-->

Thursday, September 30, 2021

జాషువా విషయంలో జవాబు దొరకని ప్రశ్నలు!


జాషువా విషయంలో జవాబు దొరకని ప్రశ్నలు!

1895 జాషువా ఆనాటి సమాజం జాషువాని శూద్రుడు గా చూసిందా? పంచముడిగా చూసిందా?
శూద్రునిగా చూస్తే మిగతా శూద్ర కులాలకి చెందిన వారికి లేని అంటూ, అస్పృశ్యత జాషువా పట్ల ఎందుకు ప్రదర్శించారు?

పితృ స్వామ్య వ్యవస్థలో తండ్రి వారసత్వాన్ని పరిగణిస్తారు, ప్రాధాన్యత ఇస్తారు.

చట్టాన్ని అనుసరించి చూసినా తండ్రి కులము సంతానానికి వర్తిస్తుంది. తండ్రి యాదవ. తల్లి ఎస్సీ కులానికి చెందిన స్త్రీ అయినప్పటికీ జాషువా యాదవ కులానికి చెందిన వాడిగా నాటి సమాజం ఎందుకు పరిగణించలేదు?
తల్లిదండ్రులు క్రైస్తవులుగా మారినా క్రైస్తవ్యాన్ని అనుసరించే బిట్రీష్ వారికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి కదా? ఎందుకివ్వలేదు?

జాషువాని అస్పృశ్యుడిగా చూసేందుకు తండ్రి కులాన్ని కూడా పక్కన బెట్టి తల్లి కులాన్ని మాత్రమే చూసి శూద్రునిగా లేదా పంచమునిగా నాటి సమాజం పరిగణించింది.

ఈ దేశంలో కులతత్వం మతతత్వం పోలేదు.
పోయిందనే వారు... పోతుందని వారు... సంఘ సంస్కర్తల వేషాలు వేసుకొని వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు ఆదర్శ వ్యక్తులగా  తరతరాలనుంచి హిందుత్వాన్ని అనుసరిస్తున్న మాల మాదిగలకు ఎందరు తమ కుమారులను, కుమార్తెలను ఇచ్చి పెళ్ళి చేయడం లేదు?

అంటరానితనం, అస్పృశ్యత ఇలాంటి అనేక కారణాలు చూపి లేదా వృత్తి ధర్మాన్ని బట్టి వారి సామాజిక స్థితిగతులను బట్టి దళితుల్ని దూరం పెడుతున్నటువంటి సమాజం!

కుల వివక్షత కారణంగా జాషువా ఎదుర్కున్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నతనంలో బడిలో, ఆటల్లో వివక్ష, కవిగా కులవివక్షను  రూపంలో ... వినుకొండలో ఒక రోజు కొప్పరపు కవుల కవిసమ్మేళనం జరుగుతుంది. అది తెలిసి కొన్ని పద్యాలు రాసుకుని జాషువా ఆ సభలోకి వెళ్ళగా అక్కడి వారు 'అంటరానివాడు సభలోకి రావడమేంటని' అవమానించారు. 

       తన కవిత్వాన్ని చూడకుండా తన కులాన్ని బట్టి కవిత్వాన్ని చులకనజేసి మాట్లాడేవారిని -
“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల సూయచేతన
న్నె విధిదూరినన్ ననువరించిన శారద లేచిపోవునే?
యివ్వసుధా స్థలింబొడమరే రసలుబ్దులు? గంటమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్రవాణికిన్"అని సౌమ్యంగానే సవాలు విసిరాడు జాషువా. వ్యక్తిగతంగాగాని,
కవితా రూపంలోగాని జాషువా ఎక్కడా పరుషంగా మాట్లాడిన సందర్భం కనిపించదు.

       జాషువా ప్రయాణిస్తుండగా తన ప్రక్కకూర్చున్న పండితుల కోరిక మేరకు తాను రాసిన పద్యాలను వినిపించగా ఆహా ఓహో అంటూ జాషువాను ఆకాశానికి ఎత్తి మీది ఏకుమని అడిగి తెలుసుకుని దూరంగా జరిగారట. ఈ బాధలోంచి వచ్చినదే ఈ క్రింది పద్యం .

“నా కవితావధూటి వదనంబు నెగా దిగజూచి రూపురే
ఖా కమనీయ వైఖరులుగాంచి భళీ భళి; యన్నవాడే “మీ
దేకుల” మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగున్ పార్థివచంద్ర; వచింప సిగ్గగున్”

మనుస్మృతి, ఋగ్వేదంలో చెప్పినట్లు...

1. " బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారు. " ( ఋగ్వేదం 10 - 90 - 12 )

2. " భూలోక విస్తారము కోరినవాడై బ్రహ్మ తన ముఖము, బాహువులు, తొడలు, పాదాల నుండి వరుసగా బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సృష్టించెను. " ( మనుస్మృతి 1 - 31 )

3. " బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి ధర్మాలను ఇహపర సుఖములకై బ్రహ్మ వేరువేరుగా ఏర్పరచెను. " ( మను 1 - 87 ).

“ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు
నలుగురు కుమారులనుట విన్నాముగాని
పసరముకన్న హీనుడభాగ్యుడైన
యైదవకులస్థు డెవరమ్మా, సవిత్రి?” ఈ  విధమైన ప్రశ్నమరే దళిత కవి వెయ్యలేదు.  

ఒకే కులంలో ఉన్న విబేధాలను గూర్చి-

" దేవుడొకడు మాకు దేవళంబులు రెండు
దేశమొకటి, మాకు తెగలు రెండు
మాటవరుస కొక్క మతమందుమే కాని
కుల సమస్య వద్ద కుమ్ముదుమ్ము

మాలక్రీస్తు కన్న మాదిగ క్రీస్తుడే
యరవీస గొప్ప వాడనియెనొకడు
మాయభక్తియె కాని మనసులోపల భక్తి
బూటకంబని లేచిపోయెనొకడు

మాలయేసు క్రీస్తు మాదిగలకు గాడు
మాదిగేసు క్రీస్తు మాకు గాడు
ఒకడు చిలువరించు నొకడు స్నానంబిచ్చు
నిరువురేకమగుట కేది దారి...?” అని ప్రస్తావించాడు.

కులమతాల తత్వానికి అతీతంగా
జాషువా కవితారచన సాగింది.
కులాధిక్యతను ప్రదర్శించినవారిని
నిరసించినా, ఒక కులంలోనివారి
మధ్యనున్న వైరుధ్యాన్ని ప్రశ్నించినా
కులతత్వం ఛాయలేని కవిత్వం జాషువాది. అందుకే-

“కులమతాల గీచుకొన్న గీతలజొచ్చి
పంజరాల గట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగులేదు, విశ్వనరుడనేను” అని అంటాడు.
అంతేకాదు-
“మతపిచ్చిగాని వర్ణో
న్నతిగానీ, స్వార్థచింతనముగానీ నా
కృతులందుండదు, శబ్దా
కృతి బ్రహ్మానంద లక్ష్మి నృతమ్మొనర్చున్” అని స్పష్టం చేస్తాడు జాషువా.

'నిన్న జాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చి వేయును'
'వేద చతుష్టయంబు ప్రభవించిన వ్యాసుని దివ్యవాణిలో
మాదిగలుందురా?
రుధిర మాంసములున్
గల అంటరానివారాదిమవాసులు
అక్కట కదా! తలపోసిన
గుండెలో సూదులు మోసులెత్తును
కృణోదరి! ఎట్లు సహించుకొందువో?'
'ఏ జాతికెంత వచ్చునో
రాజస్వంబంత నాకు రావచ్చు గదా!
నా జాతి ఎత్తు కేతన
రాజంబున నీదు మూర్తి వ్రాయింతు చెలీ!'

No comments:

Post a Comment