-->

Tuesday, September 29, 2020

గౌరవనీయులైన ఏ.ఎం. ఏ ఎల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారికి.

గౌరవనీయులైన ఏ.ఎం. ఏ ఎల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారికి.


 నన్ను నోరు మెదపకుండా చెయ్యడానికి ఎవరైతే నాపై తప్పుడు కేసు పెట్టారో వారిని కాలేజీకి పిలిపించి, వారున్న చోటుకి నన్ను పిలిపించి ఏదైనా ఘర్షణ జరిగితే పోలీస్ స్టేషన్ కు నన్ను తీసుకెళ్లడానికి సి ఐ వావాహనాన్ని సిద్ధం చేసి ఉంచారు. కళాశాలవారే రాసిన కంప్లైంట్ పై వారిచేత సంతకం చేయించి వారిచ్చిన ఫిర్యాదు కాగితం అన్నట్లుగా నటిస్తూ 3/12/2018న సదరు కళాశాల కరస్పాండెంట్ కోర్ట్ పరిధిలో ఉన్న విషయంపై మాట్లాడకూడదని లా చదివిన వ్యక్తిగా తెలిసికూడా నా సహా అధ్యాపకులైన వారిని తన జి.బి. రూమ్ లోకి పిలిపించి వారు రాసిన లెటర్ ఆ అధ్యాపకులకు ఇచ్చి చదివిచ్చి నా కేస్ ను సెటిల్ చేసుకోమని నాతో నా మిత్రులను చెప్పమని పంచాయితీ పెట్టాడు కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు. లెటర్ చదివిన మిత్రులద్వారా ఆవిషయం తెలుసుకొని ఆ లెటర్ ప్రతి నాకు కావాలని కోరుతూ 10/12/2018న  ఈక్రింది విధంగా లెటర్ రాసి ప్రిన్సిపాల్ కు అందించాను. విషయం ఏమిటంటే ఆ ప్రతిని ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. ఎందుకంటే దాని రూపకర్తలు వారే. అదేవిధంగా 14/12/2018న ప్రిన్సిపాల్ డా జి జయబాబు నన్ను తన ఛాంబర్ కు పిలిచి కేసును సెటిల్ చేసుకోమని తన మాటగా కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) చెప్పమని నీతో మాట్లాడమని చెప్పినట్లు నాతో అన్నాడు.  

ఇలా సాగుతున్న ఈ క్రమంలో నాకు రావాల్సిన CAS  ఎరియర్స్ రాకుండా నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని తప్పు లెక్కలు గట్టి 1,11,250 కు బదులు 3,64,423 రూపాయలతో బిల్లు తయారు చేశారు. సర్వీస్ రిజిస్టర్ లో రాసి పంపించారు . క్లర్క్, సూపరిండెంట్,  ప్రిన్సిపాల్ సంతకాలు చేసి కరెస్పాండెంట్ సంతకం చేసేటప్పుడు ఆ తప్పు ఉందని నాది పక్కన బెట్టి మిగతా వారిది పంపించారు. నిజంగా అనుకోకుండా తప్పే దొర్లింది అనుకుంటే ఆ తప్పును సరిచేసి అందరి బిల్లులు కలిపి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు పంపించవచ్చు. కానీ వారు అలా చెయ్యకుండా నాది తప్పించారు. నాతోటి వారందరికీ 1/7/2019 సి.ఎ.ఎస్. ఎరియర్స్ వస్తే నాకు నేటివరకు ఆ ఎరియర్స్ రాలేదు.  ఈ క్రింద 1,11,250 కు బదులు 3,64,423 రూపాయలతో తప్పుడు బిల్లు తయారుచేసి నా సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేసిన సాక్ష్యం 

     నాకు రావాల్సిన CAS ఎరియర్స్ గూర్చి జిల్లా కలెక్టర్ కు మరియు జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు పత్రం రాసి పంపగా విచారణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి శ్రీ కృష్ణా కాలేజీ ఎ. ఒ. కు వివరణ కోరగా, వారు మా కాలేజీ వారిని వివరణ కోరారు. ఆలా అడిగినందుకు, "దళిత అధ్యాపక సంఘానికి ఛైర్మన్ గా ఉన్నందుకు, అలా లెటర్ హెడ్ పై నేను ఫిర్యాదు చేసినందుకు, ఏ ఏం ఏ ఎల్ కాలేజీ పేరు ప్రస్తావించినందుకు, కులాన్ని వాడుకున్నట్లు అందుచేత నన్ను కరస్పాండెంట్ సస్పెండ్ చెయ్యగలిగే అధికారాలు ఉన్నాయని కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు నన్ను సస్పెండ్ చేస్తానని అందరిముందు బెదిరించారు.

కొన్ని నెలలుగా మా కళాశాల కరస్పాన్ డెంట్ నన్ను టార్గెట్ చేస్తూ , మీ గురించే మీటింగ్ పెట్టింది అంటూ నా వ్యక్తిగత విషయాలు అందరిముందు  ప్రస్తావిస్తూ  నన్ను అవమానిస్తున్నారు. 13/9/2019 మా కాలేజీ జి బి హాల్ ల్లో జరిగిన సమావేశంలో నా వ్యక్తిగత విషయాలను ఎలా ప్రస్తావించారో మీరు గమనించ వచ్చు.  


"పృథ్వి రాజ్ గారు మీకు డైరెక్ట్ గా అడుగుతున్నాను . మీరు అన్ని రూల్స్ మాట్లాడుతూ అంతా  కరెక్ట్ గా వెళుతున్నారు అన్నంత ఇదిగా వెళుతున్నారు . పోనీ యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా మీరేమైనా ఫాలో అవుతున్నారా ? ఒక విషయం. మీ పర్సనల్ విషయం కూడా నేను మాట్లాడుతున్నాను.  మీ సెషన్స్ లోని ఆల్రడీగా షెడ్యూల్డ్ ఇచ్చారు  . ఒక నెలరోజులు, నెలా పదిహేను రోజుల్లో గాని డెసిషన్ కూడా  వచ్చేస్తది    భగవంతుని దయవల్ల మీకు కోపరేటివ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ షెడ్యూల్డ్ లో మరుసగా మీకు వాయిదాలు పడుతుంటాయి . రెండు రోజులకు మూడు రోజులకు పడుతుంటాయి. అసలు మీరు ఏ బేస్ చేసుకొని అగెనెస్ట్ మేనేజ్మెంట్ వెళుతున్నారో నాకు అర్థం కావడం లేదు .    పోనీ మీరు కరెక్ట్ గా వెళు తున్నారా అంటే మీరు చేసిన దానిలో ప్రతిదాంట్లో తప్పు వెతక వచ్చు.  మొన్న ఏడవ తారీఖున లీవ్ ఇచ్చారు.   కడుపునొప్పి వస్తుందని లీవ్ ఇచ్చారు . మీరు ఎం చేశారు. కృష్ణా కాలేజీకి దగ్గరకు వెళ్లి   అతనితో ఎవరితో గొడవబడ్డారు.  వాళ్ళేమో ఆఫీస్ కు ఫోన్ చేశారు. ఆ తర్వాత మొన్నేమో కోర్టు వాయిదా అని లీవ్ పెట్టారు. కోర్ట్ వాయిదా ఏమిటో నాకు ప్రూఫ్ కావాలి. ఎలాగా. మీరు ఏ వాయిదా వెళ్లారు, ఏ పనిమీద వెళుతున్నారు. మీరు విక్టిం గా వెళుతున్నారా, లేదా ఎక్యూజ్ డా. కాన్సర్న్ అడ్వొకేట్ దగ్గర లెటర్ తీసుకొని  సబ్మిట్ చేస్తే దాని సపోర్ట్ చేసే డాక్యుమెంట్స్ ఇస్తే గాని   నేను అల్లౌ చెయ్యను.  ఎందుకు అల్లౌ చేస్తాము. అంటే ఇవన్ని ఏమిటంటే ....కెలికితే మేము కెలికే పద్దతులు.   ఆవిధంగా అన్నమాట. ఇన్ని   హెడ్దేక్ లు పెట్టుకుని అంత గోక్కోవడం అవసరమా అండి. ఇవ్వాళ్ళ  ప్రత్యేకించి మీటింగ్ పెట్టడానికి కారణం మిమ్మల్ని ఉద్దేశించి పెట్టుకోవడమే ! " ఇదీ మా కళాశాల కరస్పాండెంట్ వైఖరి. 
     వ్యక్తిగతం అన్నప్పుడు నా ఒక్కడితోనే వ్యక్తిగత విషయాలు మాట్లాడ వచ్చుకదా ? ఆతని ఉద్దేశం అదికాదు. నన్ను అవమానించడమే ఆయన పరమార్థం. "కెలికితే మేము కెలికే పద్దతులు"అని కక్ష సాధింపు ,వేదింపు మాటలు మాట్లాడారు  కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు. ఆయన మాటల్ని బట్టి నాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా, నన్ను టార్గెట్ చేసి వేదించినా నేను ఉన్నతాధికారులెవరికీ తెలియ జేయకూదదనేది కరస్పాండెంట్ మాట. అదే మేము వారిని కెలుక్కోవడం అంటా. దానికి ప్రతిగా వారు మా వ్యక్తిగత విషయాలను అందరిలో ప్రస్తావిస్తూ, అవమాన పరుస్తూ వ్యవహరించే శైలి వారు మమ్మల్ని కెలుక్కోవడమే.
~ ఫైన్స్ 2,000, 750, 250 హాజరు చాలని పిల్లలకు నిర్ణయించారు.
~ క్యాస్ట్ బెస్ పై లెటర్ పెట్టినందుకు మేనేజ్మెంట్ ఎంతవరకైనా వెళ్ళ వచ్చు అని బెదిరింపు.
~   కాలేజీ పేరును నేను ఉపయోగించినందుకు గాను ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చని బెదిరింపు
~ లీవ్ మెయిల్ ల్లో పెట్టకూడదట.  దూరంగా ఉన్నప్పుడు మెయిల్
~ మమ్మల్ని గోకుతున్నాడు. నేను గోకేనంటే   కాంక్రీటేను. మేమేదేసినా కాంక్రీట్లా ఉంటది .
~ అతని కేస్ హియరింగ్ కు వచ్చింది. ఇప్పటివరకు బుర్ర పెట్టలేదు. ఇక బుర్ర పెట్టానంటే ఏమైనా జరుగుతది అని బెదిరింపు.
~  మీ వర్షన్ ప్రకారం పృథ్వి రాజ్ మేనేజ్మెంట్ కు యాంటీగా ఉన్నాడంటున్నారు కదా. ఆయన్ని వేరే కాలేజికి పంపించ వచ్చు కదా అనిన అధ్యాపకుడు ఎం . కొండల రావు మాటలకు కరస్పాండెంట్ స్పందన :" నేను అలా ఎందుకు వదులుతాను మాస్టారు. భయపెట్టి వదులుతానని అనుకుంటున్నారా? మేము దిగామంటే కాంక్రీట్ సార్. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము సార్".
            
~ ఒకపేజీ అరపేజీ కాదట. రెండు మూడు పేజీల షో కాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారట. అది స్ట్రాంగ్. కాంక్రీట్  వేసినట్టే ఉంటది నేను తలుసుకుంటే. ఇక నేను దిగిపోతున్నాను  అని బెదిరింపు.
~ లాయర్ ని కూడా నేను కలిసి వచ్చాను. ఎలా ఇవ్వాలి ఏమిటనేది ?  నేను తీసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతది. నేనొకసారి ముందు స్టెప్ వేస్తే మరలా బ్యాక్ స్టెప్ పడడం అనేది తెలియదు నాకు.
~ నేను షో కాజ నోటీసు ఇష్యూ చేస్తాను మాస్టారు . అతను ఒపీనియన్ రాస్తాడు. ఆ ఒపీనియన్ కు నేను సాటిస్ఫాక్షన్ అవను. నేను సాటిస్ఫాక్షన్ అవను గనుక మా జి.బి. లో పెట్టి సస్పెన్షన్ తయారుచేసి ఇష్యూ చేస్తాను


18-10-2019న కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు , సూపరిండెంట్, ప్రిన్సిపాల్ డా జి జయబాబు బోటనీ అధ్యాపకుడు డా ఎమ్.  హరిబాబును , కామర్స్ అధ్యాపకుడు శ్రీ ఎం. కొండల రావును పిలిపించి నాగూర్చి వారివద్ద మాట్లాడిన విషయాలను నాతో తెలియజేయమని చెప్పగా ఫోన్లో శ్రీ ఏం కొండల రావు కళాశాల  కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు ఆ మీటింగ్ లో ఏవిధంగా  హెచ్చరించి - బెదిరించారో తెలియ జేశాడు.


16-10-2019న కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు , సూపరిండెంట్, ప్రిన్సిపాల్ డా జి జయబాబు బోటనీ అధ్యాపకుడు డా ఎమ్.  హరిబాబును , కామర్స్ అధ్యాపకుడు శ్రీ ఎం. కొండల రావును పిలిపించి నాగూర్చి వారివద్ద మాట్లాడిన విషయాలను నాతో తెలియజేయమని చెప్పగా ఫోన్లో శ్రీ ఏం కొండల రావు కళాశాల  కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు ఆ మీటింగ్ లో ఏవిధంగా  హెచ్చరించి - బెదిరించారో తెలియ జేశాడు


~ కరస్పాండెంట్, సూపరిండెంట్  ఆర్ జె డి ఆఫీస్ కు వెళ్లి ఆర్ జె డి ని కలిసినట్టు.
~ మెమో ,ఆతర్వాత షో కాజ్ నోటీస్, రెండు నెలలు సస్పెన్షన్, ఆర్ జె డి పర్మిషన్ తో మరో రెండు నెలలు సస్పెన్షన్ , ఆ   తర్వాత టెర్మినేట్ చేసే పవర్ మీకే ఉంది అని ఆర్ జె డి చెప్పారట.
~ మేనేజ్మెంట్ జోలి రానని, ఏ విషయంలో ఇన్వాల్ కానని ఆన్ పేపర్ పై ఇచ్చేస్తే కామ్ గా ఉంటుంది. ఆయన ఉద్యోగం ఆయన చేసుకోమను. మా పనులు మేము చేసుకుంటాము అని కరస్పాండెంట్ అన్నారట.
~   రేపు రిటైర్మెంట్ అయినా సరే మనం మేనేజ్మెంట్ కు చెప్పాలి. ఈ రోజు నేను ఉండొచ్చో రేపు మరోకరుండా వచ్చు. కాని మేనేజ్మెంట్ మాదేకదా. 
~ హాఫ్ డే సాలరీ కట్ చెయ్యాలట.    
~ మెమో ~ రెడీ చేశారట.  

23/10/2019 న సాయంత్రం ఎ ఏం ఏ ఎల్ కళాశాల స్టాఫ్ తో కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు సమావేశం కానున్నాడని సమాచారం  

ఏ ఎం ఏ ఎల్ కళాశాలలో అధ్యాపకులు విచిత్ర పరిస్థితి లో ఉన్నారు. మరి ముఖ్యంగా దళిత అధ్యాపకులు. ఒకప్పటి మేనేజ్మెంట్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టా రాజ్యంగా చేసుకుంటూ పోయే వారు.


06-12-2018 నాటి సమావేశంలోని అంశాలు:
అనేక సంవత్సరాలుగా వివక్షకు గురియైన దళిత అధ్యాపకులు ఇచ్చిన లెటర్ గూర్చి, సి ఏ ఎస్ గూర్చి., హాస్టల్ వార్డెన్, ఎన్ సి సి ఎవరికైనా తాము ఇచ్చుకోవచ్చని, అడిగే హక్కు ఎయిడెడ్ అధ్యాపకులకు లేదని ..మొదలగు విషయాలు.
10-4-2019 సాధారణ సమావేశం 
16-04-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అధికారాల గూర్చి,లీవ్స్ ,ఆడారి నాగ భూషణం ప్రస్తావన ,మేనేజ్మెంట్ ను మీరేమి చెయ్యలేరు , మాకు పోయేది ఏమీలేదు ... మొదలగు ప్రధాన విషయాలు
06-07-2019 నాటి సమావేశంలోని అంశాలు:
వర్క్ లోడ్ , మినిమం 40 అవర్స్ ఇచ్చినా చెయ్యాల్సిందే, 30 అవర్స్ మినిమం 
03-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
లీవ్స్ సూపరింటెన్ డెంట్ ద్వారా ,ఇ.పి.ఎఫ్.   ఫైన్  ప్రస్తావన,సాలరీస్ , కొందరి అధ్యాపకుల  వ్యక్తిగత విషయాల ప్రస్తావన, గోకితే పుండ్లు పడతాయి, మేనేజ్మెంట్ పవర్స్, లీవ్స్ పై పట్టు గోక్కోవ డాన్ని బట్టి అని చెబడం, ఆడారి నాగభూషణం ~చెరుకూరి నూకేశ్వర రావు లకు నిబందనలకు విరుద్ధంగా డబ్బులు ఇప్పించిన వైనం,పి జి అర్హత చాలట , హాఫ్ డే సి ఎల్, లీవ్ కావాలంటే  సూపరింటెన్ డెంట్ వద్దకు వెళ్ళాల్సిందే అని చెబడం,లీవ్ ఫండమెంటల్ రైట్ కాదని చెపడం, మాకు రోకుంటే ఎవరికైన సెలవు ఇచ్చి అడ్జెస్ట్ చేసుకుంటా మనడం, సూపరింటెన్ డెంట్ ను కలవలేదు గనుక లీవ్ లెటర్ ఇచ్చినా అబ్సెంట్ మార్క్ రాసి అధ్యాపకుడు విక్టర్ ను బెదిరించుట , మమ్మల్ని కెలికితే ఇలానే ఉంటుందని చెబడం,
07-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కరస్పాండెంట్ అడగమన్న ప్రకారం కాలేజీ పనిపైనే ఎ. ఒ. డి టి ఒ ఆఫీస్ లకు  వెళ్లి నా ఎరియర్ గూర్చి అడుగుట
సాధారణ విషయాలు.
12-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
కడుపులో నొప్పి అని ఎ ఒ వద్దకు వెళ్లి నా ఎరియర్స్ గూర్చి విచారించానని,   డిసిప్లీనరీ యాక్షన్ గూర్చి,లీవ్స్ గూర్చి, మేనేజ్మెంట్ ను క్వశ్చన్ చెయ్యడానికి లేదని , అధ్యాపకులను బెదరించడం, అబ్సెంట్ మార్క్ నోట్ చేస్తామనడం, కెలికితే -గోకితే , సస్పెండ్  చేస్తే కాలేజీకి రాలేనని, ఆడారి నాగభూషణం గూర్చి. లీవ్స్ థ్రూ ప్రోపర్ ఛానెల్,అలా చెయ్యకుంటే అబ్సెంట్ మార్క్ చేస్తాననడం, నాకు మేమో ఇష్యూ చెయ్యమని ప్రిన్సిపాల్ కు చెబడం.     
24-09-2019 నాటి సమావేశంలోని అంశాలు:
సంఘాలలో(యూనియన్స్)లో అధ్యాపకులు ఉండకూడదని, కులాన్ని ఉపయోగించుకుంటున్నానని, వీటిని బట్టి నాపై చర్యలు తీసుకోవచ్చని కరెస్పాండెంట్ నన్ను సస్పెండ్ చేస్తానని బెదిరింపులు.

16-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:
18-10-2019 హరిబాబు, కొండల రావు తో పంపిన హెచ్చరికలు- బెదిరింపులు:

అధ్యాపకులపై కళాశాల యాజమాన్యం రోకు (మోజు-ఇష్టం ) ఉంటే అన్నీ సాధ్యం !:   
కళాశాలను నిర్వహించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక కరస్పాండెంట్  ప్రభుత్వ నిబంధనలతో మాకు పనిలేదు మా ఇష్టం వచ్చిన వారికి సెలవు మంజూరు చేస్తాము, ఇష్టం లేని వ్యక్తి అనుకో సెలవు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వం , మంజూరు చెయ్యం  అని పబ్లిక్ గా స్టాఫ్ మీటింగ్ లో చెబుతున్నారంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరస్పాండెంట్ చెప్పిన దానిలో తప్పేలేదు. ఎందుకంటే ఏళ్ళ తరబడి వారు చేసుకొస్తుంది అదే. వారి దయతో లీన్ పేరిట విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, రకరకాల సెలవలతో విదేశీ పర్యటనలు, తీర్థ యాత్రలు చేసినవారు, విదేశాలకు పురుళ్ళకు వెళ్ళిన వాళ్ళు అనేకులున్నారు. కొన్ని సంవత్సరాలుగా  కళాశాలలో జరుగుతున్న తంతు.   

సెలవు చీటీ ఇచ్చినా అబ్సెంట్ రాస్తారు :
డి డబ్లూ.విక్టర్ అనే అధ్యాపకుడు సెలవుచీటి రాసి సంబంధిత క్లర్క్ కు ఇచ్చినా అటెండెన్స్ రిజిస్టర్ లో సి ఎల్ నోట్ చెయ్యక పోగా , సూపరింటెండెంట్ చేత సంతకం చేయించ లేదని సాకు చూపి ఒక క్లర్క్  కరస్పాండెంట్ సూచన మేరకు అబ్సెంట్ మార్క్ చేశాడంటే ఏమనాలి.  ఆ క్లర్క్ చెయ్యాల్సిన డ్యూటీ ఏమిటి . పట్టించుకునే ప్రభుత్వ అధికార గణం లేకుంటే అధ్యాపకులను యాజమాన్యం ఇలానే వేధిస్తుంటారు . అ చర్యకు భయపడి, మనసు చంపుకొని ఆ అధ్యాపకుడు తన లీవ్ లెటర్ ను తానే స్వయంగా సూపరిండెంట్ వద్దకు వెళ్లి సంతకం చేయించాక వైట్ ఫ్లూయిడ్ తో అబ్సెంట్ చెరిపి సి ఎల్ నోట్ చేశారు.    

కళాశాల యాజమాన్యం దయ ఉంటే ఉద్యోగం ఎగగొట్టినా లక్షలు లక్షణంగా పొందవచ్చు :
చేసిన ప్రభుత్వ వ్యతిరేకమైన పనులను ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు స్టాఫ్ సమావేశంలో నిర్భయంగా చెబుతున్నారు. అయన పరిభాషలోనే ...వారి రోకు ఎవరిపైనైతే ఉంటుందో మెడికల్ లీవ్ లు ఆ లీవ్ లు , ఈ లీవ్ లు మాత్రమే కాదు సంవత్సరాల పాటు ఎటువంటి లీవ్ లు పెట్టకుండానే కాలేజీ మానెయ్యొచ్చు. బుద్దిపుట్టిన కొన్నేళ్ళ తర్వాత యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని, రికార్డ్ లు తారుమారు చేయించుకొని, అధికారులను మేనేజ్ చేసుకొని రావాల్సిన అణా పైసాతో సహా పొందవచ్చు. అటువంటి వారికి ఉదాహరణే నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రీ చెరుకూరి నూకేశ్వర రావు, ఆడారి నాగభూషణంల ఉదంతం . కళాశాలకు కొన్నేళ్ళపాటు రాకున్నా కళాశాల యాజమాన్యంతో లౌక్యంగా వ్యవహరించి లక్షలాది రూపాయలను పొందినవాడు నూకేశ్వర రావు . కోర్టుకు వెళ్లి నేటికీ తిరుగుతున్నవాడు నాగ భూషణం. 
ఈ కథలో కరస్పాండెంట్ ఎయిడెడ్ స్టాఫ్ కు చెప్పిన నీతి , హెచ్చరిక ఏమిటంటే ...మమ్మల్ని ధిక్కరించి మీరు కోర్టుకు వెళ్ళినా సదరు కోర్టువారు తిరిగి కళాశాల యజమాన్యానికే పరిష్కరించమని సూచిస్తారు. ఆవిధంగా మేము మిమ్మల్ని సాధిస్తాము, వేధిస్తాము. జాగ్రత్త అని బెదిరించడం. యాజమాన్యం వారు ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడినా మనం నోరుమేదప కూడదు.  అనేక సమావేశాలలో వీరి విషయాన్ని కరస్పాండెంట్ ప్రస్తావించాడు.
ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు?   
   
   

పృథ్వి రాజ్ అనే అధ్యాపకుణ్ణి వేధింపులు, బెదిరింపులతో కరెస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు:

ఎయిడెడ్ కళాశాలలలొ మేనేజ్మెంట్ ఏమిచెబితే అది చేయాలనే తత్వం. బానిసలుగా చూసినా అధ్యాపకులు పడియుండాలి. మన వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ సహ ఆధ్యాపకుల ముందు  బెదిరించినా మనం పడాలి అనే వారి వైఖరి. ఉద్దేశపూర్వకంగా మన ఆర్ధిక ప్రయోజనాలను వారు అడ్డుకున్నా ఉన్నతాధికారులకు తెలియజేయకూడదు. దీనిని వేధించడం అనిగాక మరేమి అంటారు. రాష్ట్రంలో ఇన్ని ఎయిడెడ్ కళాశాలలు ఉంటే మరే కళాశాలలో లేని రీతిగా అధ్యాపకులైన మేము ప్రిన్సిపాల్ గారికి కాకుండా మా సెలవు చీటీని మేమే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ కి ఇవ్వాలనే కరెస్పాండెంట్ శాసనం. అలా గాకుండా సెలవు చీటీ సంబంధిత లీవ్స్ క్లర్క్ కు ఇచ్చినా , ప్రిన్సిపాల్ గారికి అందించినా అటెండెన్స్ రిజిస్టర్ లో ఆబ్సెంట్ మార్క్ నోట్ చేసి బెదిరించడం. అలా  ఆబ్సెంట్ మార్క్ నోట్ చేయబడినవాళ్లు భయపడిపోయి హోదాను మరచి తామే స్వయంగా కళాశాల సూపరింటెండెంట్ చేత సంతకం చేయించుకోగా ఆబ్సెంట్ గా రాసిన స్థానంలో వైట్ ఫ్లూయిడ్ పెట్టి సి. ఎల్. మార్క్ చెయ్యడం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే తీరిక లేదు. కళాశాల యాజమాన్యం అందించే ముడుపులకు ఆర్ జెడి రాజమండ్రిలో, విజయవాడ లోని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ లోను క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఒకటి కాదు మా ఎయిడెడ్ కళాశాల లీలలు.


15-5-1984 commissioner order no:5030 commissioner  MEDAM SATISH NAYAR. REPORT
SOWCAUSE NOTICE. 1st S.O. Ronanki  Anandarao .  15-5-1984 TO 6/11/1997 so to management.

బహుశా ....ఇప్పుడు మీరు చదవబోయే విషయాలు ఎయిడెడ్ అధ్యాపకులైన వారిని విస్మయానికి గురిచేస్తాయి. ఏ ఎం ఏ ఎల్ కళాశాల, అనకాపల్లి అధ్యాపకుల పట్ల కళాశాల యాజమాన్యం ఎంత అరాచకంగా వ్యవహరిస్తుందో, అధ్యాపకులను ఎంత బానిసలుగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.  ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కళాశాల యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో....అనేక మార్లు స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు  మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్ లో ఎలా అధ్యాపకులను భయపెడుతూ, హెచ్చరిస్తూ మాట్లాడారో గ్రహించవచ్చు.
ఏ ఎం ఏ ఎల్ కళాశాల సుమారు పదమూడేళ్ళ పాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలో సాగింది. కారణం....యాజమాన్యంలోని అంతర్గత కారణాలచేత ఒక వ్యక్తి కళాశాలలో జరిగిన అవకతవకలు, యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించిన తీరుమీద ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నాటి కమీషనర్ స్పందించి రికార్డ్స్ పరిశీలించి నాటి కళాశాల యాజమాన్యాన్ని తొలగించి స్పెషల్ ఆఫీసర్ (ఎస్.ఒ )ను నియమించింది.  ఎటువంటి అవకతవకలకు, ప్రభుత్వ  నిబంధనలకు విరుద్ధమైన రీతిలో వ్యవహరించమని అండర్ టేకింగ్ లెటర్ కళాశాలవారు ఇచ్చాకే ప్రభుత్వం ఎస్ .ఒ తీసి కళాశాలను యాజమాన్యానికి అప్పజెప్పింది. యాజమాన్యాన్ని డిస్మిస్ చెయ్యడానికి నాడు కారణాలు కొన్నే. కాని నేడు పరిశీలిస్తే లెక్కలేనన్ని. అయినా  అనేక మార్లు స్టాఫ్ తో ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారు  మీటింగ్స్ పెట్టి నిర్భయంగా, నిసిగ్గుగా వారి చట్టవిరుద్ధమైన పనులను ప్రస్తావిస్తూ 
6/12/2018

           
సి ఎల్స్ విషయంలో కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి శాసనం:
".....ఎస్పెషల్లీ....యూ జి సి      స్కేల్ ఎయిడెడ్ ఫ్యాకల్టీ విషయంలో చెబుతున్నాను... మీ క్యాజువల్ లీవ్స్ 8 ఉన్నాయి. ప్లస్  స్పెషల్ క్యాజువల్ లీవ్స్ విషయంలో రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లయి చెయ్యడానికి లేదు. ఇప్పుడు చెబుతున్నాను. ఇప్పుడు  సుపరిండేంట్ కూడా కాదు ......నా పర్మిషన్ లేకుండా లీవ్ అలౌ చెయ్యడానికి అవదు"

02B- మా దయ మీమీద ఉంటేనే నిబంధనలకు విరుద్ధమైనా మీకు సెలవులు మంజూరు చేస్తామనే కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాస రావు గారి మాటలు:     
"సార్ మాకు రోకు(మోజు, ఇష్టం) ఉందనుకోండి మీరు ఆరునెలలు వెళ్ళండి ఫారెన్ టూర్. మేము పంపించుకుంటాము. నా చేతిలో పవర్ ఉంది. నేనేదో అడ్జస్ట్ చేసుకుంటాను. నాకు రోక్ లేదనుకోండి ఒక్క రోజుకూడా నేను ఎలో చెయ్యను. అది నా డిస్కషన్ పవర్. మీకది పాయిన్టౌట్ చెయ్యడానికి లేదు. ఆవిషయంలో మీరు నన్ను పాయింట్ అవుట్ చెయ్యడానికి లేదు. నా ఇష్టం.  నాకు రోకుంటే 6 నెలలు ఇస్తాను. నాకు రోకు లేదనుకో ఒకరోజుకూడా ఇవ్వను. నా పవర్ అది. నా పవర్ ను మీరు క్వచన్ చెయ్యడానికి మీకు రైట్ లేదు."

03C: 
"సార్ ఇంకో విషయం సార్.  పక్కా రూల్స్ పాటించేసి మీరేదో చేస్తే ఆ మోటో కాదు సార్. మీరు కెలుకుతున్నారు కాబట్టే మేము కెలికితే మీకు ఈవిధంగా ఉంటుందని చెప్పడానికే"

మేము తలుచుకుంటే కులం పనిచెయ్యదు,  ఎం పనిచేయదు.01A: " మీరు కెలుక్కోవడం వల్ల మేము సబ్జెక్ట్ లోకి వెళ్లి పోయి మేము డెప్త్ కు వెళుతున్నాము.  మేము ఏది  చెప్పినా సరే ఆన్ రికార్డ్, ఆన్ గవర్నమెంట్ జి వొ ప్రకారంగా మాట్లాడుతున్నాను"
01A:"కాజ్వల్ లీవ్స్ 8 ఉన్నాయి. స్పెషల్ కజ్వల్ లీవ్స్ రాబోయేసరికి మా పర్మిషన్ లేకుండా మీరు అప్లై చెయ్యడానికి లేదు."
01A:"లీవ్ మీకు ఫండమెంటల్ రైట్ కాదు"
01A:"మీరు లీవ్ అప్లై చేస్తే ఇవ్వాలని రైటేమి లేదు. నాకు నచ్చలేదనుకోండి నేను కంపిటి టీవ్ అథారిటీ కాబట్టి ఏ ఎం ఏ ఎల్ కాలేజీకి నేను లీవ్ సంక్షన్ చెయ్యక్కర లేదు. అది అబ్సెంట్ క్రిందే పడుతుంది. "


 సస్పెండ్ విధానమే ప్రభుత్వ నిబంధనలు - మానవ హక్కులకు విరుద్ధం:
అధికారులు నా  సస్పెండ్ ను రివోక్ చేసినా కళాశాల యాజమాన్యం నన్ను విధులలోకి  తీసుకోకుండా నన్ను వేధించిన వైనం:
అధికారులు, మంత్రి , ఎస్సీ కమీషన్ దృష్టికి తీసుకు వెళ్ళగా జరిగిన న్యాయం :
కళాశాల యాజమాన్యం మొదలు పెట్టిన వేధింపులు:
నిష్కారణంగా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
మా ఇబ్బందులను అధికారులకు తెలియ జేసినా మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ:
జీతాలు యాజమాన్యం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాల్సిందే :
వ్యక్తిగతంగా మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసినా మనం ఏ అధికారి దృష్టికి తీసుకు వెళ్ళకూడదు:
నిద్రబోతున్న ప్రభుత్వ యంత్రాంగం:
అవినీతికి మరిగిన స్పందించి న్యాయం చెయ్యాల్సిన అధికారులు:
వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని చస్తేనే స్పందించే వ్యవస్థ:               

No comments:

Post a Comment