-->

Monday, June 15, 2020

ఒక హైకూ~ ఎన్ని అభివ్యక్తీకరణలో ... Haiku-whatsApp

కొన్ని హైకూలు ఒక్క ఉదుటున అక్షర రూపంలో ఒదగవు.  కాస్త శ్రమించాలి సంక్షిప్త పరిధిని ఏర్పరచడానికి. ఆ అనుభవాన్ని పంచుకోడానికే ఈ వివరణ

హైకూ నేపథ్యం :   
మనపై ప్రేమ చూపేవారిని మనం పట్టించుకోము. మనతో స్నేహించేవారిని పెద్ద విలువివ్వము. దూరపు కొండలు నునుపు తత్త్వం. నిత్యం మన కళ్ళముందు కనబడుతుంది ... పలకరిస్తుంది మనిల్లు తనిల్లులా రోజూ వస్తూ పోతుంది . కానీ కోకిలేమి చేస్తుంది  సంవత్సరానికోసారి వసంత కోకిలలా వచ్చి వినిపిస్తుంది . కనిపించదు.  మన ముంగిటికి రాదు. తన ప్రతిభను ప్రదర్శించడానికే... గొప్పలు పోడానికే వచ్చినట్లు చేస్తుంది.
    ఇప్పుడు చెప్పండి ...    ఎవరు మనకు దగ్గరి వారు? ఎవరు మన ఆత్మీయులు ?  కాకమ్మా? కోకిలమ్మా ? 


ఫస్ట్ థాట్:
(1)
కాకి మన చుట్టం
వసంత కోయిల
బడాయి అతిథి...

నగిషీ పట్టగా....:
(2)
రోజూ మనల్ని
పలకరించే స్నేహం కాకి.
బడాయి అతిథి కోయిల.

ఇంకా చిత్రిక పట్టగా:
(3)
రోజూ మనతో
మాట్లాడే స్నేహి కాకి.
-బడాయి అతిథి కోయిల!!
(లేదా.‌.)
షోకిల కోకిల

ఇంత చేసినా ఎలా చెబితే భావం పరిపూర్ణమౌతుందో తేల్చుకోలేని పరిస్థితులు ఒకోసారి ఎదురౌతాయి . మూడు లైన్లు కుదరగానే హైకూగా మలిచే ప్రయత్నం చేస్తే తేలిపోతాయి


[8:01 am, 13/06/2020] Gudimetla Gopalkrishna Haiku: 🚩🇳🇪🚩
[8:02 am, 13/06/2020] IHC IMMIDISETTI: రోజూ పలకరించే
కాకిమిత్రుడు
మన అతిథి కోయిల
[8:06 am, 13/06/2020] IHC IMMIDISETTI: రోజూ కావ్ కావంటూ
పలకరిచే కాకి
మన మిత్రకోకిలే
[8:10 am, 13/06/2020] Naidugari Jayanna Haiku Poet: అప్పుడప్పుడు ఇలాంటి పాఠాలు అవసరమే సార్👍🏽🙏
[8:15 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: అందుకే మిత్రమా ఈ పోస్టింగ్. ఆంతర్యాన్ని గ్రహించావు. ధన్యవాదాలు🙏

[8:21 am, 13/06/2020] shekaramanthri prabhakar: రోజూ వచ్చే
అతిథి కాకి
వసంతాన్నిచ్చే కోయిల

శేఖరమంత్రి ప్రభాకర్
[8:24 am, 13/06/2020] Mohanram Haiku Poet: రెండూ నలుపంటే/కాదని వసంతం/ గుట్టు విప్పి0ది....   పి. మోహన రామ ప్రసాదు
[8:30 am, 13/06/2020] Nelapuri Rathnaji: కరెక్ట్ నైస్ ఏదీపడితే అది రాయటం వల్ల హైకూ తత్వం దెబ్బతింటుంది కాబట్టి హైకూ కవులు ఆచితూచి ఎంచి రాయాలి
విమర్శను స్వీకరించాలి
పృధ్వి రాజ్ గారు మంచి సూచన చేశారు
[8:32 am, 13/06/2020] Deputy. Collector Govarthan Srikakulam: Nice sir,  good suggestion-🌷👌
[8:32 am, 13/06/2020] Nelapuri Rathnaji: కోకిలతో కాకిని పోల్చే పనేలేదు
మీరు అందులో రెండు హైకూలు వచ్చేవి..
రెండోది కోకిల కంటే కాకిని తక్కువ చేసి చూపటమే..
[8:37 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: కాకిలో ఐక్యత గుణం మానవ జాతికి సందేశం. కోకిల గాన కోకిలే ....!  గూడు కట్టుకోదు ... పొదగదు ... పిల్లల్ని పోషించదు . ఒక్క మాటలో చెప్పాలంటే మాతృత్వానికి కళంకం. నా దృష్టిలో మనిషికి ఆత్మ బంధువు కాకి . రెండింటిని పోలిస్తే కాకే ఆదర్శనీయం
[9:01 am, 13/06/2020] PO VEMANA SRIKAKULAM Haiku Poet VEMANA SRIKAKULAM: కోకిల చుట్టం
కావు కావు కాకియే
నిత్య అతిధి
[9:04 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: చుట్టం దగ్గరివాడా ?అతిథి దగ్గరివాడా సార్ ?
[9:06 am, 13/06/2020] KAVITALATHOTI'కవి'తలతోటి✍️: కవిత్వం వార్తకాదు . ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడానికి. భావం లోనో ..భావ వ్యక్తీకరణ లోనో.. భాషలోనో ... ఏదో ఒక ప్రత్యేకత ప్రదర్శించకపోతే కవిత్వం ఎందుకవుతుంది ? ఆలోచించండి !

[9:31 am, 13/06/2020] PO SIREESHA: మాసంపాటే కోకిల/నిత్యం కావ్ కావ్ తత్వం/కాకి ప్రభోధం. డా.వేదుల'శిరీష'

[9:39 am, 13/06/2020] PO SIREESHA: పాటచుట్టం కోకిల/కాలమంతాబంధువే/లోకంకాకులు. డా.వేదుల'శిరీష'
[9:47 am, 13/06/2020] Perugu haiku: 👌
[9:51 am, 13/06/2020] PO SIREESHA: ఐక్యఆదర్శం/కోకిలపిల్లకాశ్రయం/కాకులగూడు. డా.శిరీష
[9:57 am, 13/06/2020] shekaramanthri prabhakar: కాకిగూట్లో
కోయిల గుడ్లు
ప్రసూతి కేంద్రం

శేఖరమంత్రి ప్రభాకర్
[9:57 am, 13/06/2020] PO SIREESHA: ఉదయరాగం/ఆత్మబంధుకాకులు/నిత్యగానమై. డా.శిరీష
[10:02 am, 13/06/2020] PO SIREESHA: వసంతరాగం/ఏటికోసారి కాకిగూళ్ళూ/కోకిల గొంతై. డా.శిరీష

[10:25 am, 13/06/2020] PO SARADHI HAIKU: ఎన్ని రకాలుగా వ్రాసారండీ👏👏👏👏👏

[11:51 am, 13/06/2020] Veera Hanuman Haiku Poet: Kaki kokila/manaki spoortynistu/shabdala dwara
[0:00 pm, 13/06/2020] PO VEMANA SRIKAKULAM Haiku Poet VEMANA SRIKAKULAM: నిజమే సర్

No comments:

Post a Comment