-->

Friday, June 12, 2020

ఎయిడెడ్ కళాశాల

           
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  ఉద్దేశపూర్వకంగా సకాలంలో జీతాలు చెల్లించకుండా అధ్యాపకులను వేధించడం అధికారుల దృష్టిలో తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
ఉద్దేశపూర్వకంగా ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం సి.ఎ.ఎస్.అమలులో జాప్యం చేస్తే తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.   

* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యంఉద్దేశ పూర్వకంగా  2016 పి.ఆర్.సి. స్కేల్ స్కేల్ అమలు-ఎరియర్స్ లో జాప్యం చేస్తే తప్పు లేదని తేల్చారు.   
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం పెట్టె ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకు వెళితే , యాజమాన్యం దృష్టిలోనే కాదు; అధికారుల దృష్టిలోనూ నేరమేనని విచారణతో అధికారులు తేల్చిపారేశారు!
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం దళిత అధ్యాపకుల్ని  వేధించడమే లక్ష్యంగా  మెమోలు, షో కాజ్ నోటీసులు, సస్పెన్షన్స్, సరెండర్ చెయ్యడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం స్టాఫ్ అందరిముందు వ్యక్తిగత విషయాల ప్రస్తావనతో అవమాన పరచడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వారికి "రోకు" ఉన్నవారికి   మెడికల్ లీవ్ లు మంజూరు చెయ్యడం, లేనివారికి జీతాలు ఆపడం  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎన్.సి.సి., హాస్టల్ వార్డెన్ బాధ్యతలను ఎయిడెడ్ అధ్యాపకులకు కాకుండా పార్ట్ టైం అధ్యాపకులకు ఇచ్చుకోవడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* దళితేతర అధ్యాపకులు 15మంది ఎఫ్.ఐ.పి. ద్వారా పిహెచ్.డి. చేయడానికి అనుమతించిన ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  దళిత అధ్యాపకులను ఎఫ్.ఐ.పి.కి అనుమతించకపోవడం వివక్ష కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టా రాజ్యంగా పే ఆర్డర్స్ తో ఇర్రెగ్యులర్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
అబ్స్ క్యాన్డ్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ ఎరియర్స్ బెనిఫిట్స్ ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టా రాజ్యంగా వ్యవహరించడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం ఇష్టా రాజ్యంగా ఇష్టులకు లీన్ లతో అనుమతివ్వడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 
* ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  దశాబ్దాలుగా సీనియారిటీకి తావేలేకుండా ప్రిన్సిపాల్ షిప్ ను జూనియర్స్ కు ఇవ్వడం, ఎఫ్.ఎ. సి. క్రింద ప్రిన్సిపాల్ ను ఏళ్ళ తరబడి ఉంచడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.   
ఎయిడెడ్ కళాశాల యాజమాన్యంవర్గానికి, కులానికి చెందిన ఉద్యోగులు వారికి నచ్చినప్పుడు కాలేజీకి వచ్చి వెళ్లడం  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* యూ.జి.సి. గ్రాంట్స్ తో కట్టిన బిల్డింగ్స్ ను ప్రభుత్వ అనుమతి లేకుండానే ఎయిడెడ్ కళాశాల యాజమాన్యం  ప్రయివేట్ పరం చెయ్యడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* యూ.జి.సి. గ్రాంట్స్ తో స్టేడియం నిధుల దుర్వినియోగం ~ నాసిరకం నిర్మాణం ~ కూలిపోవడం ~ తప్పుడు రిపోర్టులు ఇవేవీ  తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు.
* కాండోనేషన్ పేరుతో ప్రభుత్వ  విరుద్ధంగా ఇష్టానుసారంగా అధిక మొత్తంలో విద్యార్థులనుండి ఫీజు వసూలు చెయ్యడం తప్పే కాదని విచారణతో అధికారులు తేల్చిపారేశారు. 

వల్గర్ లాంగ్వేజ్ : "మీరు గోకితే మాకు దురదొస్తుంది . మేము గోకితే పుండ్లు పడతాయి "

"...అంటే ఇవన్ని ఏమిటంటే ....కెలికితే మేము కెలికే పద్దతులు.   ఆవిధంగా అన్నమాట. ఇన్ని   హెడ్దేక్ లు పెట్టుకుని అంత గోక్కోవడం అవసరమా అండి."
"సార్ మాకు రోకు(ఈ అనకాపల్లి మాండలిక పదానికి అర్థం మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్ పంపించుకుంటాము
"సార్ ఇంకో విషయం సార్.  పక్కా రూల్స్ పాటించేసి మీరేదో చేస్తే ఆ మోటో కాదు సార్. మీరు కెలుకుతున్నారు కాబట్టే మేము కెలికితే మీకు ఈవిధంగా ఉంటుందని చెప్పడానికే"
"మమ్మల్ని గోకుతున్నాడు. నేను గోకేనంటే   కాంక్రీటేను. మేమేదేసినా కాంక్రీట్లా ఉంటది ."
జీతాల ఆలశ్యానికి సంబంధించి "నీకేమన్నా దమ్మూ ధైర్యం ఉంటే ...సార్ కృష్ణా కాలేజీ కి వెళ్లి ఆ మేడం గారిని నిలదీయండి "

బెదిరింపులు:
"అతని కేస్ హియరింగ్ కు వచ్చింది. ఇప్పటివరకు బుర్ర పెట్టలేదు. ఇక బుర్ర పెట్టానంటే ఏమైనా జరుగుతది అని బెదిరింపు."
"భయపెట్టి వదులుతానని అనుకుంటున్నారా? మేము దిగామంటే కాంక్రీట్ సార్. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము సార్".
"మెమో ,ఆతర్వాత షో కాజ్ నోటీస్, రెండు నెలలు సస్పెన్షన్, ఆర్ జె డి పర్మిషన్ తో మరో రెండు నెలలు సస్పెన్షన్ , ఆ   తర్వాత టెర్మినేట్ చేసే పవర్ మీకే ఉంది అని ఆర్ జె డి చెప్పారట."
"మమ్మల్ని ధిక్కరించి మీరు కోర్టుకు వెళ్ళినా సదరు కోర్టువారు తిరిగి కళాశాల యజమాన్యానికే పరిష్కరించమని సూచిస్తారు"


కొన్ని హైకూలు ఒక్క ఉదుటున అక్షర రూపంలో ఒదగవు.  కాస్త శ్రమించాలి సంక్షిప్త పరిధిని ఏర్పరచడానికి. ఆ అనుభవాన్ని పంచుకోడానికే ఈ వివరణ

హైకూ నేపథ్యం :     
మనపై ప్రేమ చూపేవారిని మనం పట్టించుకోము. మనతో స్నేహించేవారిని పెద్ద విలువివ్వము. దూరపు కొండలు నునుపు తత్త్వం. నిత్యం మన కళ్ళముందు కనబడుతుంది ... పలకరిస్తుంది మనిల్లు తనిల్లులా రోజూ వస్తూ పోతుంది . కానీ కోకిలేమి చేస్తుంది  సంవత్సరానికోసారి వసంత కోకిలలా వచ్చి వినిపిస్తుంది . కనిపించదు.  మన ముంగిటికి రాదు. తన ప్రతిభను ప్రదర్శించడానికే... గొప్పలు పోడానికే వచ్చినట్లు చేస్తుంది. 
    ఇప్పుడు చెప్పండి ...    ఎవరు మనకు దగ్గరి వారు? ఎవరు మన ఆత్మీయులు ?  కాకమ్మా? కోకిలమ్మా ?   

ఫస్ట్ థాట్:
(1)
కాకి మన చుట్టం
వసంత కోయిల
బడాయి అతిథి...
 
నగిషీ పట్టగా....:
(2)
రోజూ మనల్ని
పలకరించే స్నేహం కాకి.
బడాయి అతిథి కోయిల.

ఇంకా చిత్రిక పట్టగా:
(3)
రోజూ మనతో
మాట్లాడే స్నేహి కాకి.
-బడాయి అతిథి కోయిల!!
(లేదా.‌.)
షోకిల కోకిల

ఇంత చేసినా ఎలా చెబితే భావం పరిపూర్ణమౌతుందో తేల్చుకోలేని పరిస్థితులు ఒకోసారి ఎదురౌతాయి . మూడు లైన్లు కుదరగానే హైకూగా మలిచే ప్రయత్నం చేస్తే తేలిపోతాయి 

మీరైతే దీనిని హైకూగా ఎలా ముగిస్తారు? రాసి సాయం చెయ్యండి....   

కాకిలో ఐక్యత గుణం మానవ జాతికి సందేశం. కోకిల గాన కోకిలే ....!  గూడు కట్టుకోదు ... పొదగదు ... పిల్లల్ని పోషించదు . ఒక్క మాటలో చెప్పాలంటే మాతృత్వానికి కళంకం. నా దృష్టిలో మనిషికి ఆత్మ బంధువు కాకి . రెండింటిని పోలిస్తే కాకే ఆదర్శనీయం  


No comments:

Post a Comment