-->

Monday, November 28, 2011











Double the Tears

Siamese or conjoined twins is a rare phenomenon, but it shows the weird side of nature, it's cruel side. more...


Monday, November 14, 2011

Prithvi Created Blogs and Websites

Prithvi Created Blogs and Websites

http://naaneelu.blogspot.com/
http://kolakalurienoch.blogspot.com/
http://addepalliramamohanarao.blogspot.com/
http://ravuribharadwaja.blogspot.com/
http://telugupoetsandwriters.blogspot.com/
http://vi-ra-sam.blogspot.com/p/contact.html
http://sahithyasameeksha.blogspot.com/p/drtalathoti-prithvi-raj.html








Wednesday, November 9, 2011

Talathoti Prithvi’s Forewords


పృథ్వి రాజ్ వివిధ కవుల కవితా సంపుటులకు రాసిన ముందు మాటలు:
శిశిరంలో పచ్చని చిగుళ్ళు !!! (శ్రీ గణపతిరాజు చంద్రశేఖర రాజు రచించిన "మాధురి " హైకూ కవితా సంపుటికి రాసిన ముందు మాట)
ప్రోలోగ్ - (మాధవీ సనారా రచించిన  "హైకూనలు" చిరు కవితా సంపుటికి రాసిన ముందుమాట)   
చీకట్ల కామేశ్వర రావు "ఎగిరే పావురాలు" నానీ సంపుటానికి  "వెన్నెల గోపురంలో నానీ పావురాలు "పేరుతో 2009 లో ముందుమాట. 
భుజంగరావు కంచరాన రచించిన "కొంగా !నా గోరుమీద పువ్వేయ్యవా..." నానీ సంపుటానికి "సప్తవర్ణాల నానీలు "పేరుతో డిసెంబర్ 2010లో ముందు మాట రాశాను.
కొప్పుశెట్టి సూర్యనారాయణ "అమ్మ " పద్య కవితా సంపుటికి "కవితా నీరాజనం " పేరుతో అక్టోబర్ 2012లో ముందుమాట రాశాను.
రాపోలు సీతారామరాజు( సౌత్ ఆఫ్రికా) నానీ సంపుటానికి "మృష్టాన్న భోజనం -రాపోలు నానీలు "పేరుతో ముందుమాట  
యజ్జల మురళీ వేణి నానీ సంపుటికి "ముందుమాట "

Sunday, November 6, 2011

Autobiography of Talathoti Prithvi Raj

Introduction Of Dr.Talathoti Prithvi Raj





Prithvi In Degree



చదివే విద్యా సంస్థలను బట్టి కూడా మన భవిష్యత్తు ఉంటుందనిపిస్తుంది, నా విద్యాభివృద్ధిని నేనే పరిశీలించుకుంటే. నేను గొప్ప తెలివిగల వాడ్నేమికాదు; సాధారణ విద్యార్థినే! చిన్నపుడ్నుంచి క్లాసు లో చివరనే కూర్చునేవాడిని సార్ల దృష్టి చివరి వాళ్ళపై పెద్దగా ఉండదని. తెలివి లేక పోయినా కష్టపడి ఇష్టంగా చదివే గుణం మాత్రం ఎదిగేకొద్దీ...చదివేకొద్దీ అలవర్చుకొని పెంచుకున్నాను. ప్రయోజకులు కావాలనే ఆశ ఉంటే సరిపోదుకదా! పెద్ద సీరియస్ గా కాకుండా, అలా అని క్లాస్ లు నిత్యం ఎగకొట్టక- అప్పుడప్పుడు ఎగ్గొడుతూ ఇంటర్మీడియట్ వరకూ చదివాను.1987 -1989 విద్యా సంవత్సరాల మధ్య నేను ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ(అద్దంకి,ఒంగోలు జిల్లా)లో సి.ఇ.సి. గ్రూప్ లో చదివాను. నేను బొమ్మలు బాగా గీస్తానని నా మిత్రులు చాలామంది BiPC తీసుకోమన్నారు. నా సామర్థ్యం నాకు తెలుసు గనుక C.E.C చదివి పాసయ్యాను. అప్పటివరకు గవర్నమెంట్ స్కూల్స్ ...కాలేజీల్లో నా విద్య గడిచింది. ఇక్కడనుంచే నా జీవితం మలుపు తిరిగింది. 
నేను B.A.Litt. లొయోల కాలేజీ లో చదవడంలో మా బాబాయ్ ప్రభావం నామీద చాలా ఉంది. మా బాబాయ్ కూడా లోయోలా కాలేజీ లోనే చదివాడు.

నేను పదవ తరగతికి ముందే కథలు కవితలు రాసే అలవాటు ఉంది. చిన్నప్పుడు విధిగా పభుత్వ గ్రంధాలయానికి వెళ్లి దినపత్రికలు, వార పత్రికలు,మాస పత్రికల్లోని కామిక్స్ కథలు...కార్టూన్స్...కవితలు...ఇలా నన్ను అలరించేవాటిని చదివే వాడిని. నా రచనలుకూడా పేపర్లలో అలా పడాలని అనుకునేవాడిని. నా తొలి కవిత ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. కవితలు, కథలు..రాస్తున్నానని కాదుగాని; ఇతర సబ్జెక్ట్ ల కంటే తెలుగు తేలికగా ఉంటుందనే భావనతోనే B.A.Litt లో చేరాను. చేరడమైతే చేరానుగాని...తెలుగు సాహిత్యం చదివితే దేనికి ఉపయోగ పడుతుంది అని చాలారోజుల పాటు న్యూనతా భావంతో మబ్బుగా ఉన్నాను. ప్రముఖ కథ రచయిత,మాకు పాఠం చెప్పదానికొచ్చే శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు నన్ను గమనించి..."నీవు ఎ సబ్జెక్టు చదివావన్నది కాదు; ఆ సబ్జెక్టు లో ఎంత పట్టు సంపాయించా వన్నదే ముఖ్యం" అని నా అనుమానాలను నివృతి చేసి ప్రోత్సహించారు. అది మొదలుకొని తెలుగు సాహిత్యాన్ని ఇష్టంగా చదవడం ప్రారంభించాను. కాలేజీ మ్యాగాజైన్స్ మొదలుకొని అనేక రచనలు చెయ్యడానికి ప్రోత్సహించినవారు గురువర్యులు డా.గుమ్మా సాంబశివరావు గారు.
న్యూ హాస్టల్లో ఉండి చదువుకుంటూ వివిధ పత్రికలకు కవితలు..కార్టూన్లు..రాసిపంపేవాడిని. మయూరి..ఆంధ్ర సచిత్ర వారపత్రిక మొదలగు వారిలో ప్రచురింప బడేవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లోని "యువవాణి"లో నా కథానికలు..కవితలు ప్రసారం కావడం రచనా వ్యాసంగంపట్ల నాలో మరింత ప్రోత్సాహాన్ని కలిగించింది. సరదాగా ఆడుతూ పాడుతూ చదువుకునే నాకు ఎం.ఏ. ఎక్కడ చెయ్యాలి అనే ప్రశ్న తలయెత్తింది."హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం" గూర్చి ఒక మిత్రుని నోట అప్పుడువిన్నాను.
విజయవాడలోని ఆంధ్రా లోయోలా కాలేజీ లో నేను చదువుకునేటప్పుడు వివిధ సందర్భాలలో నేను దిగిన ఫోటోలు నాకు ఇప్పటికీ మధురానుభూతుల్ని పంచిపెడుతుంటాయి. అప్పటివరకు సముద్రం ఎలా ఉంటుందో చూడని నాకు చూడాలనిపించి హాస్టల్ లో చెప్పకుండా ఒకసారి మచిలీపట్నం బీచ్ కి వెళ్ళాను కొందరు బయటి మిత్రులతో కలిసి. భయంకరమైన వర్షంలో చిక్కుకున్నాము. ఆ రాత్రి cyclone shelter లో తలదాచుకున్న సంఘటనను ఇప్పటికీ మరిచిపోలేను. నేను ఆంధ్రా లోయోలా కాలేజీ లో డిగ్రీ చదివేటప్పుడు వివిధ సందర్భాలలో నేను దిగిన ఫోటోలు ఈ ఆల్బంలో పెట్టాను.న్యూ హాస్టల్ వార్డెన్ గా పనిచేసిన కీ.శే.ఫాదర్ కోరియకోస్ నాపట్ల చూపిన వాత్సల్యాన్ని నేనిప్పటికీ మరువలేను.






Prithvi In P.G.


హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఏ.చెయ్యాలని ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ పొంది చేరాను. నా వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా చదువుకొని ఎం.ఏ.పాసయి, యూ. జి.సి. జూనియర్ ఫెలోషిప్ కూడా పొందాను. హైదరాబాద్ వదలి పిహెచ్.డి. కోసం విశాఖ పట్నం వచ్చేటప్పుడు హైదరాబాద్ మధుర స్మృతుల కోసం ముఖ్యమైన చారిత్రిక ,ప్రసిద్ధ స్థలాలలో నేను దిగిన ఫోటోలను మీరు ఈ ఆల్బం లో చూడవచ్చు.






Prithvi as a Scholar


నేను చదువువల్ల విజయవాడ,హైదరాబాద్,విశాఖాపట్నాలలో చదువుకోవాల్సి వచ్చింది. ఆంధ్రవిశ్వ విద్యాలయంలో "ఆత్రేయ సినిమా సంభాషణలు-ఒక పరిశీలన" అనే అంశంపై పిహెచ్.డి.చెయ్యడంకోసం విశాఖ వచ్చాను.ఈ సమయంలో ....ఆయా సుందర ప్రదేశాలలో మధుర స్మృతుల కోసం కొన్ని ఫోటోలను దిగాను. ఈ ఆల్బం లో ఆ ఫోటోలను తిలకించవచ్చు.






Prithvi's Poetry Books


పదవ తరగతికి ముందే నా రచనావ్యాసంగం ప్రారంభమైన 10 వ తరగతిలో నా కవిత ప్రచురింపబడింది. చాలా రోజులపాటు పత్రికల్లో ప్రచురింపబడే కవిత్వాన్ని చూసి ఆనందించేవాడిని.ఒక సంవత్సరంన్నర పాటు ఎంజాయ్ చేసి,మరో సంవత్సరంన్నర పాటు దీక్షగా నా పిహెచ్.డి.ని పూర్తిచేశాక సీనియర్ ఫెలోషిప్ స్చాలర్ గా మిగతా రెండు సంవత్సరాలపాటు ఖాళీగా ఉండడం ఇష్టం లేని నేను డిగ్రీ తర్వాత ఆగిపోయిన నా సృజనాత్మక రచనా వ్యాసంగాన్ని తిరిగి కొనసాగించాను. 1998 లో హైకూ ప్రక్రియచే ఆకర్షింపబడిన వాళ్ళల్లో నేను ఒకడ్ని. మొదట మనిషి,మనిషిలో...ఆతర్వాత మన'సు,కవి ,ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు,నల్ల దొరలు,వెన్నెల,చినుకులు,వసంతం,రోజుకో సూర్యుడు,నీలాకాశం,కలువలు,చంద్రకిరీటి,రుతు భ్రమణం,పృథ్వి ఫోటో హైకూ,పృథ్వి సెన్ ర్యూ,పృథ్వి తంకాలు,కవితలతోటి మొదలగు పుస్తకాలను రచించి ప్రచురించాను. మరికొన్ని సంకలన కర్తగా ప్రచురించాను. ఈ ఆల్బం లో ఆ పుస్తకాల ఫోటోలను మీరు తిలకించవచ్చు.





Prithvi Poetrybooks Release Functions


టెక్స్ట్ త్వరలో...





Prithvi As a Literary Speaker



చదువుకునే దశనుంచే పదిమందిలో నిలబడి ఏదైనా మాట్లాడాలంటే..చెప్పాలంటే నాకు గుండె దడ. అటువంటిది ఈ రోజు వందలాదిమంది ముందు,పెద్ద వేదికలపై మాట్లాడ గలుగుతున్నాను.
నా భయాన్ని క్రమంగా పోగొట్టుకున్నాను. అనేక సాహిత్య అంశాలపై వివిధ సంస్థల్లో,వివిధ ప్రాంతాలలో నేను ఉపన్యసించి వక్తగా సాహితీ ప్రియుల ప్రశంసలను పొందాను.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి POWERPOINT PRESENTATION లో సాహిత్యోపన్యాసాలు చేశాను. వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలను మీరు ఈ ఆల్బం లో చూడవచ్చు.






Felicitations Of Prithvi


టెక్స్ట్ త్వరలో...





Talathoti Closeup Photos


టెక్స్ట్ త్వరలో...





Prithvi Created Literary Audio-Video C.D.'s


టెక్స్ట్ త్వరలో...






Prithvi with Literary Persons


వివిధ రంగాలలో ఎదిగిన ప్రతిఒక్కరూ ఎదగాలనుకునేవారికి స్ఫూర్తినిస్తారు. అలాంటివారి పరిచయానికి గుర్తుగా వారితో నేను దిగిన ఫోటోలు ఎన్నో ఉన్నాయి. ఆ ఫోటోలు చూసినప్పుడల్లా ఒక ప్రేరణ,చైతన్యం మనలో ఏర్పడుతుంటాయి. నేను ప్రాథమికంగా కవినిగానుక ప్రసిద్ధ కవులు...కవిమిత్రులతో ఎక్కువ ఫోటోలు దిగాను. ఆ తర్వాత కళాకారులు...సామాజిక ఉద్యమకారులతో ఫోటోలు దిగాను. నాకు స్పూర్తినిచ్చే ఇటువంటి ఫోటోలను మీరు ఈ ఆల్బం లో చూడవచ్చు.





Indian Haiku Club Invitations


టెక్స్ట్ త్వరలో...





Prithvi Organized Programmes


వృత్తిపరంగా తెలుగు అధ్యాపకునిగా విద్యాబోధన చేస్తుండడమే గాక, కవిగా కవితా సృజన చెయ్యడమేగాక, మంచి వక్తలకు చక్కని వేదికగా ఉపయోగ పడాలని...అనకాపల్లి సాహిత్యాభిమానులకు మంచి సాహిత్య ప్రసంగాలను వినిపింప జెయ్యాలని....యువకవులను ప్రోత్సహించాలని, ప్రసిద్ధ కవులను అనకాపల్లి వారికి పరిచయం చెయ్యాలని నేను " ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సాంస్కృతిక సంస్థ"ను ఏర్పాటు చేశాను. పేరుకి హైకూ క్లబ్ అయినప్పటికీ పద్యకవిత్వం,వచన కవిత్వం,గజల్స్ మొదలగు సాహిత్యాంశాలపై, ప్రక్రియలపై ఇండియన్ హైకూ క్లబ్ అధ్యక్షునిగా సాహితీ సమావేశాలను నిర్వహించాను.కొన్ని కార్యక్రమాలకు కొందరు దాతలు సహాయం చేసినది గాక వ్యక్తిగతంగా నేను ఇండియన్ హైకూ క్లబ్ కార్యక్రమాలకు సుమారు లక్షరూపాయలు వరకు ఖర్చు చేశాను. జాతీయ, రాష్ట్రస్థాయి లలో హైకూ,నానీలలో సెమినార్ లను నిర్వహించాను. ఒక సాహితీ సంస్థ వ్యవస్థాపకునిగా,నిర్వాహకునిగా మంచి గుర్తింపును పొందినందుకు సంతోషిస్తున్నాను. ఇండియన్ హైకూ క్లబ్ నిర్వాహకునిగా నేను నిర్వహించిన వివిధ కార్యక్రమాలలోని కొన్ని ఫోటోలను ఈ ఆల్బం లో మీరూ తిలకించవచ్చు!





I.H.C. Books-C.D.'s Release Functions


టెక్స్ట్ త్వరలో...





Anakapalli Young Poets


టెక్స్ట్ త్వరలో...





Athreya Sahithee Sravanthi


టెక్స్ట్ త్వరలో...





Kigo base Haiku Poetry Book (Ruthubrahmanam)


టెక్స్ట్ త్వరలో...





Prithvi Photo Haiku Book


టెక్స్ట్ త్వరలో...





Kavitalathoti Poetry Book


టెక్స్ట్ త్వరలో...





Chinukulu Haiku Poetry Book


టెక్స్ట్ త్వరలో...





Prithvi Senryu Book


టెక్స్ట్ త్వరలో...





Naaneelu Poetry Compilation


టెక్స్ట్ త్వరలో...