచి 23 అక్టోబర్ 2019 వరకు మెడికల్ లీవ్ అప్లై చేసి ప్రిన్సిపల్ సంతకం పెట్టించి వెళ్లాను. అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రిన్సిపాల్ చే సంతకం చేయించి వారికి అందించి విధుల్లో చేరాను.
కరస్పాండెంట్ కక్ష సాధింపుగా అక్టోబర్ నెలకు 15 రోజులు బిల్లు పెట్టించారు. ఎ ఒ బిల్లును పాస్ చెయ్యడానికి నిరాకరించడంతో ఆ తర్వాత మెడికల్ లీవ్ ఎనిమిది రోజులు మినహాయించి 23 రోజులకు జీతం బిల్లు పెట్టారు. నిజంగా నా మెడికల్ లీవ్ పై కరస్పాండెంట్ గారికి అనుమానం ఉంటే మెడికల్ బోర్డు కి 25 లేదా 26 తారీకు లో జన్యూనిటీ సర్టిఫికెట్ కోసం లెటర్ పెట్టివుండేవారు. కక్ష సాధింపుగా 2/11/2019 న ఇంతా జరిగింది గనుక లెటర్ పెట్టారు. ఇప్పటివరకూ మెడికల్ లీవ్ లను జన్యూనిటీ సర్టిఫికెట్ కోసం ఎందరివి మెడికల్ బోర్డు పంపించారో తెలియజేయాలి. ఎందరి మెడికల్ లీవ్ లు సక్రమమైనవని నిర్ధారించుకుని జీతాలు పెట్టారో తెలియజేయాలి. మెడికల్ లీవ్ లు మంజూరు చేయకుండా జీవితాల బిల్లును ఆపినవారి పేర్లు చెప్పాలి. సదరు కరెస్పాండెంట్ "సార్ మాకు రోకు(ఈ అనకాపల్లి మాండలిక పదానికి అర్థం మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్ పంపించుకుంటాము. నా చేతిలో పవర్ ఉంది. నేనేదో అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు రోక్ లేదనుకోండి ఒకరోజుకూడా నేను ఎలో చెయ్యను అది నా డిస్కషన్ పవర్. మీరది పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. ఆవిషయంలో మీరు నన్ను పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. నా ఇష్టం. నాకు రోకుంటే 6 నెలలు ఇస్తాను. నాకు రోకు లేదనుకో ఒకరోజుకూడా ఇవ్వను. నా పవర్ అది. నా పవర్ ను క్వచన్ చెయ్యడానికి మీకు రైట్ లేదు."అని స్టాఫ్ తో జి.బి. రూమ్ లో మీటింగ్ లో అన్నట్లు నాపై వారికి రోకు లేదుకనుకనే నా మెడికల్ లీవ్ లో మంజూరు చేయలేదు అనే వంకతో మెడికల్ బోర్డు సాకు చూపుతూ జాప్యం చేసి ఆర్థికంగా నన్ను విధించాలని చేశారు.
12వ పాయింట్:
నేను ఉద్దేశ్యపూర్వకంగా కళాశాల అభివృద్ధి ని నాశనం చేయడానికి 30/10/2019న సి.సి. ఆఫీసులకు ఫేక్ కంప్లైంట్ చేశాను అని రాశారు. ఉద్యోగులకు సకాలంలో ప్రభుత్వం జీతాలు అందేలా... చెల్లించేలా ఏర్పాటు చేస్తే సూపరింటెండెంట్, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వీరు ముగ్గురు కలిసి వారి ఇష్టానుసారంగా జీతాలు ఇస్తున్నది నిజం కాదా ? సి.ఎ.ఎస్., పి.ఆర్.సి. ఎరియర్స్ ఇవ్వడంలో ఉద్దేశ పూర్వకంగా ముగ్గురూ జాప్యం చెయ్యడం నిజంకాదా ?సి.ఎ.ఎస్., పి.ఆర్.సి. స్కెల్స్ అమలు చేయడంలో ఉద్దేశ పూర్వకంగా ముగ్గురూ జాప్యం చెయ్యడం నిజంకాదా ?
13వ పాయింట్ :
సకాలంలో జీతాలు చెల్లించడం లేదని సి.ఎ.ఎస్. మార్చి ఎరియర్ మరియు పి.ఆర్.సి. ఎరియర్ మరియు స్కేల్ ఇంప్లిమెంటేషన్ అమలు గురించి వినతిపత్రంపై సంతకాలు పెట్టిన కొందరి అధ్యాపకులను బెదిరించి ఆ ఫిర్యాదు పత్రంలోని అధ్యాపకుల సంతకాన్ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు చేసింది నిజం కాదా? మీరు రాసినట్లు కాపీ చేసి వారు రాసినవే కదా! వారు జీవితాలు సకాలంలో అందుకున్నట్లు సంతకం పెట్టగానే నిజం అయిపోదు కదా?!
14వ పాయింట్ :
వాస్తవ విషయాలు ఎవరికైనా చేదుగానే ఉంటాయి మేము షోకాజ్ నోటీసులు సమాధానంగా నేను రాసిన సమాధానాలు నిజం కావా ?
15వ పాయింట్ :
ప్రభుత్వం ద్వారా మాత్రమే జీతాలు తీసుకుంటున్నాను గనుక నాపై యాజమాన్యం నియంత్రణ ఉండకూడదని నేను భావించడం లేదు. గత షోకాజ్ నోటీసు సమాధానంలోనే నేను స్పష్టంగా రాశాను. అందరం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన వారమేనని. కులతత్వాన్ని తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత సంఘాల ఆహ్వానిస్తున్నట్లు రాశారు. యాజమాన్యం గా మీరు నా పట్ల ఇప్పటివరకు పెట్టిన అనేక ఇబ్బందులను పరిష్కరించుకునే క్రమంలో మీరు చెప్పినట్లు ఎందరినో దళిత సంఘాల నాయకులను తీసుకొచ్చి మాట్లాడించాల్సి ఉంది. ఇప్పటికీ అలా చేయలేదు. ఎందుకంటే 15/11/2019న ప్రిన్సిపాల్ అనుమతితోనే యాజమాన్యంతో మాట్లాడడానికి భీమ్ సేన ( వైజాగ్) వారు మాట్లాడి వెళ్లారు.
నా ప్రవర్తనలో మార్పు కోరుతున్నట్లు రాశారు. సమయానికి కాలేజీకి రావడం లేదా? సమయానికి క్లాసులు తీసుకోవడం లేదా ? నా సబ్జెక్ట్ లో పాస్ శాతం తక్కువా ? పోనీ కాలేజీలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నానా? తాగి కాలేజీకి వస్తున్నానా ? విద్యార్థినీలతో మిస్ బిహేవ్ చేస్తున్నానా? ఇవేవి కానప్పుడు నా ప్రవర్తనలో మార్చుకోవాల్సిన అంశాలు ఏమిటి ? ఇప్పటివరకు యాజమాన్యం నాకు జారీ చేసిన మెమోలు ,షోకాజ్ నోటీసులతో వివరంగా పేర్కొలేక పోయారు. వారు చెప్పలేక పోతున్నా నేను మార్చుకోవాల్సిన నా ప్రవర్తన ఏమిటంటే రూల్స్ ను నేను అడగకూడదు. వారు నిబంధనలకు విరుద్ధంగా ఏం చేస్తున్నా అధికారుల దృష్టికి నేను తీసుకు వెళ్ళ కూడదు. యాజమాన్యం వారి దృష్టిలో ఇదే నా దురలవాటు!
2006లో న్యాక్ కి వెళ్లారు. 2012 తర్వాత సీనియర్ లెక్చరర్స్ రిటైర్డ్ అయ్యారని అన్నారు. నేను మిగతా దళిత అధ్యాపకుల ప్రభావితం చేయడం ద్వారా యాజమాన్యం పై తిరుగుబాటు చేస్తున్నారని పేర్కొన్నారు. నాచే ప్రభావితమయ్యారని దళిత అధ్యాపకులు మీతో ఏమైనా చెప్పారా? ఎన్.సి.సి. ఎన్.ఎస్.ఎస్., హాస్టల్ వార్డెన్ మొదలగు వాటిలో వివక్ష చూపారు. కనుకనే వారందరూ ప్రశ్నించే స్థితికి వచ్చారు. నేను చేగొవీర, నెల్సన్ మండేలావంటి మహనీయుడ్ని కాదు అంతమందిని చైతన్యవంతుల్ని చేయడానికి.
అనేక సమస్యలు నా ద్వారా కళాశాల యాజమాన్యం ఎదుర్కొంటున్నారని సరెండర్ రిపోర్టులో పేర్కొన్నారు. నిజంగా ఆ సమస్యలు నిజమైనవే అయితే.. హేతుబద్ధమైనవే అయితే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి నాపై చర్యలు తీసుకునే అవకాశం మీకు ఉందికదా! ఇవి చేయకుండా సరెండర్ చేయాలనుకోవడం ఏమిటి?
~ విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల అంటే డిసిప్లైన్ కు పెట్టింది పేరు. ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ చేసి అక్కడినుండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పి.జి.చదివి డిసిప్లైన్ ఉన్నవాడిని కనుకనే జె ఆర్ ఎఫ్ సాధించి, తెలుగు సాహిత్యంలో పి హెచ్.డి పొంది ఉద్యోగం సంపాదించాను. కనుకనే రూల్స్ కు విరుద్ధంగా మీరు చేసే వాటిని డిసిప్లేన్ ఉన్న వ్యక్తిగా అనుసరించలేక, చూస్తూ ఉండలేక అధికారులకు తెలియ జేస్తున్నాను. మీతో విబేధిస్తున్నాను.
~ ఏ. ఎం. ఎ.ఎల్. కళాశాల యాజమాన్యానికి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం అలవాటు లేని పని. ఇంత గొడవకి కారణం ఇదే!
నన్ను సరెండర్ చేసే అధికారం కళాశాల యాజమాన్యానికి లేదని తెలియకుండానే నన్ను కరస్పాండెంట్ సరెండర్ చేసారు అని అనుకుందాం. అప్పుడు ఏం చెయ్యాలి ? సరెండర్ పై సి.సి.ఇ. వారి అనుమతి వచ్చే వరకు నన్ను కళాశాలలో ఉద్యోగం చేయిస్తూ, నా నెలసరి జీతాలు బిల్లు పెడుతూ ఉండగా వారు కోరుకున్నట్లు అనుమతి వచ్చాక నాకు రిలీవింగ్ సర్టిఫికెట్ ఇచ్చి పంపాలి. కానీ కళాశాల యాజమాన్యం అలా చేయలేదు. ముందే చెప్పానుకదా వారు రూల్స్ కు విరుద్ధం అని. నన్ను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టడమే యాజమాన్యం లక్ష్యం కనుక అధికారులను, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేయడమే వారి అలవాటు కనుక సరెండర్ చేసామని నన్ను కాలేజీలో ఉండనివ్వలేదు. క్లాసులు తీసుకొనివ్వలేదు. కమీషనర్ చేర్చుకోవాలి అని చెప్పినా వినలేదు. కమీషనర్ ఆర్డర్ పంపించిన నన్ను చేర్చుకోలేదు. కమిషనర్ జె.డి., ఆర్.జె.డి.ల చేత హెచ్చరించినా నన్ను కళాశాల విధుల్లోకి తీసుకోలేదు. 19 రోజులకే నా నవంబర్ జీతాన్ని పెట్టారు. నవంబరు నెలాఖరు వరకు పెట్టాల్సిన
పి. ఆర్సీ. ఎరియర్స్ ను నవంబర్ 19వరకే పెట్టారు. నాలుగేళ్ల నుండి నాకు ఇంక్రిమెంట్లు కలపకుండా జీతాలు ఇస్తున్నారు. ఎనిమిది రోజుల మెడికల్ లీవ్ జీతం ఇవ్వకుండా ఆపారు. పిఆర్సి కొత్త జీతం ఇవ్వకుండా పంపించాలని నవంబర్ 20 తేదీనుండి ఉద్యోగ బాధ్యతలో నేను లేకుండా ఇలా గాలిలో ఉండేలా చేశారు. ఇవి ఉద్దేశపూర్వకంగా చేసేవి గాక మరేమిటి?