"బాధలే నాకాప్త బంధువర్గంబు
బీదతనంబె నా ప్రియమైన హక్కు
లోకహితంబు
నాలోచించు పనియె
కఠినంబు
విధి దైవ ఘటితంబు నదియు”
రామిరెడ్డిగారి
జీవితంలో 1925,
1926 సంవత్సరాలు విషాదాన్ని మిగిల్చాయి. 25 లో ఆయన భార్య, శేషమ్మ
బాలింత వ్యాధితో మరణించారు. ఆ మరుసటి సంవత్సరంలో వారి యేడాది శిశువు కుముదమ్మ
మరణించింది. ఆ విషాద స్మృతుల నుంచి మరో మలుపుగా 1926లో
అక్టోబర్ 5న 'పానశాల' అనువాదాన్ని ప్రారంభించారు. రామిరెడ్డి. ఆ మరుసటి సంవత్సరం - నవంబర్ 24 తేదీకి
అనువాదం పూర్తయింది. ఆ రచన 1928 లో ప్రప్రథమంగా 'భారతి'లో ప్రచురితమైంది. పర్షియన్ భాషలో ఉన్న ఖయ్యూం ‘రుబాయతులు’ను రామిరెడ్డి తెలుగులోకి అనువదించారు. ఎడ్వర్డ్
పిడ్జిరాల్డ్ (EDWARD
FITZ GERALD) 1859లో ఆంగ్ల భాష లోనికి అనువదించాడు.
1) ఉత్పలమాల:
అంతములేని
యీభువనమంత పురాతనపాంథశాల, వి
శ్రాంతి
గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్ ; ధరా
క్రాంతులు
పాదుషాలు బహరామ్ జమిషీడులు వేనవేలుగాఁ
గొంత
సుఖించి పోయి రెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్
తూర్పు
పడమరలు వాకిలులుగా గల ఈఅనంత విశ్వం ఒక సత్రం లాంటి ది అందులో రాజులు, పాదుషాలు కొంతకాలం సుఖంగాఉండి వచ్చే వారికి చొటిస్తూ ఎక్కడికొ
వెల్లిపొయారని దీని బావం
2) చంపకమాల:
మరణభయంబు నాకు నణుమాత్రము లేదు; మదీయ జీవ సం
భరణభయంబె మిక్కుటము; ప్రాణము దైవము నొద్ద వడ్డి బే
హరమున కప్పుగొంటి; ఋణమంతయు నిమ్మని తల్పు దట్టినన్
సరసర హేమనిష్కముల సంచులు ముందఱ విప్పిపో సెదన్,
తనకి చావు భయం కన్నా బ్రతుకు భయం ఎక్కువ
అంటాడు. ప్రాణాన్ని దేవుని వద్ద తాకట్టు పెట్టి జీవితాన్ని అప్పుగా తెచ్చు
కున్నానంటాడు అప్పు కోసం దేవుడు తలుపు తట్టినప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు తిసుకో
అనొచ్చు అని దీని భావం
3) చంపకమాల:
మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై
చినిఁగెను; నేఁడునున్ మరలఁ జెప్పులకోసము వచ్చినాఁడ; నె
మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగరాను; నీవు చ
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులు వోలె నమాజు
సైతమున్
పొయినసారి దొంగిలించిన చెప్పులు చినిగిపొయినవి
మరలా చెప్పుల కోసం వచ్చాను కాని నమాజు కోసం కాదు చచ్చి పొయిన తరువాత చెప్పులాగే
నమాజులు కుడా పొతాయి కదా అంటాడు ఖయామ్
4) ఉత్పలమాల:
నిన్నటిరోజు కుమ్మరిని నేఁగనుగొంటి బజారు
వీథిలో
మన్నొక ముద్దఁజేసి మడమం జెడఁద్రొక్కుచు నుండ, వానితోఁ
దిన్నగ మందలించె నది దీనత "మెల్లఁగ నల్లఁ
ద్రోకు,
మో
యన్న, యెఱుంగవే నను? నొకప్పుడు నీవలె నందగాండనే!
మట్టి ముద్ద ను తొక్కు తున్న కుమ్మరి తొ ఆముద్ద .... అన్నా ! మెల్లిగా తొక్కు. నెనుకుడా నికుమాదిరిగా ఒకప్పుడు అంగాడినె అని
అంటుంది.
ప్రతివాడు మట్టి లొ కలసి పొయెవాడె అని ఖయ్యామ్
అంటాడు.
తేటగీతి
కానలేము కాలపు మర్మ మేను నీవు;
ఆ జిలుగు వ్రాఁత చదువ సాధ్యంబె మనకు
తెర వెనుక నేను నీవను పొరపుగలదు;
ఆ విభేదము తెరయెత్త నంతరించు.
తే.గీ.
ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్న
రాకయుందును; వచ్చినఁ బోకయుందు;
వీలుపడునేని యీపాడు నేలయందు
ఉనికి పుట్టువు చావు లేకున్న మేలు
చంపకమాల:
కలపయు మట్టి ఱాల నిడి కట్టిన దేవళమందు నీకు నే
ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవయేని కామినిన్
వలవుము; ప్రాణహీనమగు బండలు వేయిటికన్న శ్రేష్ఠమై
యలరుఁగదా మనుష్య హృదయంబు ప్రతి
ప్రణయానురక్తులన్
తేటగీతి:
దేవ, నీవులేని గుడిఁ బ్రార్థించుకంటెఁ
బానశాలను సత్యంబు పలుక మేలు;
సృష్టి కాద్యంతములు నీవె; సష్టవీ వె;
పాలముంచ నీటను ముంచఁ బ్రభువు నీవె.
ఖయ్యామ్ రుబాయీలు ఎలాఉంటాయొ తెలీయదుగాని
దువ్వురి రామిరెడ్డి గారి పానశాల మాత్రం తెట తెలుగులో హృదయానికి హత్తు కునే విధంగా
ఆనందంగా అహాల్హాదం గా మరచి పొలెని మధురానుభుతిని అందిస్తాయీ అన్నది అక్షరసత్యం.
1947
సెప్టెంబర్ 11న సాహితీ ప్రేమికులను విషాదంలో ముంచి అనంతలోకాలకు
తరలివెళ్లారు. ఆంధ్రసాహిత్య నందనంలో అమరజీవిగా నిలిచారు.
No comments:
Post a Comment